← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిత్యం anityaṃ

Original — తెలుగు

“క్షణ భంగురం” (శ్రీశంకరః)

(క్షణకాలముండునది; క్షణకాలమందుండి నశించునది.)

నిత్యముకానిది; శాశ్వతము కానిది; స్థిరముకానిది; నశించునది.

యద్వస్తు మధ్యమ పరిణామ తదనిత్యం, శరీరవత్ ఇతి నియమః.

ఏ వస్తువు సృష్టి స్థితిలయములను మూడింటిలో మధ్య అవస్థ అయిన స్థితి కలిగియున్నదో అది శరీరమువలె నిత్యమైనదికాదు. ఇది నియమము. శరీరము గుఱించిశ్రీమద్భగ వద్గీతలో ఈ ప్రకారముగా చెప్పబడినది : -

“అవ్యక్తా దీని భూతాని, వ్యక్త మధ్యాని భారత |

అవ్యక్త నిధనాన్యేవ - - ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 28)

(భూతములు పుట్టుట కనబడదు, చనిపోయిన తర్వాత ఏమగుచున్నవో కనబడవు, మధ్యస్థితిలో కనబడుచున్నవి, అనగా, మధ్యస్థితిలో ఉన్నవాటికి జన్మ ఉన్నది, నాశము కూడ ఉండును. ఆ ప్రకారముగానే మధ్య స్థితిలో ఉన్న వస్తువుకూడ నశింపక తప్పదు. ఇది యొక పరిణామము, మార్పు.)

“యత్కృతకం తదనిత్యం”

(ఏది చేయబడినదో - యేది కార్యమో, - కారణములోనుండి పుట్టినదో అది నిత్యముకాదు, నశించునది. కార్యమైన వస్తువు దాని కార్యములోనే - ఎందులోనుండి పుట్టినదో అందులోనే - లీనమైపోవును; ఎల్లకాలముండదు.)

“శరీరత్వాత్ అనిత్యః”.

(శరీరము అగుటవల్ల నిత్యముకానిది. శరీరము అనగా, “శీర్యతే ఇతి శరీరం” (క్షీణించునదికనుక శరీరము)

“యదైవ భూమా తదమృతం, అన్యదార్తం” ఇత్యాది శ్రుత్యాచ” భూమాత్మా నిత్యః; తత్ (అ) న్యత్ అనిత్యం ; ఇతి వివేకో లభ్యతే.

(ఏది భూమావో - ఆత్మయో - అది అమృతము, మృతి లేనిది, నాశములేనిది, నిత్యమైనది; అదికానిది అనిత్యమైనది - ఎల్లపుడూ ఉండనిది.)

“తోచి చెడే దేహాదికములే అనిత్యరూపములు” (వివేకచింతామణి)

అనిత్యములైన వస్తువులగు వస్తువుల గుఱించి శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“చ. మునివిభు డంత భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నం

దన పశు విత్త రత్న వనితా గృహ రమ్యవిహార శైల వా

రినిధి పరీత భూతల హరి ద్విపముఖ్య పదార్థ జాలముల్

ఘనమతిచే ననిత్యములుగా దలపోసి విరక్త చిత్తుడై“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 4 - 369)

(సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, కొడుకులు, పశువులు, ధనము, రత్నములు, వనితలు, గృహములు, రమ్యమైన విహారస్థలములు, సముద్రమే హద్దుగాగల భూమి - రాజ్యము - గుఱ్ఱములు, ఏనుగులు, మొదలగు వస్తువులన్నియు బాగుగా నాలోచించగా అనిత్యములని - కలకాలము ఉండనివని -నశించునవని - వాటియందు విరక్తి పొందెను.)

“యౌవనం బాల్యం శరీరం ద్రవ సం చ యాః |

భావాద్భావాంతరం యాంతి తరంగ వదనారతం” (యోగవాసిష్టము- 28 - 10)

(బాల్యము, యౌవనము, శరీరము, ద్రవములు, ఇనన్నియు అనిత్యములు, ఎల్లపుడు ఉండునవికావు. కెరటములవలె ఎల్లపుడు మార్పును చెంది, ఇంకొక రూపముగా మారుచుండునవి.)

