← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతః anaṃtaḥ

Original — తెలుగు
  1. అంతరహితః ; నిత్యః.

  2. “నాస్తి అంతః ఇత్యనంతః” (శ్రీశంకరః)

(అంతము లేనివాడు ; సర్వకాలములందు ఉండువాడు ; అందుచేత నిత్యుడు - ఎల్లపుడు ఉండువాడు.)

  1. కాలత్రయవర్తీ - (భూత, భవిష్యత్, వర్తమానములు అను మూడు కాలములందు ఉండువాడు.)

  2. అవిద్యమానో అంతః కార్యం యస్య తదనంతం - యదా కదళ్యాదేః ఫలాదికార్యోత్పాదనేన ఆది అనిత్యత్వం దృష్టం, నచ తదాపి అంతవత్వం బ్రహ్మణః, అతోపి నిత్యం.

(అరటి చెట్టునకు గెల వేయుట అను కార్యమే దాని అంతము. అటువంటి ఏ కార్యము చేయుటవలననైనను అంతమును పొందనిది పరబ్రహ్మ - అందుచేత పరబ్రహ్మ అనంతము - నిత్యము అయినది.)

  1. అద్యక్తాది సృష్టి ప్రపంచేషు వ్యాప్యపూర్ణం అవినాశి చైతన్యం అనంతం, ఉత్పత్తి వినాశరహితం అనంతం.

(వ్యక్తము మొదలు సృష్టి అంతటిలోను పూర్తిగా వ్యాపించి నాశములేని చైతన్యము అనంతము - జననమరణములు లేనిది అనంతము.)

  1. అపరిచ్ఛిన్నః. (ఇంతవాడు అని పరిమితి చెప్పుటకు నలవికానివాడు - అపరిమితుడు.)

    1. “దేశతః, కాలతః, వస్తుతః పరిచ్ఛేద రహితం బ్రహ్మ” ఇతి శ్రుతేః.

    2. అస్య అంతః పరిచ్ఛేదః దేశతః, కాలతః, వస్తుతః వాన విద్యతే ఇతి అనంతః.

    3. సర్వపరిచ్ఛేద శూన్యః, యస్య దేశకాలవస్తు కృతః పరిచ్ఛేదో నాస్తి, సః.

    4. “దేశతః కాలతః వస్తుతశ్చా పరిచ్ఛిన్నం” (శ్రీ శంకరః)

    5. దేశకాలాది హేతుత్వాత్ తది దానీం విభావ్యతే |

వస్తుతో దేశతశ్చ కాలతశ్చత్రిధోచ్యతే |

ఆనంత్యం బ్రహ్మణ శ్చాతః సత్యాద్యపిచ సిద్ధతి||” (గీతాభావప్రకాశము - 2 - 221, 222)

పైన 7.1 మొదలు 7.5 వరకు పరబ్రహ్మ మూడివిధముల పరిచ్ఛేదము - దేశమువలన కాని, కాలమువలనకాని, వస్తువువలనకాని పరిచ్ఛేదము లేనివాడు అని చెప్పబడినది. ఈ మూడువిధములైన పరిచ్ఛేదము, అది బ్రహ్మయందు ఎట్లు లేదో ఈ క్రిందను వివరించడమైనది : -

(1) “అత్రైవ దేశే అస్తి, అత్రతు నాస్తి” ఇతి దేశ పరిచ్ఛేదః; “అత్రకాలే అస్తి, అత్రతునాస్తి” ఇతికాల పరిచ్ఛేదః; ఇతి వస్తు పరిచ్ఛేదః,. ఏవం విధ పరిచ్ఛేద త్రయ రాహిత్యం నామ సర్వదేశ, సర్వ కాల వ్యాపిత్వ సర్వాంతర్యామి త్వరూపం వస్తు పరిచ్ఛేద రాహిత్యం హి సమస్త వస్తు సమానాధి కరణ్య యోగ్యత్వాదికం“.

(ఈ దేశమందున్నది - ఇక్కడ ఉన్నది - కాని అక్కడ లేదు అనునది దేశపరిచ్ఛేదము. ఈ కాలమందున్నది - ఇప్పుడు ఉన్నది - ఆ కాలమందు లేదు అనునది కాలపరిచ్ఛేదము - ఇది అగును, ఇది అవదు అనునది వస్తుపరిచ్ఛేదము. ఈ మూడువిధముల పరిచ్ఛేదములు పరబ్రహ్మయందు లేవు. సర్వ దేశములందును, సర్వ కాలములందును వ్యాపించియుండు వాడు కనుక - అన్నింటియందు అంతర్యామి రూపములోనుండుట వస్తు పరిచ్ఛేదము లేకుండుట - సమస్త వస్తువులందును ఉచ్ఛ, నీచ విచక్షణ లేక ఉండుట.)

(2) ఇహేదం నాన్య త్రేతి పరిచ్ఛేత్తు మశక్యత్వం దేశ పరిచ్ఛేదః ఇదమి దానీం, నాన్యదేత పరిచ్ఛేదా యోగ్యత్వం కాల పరిచ్ఛేదః. ఇదం ఇదం నేతి పరిచ్ఛేదానర్హత్వ లక్షణం సర్వ వస్తు సమానాధి కరణ్యార్హం వస్తు పరిచ్ఛేదః.

