← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్నం annaṃ

Original — తెలుగు

“అద్యతే భుజ్యతే ఇత్యన్నం” (శ్రీశంకరః)

(భుజింపబడుచున్నది కనుక అన్నము.)

“అద్యతే (అ) త్తి భూతాని, తస్మాదన్నం తదుచ్యతే”(తైత్తిరీయోపనిషత్.) ఉప జీవ్యత్వమేవాద్యత్వం.

(తినబడుచున్నది కనుక అన్నము అని చెప్పబడుచున్నది. భూతములను తినుచున్నదికనుక అన్నమని చెప్పబడుచున్నది. తినబడుచున్నదని చేప్పుటచేత జీవింపచేయుట అని అర్థము.)

యస్మాత్ భూతైరాద్యతే, భూతాన్యత్తిచేతి తస్మాదన్నం తదుచ్యతే.

(భూతములచేత తినబడుచున్నది, భూతములను తినుచున్నది కనుక అన్నము అని చెప్పబడుచున్నది.)

అద్యతే భుజ్యతే చైవ యద్భూతైరన్నమత్తిచ| భూతాని చ స్వయం యస్మాత్ తస్మాదన్నం తదుచ్యతే ||“.

(భూతములచేత తినబడుచున్నది కనుక అన్నము; భూతములను స్వయముగా తినుచున్నది కనుక అన్నము అని చెప్పబడుచున్నది.)

అద్యతే, అత్తిచ భూతాని ఇతి భోగ్య భోక్తృ రూపచేతనాచేతన సంఘాత లక్షణం.

(తినబడుచున్నది; భూతములను తినుచున్నది అని చెప్పుటచేత భోగ్యమగు వస్తువులు, భోగించునవి (భోక్త అనునవి) అయిన సమస్త చరాచర రూపమైన జీవ సముదాయము చెప్పబడినది. ఎందుచేతననగా ఒక జీవి ఇంకొక జీవికి ఆహారము. అచరములైన లతాదులు చరములైన పశు, పక్షి, మానవాదులకు ఆహారము. చిన్నచిన్న పశుపక్ష్యాదులు పెద్ద పెద్దవాటికి - మానవులకు ఆహారము - సాధుజంతువులు, మానవులు క్రూరమృగములకు అహారము. ఈ ప్రకారముగా ప్రతిజీవిలోను భగవంతుడు ఉండుటవలన ఒకజీవి ఇంకొకజీవికి ఆహారము - (చూడుము - ‘జీవుడు’.)

(పైన 1 మొదలు 5 వరకు చెప్పినదాని అర్థమేమనగా -కార్యరూపమున భూతములచేత భక్షింపబడినది, కారణరూపమున భూతములను భక్షించునది.)

(one of the functions of the life cell is to eat its environment)

సమ్యక్ జ్ఞానే నాద్యతే ఇత్యస్య శబ్దేన మాయా తత్కార్యముచ్యతే.

(సమ్యక్ జ్ఞానముచే నాలోచింపగా ‘అద్యతే’ (తినబడుచున్నది) అని చెప్పుటచేత మాయ, దానిచే సృష్టింపబడిన అనగా, ప్రకృతిలోనుండి దాని పరిణామములుగా పుట్టిన సకల చరాచరవస్తురూపమైన సర్వప్రపంచము అని అర్థమగుచున్నది.)

జీవన దశాయాం స్వయం అద్యతే,నాశదశా యాం అలభ్యమనత యా వా, విపరీతపరిణామ హేతు తయావా, అతృత్వలక్షణం, సంహర్తృత్వం ద్రష్టవ్యం.” (శ్రీరంగరామానుజః)

(జీవించియున్నపుడు స్వయముగా తినబడుచున్నది, వినాశమునొందునపుడు, కనబడకపోవుటచేత, లేక, విపరీతమైన పరిణామమునందుటచేత - మార్పుచెందుటచేత - సంహరింపబడినట్లు అగుటచేత ‘అద్యతే’; అని చెప్పబడుచున్నది.)

అజ్యతే భుజ్యతే సర్వైరితి సర్వప్రతిపత్తి సాధారణం స్థూలదేహ కారణం భూతపంచకం, విరాట్సంజ్ఞికం అన్న శబ్దేన ఉచ్యతే - తస్య భూత భౌతిక కారణత్వాత్.

