“స్వప్రియతమం భగవంతం విహాయ అన్యేషాం ఆశ్రయాణాం పరిత్యాగో అనన్యతా నామ. ప్రేమీ భక్తస్య హృది స్వప్రియతమం భగవంతం త్యక్త్వా అన్యస్య కస్యాపి సత్తా యాం, ఏవకల్పనా నభవతి, తదా అన్యం కథం భజేత్. నతు చరాచరం జగదాత్మనః ప్రియతమస్య శరీరం జానాతి తేన కుత్రచిదన్యో దృశ్యతే ఏవన.”ఏకం రేమీ భక్తః ఏకమాత్రమాత్మనః ప్రియతమం భగవంతమేవ జ్ఞాత్వా, తమేవ సర్వస్వం మత్వా, యధామీనస్య కేవలం జలమేహలంబనం భవతితధైవ కేవలం భగవంతమేవా శ్రిత్య సకలాశ్చేష్టా తదర్ధమేవ కరోతి.”“స చాతకస్య మేఘ విషయిణీ దృఢనిష్టేవ కేవలే భగవత్యేవ చిత్తం సం యోజ్య సంపూర్ణ రూపేణ తదుపర్యేవ స్వీయం భారం నిక్షిప్య - స్వాత్మానం తదాశ్రిత మేవ కుర్వన్ - తదర్ధమేవ భవతి. అత ఏవ తస్య సమస్త కర్మణాం చ భగవంతం ప్రతి అనన్య భావేన సంపన్న తయం తాని స్వభావాదేవ కల్యాణమయాని భవంతి”.
(తనకు అత్యంత ప్రియుడైన భగవంతుని విడిచిపెట్టి, ఇతర ఆలోచనయే లేక యుండుటచే భగవద్భక్తుడు ఇతరుని ఎట్లు భజించును. ప్రపంచమంతయు భగవంతుని శరీరమే అయినపుడు అతనుకాక ఇంకొక వస్తువు ఎట్లుండును. తనకు అత్యంత ప్రియుడు అయిన భగవంతుని తెలుసుకొని తన సర్వస్వము అతనే అని తలచిన భక్తుడు, చేపకు నీరే ఆలంబనము - పట్టుకొని వేలాడుట, అధారమని విడువకయుండుట - అయినట్లు - కేవలము భగవంతునే ఆశ్రయించి, తను చేయు పనులన్నియు అతని కొఱకే చేయును.)
(చాతకము మేఘము విషయమై దృఢమైన నిష్ట కలిగియున్నట్లు కేవలము భగవంతునియందే మనస్సును సమర్పించి, పూర్తిగా అతనిమీదే భారముంచి, తనను భగవంతుని ఆశ్రయుడుగా చేయుచు అతని కొఱకే ప్రవర్తించును. అందుచేత అట్టివాడు చేయుకర్మలన్నియు భగవంతుని గుఱించియే, ఇతరము గుఱించి కాదు. అవి చేయుటవలన అవన్నియు స్వభావమువలననే కల్యాణమయములు - శుభకర్మలు - అగుచున్నవి.)
(తనుకాక రెండవ వస్తువు లేదు. “ఇక్కడ బ్రహ్మము కాక ఇంకొకటి, అనేకములున్నవి” అని చూచువాడు జన్మముల నొందును - సంసారములో పడును, చనిపోయి, పుట్టి మరల చనిపోయి, మరల పుట్టి - ఈ ప్రకారముగా సంసారములోనే ఉండిపోవును. ఇట్లు చెప్పిన శ్రుతులవలన “ఇదంతా బ్రహ్మము ఒక్కడేకాదు అను నానాత్వము నిందింపబడుచున్నది. ఆ శ్రుతులు ద్వైతము లేదని చెప్పుచున్నవి.”ఆ పరబ్రహ్మనీవే“, నేను బ్రహ్మను అయితిని” అను శ్రుతులు జీవాత్మలు - జీవుడు, పరబ్రహ్మ ఒకటే, వాటికి భేదములేదు అని చెప్పుటచే అనన్యత్వము చెప్పుచున్నవి - అనగా, అంతా భగవంతుడే, అతను తప్ప అన్యమైనది - వేరైనది - లేదు అని అనన్యత్వమును స్తోత్రము చేసినట్టుగా చెప్పుచున్నవి. దీని భావమేమనగా - ఈ ప్రపంచసృష్టికి అంతయు ఒకటిగా ఉన్నపుడు, ఆ తర్వాత ప్రపంచము పుట్టి అనేక రూపములుగా మారినపుడునూ, - ఈ రెండు అవస్థలలోకూడ - వాటిలోనుండు చైతన్యము - సత్తస్ఫూర్తి - ఒక్కటే, వేరుకాదు. ప్రమార్థ దృష్టిలో వ్యష్టి, సమష్టి అను విభాగములేదు, అంతా ఒకటే - సమష్టి స్థితిలో ఉన్న చైతన్యము వేరు, వ్యష్టి అవస్థలో ఉన్న చైతన్యము వేరు అనుట యుక్తముకాదు - అంతా భగవత్సత్తయే. ఈ సత్తా మొదట చిన్నదిగానుండి, ఒక చిన్నవస్తువులో నిండియుండి, ఎంతమట్టుకు అయినను, ఎన్నింటిలోకైనను వ్యాపించగల శక్తి కలది. ఎన్నింటిలో వ్యాపించినను ఎంతట వ్యాపించినను అది ఒకటే - దాని వంటి చైతన్యము - సత్తాస్ఫూర్తి - మరియొకటిలేదు - కనుక అది అనన్యము.)