Transliteration

“kṣaṇa bhaṃguraṃ” (śrīśaṃkaraḥ)

(kṣaṇakālamuṃḍunadi; kṣaṇakālamaṃduṃḍi naśiṃcunadi.)

nityamukānidi; śāśvatamu kānidi; sthiramukānidi; naśiṃcunadi.

yadvastu madhyama pariṇāma tadanityaṃ, śarīravat iti niyamaḥ.

ē vastuvu sṛṣṭi sthitilayamulanu mūḍiṃṭilō madhya avastha ayina sthiti kaligiyunnadō adi śarīramuvale nityamainadikādu. idi niyamamu. śarīramu guṟiṃciśrīmadbhaga vadgītalō ī prakāramugā ceppabaḍinadi : -

“avyaktā dīni bhūtāni, vyakta madhyāni bhārata |

avyakta nidhanānyēva - - ||“. (śrīmadbhagavadgīta - 2 - 28)

(bhūtamulu puṭṭuṭa kanabaḍadu, canipōyina tarvāta ēmagucunnavō kanabaḍavu, madhyasthitilō kanabaḍucunnavi, anagā, madhyasthitilō unnavāṭiki janma unnadi, nāśamu kūḍa uṃḍunu. ā prakāramugānē madhya sthitilō unna vastuvukūḍa naśiṃpaka tappadu. idi yoka pariṇāmamu, mārpu.)

“yatkṛtakaṃ tadanityaṃ”

(ēdi cēyabaḍinadō - yēdi kāryamō, - kāraṇamulōnuṃḍi puṭṭinadō adi nityamukādu, naśiṃcunadi. kāryamaina vastuvu dāni kāryamulōnē - eṃdulōnuṃḍi puṭṭinadō aṃdulōnē - līnamaipōvunu; ellakālamuṃḍadu.)

“śarīratvāt anityaḥ”.

(śarīramu aguṭavalla nityamukānidi. śarīramu anagā, “śīryatē iti śarīraṃ” (kṣīṇiṃcunadikanuka śarīramu)

“yadaiva bhūmā tadamṛtaṃ, anyadārtaṃ” ityādi śrutyāca” bhūmātmā nityaḥ; tat (a) nyat anityaṃ ; iti vivēkō labhyatē.

(ēdi bhūmāvō - ātmayō - adi amṛtamu, mṛti lēnidi, nāśamulēnidi, nityamainadi; adikānidi anityamainadi - ellapuḍū uṃḍanidi.)

“tōci ceḍē dēhādikamulē anityarūpamulu” (vivēkaciṃtāmaṇi)

anityamulaina vastuvulagu vastuvula guṟiṃci śrīmadāṃdhra mahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“ca. munivibhu ḍaṃta bhṛtyajana maṃtri purōhita baṃdhu mitra naṃ

dana paśu vitta ratna vanitā gṛha ramyavihāra śaila vā

rinidhi parīta bhūtala hari dvipamukhya padārtha jālamul

ghanamaticē nanityamulugā dalapōsi virakta cittuḍai”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 4 - 369)

(sēvakulu, maṃtrulu, purōhitulu, baṃdhuvulu, mitrulu, koḍukulu, paśuvulu, dhanamu, ratnamulu, vanitalu, gṛhamulu, ramyamaina vihārasthalamulu, samudramē haddugāgala bhūmi - rājyamu - guṟṟamulu, ēnugulu, modalagu vastuvulanniyu bāgugā nālōciṃcagā anityamulani - kalakālamu uṃḍanivani -naśiṃcunavani - vāṭiyaṃdu virakti poṃdenu.)

“yauvanaṃ bālyaṃ śarīraṃ drava saṃ ca yāḥ |

bhāvādbhāvāṃtaraṃ yāṃti taraṃga vadanārataṃ” (yōgavāsiṣṭamu- 28 - 10)

(bālyamu, yauvanamu, śarīramu, dravamulu, inanniyu anityamulu, ellapuḍu uṃḍunavikāvu. keraṭamulavale ellapuḍu mārpunu ceṃdi, iṃkoka rūpamugā mārucuṃḍunavi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.