← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనర్థము anarthamu

Original — తెలుగు

అర్థములేనిది; వ్యర్థమైనది; ప్రయోజనము లేనిది, కీడు, అనిష్టము, నిరర్ధకము, నిష్టలార్థము.

అజ్ఞానము, తత్కార్యము.

ప్రపంచము జన్మ మరణరూపమైన దుఃఖమునకు కారణముగా ఉన్నదికనుక అనర్థము అనిచెప్పబడును.

ప్రపంచకారణము.

సంసారరూపం; దుష్కర్మరూపం, సంసారిక తాపత్రయము; కర్తృత్వాదికం.

“నవిద్యతే ప్రయోజనం ఆప్తకామత్వాత్ అస్య ఇతి అనర్థః” (శ్రీశంకరః)

(ఆప్తకాముడు - కోరికలు తీరినవాడు అగుటవల్ల మరి అర్ధించవలసిన, సాధించవలసిన ప్రయోజనము లేనివాడు.)

విషయాసక్త తయా దుఃఖం, శిక్షాది రూపాః అనర్ధాః.

(విషయములందు ఆసక్తి కలుగుటచేత దుఃఖమునకు కారణమైనది, శిక్ష మొదలగు అనర్ధములు.)

“వ. జీవుండు మాయచేత మోహితుండయి, గుణవ్యతిరిక్తుండయి మాయా సంగతిం దన్ను త్రిగుణాత్మకుండని యభిమానించుచు, కర్తయు భోక్తయు కర్తయు భోక్తయు అగుచున్నానని యనుకొనుటే అనర్థము. దీనికి నారయణభక్తియోగంబుగాని యుపశమనంబు వేఱొకటిలేదు” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 7 - 134)

“స్తేయం హింసా, అనృతం, దంభః కామః, క్రోధః స్మయా, మదః |

భేదో, వైరం, అవిశ్వాసః, సంస్పర్ధా వ్యసనానిచ |

ఏతే పంచదశానర్ధాః హ్యర్ధమూలాః మతాం నృణాం |

తస్మాదర్ధ మనర్ధాఖ్యం శ్రేయో అర్ధీ దూరతః త్యజేత్ ||“.

(దొంగతనము, హింస, అబద్ధము, దంభము, కామము, క్రోధము, స్మయము, మదము, భేదము, వైరము, అవిశ్వాసము, స్పర్థ, వ్యసనములు - ఈ పదిహేను అనర్ధములు, ధనము వలన కలుగునవి. అందుచేత శ్రేయస్సునుకోరువాడు అనర్ధమను మారుపేరుగల అర్ధమును - ధనమును - దూరముగా నుంచవలెను.)

“పంచదశ అనర్ధాః - అర్ధస్య సంపాదనే, వర్ధనేచ అతిదుఃఖం, రక్షణే మహద్దుఃఖం; వ్యయే భోగేచమహతీ చింతా; నాశే చిత్త భ్రాంతిః, అర్ధ ప్రాప్తయే స్తే యాదయః షడనర్ధాః; ప్రాప్తే అర్ధేస్మయాదయః షడనర్ధాః, త్రివిధ వ్యసనైః సహనవానర్ధాః. తస్మాత్ ఏకోప్యర్ధః పంచ దాశానర్ధానాం నిదానం భవతి.”

(అనర్ధములు పదిహేను - ధనము సంపాదించుటలో, కూడపెట్టుటలో - వృద్ధిచేయుటలో - దుఃఖము; ధనమును రక్షించుటలో దుఃఖము; ధనము ఖర్చు అయిపోవుచున్నను, తాను అనుభవించుచున్నను, అయ్యో, తరిగిపోవుచున్నదను విచారము, ధనము నష్టముకాగా చిత్త భ్రాంతి; ధనము ఉంచుకొనిన యడల దొంగలు మొదలగూరు అనర్ధములు; డబ్బు ప్రాప్తమయినపుడు స్మయము మొదలగు ఆరు అనర్ధములు. మూడువిధముల వ్యసనములు - జూదము, సురాపానము, స్త్రీసంభోగము - వీటితోకలిపి తొమ్మిది అనర్ధములు. అందుచేతధనము ఒకటే ఈ పదిహేను అనర్ధములకు నిదానము - ఆశ్రయము.)

