← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతపదం anaṃtapadaṃ

Original — తెలుగు

“మామనంతపదం ప్రాప్య పునరావృత్తి వర్జితం|నవిద్యతే పునర్జన్మ పునరావృత్తి లక్షణం”. (గీతాభావప్రకాశము- 8 - 16)

(అంతము లేని స్థానము, శాశ్వతముగనుండు గతి, పరమగతి, పరమపదము, మరల జన్మ కలుగచేయని పదము, దీనిని పొందిన, మరల మరల పుట్టుటయే లక్షణముగా గల పునర్జన్మ కలుగదు - ఇట్టిగతి, ఇట్టి స్థానము, నేనే (భగవంతుడే.)

క. “పరమ బ్రహ్మ మనంగా

బరతత్త్వం బనంగ బరమపద మనగను నీ

శ్వరు డన గృష్ణ డన జగ

ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 11 - 51)

శాశ్వతపదమే భగవంతుడు, భగవంతుడేశాశ్వతపదము, వైకుంఠమేవైకుంఠుడు, వైకుంఠుడే వైకుంఠము.)

Transliteration

“māmanaṃtapadaṃ prāpya punarāvṛtti varjitaṃ|navidyatē punarjanma punarāvṛtti lakṣaṇaṃ”. (gītābhāvaprakāśamu- 8 - 16)

(aṃtamu lēni sthānamu, śāśvatamuganuṃḍu gati, paramagati, paramapadamu, marala janma kalugacēyani padamu, dīnini poṃdina, marala marala puṭṭuṭayē lakṣaṇamugā gala punarjanma kalugadu - iṭṭigati, iṭṭi sthānamu, nēnē (bhagavaṃtuḍē.)

ka. “parama brahma manaṃgā

baratattvaṃ banaṃga baramapada managanu nī

śvaru ḍana gṛṣṇa ḍana jaga

dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 11 - 51)

śāśvatapadamē bhagavaṃtuḍu, bhagavaṃtuḍēśāśvatapadamu, vaikuṃṭhamēvaikuṃṭhuḍu, vaikuṃṭhuḍē vaikuṃṭhamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.