← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనావృత్తి anāvṛtti

Original — తెలుగు

పునర్జన్మరాహిత్యము; మరల పుట్టకుండుట.

“యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |

ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ |

అగ్నిర్జోతి రహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం |

తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ||

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం |

తత్ర చంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే |

శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వత మతే ||

ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః ||” (శ్రీమద్భగవద్గీత- 8 - 23 to 26)

(చనిపోయినతర్వాత యోగులలో ఎవరు తిరిగి జన్మించెదరు ఎవరు తిరిగి జన్మించరు అను విషయము చెప్పుచున్నాను - వీరు రెండు మార్గముల ద్వారా ప్రయాణము చేయుదురు - దేవయానము, పితృయానము. వీటినే అర్చిరాది మార్గము, ధూమాదిమార్గము అనిన్నీ, ఉత్తరాయణము లేక ఉత్తరమార్గము, దక్షిణాయనము లేక దక్షిణమార్గమనిన్నీ, శుక్లమార్గము, కృష్ణమార్గమనిన్నీ - శుక్లపక్షమార్గము, కృష్ణపక్షమార్గమనిన్నీ, చెప్పుదురు. అర్చిరాదిమార్గమనగా అర్చిస్సు మొదలగునవి చెప్పబడిన మార్గము - అనగా, అగ్ని, జ్యోతిస్సు, పగలు, శుక్లము అనునవి చెప్పబడిన మార్గము. అర్చిస్సు (అగ్ని), జ్యోతి అనుటచేత కాంతివంతమైన మార్గము; అహః - పగలు - వెలుతురు కలిగియుండుటచేత కాంతివంతమైనది. ఇది సంవత్సరములో ఆరునెలలకాలము - ఉత్తరాయణమందురు. కాంతివంతమైన మార్గము, అందుచేత శుక్లము. ఈ మార్గము ద్వారా వెళ్ళినవారు బ్రహ్మజ్ఞానము కలవారు పరబ్రహ్మమును పొందుదురు, మోక్షమును పొందుదురు, అనగా, అనావృత్తిని పొందుదురు -అవృత్తి యనగా జన్మమును పొందుట, అనావృత్తి యనగా తిరిగి జన్మించకుండుట, సంసారములో పడకుండుట, వారు తిరిగి జన్మించరు - రెండవ మార్గము ధూమము, రాత్రి, కృష్ణః అని చెప్పబడినది. రాత్రి యనుటచేత కాంతిలేనిది. ధూమము అనగా పొగ, వెలుతురు నివ్వకుండ కప్పివేయునది పొగ. కృష్ణ అనగా నల్లనిది, వెలుతురు కలిగి తెల్లగా ఉండనిది. ఇది సంవత్సరములో మిగిలిన ఆరునెలలు. దీనిని దక్షిణాయనమందురు. ఈ మార్గమునవెళ్ళినవారు, మార్గము తెలియనందున, అంధకారమయమగుటవలన ముందుకు పోలేక - బ్రహ్మను చేరలేక తిరిగి సంసారములో పడుదురు - తిరిగిజన్మించెదరు.

“యే అర్చిరాది మార్గేణ బ్రహ్మలోకం ప్రాప్తాః తేషా మనావృత్తిరేవ, నిర్గుణ బ్రహ్మవిదాం ఆవృత్తి శంకైవనాస్తి; యతః సగుణ విదామపి నిర్గుణాశ్రయణేనైవ అనావృత్తిర్నాన్యధా, తస్మాత్ బ్రహ్మవిదాం నిరస్త సమస్త ప్రపంచ స్వప్రకాశ చిదేకరస నిరతిశయానందాత్మనా వస్థితిః ఇత్యతి శోభనం”.

(అర్చిరాదిమార్గముద్వారా బ్రహ్మలోకమును పొందినవారికి తిరిగి జన్మ ఉండదు - నిర్గుణబ్రహ్మజ్ఞానము కలవారు తిరిగి జన్మించెదరేమో అను సంశయములేదు - సగుణబ్రహ్మోపాసకులు కూడా నిర్గుణబ్రహ్మజ్ఞానమువలననే మోక్షమును పొందుదురు, తిరిగి జన్మించరు - మరియొకరీతిగా మోక్షములేదు. కనుక - జ్ఞానాదేవతు కైవల్యం” అని చెప్పుటచేత - బ్రహ్మవేత్తలకు ప్రపంచసంబంధమేమియు లేక, తనంతటతానే ప్రకాశించువాడైన, చిన్మాత్రుడు, అత్యంత సుఖస్వరూపుడు అయిన పరబ్రహ్మతో కలిసియుండుట అను స్థితిగల మోక్షము కలుగును - అనుటయే శుభకరము.)

ఉత్తరాయణమున చనిపోయినవారు తిరిగి జన్మింపరు అనునది భీష్మనిర్యాణమువలన కూడ తెలియవచ్చుచున్నది.

వ. “రథిక సహస్రంబులకు గమికాడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన నది దనకు మరణోచితకాలంబని నిశ్చయించి - - -

--- మనో వా గ్దర్శనంబులం బరమాత్మయగు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాదికంబైన వాసుదేవ బ్రహ్మంబునందుం గలిసిన ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 9 - 214, - 226)

(చూడుము - ; అపునరావృత్తి ‘, ’అపునర్భవము’.)

Transliteration

punarjanmarāhityamu; marala puṭṭakuṃḍuṭa.

