← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనశ్వరం anaśvaraṃ

Original — తెలుగు

నాశ రహితం (నాశము లేనిది, నశించనిది.)

శాశ్వతం (ఎల్లకాలము ఉండునది.)

నశ్యతీతి నశ్వరం, ననశ్వరం అనశ్వరం, కాలత్రయే అపి అవినాశీత్యర్ధః.

(నశించిపోవునదికనుక నశ్వరము, నశ్వరముకానిది అనశ్వరము - మూడుకాలములందును నశించనిది.)

అవిశిష్యమాణం, మృత్ సువర్ణమాత్రం అనశ్వరం.

(మిగిలి ఉండునది; అన్నియు నశించిపోగా తాను మిగిలి యుండునది. తనలోనుండి పుట్టిన సృష్టి అంతయు లయమైపోయినను, తను మిగిలియుండువాడు, పరమాత్మ. బంగారముతో చేయబడిన వస్తువులు పాడయి పోయినను వాటి కారణరూపమైన బంగారము వాటితో నశించకుండా మిగిలి యుండును. ఆ ప్రకారమే మట్టితో చేయబడిన కుండ మొదలగునవి పగిలి నష్టమై పోయినను, వాటికి కారణమైనదిన్నీ, అవి దేనితో చేయబడినవో ఆ మట్టి మాత్రము మిగిలి యుండును. కార్య వస్తువు కారణములో లయమై పోయినను - లీనమై పోయినను, కారణము దానితో లయమై పోక మిగిలి యుండును.

“యః సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి” (శ్రీమద్భగవద్గీత - 8 - 20)

(సమస్తమైన భూతములు నశించినను తాను నశింపనివాడు.)

Transliteration

nāśa rahitaṃ (nāśamu lēnidi, naśiṃcanidi.)

śāśvataṃ (ellakālamu uṃḍunadi.)

naśyatīti naśvaraṃ, nanaśvaraṃ anaśvaraṃ, kālatrayē api avināśītyardhaḥ.

(naśiṃcipōvunadikanuka naśvaramu, naśvaramukānidi anaśvaramu - mūḍukālamulaṃdunu naśiṃcanidi.)

aviśiṣyamāṇaṃ, mṛt suvarṇamātraṃ anaśvaraṃ.

(migili uṃḍunadi; anniyu naśiṃcipōgā tānu migili yuṃḍunadi. tanalōnuṃḍi puṭṭina sṛṣṭi aṃtayu layamaipōyinanu, tanu migiliyuṃḍuvāḍu, paramātma. baṃgāramutō cēyabaḍina vastuvulu pāḍayi pōyinanu vāṭi kāraṇarūpamaina baṃgāramu vāṭitō naśiṃcakuṃḍā migili yuṃḍunu. ā prakāramē maṭṭitō cēyabaḍina kuṃḍa modalagunavi pagili naṣṭamai pōyinanu, vāṭiki kāraṇamainadinnī, avi dēnitō cēyabaḍinavō ā maṭṭi mātramu migili yuṃḍunu. kārya vastuvu kāraṇamulō layamai pōyinanu - līnamai pōyinanu, kāraṇamu dānitō layamai pōka migili yuṃḍunu.

“yaḥ sarvēṣu bhūtēṣu naśyatsu navinaśyati” (śrīmadbhagavadgīta - 8 - 20)

(samastamaina bhūtamulu naśiṃcinanu tānu naśiṃpanivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.