జంతూనాం శోకమోహౌ ద్వౌ సంసారానర్ధ కారణం|

(జంతువులకు శోకము, మోహము అను రెండును సంసారమను అనర్ధమునకు కారణము.)

“దుస్త్యజ శ్శోక మోహాది సంసారో యమ నర్ధకః ||” (గీతాభావప్రకాశము- 1 - 21, 28)

(శోకము, మోహము మొదలగునవి గల ఈ సంసారము అనర్ధకము - వాటిని దూరముగా నుంచుము.)

“యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వమవివేకతా |

ఏకైక మప్యనర్ధాయ కిము యత్ర చతుష్టయం||”

(యౌవనము, ధనము కలిగియుండుట, ప్రభుత్వము - అధికారము కలిగియుండుట, అవివేకము, ఇవి ఒక్కొక్కటీ అనర్ధమునకు కారణము. ఈ నాలుగు కలిసియుండిన ఇక చెప్పవలసినదేమున్నది.)

“అగ్నీంద్ర సూర్య ప్రముఖాః సర్వే (అ) పి దేవ ప్రవరాః పరమాత్మ శాసనాతి వృత్తే కిం భవిష్యతీతి భీత్యా స్వస్వకర్మసు జాగరూకా భవంతి. అతశ్చ బ్రహ్మ వ్యతిరిక్తం కృత్స్నమపి పదం దుఃఖో దర్కత్వాత్ అనర్ధ రూపమేవ”.

(అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు మొదలగువారు దేవతులలో ముఖ్యులైనప్పటికీ పరమాత్మయొక్కశాసనమును - ఆజ్ఞను ఉల్లంఘించిన నేమగునో యని భయముచే వారివారి పనులయందు జాగరూకతతో నుందురు. అందుచేత బ్రహ్మ వ్యతిరిక్తమైన సమస్త పదములున్నూ దుఃఖఫలము నిచ్చునవే గనుక అవి అన్నియు అనర్ధములే.)

Transliteration

arthamulēnidi; vyarthamainadi; prayōjanamu lēnidi, kīḍu, aniṣṭamu, nirardhakamu, niṣṭalārthamu.

ajñānamu, tatkāryamu.

prapaṃcamu janma maraṇarūpamaina duḥkhamunaku kāraṇamugā unnadikanuka anarthamu aniceppabaḍunu.

prapaṃcakāraṇamu.

saṃsārarūpaṃ; duṣkarmarūpaṃ, saṃsārika tāpatrayamu; kartṛtvādikaṃ.

(āptakāmuḍu - kōrikalu tīrinavāḍu aguṭavalla mari ardhiṃcavalasina, sādhiṃcavalasina prayōjanamu lēnivāḍu.)

viṣayāsakta tayā duḥkhaṃ, śikṣādi rūpāḥ anardhāḥ.

(viṣayamulaṃdu āsakti kaluguṭacēta duḥkhamunaku kāraṇamainadi, śikṣa modalagu anardhamulu.)

“va. jīvuṃḍu māyacēta mōhituṃḍayi, guṇavyatiriktuṃḍayi māyā saṃgatiṃ dannu triguṇātmakuṃḍani yabhimāniṃcucu, kartayu bhōktayu kartayu bhōktayu agucunnānani yanukonuṭē anarthamu. dīniki nārayaṇabhaktiyōgaṃbugāni yupaśamanaṃbu vēṟokaṭilēdu” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 7 - 134)

“stēyaṃ hiṃsā, anṛtaṃ, daṃbhaḥ kāmaḥ, krōdhaḥ smayā, madaḥ |

bhēdō, vairaṃ, aviśvāsaḥ, saṃspardhā vyasanānica |

ētē paṃcadaśānardhāḥ hyardhamūlāḥ matāṃ nṛṇāṃ |

tasmādardha manardhākhyaṃ śrēyō ardhī dūrataḥ tyajēt ||“.

