← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యప్రేమ ananyaprēma

Original — తెలుగు

“జ్ఞాన కర్మ ప్రభృతి సాధనానా మాశ్రయేణ రహితా సర్వతః స్పృహ శూన్యాచ సతీ చిత్తవృత్తి రనన్యభావేన యదా కేవలే భగవత్యేవ సం లగ్నాభవతి, జగతః సమస్త పదార్ధేభ్యః పరలోకస్య సకల సుఖసామగ్రీ భ్యశ్చ, విశేషతో మోక్షసుఖాదపి చిత్తం నివృత్య స్వపరమ ప్రేమాస్పదే భగవతి సం లగ్నం భవతి; సమగ్ర మమతా ఆసక్తిశ్చ, సమస్త పదార్ధేభ్యః సర్వథా నిశ్శృత్వ ఏకం భగవంతం ప్రత్యేవ సంబద్ధో భవతః తథా తాం స్థితం అనన్యప్రేమ ఇతి కధయంతి”.

(జ్ఞానయోగము, కర్మయోగము, మొదలగు సాధనముల నాశ్రయించక, దేనియందును స్పృహలేక, చిత్తమును అనన్య భావముతో కేవలము భగవంతునియందే లగ్నమై యుండునో, జగత్తులోనుండు సమస్త పదార్ధములనుండి, పరలోకసుఖములనుండి, ప్రత్యేకించి మోక్షమునుండి, మనస్సుని మరలించి, తనకు పరమ ప్రేమాస్పదుడైన భగవంతునియందే లగ్నమై యుండునో, అన్నిపదార్ధములందు మమతా, ఆసక్తి - ఇది నాది, వీరు నావారు అను అభిప్రాయము విడిచిపెట్టి భగవంతుని ఒక్కని యందే బద్ధులై యుండునో అప్పుడు ఆ స్థితి అనన్యప్రేమ యనబడును“. (చూడుము : -”అనన్యభక్తి“.)

Transliteration

“jñāna karma prabhṛti sādhanānā māśrayēṇa rahitā sarvataḥ spṛha śūnyāca satī cittavṛtti rananyabhāvēna yadā kēvalē bhagavatyēva saṃ lagnābhavati, jagataḥ samasta padārdhēbhyaḥ paralōkasya sakala sukhasāmagrī bhyaśca, viśēṣatō mōkṣasukhādapi cittaṃ nivṛtya svaparama prēmāspadē bhagavati saṃ lagnaṃ bhavati; samagra mamatā āsaktiśca, samasta padārdhēbhyaḥ sarvathā niśśṛtva ēkaṃ bhagavaṃtaṃ pratyēva saṃbaddhō bhavataḥ tathā tāṃ sthitaṃ ananyaprēma iti kadhayaṃti”.

(jñānayōgamu, karmayōgamu, modalagu sādhanamula nāśrayiṃcaka, dēniyaṃdunu spṛhalēka, cittamunu ananya bhāvamutō kēvalamu bhagavaṃtuniyaṃdē lagnamai yuṃḍunō, jagattulōnuṃḍu samasta padārdhamulanuṃḍi, paralōkasukhamulanuṃḍi, pratyēkiṃci mōkṣamunuṃḍi, manassuni maraliṃci, tanaku parama prēmāspaduḍaina bhagavaṃtuniyaṃdē lagnamai yuṃḍunō, annipadārdhamulaṃdu mamatā, āsakti - idi nādi, vīru nāvāru anu abhiprāyamu viḍicipeṭṭi bhagavaṃtuni okkani yaṃdē baddhulai yuṃḍunō appuḍu ā sthiti ananyaprēma yanabaḍunu”. (cūḍumu : - “ananyabhakti”.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.