నిర్వచింప
శక్యము కానిది; ఇట్టిదని చెప్పరానిది.నిర్వచనమనగా నిర్ణయించుట, అనగా, ఇట్టిది అని నిరూపించుటకు
వీలగునది నిర్వచనీయము. అట్టిది కానిది అనిర్వచనీయము.
ఉన్నదనికాని, లేదనికాని, ఉన్నదియు,
లేనిదియు అని కాని చెప్పుటకు వీలులేనిది.
అజ్ఞానము
జ్ఞానముచే పోవును. అందుచేత అజ్ఞానము సత్ కాదు - ఎల్లపుడూ ఉండునదికాదు. అజ్ఞానము అసత్
కాదుఎందుచేతననగా అసత్ అనగా గొడ్రాలి కొడుకు వంటిది, అసంభవమైనది. సదసత్ రూపమనుటకుకూడ
వీలుకాదు. ఈ రెండునూ ఒకటికొకటి విరుద్ధములు. అందుచేత అది ఎటువంటిదో చెప్ప శక్యముకానిది - అనగా,
అనిర్వచనీయము -
“నేహ
నానాస్తి కించన” (ఈ బ్రహ్మమందు ఏ విధముగు భేదము లేదు - ఉన్నదంతా బ్రహ్మమే - సృష్టిలో బ్రహ్మకాని
వస్తువు మరొకటి లేదు) అని చెప్పుటవలన ప్రపంచము అనునది సద్రూపముకాదు -
శాశ్వతముగానుండునదికాదు కనుక. కుందేటికొమ్ము, గొడ్రాలి కొడుకు కానరానివి. అందుచేత అసత్ -
ప్రపంచము వాటివలె కానరానిదికాదు. అందుచేత అసత్ వస్తువుకాదు - సత్తుకాదు, అసత్తుకాదు. అలాగని
సదసత్ వస్తువుకాదు - ఈ రెండును పరస్పరము - ఒకదానికొకటి - విరుద్ధములుగనుక.ఇందుచేత ఈ
ప్రపంచము ఇట్టిదని నిర్ణయించి నిర్ధారణగా చెప్పుటకు వీలుకానిది. అందుచేత అనిర్వచనీయము - సదసత్
వస్తువులు రెండింటికి విలక్షణముగా నుండునది అనిర్వచనీయము.
మాయ యనునదికలదనికాని,
లేదనికాని చెప్పుటకు వీలులేనిది. కావున అది అనిర్వచనీయము -
“ఇత్యేవముక్తరీత్యాయం సాక్షిభాస్య
తయాక్షగా |
శక్తిః పరమధర్మాఖ్యా (అ)
నిద్వాచ్యా త్రిగుణాత్మకా |” (గీతాభావప్రకాశము- 7 - 31)
(భూమి
మొదలగు ఎనిమిది విధములుగా ఉన్న భగవంతుని శక్తి ప్రకృతి, లేకమాయ సత్వరజస్తమములుగలది
అనిర్వాచ్యమైనది.)
వాణ్యా బ్రహ్మణో
వర్ణనమసంభవమస్తి. వేదాః “నేతి, నేతి”కథయిత్వా తూష్ణీం భవంతి.
(వాక్కుచేతను
బ్రహ్మను వర్ణించుటకు వీలుకాదు. వేదములు కూడా ఇదికాదు, ఇదికాదు అని చెప్పి, చెప్పి, చివరకు ఏమీ
చెప్పలేక ఊరుకున్నవి. అందుచేత బ్రహ్మము అనిర్వాచ్యము.)
బ్రహ్మను
గుఱించి వేదములు ఎంత చెప్పినను ఏ ప్రమాణముచేతనూ తెలియకుండుటచేత బ్రహ్మము అనిర్వాచ్యము.)
Transliteration
nirvaciṃpa
śakyamu kānidi; iṭṭidani cepparānidi.nirvacanamanagā nirṇayiṃcuṭa,
anagā, iṭṭidi ani nirūpiṃcuṭaku vīlagunadi nirvacanīyamu. aṭṭidi kānidi
anirvacanīyamu.
unnadanikāni,
lēdanikāni, unnadiyu, lēnidiyu ani kāni ceppuṭaku vīlulēnidi.
ajñānamu
jñānamucē pōvunu. aṃducēta ajñānamu sat kādu - ellapuḍū uṃḍunadikādu.
ajñānamu asat kādueṃducētananagā asat anagā goḍrāli koḍuku vaṃṭidi,
asaṃbhavamainadi. sadasat rūpamanuṭakukūḍa vīlukādu. ī reṃḍunū
okaṭikokaṭi viruddhamulu. aṃducēta adi eṭuvaṃṭidō ceppa śakyamukānidi -
anagā, anirvacanīyamu -
“nēha
nānāsti kiṃcana” (ī brahmamaṃdu ē vidhamugu bhēdamu lēdu - unnadaṃtā
brahmamē - sṛṣṭilō brahmakāni vastuvu marokaṭi lēdu) ani ceppuṭavalana
prapaṃcamu anunadi sadrūpamukādu - śāśvatamugānuṃḍunadikādu kanuka.
kuṃdēṭikommu, goḍrāli koḍuku kānarānivi. aṃducēta asat - prapaṃcamu
vāṭivale kānarānidikādu. aṃducēta asat vastuvukādu - sattukādu,
asattukādu. alāgani sadasat vastuvukādu - ī reṃḍunu parasparamu -
okadānikokaṭi - viruddhamuluganuka.iṃducēta ī prapaṃcamu iṭṭidani
nirṇayiṃci nirdhāraṇagā ceppuṭaku vīlukānidi. aṃducēta anirvacanīyamu -
sadasat vastuvulu reṃḍiṃṭiki vilakṣaṇamugā nuṃḍunadi
anirvacanīyamu.
māya
yanunadikaladanikāni, lēdanikāni ceppuṭaku vīlulēnidi. kāvuna adi
anirvacanīyamu -
“ityēvamuktarītyāyaṃ
sākṣibhāsya tayākṣagā |
śaktiḥ
paramadharmākhyā (a) nidvācyā triguṇātmakā |” (gītābhāvaprakāśamu- 7 -
31)
(bhūmi
modalagu enimidi vidhamulugā unna bhagavaṃtuni śakti prakṛti, lēkamāya
satvarajastamamulugaladi anirvācyamainadi.)
vāṇyā
brahmaṇō varṇanamasaṃbhavamasti. vēdāḥ “nēti, nēti”kathayitvā tūṣṇīṃ
bhavaṃti.
(vākkucētanu
brahmanu varṇiṃcuṭaku vīlukādu. vēdamulu kūḍā idikādu, idikādu ani
ceppi, ceppi, civaraku ēmī ceppalēka ūrukunnavi. aṃducēta brahmamu
anirvācyamu.)
brahmanu
guṟiṃci vēdamulu eṃta ceppinanu ē pramāṇamucētanū teliyakuṃḍuṭacēta
brahmamu anirvācyamu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.