చెడ్డ
అలవాట్లవల్లను, అమితభోజనమువలనను, నిద్దుర లేమిచేతను, అరగనిపదార్థము తినుటచేతను, తినిన పదార్థము
అరగనందువలనను, వేళగాని వేళలందు భోజనము చేయుటవలనను శరీరములో, శరీరమునకు అవసరములేని
పదార్థములు తయారగుచుండును. శరీరము వీటిని - మలమూత్రములను, చెమట మొదలగు వాటిని - సహజముగనే
తొలగించు చుండును. దాని శక్తికి మించినవి శరీరములోనుండిపోయి, కఫ, వాత, పైత్యములను వాటి మూలముగా
అనారోగ్యమును కలిగించును. అందుచేత అనారోగ్యమును కలిగించువాటిని మానవలయును - ఇందుకు సాధనములలో
ముఖ్యమైనవి: -ఆహారము తినుట జీవించుటకొఱకు. అందుచేత జీవించుటకు తగినట్లుగనే, అందుకు
అవసరమైనవే, మితముగనే, జీర్ణించునవే తినవలెను. దీని నిమిత్తము జిహ్వను స్వాధీనములోనుంచుకొనవలెను -
వారమునకు ఒక రోజుగాని, ఒక పూటగాని ఉపవాసము చేయవలయును. దీనివలన శరీరములోని శక్తి శరీరమును
శుభ్రము చేయుటకు అవకాశము కలుగును - కూరలు, పండ్లు తాజాగా (fresh) ఉన్నపుడే తినవలెను.
శరీరమునకు కావలసిన పదార్థము పాలలో ఉన్నది. చంటి పిల్లలు, పశువుల పెయ్యలు తల్లిపాలు త్రాగి
పెరుగును. పాలు కాగపెట్టక పొదుగునుండి తీయగానే త్రాగుట శ్రేష్టము - గుమ్మపాలు. పాలు
ఆయుర్దాయమును వృద్ధి పొందించును - “క్షీరేణాయుః ప్రవర్థతే” (పాలు ఆయుర్దాయమును వృద్ధి చేయును.)
పండురసమువలన కఫ, వాత పైత్యములు హరింపబడును. కొన్ని పదార్థముల దోషములకు ఆహారములోనే
విరుగుడు కలదు - సూర్యరశ్మి తగిలిన శరీరము కాంతివంతముగ, ధృఢముగనుండును. సూర్యరశ్మి
చర్మముద్వారా లోనున్న రక్తమును శుద్ధి చేయును. ఊపిరితీయుటవలననే జీవించియుండుట కనుక సాధారణముగ
లోనికి పీల్చుగాలికన్న కొంచెము ఎక్కువగాలి, అనాయాసముగ, పీల్చుట అలవాటు చేసుకొనవలెను.
Transliteration
ceḍḍa
alavāṭlavallanu, amitabhōjanamuvalananu, niddura lēmicētanu,
araganipadārthamu tinuṭacētanu, tinina padārthamu araganaṃduvalananu,
vēḷagāni vēḷalaṃdu bhōjanamu cēyuṭavalananu śarīramulō, śarīramunaku
avasaramulēni padārthamulu tayāragucuṃḍunu. śarīramu vīṭini -
malamūtramulanu, cemaṭa modalagu vāṭini - sahajamuganē tolagiṃcu
cuṃḍunu. dāni śaktiki miṃcinavi śarīramulōnuṃḍipōyi, kapha, vāta,
paityamulanu vāṭi mūlamugā anārōgyamunu kaligiṃcunu. aṃducēta
anārōgyamunu kaligiṃcuvāṭini mānavalayunu - iṃduku sādhanamulalō
mukhyamainavi: -āhāramu tinuṭa jīviṃcuṭakoṟaku. aṃducēta jīviṃcuṭaku
taginaṭluganē, aṃduku avasaramainavē, mitamuganē, jīrṇiṃcunavē
tinavalenu. dīni nimittamu jihvanu svādhīnamulōnuṃcukonavalenu -
vāramunaku oka rōjugāni, oka pūṭagāni upavāsamu cēyavalayunu. dīnivalana
śarīramulōni śakti śarīramunu śubhramu cēyuṭaku avakāśamu kalugunu -
kūralu, paṃḍlu tājāgā (fresh) unnapuḍē tinavalenu. śarīramunaku
kāvalasina padārthamu pālalō unnadi. caṃṭi pillalu, paśuvula peyyalu
tallipālu trāgi perugunu. pālu kāgapeṭṭaka podugunuṃḍi tīyagānē trāguṭa
śrēṣṭamu - gummapālu. pālu āyurdāyamunu vṛddhi poṃdiṃcunu - “kṣīrēṇāyuḥ
pravarthatē” (pālu āyurdāyamunu vṛddhi cēyunu.) paṃḍurasamuvalana kapha,
vāta paityamulu hariṃpabaḍunu. konni padārthamula dōṣamulaku āhāramulōnē
viruguḍu kaladu - sūryaraśmi tagilina śarīramu kāṃtivaṃtamuga,
dhṛḍhamuganuṃḍunu. sūryaraśmi carmamudvārā lōnunna raktamunu śuddhi
cēyunu. ūpiritīyuṭavalananē jīviṃciyuṃḍuṭa kanuka sādhāraṇamuga lōniki
pīlcugālikanna koṃcemu ekkuvagāli, anāyāsamuga, pīlcuṭa alavāṭu
cēsukonavalenu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.