← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనేకరూపః anēkarūpaḥ

Original — తెలుగు

చేతనా చేతనాత్మక సకల ప్రపంచ స్వరూపః.

(ప్రాణముగలది, ప్రాణములేనిది అను ఈ రెండు విధములగు రూపములుగల సర్వ ప్రపంచము స్వరూపముగా గలవాడు - )

“విశ్వస్య స్రష్టారమనేక రూపం” ఇతి శ్రుతిః.

(విశ్వమంతా భగవంతుని స్థూలరూపము. విశ్వములో ఉన్న రూపములన్నీ భగవంతుని రూపములే. అందుచేత విశ్వమంతా భగవంతుని నామ రూపములే. అందుచేత అనేకరూపములు గలవాడు.)

“రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, మహా బాహో, బహు బాహూరు పాదం|

బహూదరం బహుదంష్టా కరాళం - - - ” (శ్రీమద్భగవద్గీత- 11 - 23)

(చూడుము - “అనేక బాహూదరవక్త్ర నేత్రం”)

“తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చ, త్యచ్చ అభవత్ -” (చూడుము - బాహూదరవక్త్రనేత్రం - 1)

“నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప” - (శ్రీమద్భగవద్గీత- 10 - 40)

(నా విభూతులకు అంతము లేదు. విభూతులనగా వివిధరూపములుగా భగవంతుడు ఆవర్భవించుటయే - అందుచేత భగవంతుడు అనంతుడు.)

Transliteration

cētanā cētanātmaka sakala prapaṃca svarūpaḥ.

(prāṇamugaladi, prāṇamulēnidi anu ī reṃḍu vidhamulagu rūpamulugala sarva prapaṃcamu svarūpamugā galavāḍu - )

“viśvasya sraṣṭāramanēka rūpaṃ” iti śrutiḥ.

(viśvamaṃtā bhagavaṃtuni sthūlarūpamu. viśvamulō unna rūpamulannī bhagavaṃtuni rūpamulē. aṃducēta viśvamaṃtā bhagavaṃtuni nāma rūpamulē. aṃducēta anēkarūpamulu galavāḍu.)

“rūpaṃ mahattē bahuvaktra nētraṃ, mahā bāhō, bahu bāhūru pādaṃ|

bahūdaraṃ bahudaṃṣṭā karāḷaṃ - - - ” (śrīmadbhagavadgīta- 11 - 23)

(cūḍumu - “anēka bāhūdaravaktra nētraṃ”)

“tat sṛṣṭvā tadēvānu prāviśat, tadanu praviśya sacca, tyacca abhavat -” (cūḍumu - bāhūdaravaktranētraṃ - 1)

“nāṃtōsti mama divyānāṃ vibhūtīnāṃ paraṃtapa” - (śrīmadbhagavadgīta- 10 - 40)

(nā vibhūtulaku aṃtamu lēdu. vibhūtulanagā vividharūpamulugā bhagavaṃtuḍu āvarbhaviṃcuṭayē - aṃducēta bhagavaṃtuḍu anaṃtuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.