అవియుక్తా. (విడిచి ఉండనిది.)
యతః న విద్యతే అపాయో, వియోగో,
యస్యాః తథా భూతా - సతతమాశ్లిష్టా ఇత్యర్ధః.
(తనతో వియోగము కలుగనీయనిది; ఎల్లపుడు
ఆవేశించుకొని యుండునది.)
“విష్ణో రేషా నపాయినీ”
(విష్ణువునకు
ఈమె అనపాయినీ - ఎప్పుడూ వదలకుండ నిత్యము కూడి ఉండినది. శ్రీ మహావిష్ణువునకు శ్రీమహాలక్ష్మి
నిత్యానపాయినీ.)
“రాఘవత్వే అభవత్సీతా విష్ణో రేషా
నపాయినీ|”
(శ్రీమహావిష్ణుని
నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి రామావతారములో రఘురామునకు సీత అయినది.)
భగవంతుడు
సృష్టిప్రారంభములో తన జడశక్తి అయిన ప్రకృతిలో తన చైతన్య శక్తితో ప్రవేశించి ఆ ప్రకృతిచేత ఈ సృష్టిని
చేయించెను - ప్రకృతియే సృష్టిలోని వస్తువులుగా మారెను. ఆ ప్రకృతిలోనుండి పుట్టినవన్నియు, అప్పటినుండి
ఇప్పటివరకు, ఇకముందుకూడ, ప్రకృతి అంశ, భగవంతుని అంశ (చిదంశ-చిచ్ఛక్తి) అను రెండు అంశలూ
కలిగియే యున్నవి. అందుచేత ప్రకృతి భగవంతుని ఎప్పుడు వదలి యుండనిది - నిత్యానపాయిని. శ్రీమహావిష్ణుని
శక్తియే శ్రీమహాలక్ష్మి; అతని వక్షస్థలమందుండును అనిపురాణవచనము. ఆ ప్రకారముగానే శివుని శక్తి అయిన
పార్వతి అతనిని వదలియుండదు. శివుని అర్ధశరీరమే పార్వతియని చెప్పబడుచున్నది. అందుచేతనే శివుడు
అర్ధనారీశ్వరుడని చెప్పబడుచున్నాడు - సాంబుడు - “శ్రీకాళహస్తి పరమేశ్వర | సాంబశివా | మహాప్రభో” -
సాంబుడు అనగా ‘అంబయా సహితః’ = అంబతో కూడియుండువాడు, పార్వతితో కూడియుండువాడు - పార్వతీ
పరమేశ్వరులని, లక్ష్మీ నారాయణులని, సీతారాములని వాడుకలో ఉన్న విషయమే - ఒకరి నొకరు
విడిచియుండరు.సృష్టిలో భగవదంశ లేని ప్రకృతి అణుమాత్రమైనదికూడ లేదు.
“క. హరిమయము
విశ్వమంతయు
హరి విశ్వమయుండు
సంశయము పనిలేదా
హరిమయము గాని
ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన!
వింటే” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 2 - 1 - 17)
(Every
particle of matter contains Energy - There is not even the slightest
particle of matter which dose not contain Energy.)
Transliteration
aviyuktā. (viḍici
uṃḍanidi.)
yataḥ
na vidyatē apāyō, viyōgō, yasyāḥ tathā bhūtā - satatamāśliṣṭā
ityardhaḥ.
(tanatō
viyōgamu kaluganīyanidi; ellapuḍu āvēśiṃcukoni yuṃḍunadi.)
“viṣṇō rēṣā napāyinī”
(viṣṇuvunaku
īme anapāyinī - eppuḍū vadalakuṃḍa nityamu kūḍi uṃḍinadi. śrī
mahāviṣṇuvunaku śrīmahālakṣmi nityānapāyinī.)
“rāghavatvē
abhavatsītā viṣṇō rēṣā napāyinī|”
(śrīmahāviṣṇuni
nityānapāyini ayina lakṣmīdēvi rāmāvatāramulō raghurāmunaku sīta
ayinadi.)
bhagavaṃtuḍu
sṛṣṭiprāraṃbhamulō tana jaḍaśakti ayina prakṛtilō tana caitanya śaktitō
pravēśiṃci ā prakṛticēta ī sṛṣṭini cēyiṃcenu - prakṛtiyē sṛṣṭilōni
vastuvulugā mārenu. ā prakṛtilōnuṃḍi puṭṭinavanniyu, appaṭinuṃḍi
ippaṭivaraku, ikamuṃdukūḍa, prakṛti aṃśa, bhagavaṃtuni aṃśa
(cidaṃśa-cicchakti) anu reṃḍu aṃśalū kaligiyē yunnavi. aṃducēta prakṛti
bhagavaṃtuni eppuḍu vadali yuṃḍanidi - nityānapāyini. śrīmahāviṣṇuni
śaktiyē śrīmahālakṣmi; atani vakṣasthalamaṃduṃḍunu anipurāṇavacanamu. ā
prakāramugānē śivuni śakti ayina pārvati atanini vadaliyuṃḍadu. śivuni
ardhaśarīramē pārvatiyani ceppabaḍucunnadi. aṃducētanē śivuḍu
ardhanārīśvaruḍani ceppabaḍucunnāḍu - sāṃbuḍu - “śrīkāḷahasti
paramēśvara | sāṃbaśivā | mahāprabhō” - sāṃbuḍu anagā ‘aṃbayā sahitaḥ’ =
aṃbatō kūḍiyuṃḍuvāḍu, pārvatitō kūḍiyuṃḍuvāḍu - pārvatī paramēśvarulani,
lakṣmī nārāyaṇulani, sītārāmulani vāḍukalō unna viṣayamē - okari nokaru
viḍiciyuṃḍaru.sṛṣṭilō bhagavadaṃśa lēni prakṛti aṇumātramainadikūḍa
lēdu.
“ka.
harimayamu viśvamaṃtayu
hari viśvamayuṃḍu saṃśayamu
panilēdā
harimayamu gāni dravyamu
paramāṇuvu
lēdu vaṃśapāvana! viṃṭē” (śrīmadāṃdhra mahābhāgavatamu- 2 - 1 - 17)
(Every
particle of matter contains Energy - There is not even the slightest
particle of matter which dose not contain Energy.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.