“చతుర్వ్యూహేషు
చతుర్ధో వ్యూహః అనిరుద్ధః, న నిరుద్ధ్యతే శత్రుభిః కదాచిదితి వా”. (శ్రీశంకరః)
(వైష్ణవాగమముల
ప్రకారము వాసుదేవ వ్యూహము, సంరక్షణవ్యూహము, ప్రద్యుమ్నవ్యూహము, అనిరుద్ధ వ్యూహము అను
నాలుగువ్యూహములలో నాలుగవది - అనిరుద్ధవ్యూహము. శత్రువులచేత ఎప్పుడునూ
నిరోధించబడియుండలేదు.)
వాసుదేవ,
సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధాః చత్వారః. భగవాన్ వాసుదేవః పరమేశ్వరః సర్వకారణం. తస్మాదు త్పద్యతే
సంకర్షణాఖ్యో జీవః, తస్మాన్మనః ప్రద్యుమ్నః, తస్మాదనిరుద్ధో అహంకారః.సర్వేచ ఏతే భగవతః వాసుదేవస్య
ఏవ అంశ భూతాః, తదభిన్నాః ఏవ. ఇతి తస్య వాసుదేవస్య మనోవాక్కాయ వృత్తిభిఃఅరాధనం కృత్వా కృత కృత్యో
భవతి. ఇత్యాది నిరూపితం పాంచ రాత్రే.
(వాసుదేవ,
సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధములు అను పేరుగలవి నాలుగు వ్యూహములు. వాటిలో భగవంతుడైన
వాసుదేవుడు పరమేశ్వరుడు, అంతటికి కారణమైన వాడు. ఆ వాసుదేవ వ్యూహము నుండి సంకర్షణుడను
జీవుడు. ఆ సంకర్షణవ్యూహమునుండి పుట్టినది ప్రద్యుమ్నము అను పేరుగల మనస్సు. ఆ ప్రద్యుమ్న
వ్యూహమునుండి అనిరుద్ధుడు అను పేరుగల అహంకారము - అనువ్యూహము పుట్టినది. ఇవన్నియు
భగవంతుడైన వాసుదేవునియొక్క అంశలే, వాసుదేవునికంటె వేరైనవికావు. ఈ ప్రకారము ఆ వాసుదేవునియొక్క ఆరాధన
మనోవాక్కాయకర్మలను వృత్తులతో చేసి కృతార్థులగుదురు - అను మొదలగు విషయములు పాంచరాత్రాగములలో
చెప్పబడినవి)
ఈ అనిరుద్ధ
వ్యూహముగుఱించి శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -
వ.
“--- ఏది యనిరుద్ధాఖ్యం బైన వ్యూహం బదియ హృషీకంబులకు నధీశ్వరం బై సకల యోగీంద్ర సేవ్యం బగుచు
శర దిందీవర శ్యామంబై యుండు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 26 - 887)
Transliteration
“caturvyūhēṣu
caturdhō vyūhaḥ aniruddhaḥ, na niruddhyatē śatrubhiḥ kadāciditi vā”.
(śrīśaṃkaraḥ)
(vaiṣṇavāgamamula
prakāramu vāsudēva vyūhamu, saṃrakṣaṇavyūhamu, pradyumnavyūhamu,
aniruddha vyūhamu anu nāluguvyūhamulalō nālugavadi - aniruddhavyūhamu.
śatruvulacēta eppuḍunū nirōdhiṃcabaḍiyuṃḍalēdu.)
vāsudēva,
saṃkarṣaṇa, pradyumna aniruddhāḥ catvāraḥ. bhagavān vāsudēvaḥ
paramēśvaraḥ sarvakāraṇaṃ. tasmādu tpadyatē saṃkarṣaṇākhyō jīvaḥ,
tasmānmanaḥ pradyumnaḥ, tasmādaniruddhō ahaṃkāraḥ.sarvēca ētē bhagavataḥ
vāsudēvasya ēva aṃśa bhūtāḥ, tadabhinnāḥ ēva. iti tasya vāsudēvasya
manōvākkāya vṛttibhiḥarādhanaṃ kṛtvā kṛta kṛtyō bhavati. ityādi
nirūpitaṃ pāṃca rātrē.
(vāsudēva,
saṃkarṣaṇa, pradyumna aniruddhamulu anu pērugalavi nālugu vyūhamulu.
vāṭilō bhagavaṃtuḍaina vāsudēvuḍu paramēśvaruḍu, aṃtaṭiki kāraṇamaina
vāḍu. ā vāsudēva vyūhamu nuṃḍi saṃkarṣaṇuḍanu jīvuḍu. ā
saṃkarṣaṇavyūhamunuṃḍi puṭṭinadi pradyumnamu anu pērugala manassu. ā
pradyumna vyūhamunuṃḍi aniruddhuḍu anu pērugala ahaṃkāramu - anuvyūhamu
puṭṭinadi. ivanniyu bhagavaṃtuḍaina vāsudēvuniyokka aṃśalē,
vāsudēvunikaṃṭe vērainavikāvu. ī prakāramu ā vāsudēvuniyokka ārādhana
manōvākkāyakarmalanu vṛttulatō cēsi kṛtārthulaguduru - anu modalagu
viṣayamulu pāṃcarātrāgamulalō ceppabaḍinavi)
ī
aniruddha vyūhamuguṟiṃci śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃda
vidhamugā ceppabaḍinadi : -
va.
“--- ēdi yaniruddhākhyaṃ baina vyūhaṃ badiya hṛṣīkaṃbulaku nadhīśvaraṃ
bai sakala yōgīṃdra sēvyaṃ bagucu śara diṃdīvara śyāmaṃbai yuṃḍu ---”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 26 - 887)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.