← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంతశయనుడు anaṃtaśayanuḍu

Original — తెలుగు
  1. అనంతుడు అను పేరుగల సర్పరాజు (శేషువు) పై శయనించువాడు - విష్ణువు, శేషశాయి.

  2. పురిశయనాత్ పురుషః - పురములో శయనించువాడు కనుక పురుషుడు - అను ఉత్పత్త్యర్ధమును > బట్టి అనంతములైన పురములలో - శరీరములలో, వస్తువులలో, ఉపాధులలో - శయనించువాడు, > భగవంతుడు. సమస్తమైన ఉపాధిరూపములైన వస్తువులలో అంతర్యామిగ నుండువాడు గనుక > భగవంతుడు అనంతశయనుడు - అని చెప్పబడుచున్నాడు.

  3. “మహాశనే పన్నగతల్పమధ్యే నిషణ్ణమీళే రఘువంశరత్నం” - (శ్రీరామకర్ణామృతం- 2 - 21)

(శేషువు అను మహాసర్పమే తల్పముగా గల గొప్ప ఆసనమందుండు, రఘువంశమునకు రత్నమువంటివాడైన శ్రీరామచంద్రుని నుతించుచున్నాను.)

Transliteration
  1. anaṃtuḍu anu pērugala sarparāju (śēṣuvu) pai śayaniṃcuvāḍu - viṣṇuvu, śēṣaśāyi.

  2. puriśayanāt puruṣaḥ - puramulō śayaniṃcuvāḍu kanuka puruṣuḍu - anu utpattyardhamunu > baṭṭi anaṃtamulaina puramulalō - śarīramulalō, vastuvulalō, upādhulalō - śayaniṃcuvāḍu, > bhagavaṃtuḍu. samastamaina upādhirūpamulaina vastuvulalō aṃtaryāmiga nuṃḍuvāḍu ganuka > bhagavaṃtuḍu anaṃtaśayanuḍu - ani ceppabaḍucunnāḍu.

  3. “mahāśanē pannagatalpamadhyē niṣaṇṇamīḷē raghuvaṃśaratnaṃ” - (śrīrāmakarṇāmṛtaṃ- 2 - 21)

(śēṣuvu anu mahāsarpamē talpamugā gala goppa āsanamaṃduṃḍu, raghuvaṃśamunaku ratnamuvaṃṭivāḍaina śrīrāmacaṃdruni nutiṃcucunnānu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.