← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యః ananyaḥ

Original — తెలుగు
  1. నిరుపాధిః (ఉపాధిలేనివాడు.)

  2. బ్రహ్మ భిన్నత్వాత్ అనన్యః

(బ్రహ్మ అభేద్యుడు కనుక అనన్యః, తనకన్న వేరుగా ఎవడూ లేడు కనుక - తనకన్న అన్యుడు వేరొకడు - లేడు కనుక బ్రహ్మ అనన్యః.)

  1. యస్మాత్ అన్యం న విద్యతే సః అనన్యః; ఏకాకీ.

(తను తప్ప మరొక వస్తువు లేనివాడు - అంతా బ్రహ్మమే కనుక ప్రపంచములోని వస్తువులన్నీ పరబ్రహ్మరూపములేకనుక - “ఉండేదీ రాము డొకడు”) (భక్త రామదాసు)

(ఏకాకి - ఉన్నదంతా ఒక్కడే, ఒక పరబ్రహ్మమే.)

  1. సర్వ శరీరేషు ఏకరూపతయా ప్రత్యగాత్మత్వేన విద్యమానః ఇత్యర్థః.

(సమస్త శరీరములందు ప్రత్యగాత్మగా - ప్రత్యగాత్మరూపముతో - ఒకే రూపముతో, తత్వముగా ఉండుటవలన అనన్యః.)

  1. నాస్తి అన్యః విషయః యస్య. (ఇతర విషయములు లేనివాడు.)

  2. “అవిద్యమానం అన్యత్ యేషాం తే అనన్యాః” (శ్రీజయతీర్థమునిః)

(భగవంతుడు తప్ప మఱియొక వస్తువు లేదు అని నమ్మియున్నవాడు.)

  1. అనన్య ప్రయోజనాః మచ్ఛింతనేన వినా ఆత్మ ధారణా లాభాన్, మచ్చింతనైక ప్రయోజనాః.

(భగవంతుడుకాక మఱియొక ప్రయోజనము లేనివాడు. నన్ను ధ్యానించుట అను ఒకటే ప్రయోజనముగా గలవాడు. బ్రతికియుండుటవలన నా ధ్యానముకాక మరియొక లాభము - ప్రయోజనము - లేదు అనుకొనువారు.)

  1. అన్యత్ అచింత యిత్వా-

“సర్వం పరిత్యజ్య మనోగతం యద్వినా దేవకేవలం శుద్ధమాద్యం |

యే చింతయంతీహ తమేవ ధీరాః అనన్యాః తే దేవమా విశంతి ||”

(సమస్తమును వదలివేసి, మనసులో ఇంకొక విషయములేక కేవలము ఆద్యుడు, శుధ్ధుడు అయిన భగవంతుని ఎవరు చింతించెదరో అట్టివారు అనన్యులు, వారు అతనినే పొందుదురు.)

  1. చంచలము కానిది.
Transliteration
  1. nirupādhiḥ (upādhilēnivāḍu.)

  2. brahma bhinnatvāt ananyaḥ

(brahma abhēdyuḍu kanuka ananyaḥ, tanakanna vērugā evaḍū lēḍu kanuka - tanakanna anyuḍu vērokaḍu - lēḍu kanuka brahma ananyaḥ.)

  1. yasmāt anyaṃ na vidyatē saḥ ananyaḥ; ēkākī.

(tanu tappa maroka vastuvu lēnivāḍu - aṃtā brahmamē kanuka prapaṃcamulōni vastuvulannī parabrahmarūpamulēkanuka - “uṃḍēdī rāmu ḍokaḍu”) (bhakta rāmadāsu)

(ēkāki - unnadaṃtā okkaḍē, oka parabrahmamē.)

  1. sarva śarīrēṣu ēkarūpatayā pratyagātmatvēna vidyamānaḥ ityarthaḥ.

(samasta śarīramulaṃdu pratyagātmagā - pratyagātmarūpamutō - okē rūpamutō, tatvamugā uṃḍuṭavalana ananyaḥ.)

  1. nāsti anyaḥ viṣayaḥ yasya. (itara viṣayamulu lēnivāḍu.)

  2. “avidyamānaṃ anyat yēṣāṃ tē ananyāḥ” (śrījayatīrthamuniḥ)

(bhagavaṃtuḍu tappa maṟiyoka vastuvu lēdu ani nammiyunnavāḍu.)

  1. ananya prayōjanāḥ macchiṃtanēna vinā ātma dhāraṇā lābhān, macciṃtanaika prayōjanāḥ.

(bhagavaṃtuḍukāka maṟiyoka prayōjanamu lēnivāḍu. nannu dhyāniṃcuṭa anu okaṭē prayōjanamugā galavāḍu. bratikiyuṃḍuṭavalana nā dhyānamukāka mariyoka lābhamu - prayōjanamu - lēdu anukonuvāru.)

  1. anyat aciṃta yitvā-

“sarvaṃ parityajya manōgataṃ yadvinā dēvakēvalaṃ śuddhamādyaṃ |

yē ciṃtayaṃtīha tamēva dhīrāḥ ananyāḥ tē dēvamā viśaṃti ||”

(samastamunu vadalivēsi, manasulō iṃkoka viṣayamulēka kēvalamu ādyuḍu, śudhdhuḍu ayina bhagavaṃtuni evaru ciṃtiṃcedarō aṭṭivāru ananyulu, vāru ataninē poṃduduru.)

  1. caṃcalamu kānidi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.