“నికేతః ఆశ్రయః, నివాసః నియతః న
విద్యతే యస్య సః అనికేతః”. (శ్రీ శంకరః)
(నికేతమనగా ఆశ్రయము, నిర్ధిష్టమైన నివాసము,
అదిలేనివాడు.)
నియతా వసధి రహితః.
(నిర్ణీతమైన అవసధము - బస - విశ్రమస్థానము, లేనివాడు.)
గృహశూన్యః (ఇల్లు
అనునది లేనివాడు.)
శూన్యో
నియత వాసేన. (నియతమైన నివాసము లేనివాడు.)
యో గృహం
ద్వారం సర్వం భగవతః ఇతి కృతమతిః.
(గృహము, ద్వారము, అన్నియు భగవంతునివియే అని
తలచువాడు.)
యస్యాత్మనః కదృశమపి గృహం నాస్తి, యో
గృహే మమత్వరహితః ఇత్యర్థః.
(తనది
అయిన ఏ విధమైన గృహములేనివాడు; గృహమందు మమత్వము - ఈ ఇల్లు నాది యను అనుభావము
లేనివాడు.)
“ఆత్మని స్థిరమతిత్వేన నికేతనాదిషు అసక్తః”
(శ్రీరామానుజః)
(ఆత్మయందు స్థిరమైన మనస్సు
కలిగియుండుటచేత వసతిస్థానమందు ఆసక్తి లేనివాడు.)
ఇల్లు వాకిలి,
విడిచినవాడు.
Transliteration
“nikētaḥ
āśrayaḥ, nivāsaḥ niyataḥ na vidyatē yasya saḥ anikētaḥ”. (śrī
śaṃkaraḥ)
(nikētamanagā
āśrayamu, nirdhiṣṭamaina nivāsamu, adilēnivāḍu.)
niyatā
vasadhi rahitaḥ. (nirṇītamaina avasadhamu - basa - viśramasthānamu,
lēnivāḍu.)
gṛhaśūnyaḥ (illu anunadi
lēnivāḍu.)
śūnyō niyata
vāsēna. (niyatamaina nivāsamu lēnivāḍu.)
yō gṛhaṃ dvāraṃ
sarvaṃ bhagavataḥ iti kṛtamatiḥ.
(gṛhamu,
dvāramu, anniyu bhagavaṃtuniviyē ani talacuvāḍu.)
yasyātmanaḥ
kadṛśamapi gṛhaṃ nāsti, yō gṛhē mamatvarahitaḥ ityarthaḥ.
(tanadi
ayina ē vidhamaina gṛhamulēnivāḍu; gṛhamaṃdu mamatvamu - ī illu nādi
yanu anubhāvamu lēnivāḍu.)
“ātmani
sthiramatitvēna nikētanādiṣu asaktaḥ” (śrīrāmānujaḥ)
(ātmayaṃdu
sthiramaina manassu kaligiyuṃḍuṭacēta vasatisthānamaṃdu āsakti
lēnivāḍu.)
illu
vākili, viḍicinavāḍu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.