← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిర్దేశ్యం anirdēśyaṃ

Original — తెలుగు

న నిర్దేష్టుం శక్యతే, అతః అనిర్దేశ్యం. (నిర్దేశించుటకు శక్యము కానిది.)

నిర్ణేతు మశక్యం, వాచామ గోచరం.

(ఇట్టిదని నిర్నయించుటకు శక్యముకానిది, - వాక్కులకు అందకపోవుటవలన, అనగా, మాటలచే ఇట్టిదని నిర్ణయించుటకు వీలుపడనిది.)

అవ్యక్తత్వాత్ అశబ్దగోచరం ఇతి న నిర్దేష్టం శక్యతే, అతః అనిర్దేశ్యం.

(వ్యక్తము కాకపోవుటవలన - అనగా, కంటికి కనబడక పోవుటవలన, మాటలకు అందదు. అందుచేత నిర్దేశింప శక్యముకానిది, అందుచేత అనిర్దేశ్యము.)

నిర్దేష్టు మశక్యం, ప్రాకృత పురుష వాఙ్మ నయోః అగోచరం.

(నిర్దేశింపశక్యముకానిది, ప్రాకృత పురుషుల వాక్కుమనస్సులకు అగోచరుడు, అందనివాడు.)

చేతనా చేతన సజాతీయతయా నిర్దేష్టుమశక్యం.

(చేతనములు, అచేతనములు అను రెండుజాతులకు చెందియుండక పోవుటచేత నిర్దేశింప శక్యముకానిది.)

ఇదం తదితి నిర్దేష్టు మశక్యం పరస్మై సమస్తోపాధి వినిర్ముక్తత్వాత్ - ఉపలక్షణమే తత్ - మనసాపి చింతయితు మశక్యం. అథాపి, యే నివృత్తైషణాః తే ప్రత్యక్షమే వైతన్మన్యంతే.

(అది ఇది ఇటువంటిది అని నిర్దేశించుటకు శక్యముకానిది ఉపాధితో కలిసియుండిన నిర్దేశించుటకు వీలగును - ఉపాధిలేనివాడుకనుక నిర్దేశింపవీలు లేనివాడు. ఇలాగున అయినప్పటికీ కోరికలులేనివారు అతనిని ప్రత్యక్షముగాకనబడువాడు వలెనే తలంచెదరు.)

అనిదం స్వరూపత్వాత్.

(స్వరూపమును బట్టి ఇది ఇటువంటిదికాదు, అనగా, సృష్టిలో కనబడు వస్తువులు కానిది - ఏ వస్తువు వంటిది కానిది.)

తత్వే నిర్దేష్టుం అశక్యత్వాత్ అనిర్దేశ్యం.

(దాని తత్వమేదో నిర్దేశించుటకు శక్యము కానందువల్ల అనిర్దేశ్యము) -

“అనిర్దేశ్యమశక్యం యద్వ్యపదేష్టుం గిరా (అ) క్షరం” (గీతాభావప్రకాశము- 12 - 22)

(మాటలచే నిర్దేశింప శక్యము కానిది.)

యస్మిన్ న కశ్చిద్విశేషోస్తి నామవా, రూపం వా, జాతిర్వా, గుణోవా, తద్ద్వారేణైవ హి శబ్ద వృత్తిర్భవతి. న చైషాం కశ్చిత్ విశేషో బ్రహ్మణి అస్తి అతో న నిర్దేష్టుం శక్యతే ఇదం తదితి.

(బ్రహ్మకు ఏ విధమైన విశేషములులేవు - పేరులేదు, రూపము లేదు, జాతిలేదు, గుణములేదు. ఇవి ఏవైనా ఉన్నయడల వాటిని బట్టి ఇటువంటిది అని పోల్చుకొనవచ్చును - బ్రహ్మ నిర్విశేషుడు, నిర్గుణుడు, నిరాకారుడు, అనామికుడు, అగోత్రుడు. అందుచేత బ్రహ్మ ఇది, ఈ లాగున ఉంటాడు అని నిర్దేశించుటకు శక్యము కాదు.)

రూపాది హీనః (రూపము మొదలగునవి లేనివాడు - అనగా, రూపము, గుణము, పేరు, జాతి విశేషములు లేనివాడు.)

నిర్గుణః(త్రిగుణములు లేనివాడు - త్రిగుణములకు అతీతుడు. త్రిగుణములకు మించినవాడు - అందుచేత అనిర్దేశ్యము.)