(జీవునకు ఆత్మకు భేదములేదని చెప్పుటచేత అనన్యత్వము ప్రశంసింపబడినది; నానాత్వము నిందింపబడినది. ఇదియే సమంజసమైనది.) (చూడుము :- “అనన్య ప్రేమ” ; “అనన్యభక్తి”.)
“svapriyatamaṃ bhagavaṃtaṃ vihāya anyēṣāṃ āśrayāṇāṃ parityāgō ananyatā nāma. prēmī bhaktasya hṛdi svapriyatamaṃ bhagavaṃtaṃ tyaktvā anyasya kasyāpi sattā yāṃ, ēvakalpanā nabhavati, tadā anyaṃ kathaṃ bhajēt. natu carācaraṃ jagadātmanaḥ priyatamasya śarīraṃ jānāti tēna kutracidanyō dṛśyatē ēvana.”ēkaṃ rēmī bhaktaḥ ēkamātramātmanaḥ priyatamaṃ bhagavaṃtamēva jñātvā, tamēva sarvasvaṃ matvā, yadhāmīnasya kēvalaṃ jalamēhalaṃbanaṃ bhavatitadhaiva kēvalaṃ bhagavaṃtamēvā śritya sakalāścēṣṭā tadardhamēva karōti.”“sa cātakasya mēgha viṣayiṇī dṛḍhaniṣṭēva kēvalē bhagavatyēva cittaṃ saṃ yōjya saṃpūrṇa rūpēṇa taduparyēva svīyaṃ bhāraṃ nikṣipya - svātmānaṃ tadāśrita mēva kurvan - tadardhamēva bhavati. ata ēva tasya samasta karmaṇāṃ ca bhagavaṃtaṃ prati ananya bhāvēna saṃpanna tayaṃ tāni svabhāvādēva kalyāṇamayāni bhavaṃti”.
(tanaku atyaṃta priyuḍaina bhagavaṃtuni viḍicipeṭṭi, itara ālōcanayē lēka yuṃḍuṭacē bhagavadbhaktuḍu itaruni eṭlu bhajiṃcunu. prapaṃcamaṃtayu bhagavaṃtuni śarīramē ayinapuḍu atanukāka iṃkoka vastuvu eṭluṃḍunu. tanaku atyaṃta priyuḍu ayina bhagavaṃtuni telusukoni tana sarvasvamu atanē ani talacina bhaktuḍu, cēpaku nīrē ālaṃbanamu - paṭṭukoni vēlāḍuṭa, adhāramani viḍuvakayuṃḍuṭa - ayinaṭlu - kēvalamu bhagavaṃtunē āśrayiṃci, tanu cēyu panulanniyu atani koṟakē cēyunu.)
(cātakamu mēghamu viṣayamai dṛḍhamaina niṣṭa kaligiyunnaṭlu kēvalamu bhagavaṃtuniyaṃdē manassunu samarpiṃci, pūrtigā atanimīdē bhāramuṃci, tananu bhagavaṃtuni āśrayuḍugā cēyucu atani koṟakē pravartiṃcunu. aṃducēta aṭṭivāḍu cēyukarmalanniyu bhagavaṃtuni guṟiṃciyē, itaramu guṟiṃci kādu. avi cēyuṭavalana avanniyu svabhāvamuvalananē kalyāṇamayamulu - śubhakarmalu - agucunnavi.)
(tanukāka reṃḍava vastuvu lēdu. “ikkaḍa brahmamu kāka iṃkokaṭi, anēkamulunnavi” ani cūcuvāḍu janmamula noṃdunu - saṃsāramulō paḍunu, canipōyi, puṭṭi marala canipōyi, marala puṭṭi - ī prakāramugā saṃsāramulōnē uṃḍipōvunu. iṭlu ceppina śrutulavalana “idaṃtā brahmamu okkaḍēkādu anu nānātvamu niṃdiṃpabaḍucunnadi. ā śrutulu dvaitamu lēdani ceppucunnavi.”ā parabrahmanīvē”, nēnu brahmanu ayitini” anu śrutulu jīvātmalu - jīvuḍu, parabrahma okaṭē, vāṭiki bhēdamulēdu ani ceppuṭacē ananyatvamu ceppucunnavi - anagā, aṃtā bhagavaṃtuḍē, atanu tappa anyamainadi - vērainadi - lēdu ani ananyatvamunu stōtramu cēsinaṭṭugā ceppucunnavi. dīni bhāvamēmanagā - ī prapaṃcasṛṣṭiki aṃtayu okaṭigā unnapuḍu, ā tarvāta prapaṃcamu puṭṭi anēka rūpamulugā mārinapuḍunū, - ī reṃḍu avasthalalōkūḍa - vāṭilōnuṃḍu caitanyamu - sattasphūrti - okkaṭē, vērukādu. pramārtha dṛṣṭilō vyaṣṭi, samaṣṭi anu vibhāgamulēdu, aṃtā okaṭē - samaṣṭi sthitilō unna caitanyamu vēru, vyaṣṭi avasthalō unna caitanyamu vēru anuṭa yuktamukādu - aṃtā bhagavatsattayē. ī sattā modaṭa cinnadigānuṃḍi, oka cinnavastuvulō niṃḍiyuṃḍi, eṃtamaṭṭuku ayinanu, enniṃṭilōkainanu vyāpiṃcagala śakti kaladi. enniṃṭilō vyāpiṃcinanu eṃtaṭa vyāpiṃcinanu adi okaṭē - dāni vaṃṭi caitanyamu - sattāsphūrti - mariyokaṭilēdu - kanuka adi ananyamu.)
(jīvunaku ātmaku bhēdamulēdani ceppuṭacēta ananyatvamu praśaṃsiṃpabaḍinadi; nānātvamu niṃdiṃpabaḍinadi. idiyē samaṃjasamainadi.) (cūḍumu :- “ananya prēma” ; “ananyabhakti”.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.