(ఇది ఇక్కడ ఉన్నది, మఱియొకచోటలేదు అని పరిమితి చెప్పుటకు వీలు లేకపోవడమే దేశపరిచ్ఛేదము లేకుండుట. ఇది ఇప్పుడు ఉన్నది, మరెప్పుడును లేదు అని చెప్పుటకు వీలు లేకుండా త్రికాలములందు ఉండుటే కాలపరిచ్ఛేదము లేకుండుట. ఇది ఇది, అది కాదు, - ఇందులో ఉన్నాడు అందులో లేడు అనుటకు అవకాశము లేకుండా అన్నింటియందు ఉండుటే వస్తు పరిచ్ఛేదము లేకుండుట.)

(3) ఆకాశాది కారణత్వాత్ దేశతః తావదనం తం బ్రహ్మ - ఆకాశోహ్యనంతః ఇతి ప్రసిద్ధం దేశతః, తస్యచాయం కారణం, తస్మాత్ సిద్ధం దేశతః ఆత్మనః అనంత్యం నహి సర్వగతత్వాత్ సర్వగతం ఉత్పద్య మానం లోకే కించిత్ దృశ్యతే అతో నిరతిశయం ఆత్మనః అనంత్యం దేశతః - తథా అకార్యత్వాత్ కాలతః తద్భిన్న వస్త్వంత రా భావాచ్ఛా వస్తుతః అత ఏవ నిరతిశయం సత్యత్వం. దేశతః అవిచ్ఛిన్నస్య ఆకాశస్య కారణత్వాత్ వ్యాపకత్వాత్ నిరతిశయం ఆత్మనః దేశతః అనంత్యం. అకార్యత్వాత్ చ కాలతః అనంత్యం. యద్యతో వ్యాపర్తతే తస్య పృథక్ అసత్వాత్ కార్యస్య ఉపాదానాత్ అన్యత్ర సత్వా యోగాత్వాత్ వస్తుతః అవ్యనంత్యం సిద్ధ మిత్యర్ధః.

(ఆకాశము అంతటా వ్యాపించియున్నది - “ఆసమంతాత్ కాశతే ప్రకాశతే ఇత్యాకాశః” - అంతటా ప్రకాశించునది కనుక ఆకాశము అని చెప్పబడుచున్నది - ఆకాశము వ్యాపించని దేశము లేదు. అందుచేత ఆకాశము దేశతః అనంతము. అట్టి ఆకాశమునకు కారణమైనది ఆత్మ. అందుచేత ఆత్మ దేశతః అనంతము - దేశపరిచ్ఛేదము లేనిది. లోకములో అంతటను వ్యాపించియున్నది మఱియొకటి కనబడదు - అందుచేత ఆత్మ దేశతః అనంతము - దేశపరిచ్ఛేదము లేనిది.కార్యమైన వస్తువు ఎప్పుడో ఒకప్పుడు అంతమొందవలసినదే. ఆత్మ కార్యము కాదు - కనుక ‘కాలతః’ అంతములేనిది, అనంతము- అందుచేతనే ఆత్మ ‘సత్’ పదార్ధము - త్రికాలములందు ఉండునది.)

(అంతట వ్యాపించియున్న ఆకాశమునకు కారణమగుటవల్ల ఆత్మ ‘దేశతః’ అనంతము. కార్య వస్తువుకాదు కనుక ఆత్మ ‘కాలతః’ అనంతము; అన్నివస్తువులలోను సమాన సత్తాస్ఫూర్తి కలిగి యుండడమువలన ‘వస్తుతః’ అనంతము.)

(4) “దేశకాలాది హేతుత్వాత్ తది దానీం విభావ్యతే |

వస్తుతో దేశతశ్చైవ కాలతశ్చ త్రిధోచ్యతే |

ఆనంత్యం బ్రహ్మణశ్చాతః సత్యాద్యపిచ సిద్ధ్యతి“. (గీతాభావప్రకాశము - 2 - 221, 222)

(దేశమువలన, కాలమువలన, వస్తువువలన అను ఈమూడువిధముల అంతములేనివాడు కనుక బ్రహ్మ అనంతుడు. ఇందువలననే బ్రహ్మ “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అను వాక్యము సిద్ధించినది.)

(5) “సవ్యాపి త్వాత్ దేశతో (అ)నంతో నిత్యత్వాన్నాపి కాలతః |

న వస్తుతోపి సర్వాత్మా దనంత్యం బ్రహ్మణిత్రిధా ||”

(అంతటా వ్యాపించియుండుటవలన దేశపరిచ్చేదము లేనివాడు - నిత్యుడు, శాశ్వతుడు అగుటవలన కాలపరిచ్ఛేదము లేనివాడు. సర్వాత్మ యగుటవలన అన్ని వస్తువులలోను ఆత్మ రూపముగా అంతరాత్మగా నుండుటవలన వస్తు పరిచ్ఛేదము లేనివాడు.)

  1. “నిఖిల జగదాశ్రయ తయా దేశకాల పరిచ్ఛిన్నానర్హం” (శ్రీరామానుజః)

(జగత్తు అంతటికీ ఆశ్రయమైనవాడు. ఇతనిలోనే జగత్ సృష్టికి పూర్వము సూక్ష్మరూపములోఉండును, స్థితికాలములోకూడా ఇతని విశ్వరూపములోనే జగత్తు అంతయు ఉన్నది. అందుచేత జగత్తునకు ఆశ్రయమైన వాడు.