(అందరిచేతను, అన్నింటిచేతను తినబడుచున్నది అని చెప్పుటచేత స్థూలదేహమునకు కారణమైన పంచభూత సంఘాతమైన విరాట్ అని చెప్పబడుచున్నది. (వివిధ రూపములుగా పరిణమించుచున్నది విరాట్.) స్థూలభూతములకు వాటికి కారణములయినవాటికి అన్నింటికి కారణమయినది విరాట్స్వరూపము.)

“అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ ఇత్యన్నాత్ హి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి, అన్నం ప్రయంతి అభిసంవిశంతి” (తైత్తిరీయోపనిషత్)

(అన్నమువలననే ఈ భూతములు పుట్టుచున్నవి, అట్లు పుట్టినవి అన్నమువలననే జీవించుచున్నవి, అన్నములోనే లయమగుచున్నవి - దానిలోనే ప్రవేశించి ఏకమగుచున్నవి.)

(“యతః సర్వాణి భూతాని జాయంతే, యాని జాతాని జీవంతి, యస్మిన్నప్యేతి, అభిసం విశంతి” అని పరమాత్మ ప్రపంచము యొక్క సృష్టి స్థితిలయములకు కారణమని చెప్పబడినది. ఆ ప్రకారముగానే అన్నమువలననే ప్రపంచ సృష్టిస్థితిలయములు చెప్పబడినవి. అందుచేత అన్నమనగా పరబ్రహ్మస్వరూపమే అని ఉపాసించవలెను.)

“అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే, అన్నేనైన జీవంతి” (తైత్తిరీయోపనిషత్)

(అన్నమువలననే ప్రజలుపుట్టుచున్నారు; అన్నమువలననే జీవించుచున్నారు - అని తైత్తరీయోపనిషత్ చెప్పుచున్నది.)

“అన్న ప్రభవాః అన్న జీవనాః, అన్న ప్రలయాశ్చ సర్వాః ప్రజాః, తస్మాత్ అన్నం సర్వౌషధం, సర్వప్రాణినాం దేహ దాహ ప్రశమనం అన్నం ఉచ్యతే”.

(ప్రజలందరు అన్నమువలన పుట్టినవారు, అన్నము తినుటవలన జీవించియున్నారు. అన్నము వలననే నశించుచున్నారు - అందుచేత ప్రాణులందరకు అన్నము సర్వౌషధము దేహదాహమును శమింపచేయును -

“అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః” (శ్రీమద్భగవద్గీత- 3 - 14)

వర్షముపడుటవలన సస్యములు (అన్నము) కలుగుచున్నవి, ఆ సస్యములు తిని భూతములు - మానవులు, పశువులు, పక్షులు మొదలగునవి, జీవముకలవి - వృద్ధిపొందుచున్నవి.ఆ అన్నము శరీరమునకు పడనియడల - తినకూడని అన్నము తినరాని విధముగా తినినయడల రోగము కలిగి ఆ జీవులు చనిపోవుచుందురు. అన్ని జీవులలోను అన్నమే ఉండుటవలన - రూపము మారియుండుటవలన, రక్తమాంసములుగా మారియుండుటవలన - ఒకజీవి ఇంకొక జీవికి అన్నమగుచున్నది. జాగ్రత్తగా వాడి తినినయడల అన్నమే అమృతము, అజాగ్రత్తవలన అన్నమే విషము.)

యే “అన్నం బ్రహ్మ” యధోక్తం ఉపాసతే - కధం? అన్నజో, అన్నాత్మా అన్న ప్రళయోహం తస్మాత్ “అన్నం బ్రహ్మేతి” కుతః పునస్సర్వాన్న ప్రాప్తి ఫలం అన్నాత్మోపాసనమితి ఉచ్యతే.