“yatra kālē tvanāvṛttimāvṛttiṃ caiva yōginaḥ |

prayātā yāṃti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha |

agnirjōti rahaḥ śuklaḥ ṣaṇmāsā uttarāyaṇaṃ |

tatra prayātā gacchaṃti brahma brahmavidō janāḥ ||

dhūmō rātristathā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanaṃ |

tatra caṃdramasaṃ jyōtiryōgī prāpya nivartatē |

śukla kṛṣṇē gatī hyētē jagataḥ śāśvata matē ||

ēkayā yātyanāvṛttimanyayā vartatē punaḥ ||” (śrīmadbhagavadgīta- 8 - 23 to 26)

(canipōyinatarvāta yōgulalō evaru tirigi janmiṃcedaru evaru tirigi janmiṃcaru anu viṣayamu ceppucunnānu - vīru reṃḍu mārgamula dvārā prayāṇamu cēyuduru - dēvayānamu, pitṛyānamu. vīṭinē arcirādi mārgamu, dhūmādimārgamu aninnī, uttarāyaṇamu lēka uttaramārgamu, dakṣiṇāyanamu lēka dakṣiṇamārgamaninnī, śuklamārgamu, kṛṣṇamārgamaninnī - śuklapakṣamārgamu, kṛṣṇapakṣamārgamaninnī, ceppuduru. arcirādimārgamanagā arcissu modalagunavi ceppabaḍina mārgamu - anagā, agni, jyōtissu, pagalu, śuklamu anunavi ceppabaḍina mārgamu. arcissu (agni), jyōti anuṭacēta kāṃtivaṃtamaina mārgamu; ahaḥ - pagalu - veluturu kaligiyuṃḍuṭacēta kāṃtivaṃtamainadi. idi saṃvatsaramulō ārunelalakālamu - uttarāyaṇamaṃduru. kāṃtivaṃtamaina mārgamu, aṃducēta śuklamu. ī mārgamu dvārā veḷḷinavāru brahmajñānamu kalavāru parabrahmamunu poṃduduru, mōkṣamunu poṃduduru, anagā, anāvṛttini poṃduduru -avṛtti yanagā janmamunu poṃduṭa, anāvṛtti yanagā tirigi janmiṃcakuṃḍuṭa, saṃsāramulō paḍakuṃḍuṭa, vāru tirigi janmiṃcaru - reṃḍava mārgamu dhūmamu, rātri, kṛṣṇaḥ ani ceppabaḍinadi. rātri yanuṭacēta kāṃtilēnidi. dhūmamu anagā poga, veluturu nivvakuṃḍa kappivēyunadi poga. kṛṣṇa anagā nallanidi, veluturu kaligi tellagā uṃḍanidi. idi saṃvatsaramulō migilina ārunelalu. dīnini dakṣiṇāyanamaṃduru. ī mārgamunaveḷḷinavāru, mārgamu teliyanaṃduna, aṃdhakāramayamaguṭavalana muṃduku pōlēka - brahmanu cēralēka tirigi saṃsāramulō paḍuduru - tirigijanmiṃcedaru.

“yē arcirādi mārgēṇa brahmalōkaṃ prāptāḥ tēṣā manāvṛttirēva, nirguṇa brahmavidāṃ āvṛtti śaṃkaivanāsti; yataḥ saguṇa vidāmapi nirguṇāśrayaṇēnaiva anāvṛttirnānyadhā, tasmāt brahmavidāṃ nirasta samasta prapaṃca svaprakāśa cidēkarasa niratiśayānaṃdātmanā vasthitiḥ ityati śōbhanaṃ”.

(arcirādimārgamudvārā brahmalōkamunu poṃdinavāriki tirigi janma uṃḍadu - nirguṇabrahmajñānamu kalavāru tirigi janmiṃcedarēmō anu saṃśayamulēdu - saguṇabrahmōpāsakulu kūḍā nirguṇabrahmajñānamuvalananē mōkṣamunu poṃduduru, tirigi janmiṃcaru - mariyokarītigā mōkṣamulēdu. kanuka - jñānādēvatu kaivalyaṃ” ani ceppuṭacēta - brahmavēttalaku prapaṃcasaṃbaṃdhamēmiyu lēka, tanaṃtaṭatānē prakāśiṃcuvāḍaina, cinmātruḍu, atyaṃta sukhasvarūpuḍu ayina parabrahmatō kalisiyuṃḍuṭa anu sthitigala mōkṣamu kalugunu - anuṭayē śubhakaramu.)

uttarāyaṇamuna canipōyinavāru tirigi janmiṃparu anunadi bhīṣmaniryāṇamuvalana kūḍa teliyavaccucunnadi.

va. “rathika sahasraṃbulaku gamikāḍaina bhīṣmuṃḍu svacchaṃda maraṇulaina yōgīśvarulaku vāṃchitaṃbagu nuttarāyaṇaṃbu canudeṃcina nadi danaku maraṇōcitakālaṃbani niścayiṃci - - -

--- manō vā gdarśanaṃbulaṃ baramātmayagu kṛṣṇuni hṛdayaṃbuna nilipikoni niśvāsaṃbulu māni nirupādikaṃbaina vāsudēva brahmaṃbunaṃduṃ galisina ---” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 9 - 214, - 226)

(cūḍumu - ; apunarāvṛtti ‘, ’apunarbhavamu’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.