అవిషయం. (ఇంద్రియములకు విషయముకానివాడు) అనగా, ఏ ఇంద్రియముచేతనైనను తెలియ శక్యముకానివాడు.)

Transliteration

na nirdēṣṭuṃ śakyatē, ataḥ anirdēśyaṃ. (nirdēśiṃcuṭaku śakyamu kānidi.)

nirṇētu maśakyaṃ, vācāma gōcaraṃ.

(iṭṭidani nirnayiṃcuṭaku śakyamukānidi, - vākkulaku aṃdakapōvuṭavalana, anagā, māṭalacē iṭṭidani nirṇayiṃcuṭaku vīlupaḍanidi.)

avyaktatvāt aśabdagōcaraṃ iti na nirdēṣṭaṃ śakyatē, ataḥ anirdēśyaṃ.

(vyaktamu kākapōvuṭavalana - anagā, kaṃṭiki kanabaḍaka pōvuṭavalana, māṭalaku aṃdadu. aṃducēta nirdēśiṃpa śakyamukānidi, aṃducēta anirdēśyamu.)

nirdēṣṭu maśakyaṃ, prākṛta puruṣa vāṅma nayōḥ agōcaraṃ.

(nirdēśiṃpaśakyamukānidi, prākṛta puruṣula vākkumanassulaku agōcaruḍu, aṃdanivāḍu.)

cētanā cētana sajātīyatayā nirdēṣṭumaśakyaṃ.

(cētanamulu, acētanamulu anu reṃḍujātulaku ceṃdiyuṃḍaka pōvuṭacēta nirdēśiṃpa śakyamukānidi.)

idaṃ taditi nirdēṣṭu maśakyaṃ parasmai samastōpādhi vinirmuktatvāt - upalakṣaṇamē tat - manasāpi ciṃtayitu maśakyaṃ. athāpi, yē nivṛttaiṣaṇāḥ tē pratyakṣamē vaitanmanyaṃtē.

(adi idi iṭuvaṃṭidi ani nirdēśiṃcuṭaku śakyamukānidi upādhitō kalisiyuṃḍina nirdēśiṃcuṭaku vīlagunu - upādhilēnivāḍukanuka nirdēśiṃpavīlu lēnivāḍu. ilāguna ayinappaṭikī kōrikalulēnivāru atanini pratyakṣamugākanabaḍuvāḍu valenē talaṃcedaru.)

anidaṃ svarūpatvāt.

(svarūpamunu baṭṭi idi iṭuvaṃṭidikādu, anagā, sṛṣṭilō kanabaḍu vastuvulu kānidi - ē vastuvu vaṃṭidi kānidi.)

tatvē nirdēṣṭuṃ aśakyatvāt anirdēśyaṃ.

(dāni tatvamēdō nirdēśiṃcuṭaku śakyamu kānaṃduvalla anirdēśyamu) -

“anirdēśyamaśakyaṃ yadvyapadēṣṭuṃ girā (a) kṣaraṃ” (gītābhāvaprakāśamu- 12 - 22)

(māṭalacē nirdēśiṃpa śakyamu kānidi.)

yasmin na kaścidviśēṣōsti nāmavā, rūpaṃ vā, jātirvā, guṇōvā, taddvārēṇaiva hi śabda vṛttirbhavati. na caiṣāṃ kaścit viśēṣō brahmaṇi asti atō na nirdēṣṭuṃ śakyatē idaṃ taditi.

(brahmaku ē vidhamaina viśēṣamululēvu - pērulēdu, rūpamu lēdu, jātilēdu, guṇamulēdu. ivi ēvainā unnayaḍala vāṭini baṭṭi iṭuvaṃṭidi ani pōlcukonavaccunu - brahma nirviśēṣuḍu, nirguṇuḍu, nirākāruḍu, anāmikuḍu, agōtruḍu. aṃducēta brahma idi, ī lāguna uṃṭāḍu ani nirdēśiṃcuṭaku śakyamu kādu.)

rūpādi hīnaḥ (rūpamu modalagunavi lēnivāḍu - anagā, rūpamu, guṇamu, pēru, jāti viśēṣamulu lēnivāḍu.)

nirguṇaḥ(triguṇamulu lēnivāḍu - triguṇamulaku atītuḍu. triguṇamulaku miṃcinavāḍu - aṃducēta anirdēśyamu.)

aviṣayaṃ. (iṃdriyamulaku viṣayamukānivāḍu) anagā, ē iṃdriyamucētanainanu teliya śakyamukānivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.