వ. “ఉత్పత్తి స్థితి లయంబు లెందు నగుచు బ్రకాశింపబడు నది యాశ్రయంబనంబడు. - అదియ పరమాత్మ, బ్రహ్మశబ్ద వాచ్యంబు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 2 - 10 - 268)

అందుచేత దేశపరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము, లేనివాడు.)

  1. యత్ హి న కుతశ్చిత్ ప్రవిభజ్యతే తదనంతం. (ఏది దేనిచేతనైనను విభజించబడదో అది అనంతము.)

  2. “నిత్యత్వాత్, సర్వగతత్వాత్, దేశకాల పరిచ్ఛేదాభావాత్ అనంతః” (శ్రీశంకరః)

(శాశ్వతుడు, అన్నింటిలోను వ్యాపించి యుండువాడు, దేశమువల్ల కాలమువల్ల పరిచ్ఛేదము లేనివాడు అగుట వలన అనంతుడు.)

  1. వ్యాపిత్వాత్, నిత్యత్వాత్, సర్వాత్మత్వాత్ దేశతః కాలతః వస్తుతః చ అపరిచ్ఛిన్నః అనంతః.

(అంతట వ్యాపించియుండుటవలన దేశపరిచ్ఛేదము లేనివాడు; మూడు కాలములందు - ఎల్లపుడు ఉండువాడగుటవలన కాలపరిచ్ఛేదము లేనివాడు; ప్రతి వస్తువులోన అంతరాత్మగా యుండుటవలన వస్తు పరిచ్ఛేదము లేనివాడు. అందుచేత అనంతుడు.)

  1. “దేశకాల వస్తుభిః యస్య అంతో - పరిచ్ఛేదః - న భవతి, కింతు సర్వదేశ, సర్వకాల సర్వావస్తుషు చ > వ్యాప్య యద్వర్తతే తదనంతం, విభు, భూమ ఇతి చ ఉచ్యతే. యో భూమా స ఆనందోభవతి ఇత్యుక్తం > అతశ్చ అనంతత్వాదేవ బ్రహ్మణః ఆనందరూపమపి సిద్ధం”. (విచారసాగరము)

(దేశము వల్లకాని, కాలము వల్లకాని, వస్తువువలన కాని అంతములేనివాడు. సమస్త దేశములలోను, సర్వకాలములందును, సమస్తవస్తువులందును వ్యాపించియుండువాడు అతనే అనంతుడు, అతనే విభువు, అదియే ‘భూమ’ అని చెప్పబడుచున్నాడు. ఏది అంతములేనన్ని రూపములు గలదో అదియే భూమ, యేది భూమయో అదియే ఆనందము అని చెప్పబడినది. అందుచేత, అనంతుడగుటవలననే పరబ్రహ్మకు ఆనందరూపము సిద్ధించినది.)

  1. “ఉత్పత్తి వినాశరహితమనంతం, షడ్భావ వికార రహితమనంతం, సర్వోపాధి వినుర్ముక్తమనంతం, మద్వికారేషు > మృదిన, స్వర్ణవికారేషు స్వర్ణమివ, తంతు వికారేషు తంతురివ, అవ్యక్తాది సృష్టి ప్రపంచేషు > వ్యాప్య పూర్ణమ వినాశి చైతన్యమనంతం”. (సర్వసారోపనిషత్)

(ఆత్మ జననమరణములు లేకపోవుటవలన అనంతము. జననము కలదానికి మరణముండును, మరణముండిన నదియే అంతము. ఈ రెండును ఆత్మకు లేవుకనుక అనంతము.షడ్భావవికారములు - జననము మొదలగునవి - లేనందున అనంతము - జననము ఉండిననే మిగిలిన వికారములుండును. అందుచేత అనంతము. ఏ విధమైన ఉపాధి లేనందున అనంతము. ఉపాధులన్నియు నశించునవియే - ఆత్మ స్వస్వరూపములో ఉపాధిలేనందున - శుద్ధసత్వమయుడగుటవలన - అనంతుడు. మట్టితో చేయబడినపదార్థము లన్నింటిలోను మట్టియున్నట్లే, బంగారముతో చేయబడిన ఆభరణములన్నింటిలోను బంగారమున్నట్లే, దారములతో నేయబడినబట్ట మొదలగువాటిలో దారమున్నట్లు, అవ్యక్తము -ప్రకృతి - మొదలు ప్రపంచములో ఉన్న వస్తువులన్నింటిలోను పూర్తిగా వ్యాపించి నిండి యుండి, నాశములేని చైతన్యముకనుక అనంతము.)

  1. అపరిమిత త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వాత్ అఖండ దండాయమానః ఇత్యర్థః - ఏ తేన స జాతీయ, విజాతీయ > స్వగతభేదత్రయ రాహిత్యం సూచితం.

(మూడు విధముల పరిచ్ఛేదము లేకపోవుటవలన అంతటను దండమువలె ఒకటిగానే ఉండువాడు - ఇందువల్ల స్వజాతీయ, విజాతీయ స్వగత భేదములేనివాడు - తనవంటి ప్రభువుకాని, ఇతర ప్రభువు అయినవాడుకాని లేనటువంటివాడు.)

  1. “యస్మాదుచ్యార్యమాణ ఏవ ఆద్యంతం నోపలభ్యతే, తిర్య గూర్థ్వమథ్యస్తాత్” తస్మా దుచ్యతే అనంతః -“. > (అధర్వశిరోపనిషత్)

(క్రింద, మీద, అడుగు ఎటుచూసినను మొదలు, తుది కానరాదు అని చెప్పబడినందున అనంతము.)

