← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనావృష్టి anāvṛṣṭi

Original — తెలుగు

వర్షము కురియకుండుట. దేశమునకు హాని కలుగునట్లు వర్షము లేకుండుట.

“అగ్నౌహోమాద్యభావాత్తు వృష్ట్యభావో అప్యభూ న్నృప |

వృష్టేరభావే సంశుష్కం నిర్జలంచాపి భూతలం |

కూపవాపీ తటాకాశ్చ సరితః శుష్కతాంగతాః |

అనావృష్టిరియం రాజన్ అభూత్ చ శతవార్షికీ ||” (దేవీభాగవతం)

(అగ్నియందు హోమము చేయకపోవుటవలన వర్షము కురియదు. వర్షము కురవకపోవుటవలన భూమి ఎండిపోయి జలశూన్యమగును. అందువలన నూతులు, చెరువులు, ఎండిపోవును. ఇది అనావృష్టి. ఇది నూరు సంవత్సరముల కొక పర్యాయము వచ్చును.)

“అగ్నౌ ప్రాప్తా హుతిః సమ్యగారిత్య ముపతిష్టతే |

ఆదిత్యాజ్జాయతే వృష్టిః వృష్టే రన్నం, తతః ప్రజాః |”

ఇతి శ్రుతేపి దృష్టికారణహోమాభావే వృష్టే రప్యభావః ఇత్యర్థః.

(అగ్నియందు హోమము చేసినయడల వర్షము కురియుట, హోమము చేయకపోయినయడల వర్షము కురియక పోవుట ఎందువలన అనగా - “అగ్నియందు ఆహుతి చేయబడినది సూర్యుని చేరును - సూర్యుని వలన వర్షము కలుగును, వర్షము వలన అన్నము - సస్యములు - కలుగును. అన్నము వలన ప్రజలు కలుగుచున్నారు -” అని శ్రుతి చెప్పుచున్నది. ఇందువలన వర్షమునకు కారణమైన హోమము లేనప్పుడు వర్షము కూడలేకపోవును.)

“యజ్ఞాత్ భవతి పర్జన్యో” (శ్రీమద్భగవద్గీత- 3 - 15)

(యజ్ణమువలన వర్ష మేఘము కలుగును. అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు) - దీనికి ఈ క్రింది విధముగా వ్యాఖ్యానము చేయబడినది : -

“యజ్ఞా ద్ధర్మాద పూరాఖ్యా జ్జాయతే వృష్టిరర్కతః |

అగ్నౌ ప్రాప్తాహతా సమ్యగాదిత్య ముపతిష్టతే |

ఆదిత్యా జ్జాయతే వృష్టిః- - - ||“. (గీతాభావప్రకాశము- 3 - 52, 53)

(యజ్ఞమువలన అపూర్వము అను పేరుగల ధర్మముననుసరించి సూర్యునివలన వర్షము కలుగుచున్నది. అగ్నిలో ఆహుతి చేయబడినది సూర్యుని చేరుచున్నది అని శ్రుతి చెప్పు చున్నది. సూర్యునివలన వర్షము కురియుచున్నది. వేదములో చెప్పబడిన విషయమునకు వేదమే ప్రమాణము. మహర్షులు ఈ అపూర్వమను ధర్మమును - అతి సూక్ష్మమైన ప్రకృతి ధర్మమును (Natural law). వారి సూక్ష్మదృష్టితో కనిపెట్టియుందురు. వారి సూక్ష్మదృష్టి ఇప్పటి కాలపు మనకు లేకుండుటవలన దాని సత్యము మనము గ్రహించలేకున్నాము -.)

Transliteration

varṣamu kuriyakuṃḍuṭa. dēśamunaku hāni kalugunaṭlu varṣamu lēkuṃḍuṭa.

“agnauhōmādyabhāvāttu vṛṣṭyabhāvō apyabhū nnṛpa |

vṛṣṭērabhāvē saṃśuṣkaṃ nirjalaṃcāpi bhūtalaṃ |

kūpavāpī taṭākāśca saritaḥ śuṣkatāṃgatāḥ |

anāvṛṣṭiriyaṃ rājan abhūt ca śatavārṣikī ||” (dēvībhāgavataṃ)

(agniyaṃdu hōmamu cēyakapōvuṭavalana varṣamu kuriyadu. varṣamu kuravakapōvuṭavalana bhūmi eṃḍipōyi jalaśūnyamagunu. aṃduvalana nūtulu, ceruvulu, eṃḍipōvunu. idi anāvṛṣṭi. idi nūru saṃvatsaramula koka paryāyamu vaccunu.)

“agnau prāptā hutiḥ samyagāritya mupatiṣṭatē |

ādityājjāyatē vṛṣṭiḥ vṛṣṭē rannaṃ, tataḥ prajāḥ |”

iti śrutēpi dṛṣṭikāraṇahōmābhāvē vṛṣṭē rapyabhāvaḥ ityarthaḥ.

(agniyaṃdu hōmamu cēsinayaḍala varṣamu kuriyuṭa, hōmamu cēyakapōyinayaḍala varṣamu kuriyaka pōvuṭa eṃduvalana anagā - “agniyaṃdu āhuti cēyabaḍinadi sūryuni cērunu - sūryuni valana varṣamu kalugunu, varṣamu valana annamu - sasyamulu - kalugunu. annamu valana prajalu kalugucunnāru -” ani śruti ceppucunnadi. iṃduvalana varṣamunaku kāraṇamaina hōmamu lēnappuḍu varṣamu kūḍalēkapōvunu.)

“yajñāt bhavati parjanyō” (śrīmadbhagavadgīta- 3 - 15)

(yajṇamuvalana varṣa mēghamu kalugunu. ani śrīkṛṣṇa bhagavānuḍu śrīmadbhagavadgītalō ceppiyunnāḍu) - dīniki ī kriṃdi vidhamugā vyākhyānamu cēyabaḍinadi : -

“yajñā ddharmāda pūrākhyā jjāyatē vṛṣṭirarkataḥ |

agnau prāptāhatā samyagāditya mupatiṣṭatē |

ādityā jjāyatē vṛṣṭiḥ- - - ||“. (gītābhāvaprakāśamu- 3 - 52, 53)

(yajñamuvalana apūrvamu anu pērugala dharmamunanusariṃci sūryunivalana varṣamu kalugucunnadi. agnilō āhuti cēyabaḍinadi sūryuni cērucunnadi ani śruti ceppu cunnadi. sūryunivalana varṣamu kuriyucunnadi. vēdamulō ceppabaḍina viṣayamunaku vēdamē pramāṇamu. maharṣulu ī apūrvamanu dharmamunu - ati sūkṣmamaina prakṛti dharmamunu (Natural law). vāri sūkṣmadṛṣṭitō kanipeṭṭiyuṃduru. vāri sūkṣmadṛṣṭi ippaṭi kālapu manaku lēkuṃḍuṭavalana dāni satyamu manamu grahiṃcalēkunnāmu -.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.