(doṃgatanamu, hiṃsa, abaddhamu, daṃbhamu, kāmamu, krōdhamu, smayamu, madamu, bhēdamu, vairamu, aviśvāsamu, spartha, vyasanamulu - ī padihēnu anardhamulu, dhanamu valana kalugunavi. aṃducēta śrēyassunukōruvāḍu anardhamanu mārupērugala ardhamunu - dhanamunu - dūramugā nuṃcavalenu.)

“paṃcadaśa anardhāḥ - ardhasya saṃpādanē, vardhanēca atiduḥkhaṃ, rakṣaṇē mahadduḥkhaṃ; vyayē bhōgēcamahatī ciṃtā; nāśē citta bhrāṃtiḥ, ardha prāptayē stē yādayaḥ ṣaḍanardhāḥ; prāptē ardhēsmayādayaḥ ṣaḍanardhāḥ, trividha vyasanaiḥ sahanavānardhāḥ. tasmāt ēkōpyardhaḥ paṃca dāśānardhānāṃ nidānaṃ bhavati.”

(anardhamulu padihēnu - dhanamu saṃpādiṃcuṭalō, kūḍapeṭṭuṭalō - vṛddhicēyuṭalō - duḥkhamu; dhanamunu rakṣiṃcuṭalō duḥkhamu; dhanamu kharcu ayipōvucunnanu, tānu anubhaviṃcucunnanu, ayyō, tarigipōvucunnadanu vicāramu, dhanamu naṣṭamukāgā citta bhrāṃti; dhanamu uṃcukonina yaḍala doṃgalu modalagūru anardhamulu; ḍabbu prāptamayinapuḍu smayamu modalagu āru anardhamulu. mūḍuvidhamula vyasanamulu - jūdamu, surāpānamu, strīsaṃbhōgamu - vīṭitōkalipi tommidi anardhamulu. aṃducētadhanamu okaṭē ī padihēnu anardhamulaku nidānamu - āśrayamu.)

jaṃtūnāṃ śōkamōhau dvau saṃsārānardha kāraṇaṃ|

(jaṃtuvulaku śōkamu, mōhamu anu reṃḍunu saṃsāramanu anardhamunaku kāraṇamu.)

“dustyaja śśōka mōhādi saṃsārō yama nardhakaḥ ||” (gītābhāvaprakāśamu- 1 - 21, 28)

(śōkamu, mōhamu modalagunavi gala ī saṃsāramu anardhakamu - vāṭini dūramugā nuṃcumu.)

“yauvanaṃ dhanasaṃpattiḥ prabhutvamavivēkatā |

ēkaika mapyanardhāya kimu yatra catuṣṭayaṃ||”

(yauvanamu, dhanamu kaligiyuṃḍuṭa, prabhutvamu - adhikāramu kaligiyuṃḍuṭa, avivēkamu, ivi okkokkaṭī anardhamunaku kāraṇamu. ī nālugu kalisiyuṃḍina ika ceppavalasinadēmunnadi.)

“agnīṃdra sūrya pramukhāḥ sarvē (a) pi dēva pravarāḥ paramātma śāsanāti vṛttē kiṃ bhaviṣyatīti bhītyā svasvakarmasu jāgarūkā bhavaṃti. ataśca brahma vyatiriktaṃ kṛtsnamapi padaṃ duḥkhō darkatvāt anardha rūpamēva”.

(agni, iṃdruḍu, sūryuḍu modalaguvāru dēvatulalō mukhyulainappaṭikī paramātmayokkaśāsanamunu - ājñanu ullaṃghiṃcina nēmagunō yani bhayamucē vārivāri panulayaṃdu jāgarūkatatō nuṃduru. aṃducēta brahma vyatiriktamaina samasta padamulunnū duḥkhaphalamu niccunavē ganuka avi anniyu anardhamulē.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.