  1. న చ దివ్యానాం భగవద్విభూతేనామంతో అస్తి, యతః అనంతవిభూతిత్వాత్ అనంతః.

(భగవంతునియొక్క దివ్యమైన విభూతులకు - మూర్తులకు - అంతములేదు - అనంతవిభూతులు గలవాడుకనుక అనంతుడు.

  1. “నాం తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |” (శ్రీమద్భగవద్గీత - 10 - 40)

(దివ్యమైన నా విభూతులకు అంతములేదు)

అని శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పెను - విభూతులు ననగా అనేకరూపములుగా అగుట. అందుచేత లెక్కలేనన్ని, అంతములేనన్ని రూపములు గలవాడు గనుక అనంతుడు. సృష్టిలోని రూపములన్నియు భగవంతునివే.)

(2) ఈ విషయమే శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది –

సీ. ” --- భువి దావకీన విభూతులెన్న

తే.నంత మెఱుగంగరామి ననంతు డనుచు

బలుకుదురు నిన్ను --- “. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 4 - 30 - 925)

    1. “గంధర్వాప్సరసః సిద్ధాః కిన్నరోరగ చారణాః |

నాంతం గుణానాం గచ్ఛంతితేనానం తోయ మవ్యయం ||“.

ఇతి విష్ణుపురాణ వచనాత్ వా అనంతః.

(గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు కిన్నరులు, ఉరగులు, చారణులు, నీ గుణముల అంతము తెలియలేరు. - (అనంత గుణములు గలవాడవు) - అందుచేత అనంతుడు.)

  1. పై విషయము శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“సీ. ఎవ్వని గుణజాల మెన్న జిహ్వలులేక నళినగర్భాదు లనంతు డండ్రు ---”.

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 8 - 447)

  1. “యో(అ)నంతశక్తిర్భగవాననంతో మహద్గుణత్వాద్యమనంత మాహుః||”. (శ్రీమద్భాగవతము - 1 - 18 - > 19)

(అనంత శక్తి గలిగి యుండుటచేత భగవంతుడనంతుడు. అనంతగుణములు గలవాడగుటచేత అనంతుడు అని చెప్పబడుచున్నాడు.)

17.4 “సీ. భూరజంబుల నైన భూనాధ! యెన్నంగ జను గాని నాగుణ జన్మ కర్మ

నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరు జాల రదియేల నాకును నలవి గాదు - - - “.

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - పూ.భా. - 1650)

  1. “అనంతరూపం స్వమనంతచర్యం అనంతవేదైరను వర్ణనీయం |

అనంతనామానమంత దేవం |

అనంతకల్యాణగుణాభిరామం ||

- అనంత శక్తీశమనంత విక్రమం అనంతదేహే చ శయా నమీశ్వరం |

అనంతసౌభాగ్యమనంత నేత్రికం - - - ||“. (శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం - 3 - 35, 36)

(అంతములేనన్ని రూపములు, చర్యలు, నామములు, కల్యాణగుణములు గలవాడు. అనంతమైన వేదములచేత తెలియబడువాడు. అనంత శక్తిగలవాడు, అనంత పరాక్రమము గలవాడు, అనంత దేహములలో శయనించువాడు, అనంత సౌభాగ్యములు కలవాడు, అనంత నేత్రములు కలవాడు.)

  1. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” ; “అనాధ్యనంతం” ఇతిచ శ్రుతిః.

(వేదము సత్యస్వరూపము - మూడుకాలములందు ఉండువాడు - జ్ఞానస్వరూపుడు - అంతము లేనివాడు - నిత్యుడు” అనిన్నీ, ‘మొదలు, తుది లేనివాడు’ అని భగవంతుని గుఱించి చెప్పుచున్నది.)

  1. ఆది శేషువు ఆది - మొదలు; శేషువు - శేషించినవాడు - సృష్టికి ముందు ఉన్నవాడు, మొదలు > అయినవాడు, కారణమైనవాడు. సృష్టి అంతమైన తర్వాత మిగిలి యుండువాడు పరమాత్మయే –

“సీ. --- బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగంబులు నశింపగ బెద్ద భూతగణము

ఆ. సూక్ష్మభూతమందు జొరగ నా భూతంబు

ప్రకృతిలోన జొరగ బ్రకృతి వోయి

వ్యక్తమందు జొరగ వ్యక్త మడంగను

శేష సంజ్ఞ నీవు చెలువ మగుదు.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - పూ.భా. 126)

  1. నాగరాజు అయిన అనంతుడు - భగవంతుడు అనంతశయనుడు - “అనంతశ్చాస్మి నాగానాం” > (శ్రీభగవద్గీత - 10 - 29)

- నాగరాజు - “నాగానాం భగవత్కలా” - భగవంతుని కళయే అయిన నాగరాజు.

  1. “సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం”. (శ్రీమద్భగవద్గీత - 11 - 11)

(అందఱకు - అన్నివిధముల ఆశ్చర్యమును కలిగించుచు, అంతటా ముఖములు గలిగినటువంటిన్నీ, అంతములేని రూపము(లు) గలిగినటువంటి దేవుని పార్థుని కొఱకు శ్రీకృష్ణభగవానుడు చూపించెను.)

