← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిమిషః animiṣaḥ

Original — తెలుగు

“నిత్య ప్రబుద్ధ స్వరూపత్వాతనిమిషః ఆత్మ రూపతయావా అనిమిషః -” (శ్రీశంకరః)

(నిత్యము జ్ఞానరూపుడు, మేల్కొనియుండువాడు; రెప్పపాటు లేకుండ ప్రపంచమును నడిపించువాడు. ఆత్మరూపుడు కనుక అన్నింటి ఆత్మ అయి వాటినన్నింటినీ నడిపించువాడు - కనుక అనిమిషుడు.)

(నిరంతర దృష్టికి రెప్పపాటు అడ్డము. తన చైతన్యశక్తి అన్నివేళలందు అన్నింటియందు పనిచేయుట అను నిరంతర వ్యాపారమునకు రెప్పపాటు ఆటంకము కూడ లేనివాడు. నిరంతర శక్తి సామర్థ్యముగలవాడు.)

నిమేష వ్యాపార శూన్యః(రెప్పపాటు లేనివాడు.)

కాలాత్మకః (రెప్పపాటువలె అయినను ఆగని ప్రవాహరూపమైన కాలమైనవాడు.)

అలుప్త దృష్టి త్వాత్ అనిమిషః - శ్రీ విష్ణుః.

(లోపించని దృష్టికలవాడు, ఎల్లపుడు అన్నింటినీ అడ్డులేకుండ చూచుచుండువాడు - శ్రీ మహా విష్ణువు.)

Transliteration

“nitya prabuddha svarūpatvātanimiṣaḥ ātma rūpatayāvā animiṣaḥ -” (śrīśaṃkaraḥ)

(nityamu jñānarūpuḍu, mēlkoniyuṃḍuvāḍu; reppapāṭu lēkuṃḍa prapaṃcamunu naḍipiṃcuvāḍu. ātmarūpuḍu kanuka anniṃṭi ātma ayi vāṭinanniṃṭinī naḍipiṃcuvāḍu - kanuka animiṣuḍu.)

(niraṃtara dṛṣṭiki reppapāṭu aḍḍamu. tana caitanyaśakti annivēḷalaṃdu anniṃṭiyaṃdu panicēyuṭa anu niraṃtara vyāpāramunaku reppapāṭu āṭaṃkamu kūḍa lēnivāḍu. niraṃtara śakti sāmarthyamugalavāḍu.)

nimēṣa vyāpāra śūnyaḥ(reppapāṭu lēnivāḍu.)

kālātmakaḥ (reppapāṭuvale ayinanu āgani pravāharūpamaina kālamainavāḍu.)

alupta dṛṣṭi tvāt animiṣaḥ - śrī viṣṇuḥ.

(lōpiṃcani dṛṣṭikalavāḍu, ellapuḍu anniṃṭinī aḍḍulēkuṃḍa cūcucuṃḍuvāḍu - śrī mahā viṣṇuvu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.