(శాస్త్రములో చెప్పిన ప్రకారము అన్నము బ్రహ్మ అని ఎవరు ఉపాసించుచున్నారో - అనునది ఏ ప్రకారమనగా - నేను అన్నము నుండి పుట్టినవాడను, అన్నమయమైన శరీరము గలవాడను, అన్నములోనే లయమును పొందువాడను, అందుచేత అన్నము బ్రహ్మమే అని ఎవరు ఉపాసించెదరో - అని.దీనికి కారణమేమనగా అన్నమే ఆత్మయని ఉపాసించుటవలన అన్ని విధములైన అన్నము ప్రాప్తించుటయే ఫలము. )

వ్రీహి యవాది లక్షణం. (తినబడు ధాన్యములు మొదలగువాటి లక్షణముకలది అన్నము.)

అన్నమోదనాపూపవ్యం జనాది రూపం. (పిండివంటలు మొదలగునవి అన్నము.)

స్థావరాణి (కదలనివి, అచరములు అయిన వృక్ష లతాదులు - ఇవి కదిలే జీవులకు ఆహారము.)

రసాది భావ మాపన్నం అన్నం. (రసము మొదలగువాటివలె పరిణమించినవి, మారినవి.)

“చరాచర మన్న మచరాః” (మనుః)

(కాళ్ళు, చేతులు కలిగిన భూతములకు కాళ్ళు, చేతులు లేని వృక్షాదులు, లతాదులు అన్నము - అహారము.)

“సీ. ఆదికాలంబున నా ప్రజాపతి పతి యయిన లోకేశ్వరుం డచ్యుతుండు

పద్మనేత్రుడు వనస్పతుల నోషధిముఖ్యజాతంబు నిషము (ఇష్టము) నూర్జంబు (బలము) గోరి

కల్పించె నందు ముఖ్యం బైన యన్నంబు నచరంబు లైనట్టి యపద మెల్ల

బాదచారులకును బాల్వెట్టి, యిరుగాళ్ళు చేతులు కలిగిన జీవతతికి

తే. హస్తములు లేని యా చతుష్పాదు లెల్ల

నన్నముగ బూని కావించె ---“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 6 - 4 - 198)

(సృష్టి ప్రారంభమున భగవంతుడు ఔషధులను, వనస్పతులను సృష్టించెను - పాదములు లేనివాటిని పాదములు గలవాటికి అన్నముగ - అహారముగా - చేసెను. కాళ్ళు చేతులు గలవాటికి చేతులులేని చతుష్పద జంతువులను ఆహారముగ చేసెను.)

“వ. --- కరంబులుగల జంతువులకు గరంబులు లేని చతుష్పదాదు లాహారంబులగు, చరణంబులు గల ప్రాణులకు జరణంబులులేని తృణాదులు భక్షణీయంబులగు. అధికజన్మంబులుగల వ్యాఘ్రాదులకు నల్ప జన్మంబుగల మృగాదులు భోజ్యంబులగు. సకల దేహిదేహంబులందును జీవుండు గలుగుటంజేసి జీవునికి జీవుండ జీవికయగు. సహస్తా సహస్తాది రూపంబైన విశ్వమంతయు నీశ్వరుండుగా దెలియుము. అతనికి వేఱు లేదు ---”.

(శ్రీమదాంధ్ర మహాభాగవతము- 1 - 13 - 323)

“అన్నాద్రసః, రసాచ్ఛోణితం, శోణితాత్ మాంసః, మాంసా ద్మేధః, మేధసస్స్నాయః, స్నాయుభ్యో అస్థీని, అస్థిభ్యో మజ్జా, మజ్జయాః శుక్లః”.

(అన్నమునుండి రసము, రసమునుండి శోణితము, శోణితమునుండి మాంసము, మాంసమునుండి మేధస్సు, మేధస్సునుండి స్నాయువు, స్నాయువువలన అస్థి, అస్తికలనుండి మజ్జా, దానినుండి శుక్లము కలుగుచున్నవి - అనగా, అన్నమే శరీరములో ఇన్ని పదార్థములుగా మారుచున్నది.)

పంచాత్మకం, పంచసువర్తమానం, షడాశ్రయం, షడ్గుణ యోగయుక్తం |

తం సప్తధాతుం, త్రిమలం, ద్వియోనిం చతుర్విధాహరమిదం శరీరం ||“.