  1. “అనంతమవ్యయం కవిం” (మంత్రపుష్పము)
Transliteration
  1. aṃtarahitaḥ ; nityaḥ.

  2. “nāsti aṃtaḥ ityanaṃtaḥ” (śrīśaṃkaraḥ)

(aṃtamu lēnivāḍu ; sarvakālamulaṃdu uṃḍuvāḍu ; aṃducēta nityuḍu - ellapuḍu uṃḍuvāḍu.)

  1. kālatrayavartī - (bhūta, bhaviṣyat, vartamānamulu anu mūḍu kālamulaṃdu uṃḍuvāḍu.)

  2. avidyamānō aṃtaḥ kāryaṃ yasya tadanaṃtaṃ - yadā kadaḷyādēḥ phalādikāryōtpādanēna ādi anityatvaṃ dṛṣṭaṃ, naca tadāpi aṃtavatvaṃ brahmaṇaḥ, atōpi nityaṃ.

(araṭi ceṭṭunaku gela vēyuṭa anu kāryamē dāni aṃtamu. aṭuvaṃṭi ē kāryamu cēyuṭavalananainanu aṃtamunu poṃdanidi parabrahma - aṃducēta parabrahma anaṃtamu - nityamu ayinadi.)

  1. adyaktādi sṛṣṭi prapaṃcēṣu vyāpyapūrṇaṃ avināśi caitanyaṃ anaṃtaṃ, utpatti vināśarahitaṃ anaṃtaṃ.

(vyaktamu modalu sṛṣṭi aṃtaṭilōnu pūrtigā vyāpiṃci nāśamulēni caitanyamu anaṃtamu - jananamaraṇamulu lēnidi anaṃtamu.)

  1. aparicchinnaḥ. (iṃtavāḍu ani parimiti ceppuṭaku nalavikānivāḍu - aparimituḍu.)

    1. “dēśataḥ, kālataḥ, vastutaḥ paricchēda rahitaṃ brahma” iti śrutēḥ.

    2. asya aṃtaḥ paricchēdaḥ dēśataḥ, kālataḥ, vastutaḥ vāna vidyatē iti anaṃtaḥ.

    3. sarvaparicchēda śūnyaḥ, yasya dēśakālavastu kṛtaḥ paricchēdō nāsti, saḥ.

    4. “dēśataḥ kālataḥ vastutaścā paricchinnaṃ” (śrī śaṃkaraḥ)

    5. dēśakālādi hētutvāt tadi dānīṃ vibhāvyatē |

vastutō dēśataśca kālataścatridhōcyatē |

ānaṃtyaṃ brahmaṇa ścātaḥ satyādyapica siddhati||” (gītābhāvaprakāśamu - 2 - 221, 222)

paina 7.1 modalu 7.5 varaku parabrahma mūḍividhamula paricchēdamu - dēśamuvalana kāni, kālamuvalanakāni, vastuvuvalanakāni paricchēdamu lēnivāḍu ani ceppabaḍinadi. ī mūḍuvidhamulaina paricchēdamu, adi brahmayaṃdu eṭlu lēdō ī kriṃdanu vivariṃcaḍamainadi : -

(1) “atraiva dēśē asti, atratu nāsti” iti dēśa paricchēdaḥ; “atrakālē asti, atratunāsti” itikāla paricchēdaḥ; iti vastu paricchēdaḥ,. ēvaṃ vidha paricchēda traya rāhityaṃ nāma sarvadēśa, sarva kāla vyāpitva sarvāṃtaryāmi tvarūpaṃ vastu paricchēda rāhityaṃ hi samasta vastu samānādhi karaṇya yōgyatvādikaṃ”.

(ī dēśamaṃdunnadi - ikkaḍa unnadi - kāni akkaḍa lēdu anunadi dēśaparicchēdamu. ī kālamaṃdunnadi - ippuḍu unnadi - ā kālamaṃdu lēdu anunadi kālaparicchēdamu - idi agunu, idi avadu anunadi vastuparicchēdamu. ī mūḍuvidhamula paricchēdamulu parabrahmayaṃdu lēvu. sarva dēśamulaṃdunu, sarva kālamulaṃdunu vyāpiṃciyuṃḍu vāḍu kanuka - anniṃṭiyaṃdu aṃtaryāmi rūpamulōnuṃḍuṭa vastu paricchēdamu lēkuṃḍuṭa - samasta vastuvulaṃdunu uccha, nīca vicakṣaṇa lēka uṃḍuṭa.)

(2) ihēdaṃ nānya trēti paricchēttu maśakyatvaṃ dēśa paricchēdaḥ idami dānīṃ, nānyadēta paricchēdā yōgyatvaṃ kāla paricchēdaḥ. idaṃ idaṃ nēti paricchēdānarhatva lakṣaṇaṃ sarva vastu samānādhi karaṇyārhaṃ vastu paricchēdaḥ.

(idi ikkaḍa unnadi, maṟiyokacōṭalēdu ani parimiti ceppuṭaku vīlu lēkapōvaḍamē dēśaparicchēdamu lēkuṃḍuṭa. idi ippuḍu unnadi, mareppuḍunu lēdu ani ceppuṭaku vīlu lēkuṃḍā trikālamulaṃdu uṃḍuṭē kālaparicchēdamu lēkuṃḍuṭa. idi idi, adi kādu, - iṃdulō unnāḍu aṃdulō lēḍu anuṭaku avakāśamu lēkuṃḍā anniṃṭiyaṃdu uṃḍuṭē vastu paricchēdamu lēkuṃḍuṭa.)

