← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్యయోగము ananyayōgamu

Original — తెలుగు

పరమాత్మతప్ప ఇతరమును దేనిని తలంపని యోగము - ఇతర చింత లేకుండుట.

ఏకాగ్ర బుద్ధి - ఇతరమగు దేనియందును మనస్సును చేర్చకుండుట.

భేదశూన్యం - అహమేవ భగవాన్ వాసుదేవః ఇతి పరమేశ్వరే అహం గ్రహలక్షణం యోగం.

(జీవ బ్రహ్మలకు భేదములేదని, నేనే భగవంతుడనైన వాసుదేవుడను అని పరమేశ్వరునియందు అవాం గహోపాసన లక్షణమైన యోగము.)

సంతః అనన్యేనైవ, అవిద్యమానం అన్యత్ ఆలంబనం విశ్వరూపం దేవం ఆత్మానం ముక్త్వా యస్యసః అనన్యః, అనన్యః యోగః సమాధిః అనన్యయోగః.

(విశ్వరూపుడైన పరమాత్మను విడిచిపెట్టి ఇతరమైన ఆలంబనము లేనివాడు, అనన్యుడు. అనన్యుని యోగము, సమాధి అనన్య యోగము.)

“న అన్యో భగవతః వాసుదేవాత్ పరః అస్తి, అతః స ఏవగతిః” ఇత్యేవం నిశ్చితాబుద్ధిః అనన్య యోగః,

(భగవంతుడైన వాసుదేవుడు తప్ప పరమాత్మ, ఉత్కృష్ట మరొకటిలేదు అందుచేత అతనే గతి అను ఈ విధమైన బుద్ధి కలిగియుండుట అనన్యయోగము.)

Transliteration

paramātmatappa itaramunu dēnini talaṃpani yōgamu - itara ciṃta lēkuṃḍuṭa.

ēkāgra buddhi - itaramagu dēniyaṃdunu manassunu cērcakuṃḍuṭa.

bhēdaśūnyaṃ - ahamēva bhagavān vāsudēvaḥ iti paramēśvarē ahaṃ grahalakṣaṇaṃ yōgaṃ.

(jīva brahmalaku bhēdamulēdani, nēnē bhagavaṃtuḍanaina vāsudēvuḍanu ani paramēśvaruniyaṃdu avāṃ gahōpāsana lakṣaṇamaina yōgamu.)

saṃtaḥ ananyēnaiva, avidyamānaṃ anyat ālaṃbanaṃ viśvarūpaṃ dēvaṃ ātmānaṃ muktvā yasyasaḥ ananyaḥ, ananyaḥ yōgaḥ samādhiḥ ananyayōgaḥ.

(viśvarūpuḍaina paramātmanu viḍicipeṭṭi itaramaina ālaṃbanamu lēnivāḍu, ananyuḍu. ananyuni yōgamu, samādhi ananya yōgamu.)

“na anyō bhagavataḥ vāsudēvāt paraḥ asti, ataḥ sa ēvagatiḥ” ityēvaṃ niścitābuddhiḥ ananya yōgaḥ,

(bhagavaṃtuḍaina vāsudēvuḍu tappa paramātma, utkṛṣṭa marokaṭilēdu aṃducēta atanē gati anu ī vidhamaina buddhi kaligiyuṃḍuṭa ananyayōgamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.