← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతరూపం anaṃtarūpaṃ

Original — తెలుగు
  1. నానా రూపం (అనేక రూపములు కలవాడు.)

  2. అనంతాని రూపాణి అస్య ఇతి అనంత రూపః. (అంతము లేనన్ని, లెక్కలేనన్ని రూపములు గలవాడు.)

  3. “అనంతాని రూపాణి అస్య విశ్వరూపేణ స్థితస్య ఇతి అనంతరూపః” (శ్రీశంకరః.)

(విశ్వమే రూపముగా ఉన్న ఇతని ఆ రూపములో అంతములేనన్ని, లెక్కలేనన్ని రూపములు గలవాడు.)

  1. అంతో నవిద్యతే తవ రూపాణాం ; త్రివిధ పరిచ్ఛేద శూన్య స్వరూపః.

(దేశకాలవస్తు పరిచ్ఛేదము లేకపోవుటచేత నీ రూపములకు అంతము లేదు, ఇవి ఇన్నే అని నిర్ణయములేదు. అన్ని కాలములందు, అన్ని స్థలములందు ఉండు రూపములన్నియు భగవంతునివే. అవి ‘ఇన్ని’ అని లెక్కపెట్టనలవికాదు. అంతములేనన్ని రూపములుగలవాడు కనుక అనంతరూపుడు.)

  1. రూపాణాం కైవల్యాదీనాం అంతః పరిచ్ఛేదో న విద్యతే ఇతి అనంతరూపః.

(మోక్షము మొదలగు తన రూపములకు అంతము లేదు, మితము లేదు - కనుక అనంతరూపుడు.)

  1. పరిచ్ఛేదత్రయా భావాత్ అనంతరూపః.

(దేశకాల వస్తువులవలన పరిచ్ఛేదము లేకపోవుటవలన అనంతరూపుడు.)

  1. స్వాజ్ఞ దృష్ట్యా అనేక రూపీ, సేవాత్మకత్వాత్.

(అన్నీ భగవంతుడే అని తెలియకపోవుటవలన, సర్వమునకు తానే అయి యుండుటవలన, అనేక రూపములుగలవాడు. అందుచేత అనంతరూపుడు.)

  1. శ్రీకృష్ణభగవానుని విశ్వరూపము చూచి అర్జునుడు ఈ ప్రకారముగా స్తోత్రము చేసెను : -

“పశ్చామిత్వాం సర్వతో(అ)నంత రూపః.” (శ్రీమద్భగవద్గీత- 11 - 16)

(అంతములేనన్ని రూపములుగల నిన్నూంతట చూచుచున్నాను.)

  1. భగవంతుని విశ్వరూపము గుఱించి తానే ఈ క్రింద విధముగా చెప్పెను :- “తేజోమయం విశ్వమనంతమాద్యం”

(శ్రీమద్భగవద్గీత- 11 - 47)

  1. అపరిమాణః.

(హద్దు ఆపు లేక విస్తరించి- వ్యాపించి - పరిమాణములేక విశ్వమంతాకలిసియున్న ఒకే ఒక రూపముకలవాడు.)

  1. “నాంతం, నమధ్యం, నపునస్తవాదిం పశ్యాలి” (శ్రీమద్భగవద్గీత - 11 - 16)

(మొదలు, తుది. మధ్యము కనబడని రూపము - అందుచేత అనంతరూపము.)

  1. “అచింత్య మవ్యక్త మనంత రూపం శివం ప్రశాంత,” ఇతి శ్రుతిః.
Transliteration
  1. nānā rūpaṃ (anēka rūpamulu kalavāḍu.)

  2. anaṃtāni rūpāṇi asya iti anaṃta rūpaḥ. (aṃtamu lēnanni, lekkalēnanni rūpamulu galavāḍu.)

  3. “anaṃtāni rūpāṇi asya viśvarūpēṇa sthitasya iti anaṃtarūpaḥ” (śrīśaṃkaraḥ.)

(viśvamē rūpamugā unna itani ā rūpamulō aṃtamulēnanni, lekkalēnanni rūpamulu galavāḍu.)

  1. aṃtō navidyatē tava rūpāṇāṃ ; trividha paricchēda śūnya svarūpaḥ.

(dēśakālavastu paricchēdamu lēkapōvuṭacēta nī rūpamulaku aṃtamu lēdu, ivi innē ani nirṇayamulēdu. anni kālamulaṃdu, anni sthalamulaṃdu uṃḍu rūpamulanniyu bhagavaṃtunivē. avi ‘inni’ ani lekkapeṭṭanalavikādu. aṃtamulēnanni rūpamulugalavāḍu kanuka anaṃtarūpuḍu.)

  1. rūpāṇāṃ kaivalyādīnāṃ aṃtaḥ paricchēdō na vidyatē iti anaṃtarūpaḥ.

(mōkṣamu modalagu tana rūpamulaku aṃtamu lēdu, mitamu lēdu - kanuka anaṃtarūpuḍu.)

  1. paricchēdatrayā bhāvāt anaṃtarūpaḥ.

(dēśakāla vastuvulavalana paricchēdamu lēkapōvuṭavalana anaṃtarūpuḍu.)

  1. svājña dṛṣṭyā anēka rūpī, sēvātmakatvāt.

(annī bhagavaṃtuḍē ani teliyakapōvuṭavalana, sarvamunaku tānē ayi yuṃḍuṭavalana, anēka rūpamulugalavāḍu. aṃducēta anaṃtarūpuḍu.)

  1. śrīkṛṣṇabhagavānuni viśvarūpamu cūci arjunuḍu ī prakāramugā stōtramu cēsenu : -

“paścāmitvāṃ sarvatō(a)naṃta rūpaḥ.” (śrīmadbhagavadgīta- 11 - 16)

(aṃtamulēnanni rūpamulugala ninnūṃtaṭa cūcucunnānu.)

  1. bhagavaṃtuni viśvarūpamu guṟiṃci tānē ī kriṃda vidhamugā ceppenu :- “tējōmayaṃ viśvamanaṃtamādyaṃ”

(śrīmadbhagavadgīta- 11 - 47)

  1. aparimāṇaḥ.

(haddu āpu lēka vistariṃci- vyāpiṃci - parimāṇamulēka viśvamaṃtākalisiyunna okē oka rūpamukalavāḍu.)

  1. “nāṃtaṃ, namadhyaṃ, napunastavādiṃ paśyāli” (śrīmadbhagavadgīta - 11 - 16)

(modalu, tudi. madhyamu kanabaḍani rūpamu - aṃducēta anaṃtarūpamu.)

  1. “aciṃtya mavyakta manaṃta rūpaṃ śivaṃ praśāṃta,” iti śrutiḥ.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.