(3) ākāśādi kāraṇatvāt dēśataḥ tāvadanaṃ taṃ brahma - ākāśōhyanaṃtaḥ iti prasiddhaṃ dēśataḥ, tasyacāyaṃ kāraṇaṃ, tasmāt siddhaṃ dēśataḥ ātmanaḥ anaṃtyaṃ nahi sarvagatatvāt sarvagataṃ utpadya mānaṃ lōkē kiṃcit dṛśyatē atō niratiśayaṃ ātmanaḥ anaṃtyaṃ dēśataḥ - tathā akāryatvāt kālataḥ tadbhinna vastvaṃta rā bhāvācchā vastutaḥ ata ēva niratiśayaṃ satyatvaṃ. dēśataḥ avicchinnasya ākāśasya kāraṇatvāt vyāpakatvāt niratiśayaṃ ātmanaḥ dēśataḥ anaṃtyaṃ. akāryatvāt ca kālataḥ anaṃtyaṃ. yadyatō vyāpartatē tasya pṛthak asatvāt kāryasya upādānāt anyatra satvā yōgātvāt vastutaḥ avyanaṃtyaṃ siddha mityardhaḥ.

(ākāśamu aṃtaṭā vyāpiṃciyunnadi - “āsamaṃtāt kāśatē prakāśatē ityākāśaḥ” - aṃtaṭā prakāśiṃcunadi kanuka ākāśamu ani ceppabaḍucunnadi - ākāśamu vyāpiṃcani dēśamu lēdu. aṃducēta ākāśamu dēśataḥ anaṃtamu. aṭṭi ākāśamunaku kāraṇamainadi ātma. aṃducēta ātma dēśataḥ anaṃtamu - dēśaparicchēdamu lēnidi. lōkamulō aṃtaṭanu vyāpiṃciyunnadi maṟiyokaṭi kanabaḍadu - aṃducēta ātma dēśataḥ anaṃtamu - dēśaparicchēdamu lēnidi.kāryamaina vastuvu eppuḍō okappuḍu aṃtamoṃdavalasinadē. ātma kāryamu kādu - kanuka ‘kālataḥ’ aṃtamulēnidi, anaṃtamu- aṃducētanē ātma ‘sat’ padārdhamu - trikālamulaṃdu uṃḍunadi.)

(aṃtaṭa vyāpiṃciyunna ākāśamunaku kāraṇamaguṭavalla ātma ‘dēśataḥ’ anaṃtamu. kārya vastuvukādu kanuka ātma ‘kālataḥ’ anaṃtamu; annivastuvulalōnu samāna sattāsphūrti kaligi yuṃḍaḍamuvalana ‘vastutaḥ’ anaṃtamu.)

(4) “dēśakālādi hētutvāt tadi dānīṃ vibhāvyatē |

vastutō dēśataścaiva kālataśca tridhōcyatē |

ānaṃtyaṃ brahmaṇaścātaḥ satyādyapica siddhyati”. (gītābhāvaprakāśamu - 2 - 221, 222)

(dēśamuvalana, kālamuvalana, vastuvuvalana anu īmūḍuvidhamula aṃtamulēnivāḍu kanuka brahma anaṃtuḍu. iṃduvalananē brahma “satyaṃ jñānamanaṃtaṃ brahma” anu vākyamu siddhiṃcinadi.)

(5) “savyāpi tvāt dēśatō (a)naṃtō nityatvānnāpi kālataḥ |

na vastutōpi sarvātmā danaṃtyaṃ brahmaṇitridhā ||”

(aṃtaṭā vyāpiṃciyuṃḍuṭavalana dēśapariccēdamu lēnivāḍu - nityuḍu, śāśvatuḍu aguṭavalana kālaparicchēdamu lēnivāḍu. sarvātma yaguṭavalana anni vastuvulalōnu ātma rūpamugā aṃtarātmagā nuṃḍuṭavalana vastu paricchēdamu lēnivāḍu.)

  1. “nikhila jagadāśraya tayā dēśakāla paricchinnānarhaṃ” (śrīrāmānujaḥ)

(jagattu aṃtaṭikī āśrayamainavāḍu. itanilōnē jagat sṛṣṭiki pūrvamu sūkṣmarūpamulōuṃḍunu, sthitikālamulōkūḍā itani viśvarūpamulōnē jagattu aṃtayu unnadi. aṃducēta jagattunaku āśrayamaina vāḍu.

va. “utpatti sthiti layaṃbu leṃdu nagucu brakāśiṃpabaḍu nadi yāśrayaṃbanaṃbaḍu. - adiya paramātma, brahmaśabda vācyaṃbu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu- 2 - 10 - 268)

aṃducēta dēśaparicchēdamu, kālaparicchēdamu, lēnivāḍu.)

  1. yat hi na kutaścit pravibhajyatē tadanaṃtaṃ. (ēdi dēnicētanainanu vibhajiṃcabaḍadō adi anaṃtamu.)

  2. “nityatvāt, sarvagatatvāt, dēśakāla paricchēdābhāvāt anaṃtaḥ” (śrīśaṃkaraḥ)

(śāśvatuḍu, anniṃṭilōnu vyāpiṃci yuṃḍuvāḍu, dēśamuvalla kālamuvalla paricchēdamu lēnivāḍu aguṭa valana anaṃtuḍu.)