(పంచభూతముల కలయికవలన కలిగిన శరీరములు కలిగిన స్త్రీ పురుషులు మధుర, ఆమ్ల, లవణ, తిక్త, కషాయములను షడ్రసములు కలిగినటువంటి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములను నాలుగు విధములైన అన్నమును - ఆహారమును - భుజించుటవలన, ఆ భుజించిన అహారము - అన్నము - కాలక్రమమున పచనమై, రసరూపముగా మారి, సప్త ధాతువులుగల రేతస్సుగామారును. ఈ రేతస్సుసందు జీవుడుండును - అనగా, ఇన్ని పరిణామములు చెందిన తర్వాత జీవుడు నివసించుటకు తగిన వాతవరణము - పరిస్థితి - ఏర్పడును.)

“పూర్వ రూప పరిత్యాగేన రూపాంతరప్రాప్తి పరిణామః, క్షీరం దధ్యాకారేణ పరిణమతే” -

(ఇదివరకు ఉన్న రూపమును వదలి మఱియొక రూపమును పొందుటయే పరిణామము - మార్పు. పాలు పెరుగువలెమారుట పరిణామము. ఈ ప్రకారముగానే అన్నరసము అనేకవిధములుగా పరిణమించి - మార్పులను చెంది, దేహముగా మారుచున్నది.)

“శుక్ర శోణితరూపేణ హ్యన్మాత్ పరిణతాత్కిల |

శరీరాణి ప్రజాయంతే, వృష్టేరన్నస్య జన్మచ ||“. (గీతాభావప్రకాశము- 3 -91)

(తినిన అన్నము శుక్లశోణితములుగా మారినందున శరీరములు పుట్టుచున్నవి, వర్షము కురియుటవలన సస్యములు మొలచి అన్నము కలుగుచున్నది.)

“యదద్యతే తదన్నం, యేనపచ్యతే సో (అ) యం పురుష శరీరే అంతరస్తి”.

(తినబడునది అన్నము. దానిని పచనముచేయు పురుషుడు శరీరములోనే ఉన్నాడు - వైశ్వానరుడు - తినబడు అన్నము భగవంతుడే, దానిని పచనముచేయువాడు భగవంతుడే. ‘అత్తి ఇతి ఆత్మా’ - తినువాడుకూడ భగవంతుడే.

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||“. (శ్రీమద్భగవద్గీత - 15 -14)

(నేను ప్రాణుల దేహములో వైశ్వానరుడను పేరుతో జఠరాగ్నినై ప్రాణాపాన వాయువులతో కూడిన వాడనై - ప్రాణాపానవాయువుల వృత్తి ద్వారా భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము అను నాలుగు విధముల అన్నమును పాకముచేసి, అవి అరుగుటకును, శరీరమంతటా వ్యాపించి పోషించుటకును, తగిన స్థితిలో నుండునటుల పరిణమింపచేయుదును - మార్పు కలుగచేయుదును.)

“సో (ఆ)పో (అ) భ్య తపత్తాభ్యో మూర్తి రజాయత |

యో వైమూర్తి రజాయతాన్నం వైతత్” (ఐతరేయోపనిషత్)

(భగవంతుడు నీటిలోనుండి నీటిని తన సత్తస్ఫూర్తిచే తపింప చేయగా ఒక ఆకారముతోనున్న వస్తువు పుట్టెను - అదియే అన్నము.)

భక్ష్య,భోజ్య, లేహ్య, చోష్య భేదైః అన్నం చతుర్విధం.

(భక్ష్యములని, భోజ్యములని, లేహ్యములని, చోష్యములని అన్నము నాలుగు విధములు -పళ్ళతో కొరికి తినబడు అపూసము మొదలగునవి భక్ష్యములు. నాలుకచేతనే పీల్చివేయబడునవి - పాయసము మొదలగునవి భోజ్యములు - నాలుకమీద వేసుకొని రసము రుచి చూచుచూ, ద్రవమువలె తయారైనవి - బెల్లము మొదలగునవి లేహ్యములు. పళ్ళతో నమిలి, రసమునే గ్రహించి, పిప్పిని వదలివేయవలసిన పదార్థములు - చెరుకు మొదలగునవి చోష్యములు - (చోష్యమనగా పీల్చబడినది) -.)

