← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంత బాహుః anaṃta bāhuḥ

Original — తెలుగు
  1. అసంఖ్యేయ బాహుః.

(అంతములేనన్ని, లెక్కలేనన్ని బాహువులు కలవాడు.)

  1. “అనంత బాహుం శశి సూర్యనేత్రం” (శ్రీమద్భగవద్గీత - 11 - 19)

(భగవంతునియొక్క విశ్వరూపములోనున్న సమస్తరూపములు భగవంతుని రూపములే, అతని విభూతులే, యగుటవల్ల ఆ రూపముల అవయవములన్నియు భగవంతుని అవయవములే. ఈ రూపములు అనంతములు - లెక్కలేనన్ని - అందుచేత అవయవములన్నియు కూడా అనంతములే.లెక్క లేనన్ని బాహువులు కలవాడు అని చెప్పబడినది.) ఈ ప్రకారముగానే శ్రీమద్భగవద్గీతలో మఱియొకచోట, శ్రీరామ కర్ణామృతములోను చెప్పబడినది: -

“అనంత బాహు దరవక్త్ర నేత్రం” (గీత - 11 - 16)

“సహస్ర నేత్రానన పాద బాహుం” (శ్రీరామకర్ణామృతం- 2 - 25)

Transliteration
  1. asaṃkhyēya bāhuḥ.

(aṃtamulēnanni, lekkalēnanni bāhuvulu kalavāḍu.)

  1. “anaṃta bāhuṃ śaśi sūryanētraṃ” (śrīmadbhagavadgīta - 11 - 19)

(bhagavaṃtuniyokka viśvarūpamulōnunna samastarūpamulu bhagavaṃtuni rūpamulē, atani vibhūtulē, yaguṭavalla ā rūpamula avayavamulanniyu bhagavaṃtuni avayavamulē. ī rūpamulu anaṃtamulu - lekkalēnanni - aṃducēta avayavamulanniyu kūḍā anaṃtamulē.lekka lēnanni bāhuvulu kalavāḍu ani ceppabaḍinadi.) ī prakāramugānē śrīmadbhagavadgītalō maṟiyokacōṭa, śrīrāma karṇāmṛtamulōnu ceppabaḍinadi: -

“anaṃta bāhu daravaktra nētraṃ” (gīta - 11 - 16)

“sahasra nētrānana pāda bāhuṃ” (śrīrāmakarṇāmṛtaṃ- 2 - 25)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.