  1. vyāpitvāt, nityatvāt, sarvātmatvāt dēśataḥ kālataḥ vastutaḥ ca aparicchinnaḥ anaṃtaḥ.

(aṃtaṭa vyāpiṃciyuṃḍuṭavalana dēśaparicchēdamu lēnivāḍu; mūḍu kālamulaṃdu - ellapuḍu uṃḍuvāḍaguṭavalana kālaparicchēdamu lēnivāḍu; prati vastuvulōna aṃtarātmagā yuṃḍuṭavalana vastu paricchēdamu lēnivāḍu. aṃducēta anaṃtuḍu.)

  1. “dēśakāla vastubhiḥ yasya aṃtō - paricchēdaḥ - na bhavati, kiṃtu sarvadēśa, sarvakāla sarvāvastuṣu ca > vyāpya yadvartatē tadanaṃtaṃ, vibhu, bhūma iti ca ucyatē. yō bhūmā sa ānaṃdōbhavati ityuktaṃ > ataśca anaṃtatvādēva brahmaṇaḥ ānaṃdarūpamapi siddhaṃ”. (vicārasāgaramu)

(dēśamu vallakāni, kālamu vallakāni, vastuvuvalana kāni aṃtamulēnivāḍu. samasta dēśamulalōnu, sarvakālamulaṃdunu, samastavastuvulaṃdunu vyāpiṃciyuṃḍuvāḍu atanē anaṃtuḍu, atanē vibhuvu, adiyē ‘bhūma’ ani ceppabaḍucunnāḍu. ēdi aṃtamulēnanni rūpamulu galadō adiyē bhūma, yēdi bhūmayō adiyē ānaṃdamu ani ceppabaḍinadi. aṃducēta, anaṃtuḍaguṭavalananē parabrahmaku ānaṃdarūpamu siddhiṃcinadi.)

  1. “utpatti vināśarahitamanaṃtaṃ, ṣaḍbhāva vikāra rahitamanaṃtaṃ, sarvōpādhi vinurmuktamanaṃtaṃ, madvikārēṣu > mṛdina, svarṇavikārēṣu svarṇamiva, taṃtu vikārēṣu taṃturiva, avyaktādi sṛṣṭi prapaṃcēṣu > vyāpya pūrṇama vināśi caitanyamanaṃtaṃ”. (sarvasārōpaniṣat)

(ātma jananamaraṇamulu lēkapōvuṭavalana anaṃtamu. jananamu kaladāniki maraṇamuṃḍunu, maraṇamuṃḍina nadiyē aṃtamu. ī reṃḍunu ātmaku lēvukanuka anaṃtamu.ṣaḍbhāvavikāramulu - jananamu modalagunavi - lēnaṃduna anaṃtamu - jananamu uṃḍinanē migilina vikāramuluṃḍunu. aṃducēta anaṃtamu. ē vidhamaina upādhi lēnaṃduna anaṃtamu. upādhulanniyu naśiṃcunaviyē - ātma svasvarūpamulō upādhilēnaṃduna - śuddhasatvamayuḍaguṭavalana - anaṃtuḍu. maṭṭitō cēyabaḍinapadārthamu lanniṃṭilōnu maṭṭiyunnaṭlē, baṃgāramutō cēyabaḍina ābharaṇamulanniṃṭilōnu baṃgāramunnaṭlē, dāramulatō nēyabaḍinabaṭṭa modalaguvāṭilō dāramunnaṭlu, avyaktamu -prakṛti - modalu prapaṃcamulō unna vastuvulanniṃṭilōnu pūrtigā vyāpiṃci niṃḍi yuṃḍi, nāśamulēni caitanyamukanuka anaṃtamu.)

  1. aparimita trividha paricchēda śūnyatvāt akhaṃḍa daṃḍāyamānaḥ ityarthaḥ - ē tēna sa jātīya, vijātīya > svagatabhēdatraya rāhityaṃ sūcitaṃ.

(mūḍu vidhamula paricchēdamu lēkapōvuṭavalana aṃtaṭanu daṃḍamuvale okaṭigānē uṃḍuvāḍu - iṃduvalla svajātīya, vijātīya svagata bhēdamulēnivāḍu - tanavaṃṭi prabhuvukāni, itara prabhuvu ayinavāḍukāni lēnaṭuvaṃṭivāḍu.)

  1. “yasmāducyāryamāṇa ēva ādyaṃtaṃ nōpalabhyatē, tirya gūrthvamathyastāt” tasmā ducyatē anaṃtaḥ -“. > (adharvaśirōpaniṣat)

(kriṃda, mīda, aḍugu eṭucūsinanu modalu, tudi kānarādu ani ceppabaḍinaṃduna anaṃtamu.)

  1. na ca divyānāṃ bhagavadvibhūtēnāmaṃtō asti, yataḥ anaṃtavibhūtitvāt anaṃtaḥ.

(bhagavaṃtuniyokka divyamaina vibhūtulaku - mūrtulaku - aṃtamulēdu - anaṃtavibhūtulu galavāḍukanuka anaṃtuḍu.

