అలం
అనగా చాలును అని అర్ధము. న + అలం = అనలం - చాలదు అని అర్ధము - ఎంత ఆహుతి వేసినను ఇక
చాలును, మరివలదు అని అగ్ని అనదు. అందుచేత అగ్నికి అనలం అని పేరు వచ్చినది.
న అస్య అలం పర్యాప్తిః
విద్యతే ఇతి అనలః, వహ్నిః.
(అగ్నికి ‘చాలును’
అను పర్యాప్తి - తృప్తి - లేదు. అందుచేత ‘అనలం’ అని చెప్పబడినది.)
అలం
బుద్ధిః నాస్తి ఇత్య నలః, యద్యచపి ఇంద్రాది పదం ప్రాప్తం, పునః బ్రహ్మాది పదం ప్రాప్యతి ఇతి అలం
బుద్ధిః నాస్తి.
(ఇంద్రపదవి
వచ్చినను, ఇంకా బ్రహ్మపదము కావలెను అను ఇటువంటి బుద్ధి కలిగి, చాలును అను బుద్ధి లేకుండుట
వలన అనలః.)
“నాగ్నిస్తృప్త్యతి కాష్టానాం”
(కట్టెలు
ఎన్ని వేసినను చాలును అని అగ్ని తృప్తి చెందదు, చాలును అని అనదు - ఎన్నింటిని వేసినను
దహించును.)
“నహి
అనలః కాష్టైః తర్ప యితుం శక్యః, వర్ధతే ఏవ”
(కట్టెలు వేసిన
కొలది అగ్ని వృద్ధి చెందుచునే యుండును - కాని దానికి సంతుష్టిగా వేయుటకు అలవికాదు.)
Transliteration
alaṃ
anagā cālunu ani ardhamu. na + alaṃ = analaṃ - cāladu ani ardhamu - eṃta
āhuti vēsinanu ika cālunu, marivaladu ani agni anadu. aṃducēta agniki
analaṃ ani pēru vaccinadi.
na asya alaṃ
paryāptiḥ vidyatē iti analaḥ, vahniḥ.
(agniki
‘cālunu’ anu paryāpti - tṛpti - lēdu. aṃducēta ‘analaṃ’ ani
ceppabaḍinadi.)
alaṃ
buddhiḥ nāsti itya nalaḥ, yadyacapi iṃdrādi padaṃ prāptaṃ, punaḥ
brahmādi padaṃ prāpyati iti alaṃ buddhiḥ nāsti.
(iṃdrapadavi
vaccinanu, iṃkā brahmapadamu kāvalenu anu iṭuvaṃṭi buddhi kaligi, cālunu
anu buddhi lēkuṃḍuṭa valana analaḥ.)
“nāgnistṛptyati
kāṣṭānāṃ”
(kaṭṭelu
enni vēsinanu cālunu ani agni tṛpti ceṃdadu, cālunu ani anadu -
enniṃṭini vēsinanu dahiṃcunu.)
“nahi analaḥ
kāṣṭaiḥ tarpa yituṃ śakyaḥ, vardhatē ēva”
(kaṭṭelu
vēsina koladi agni vṛddhi ceṃducunē yuṃḍunu - kāni dāniki saṃtuṣṭigā
vēyuṭaku alavikādu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.