  1. “nāṃ tōsti mama divyānāṃ vibhūtīnāṃ paraṃtapa |” (śrīmadbhagavadgīta - 10 - 40)

(divyamaina nā vibhūtulaku aṃtamulēdu)

ani śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō ceppenu - vibhūtulu nanagā anēkarūpamulugā aguṭa. aṃducēta lekkalēnanni, aṃtamulēnanni rūpamulu galavāḍu ganuka anaṃtuḍu. sṛṣṭilōni rūpamulanniyu bhagavaṃtunivē.)

(2) ī viṣayamē śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi –

sī. ” --- bhuvi dāvakīna vibhūtulenna

tē.naṃta meṟugaṃgarāmi nanaṃtu ḍanucu

balukuduru ninnu --- “. (śrīmadāṃdhra mahābhāgavatamu - 4 - 30 - 925)

    1. “gaṃdharvāpsarasaḥ siddhāḥ kinnarōraga cāraṇāḥ |

nāṃtaṃ guṇānāṃ gacchaṃtitēnānaṃ tōya mavyayaṃ ||“.

iti viṣṇupurāṇa vacanāt vā anaṃtaḥ.

(gaṃdharvulu, apsarasalu, siddhulu kinnarulu, uragulu, cāraṇulu, nī guṇamula aṃtamu teliyalēru. - (anaṃta guṇamulu galavāḍavu) - aṃducēta anaṃtuḍu.)

  1. pai viṣayamu śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“sī. evvani guṇajāla menna jihvalulēka naḷinagarbhādu lanaṃtu ḍaṃḍru ---”.

(śrīmadāṃdhra mahābhāgavatamu - 1- 8 - 447)

  1. “yō(a)naṃtaśaktirbhagavānanaṃtō mahadguṇatvādyamanaṃta māhuḥ||”. (śrīmadbhāgavatamu - 1 - 18 - > 19)

(anaṃta śakti galigi yuṃḍuṭacēta bhagavaṃtuḍanaṃtuḍu. anaṃtaguṇamulu galavāḍaguṭacēta anaṃtuḍu ani ceppabaḍucunnāḍu.)

17.4 “sī. bhūrajaṃbula naina bhūnādha! yennaṃga janu gāni nāguṇa janma karma

nāmaṃbu lella nennaṃga nevvaru jāla radiyēla nākunu nalavi gādu - - - “.

(śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - pū.bhā. - 1650)

  1. “anaṃtarūpaṃ svamanaṃtacaryaṃ anaṃtavēdairanu varṇanīyaṃ |

anaṃtanāmānamaṃta dēvaṃ |

anaṃtakalyāṇaguṇābhirāmaṃ ||

- anaṃta śaktīśamanaṃta vikramaṃ anaṃtadēhē ca śayā namīśvaraṃ |

anaṃtasaubhāgyamanaṃta nētrikaṃ - - - ||“. (śrī vēṃkaṭēśvaramahātmyaṃ - 3 - 35, 36)

(aṃtamulēnanni rūpamulu, caryalu, nāmamulu, kalyāṇaguṇamulu galavāḍu. anaṃtamaina vēdamulacēta teliyabaḍuvāḍu. anaṃta śaktigalavāḍu, anaṃta parākramamu galavāḍu, anaṃta dēhamulalō śayaniṃcuvāḍu, anaṃta saubhāgyamulu kalavāḍu, anaṃta nētramulu kalavāḍu.)

  1. “satyaṃ jñānamanaṃtaṃ brahma” ; “anādhyanaṃtaṃ” itica śrutiḥ.

(vēdamu satyasvarūpamu - mūḍukālamulaṃdu uṃḍuvāḍu - jñānasvarūpuḍu - aṃtamu lēnivāḍu - nityuḍu” aninnī, ‘modalu, tudi lēnivāḍu’ ani bhagavaṃtuni guṟiṃci ceppucunnadi.)

  1. ādi śēṣuvu ādi - modalu; śēṣuvu - śēṣiṃcinavāḍu - sṛṣṭiki muṃdu unnavāḍu, modalu > ayinavāḍu, kāraṇamainavāḍu. sṛṣṭi aṃtamaina tarvāta migili yuṃḍuvāḍu paramātmayē –

“sī. --- brahma reṃḍava yarthaṃbu tudi jagaṃbulu naśiṃpaga bedda bhūtagaṇamu

ā. sūkṣmabhūtamaṃdu joraga nā bhūtaṃbu

prakṛtilōna joraga brakṛti vōyi

vyaktamaṃdu joraga vyakta maḍaṃganu

śēṣa saṃjña nīvu celuva magudu.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - pū.bhā. 126)

  1. nāgarāju ayina anaṃtuḍu - bhagavaṃtuḍu anaṃtaśayanuḍu - “anaṃtaścāsmi nāgānāṃ” > (śrībhagavadgīta - 10 - 29)

- nāgarāju - “nāgānāṃ bhagavatkalā” - bhagavaṃtuni kaḷayē ayina nāgarāju.

  1. “sarvāścaryamayaṃ dēvaṃ anaṃtaṃ viśvatōmukhaṃ”. (śrīmadbhagavadgīta - 11 - 11)

(aṃdaṟaku - annividhamula āścaryamunu kaligiṃcucu, aṃtaṭā mukhamulu galiginaṭuvaṃṭinnī, aṃtamulēni rūpamu(lu) galiginaṭuvaṃṭi dēvuni pārthuni koṟaku śrīkṛṣṇabhagavānuḍu cūpiṃcenu.)

  1. “anaṃtamavyayaṃ kaviṃ” (maṃtrapuṣpamu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.