“అన్నమయం హి, సౌమ్య | మనః” ఇతి శ్రుతిః -

(మనస్సు అన్నమయం - అనగా మనము తినిన ఆహారము మనసుగా మారును -, మనము తినిన ఆహారమును బట్టి మన బుద్ధి తయారగును, మనసును బట్టి మనిషి ప్రవర్తన, నడవడి తయారగును - (Tell me what you eat and I shall tell you what you are.) (అన్నము మూడుభాగములుగా నుండును - అందులో అసారమైన భాగము పురీషముగా మారును, కొంచెముసారవంతమైనది మాంసముగా మారును, పూర్తిగా సారవంతమైనభాగము బుద్ధిగా మారును.)

అన్నము ఆత్మకాదు, అనాత్మవస్తువు. అందుచేత తయారయిన దేహము, ఇంద్రియములు, మనస్సు ఆత్మకాదు-అనాత్మ వస్తువులు-

అన్నమశనం ఖాదః ఇత్యన్నం త్రివిధం.

(అన్నము. అశనము, ఖాదము అని అన్నము మూడువిధములు.)

“త్యతోపి బుద్ధి రన్నస్య కార్యమేవ న సంశయః- |

అతోపి బుద్ధిమన్న స్యకార్యం త్యక్త్వా నివిక్త ధీః |

సర్వసాక్షిణి చిద్రూపే కార్యాన్నిత్యమహం మతిః ||“.

(బుద్ధి అన్నముయొక్క కార్యము - అన్నమువలన తయారైనది - సంశయములేదు - అందుచేత బుద్ధిని వదలి సర్వసాక్షి, చిద్రూపుడు అయిన భగవంతునియందు - అది నేనే - (అహం బ్రహ్మాస్మి) యని బుద్ధి - అభిప్రాయము - నిత్యము కలిగియుండవలెను.)

“ఆపశ్చన్నామ సృజంత” - (చాందోగ్యోపనిషత్- 6 - 2 - 4)

(ఉదకములు అన్నమును పుట్టించెను - ఉదకము అన్నమునకు కారణము.)

“క. ధృతివదలక యుగ్రస్థితి

బ్రతిదినమును బిడికెడవని రజమశనముగా

నీతి నియమముతో నా పశు

పతి శంకరు ఫాలనయను భర్గునుమేశున్

చెదరని నిజభక్తిని భజియించిన - - - “. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10 - ఉ.భా. - 332)

(అన్నమువంతు భూమి ధూళినే అన్నముగా తిని స్వాల్వుడు శివుని సేవించెను -శ్రీ కృష్ణుడు యశోదకు తన విశ్వరూపమును నోటిలో చూపెట్ట తలచి మట్టి తినెను. మట్టియే చెట్టుయొక్క శరీరముగామారును. అందుచేత మట్టిలోనుండి పుట్టు అన్నమువంతు మట్టినే తినుట అట్టి మహాత్ములకే సాధ్యముకాని ఇతరులకు కాదు.)

“అగ్నౌ ప్రాప్తా హుతిః సమ్యగాదిత్యముపతిష్టతే |

ఆదిత్యా జ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజాః |

సూక్ష్మీ ధర్మః యజ్ఞాఖ్య ఋత్విగా దేశ్చ కర్మణః |

అపూర్వాఖ్యస్య యజ్ఞస్య విహితం కర్మకారణం ||“. (గీతాభావప్రకాశము- 3 - 92 to 94)

(అగ్నియందు ఆహుతి చేయబడినది సూర్యుని చేరుచున్నది, సూర్యునివలన వర్షము కురియుచున్నది. వర్షము పడుటవలన సస్యములు మొలుచుచున్నవి. ఆ సస్యములే అన్నముగా మారుచున్నవి. ఈ ప్రకారముగా యజ్ఞమునకు, అన్నమునకు గల పరంపర సంబంధము సూక్ష్మ ధర్మము - దీని పేరు యజ్ఞము, అపూర్వము అను యజ్ఞము - ఈ యజ్ఞము చేయువారు, చేయించువారు ఋత్విగాదులు చేయుకర్మ ఫలితముగా గలిగినది. ఇది సూక్ష్మమగుటచేత సామాన్య దృష్టి, సామాన్య జ్ఞానమునకు గోచరముకాదు - సూక్ష్మాతి సూక్ష్మములను చూడగలుగు శక్తిగల సూక్ష్మదర్శినులకు మాత్రమే కనుగొన నగును.)

“ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజ యేత్|”.

(శత్రువు పెట్టిన అన్నము తినకూడదు - శత్రువునకు అన్నము పెట్టరాదు)

Transliteration

“adyatē bhujyatē ityannaṃ” (śrīśaṃkaraḥ)

(bhujiṃpabaḍucunnadi kanuka annamu.)

“adyatē (a) tti bhūtāni, tasmādannaṃ taducyatē”(taittirīyōpaniṣat.) upa jīvyatvamēvādyatvaṃ.

(tinabaḍucunnadi kanuka annamu ani ceppabaḍucunnadi. bhūtamulanu tinucunnadikanuka annamani ceppabaḍucunnadi. tinabaḍucunnadani cēppuṭacēta jīviṃpacēyuṭa ani arthamu.)

yasmāt bhūtairādyatē, bhūtānyatticēti tasmādannaṃ taducyatē.

(bhūtamulacēta tinabaḍucunnadi, bhūtamulanu tinucunnadi kanuka annamu ani ceppabaḍucunnadi.)

adyatē bhujyatē caiva yadbhūtairannamattica| bhūtāni ca svayaṃ yasmāt tasmādannaṃ taducyatē ||“.

(bhūtamulacēta tinabaḍucunnadi kanuka annamu; bhūtamulanu svayamugā tinucunnadi kanuka annamu ani ceppabaḍucunnadi.)

adyatē, attica bhūtāni iti bhōgya bhōktṛ rūpacētanācētana saṃghāta lakṣaṇaṃ.

(tinabaḍucunnadi; bhūtamulanu tinucunnadi ani ceppuṭacēta bhōgyamagu vastuvulu, bhōgiṃcunavi (bhōkta anunavi) ayina samasta carācara rūpamaina jīva samudāyamu ceppabaḍinadi. eṃducētananagā oka jīvi iṃkoka jīviki āhāramu. acaramulaina latādulu caramulaina paśu, pakṣi, mānavādulaku āhāramu. cinnacinna paśupakṣyādulu pedda peddavāṭiki - mānavulaku āhāramu - sādhujaṃtuvulu, mānavulu krūramṛgamulaku ahāramu. ī prakāramugā pratijīvilōnu bhagavaṃtuḍu uṃḍuṭavalana okajīvi iṃkokajīviki āhāramu - (cūḍumu - ‘jīvuḍu’.)

(paina 1 modalu 5 varaku ceppinadāni arthamēmanagā -kāryarūpamuna bhūtamulacēta bhakṣiṃpabaḍinadi, kāraṇarūpamuna bhūtamulanu bhakṣiṃcunadi.)

(one of the functions of the life cell is to eat its environment)

samyak jñānē nādyatē ityasya śabdēna māyā tatkāryamucyatē.

(samyak jñānamucē nālōciṃpagā ‘adyatē’ (tinabaḍucunnadi) ani ceppuṭacēta māya, dānicē sṛṣṭiṃpabaḍina anagā, prakṛtilōnuṃḍi dāni pariṇāmamulugā puṭṭina sakala carācaravasturūpamaina sarvaprapaṃcamu ani arthamagucunnadi.)

jīvana daśāyāṃ svayaṃ adyatē,nāśadaśā yāṃ alabhyamanata yā vā, viparītapariṇāma hētu tayāvā, atṛtvalakṣaṇaṃ, saṃhartṛtvaṃ draṣṭavyaṃ.” (śrīraṃgarāmānujaḥ)

(jīviṃciyunnapuḍu svayamugā tinabaḍucunnadi, vināśamunoṃdunapuḍu, kanabaḍakapōvuṭacēta, lēka, viparītamaina pariṇāmamunaṃduṭacēta - mārpuceṃduṭacēta - saṃhariṃpabaḍinaṭlu aguṭacēta ‘adyatē’; ani ceppabaḍucunnadi.)

ajyatē bhujyatē sarvairiti sarvapratipatti sādhāraṇaṃ sthūladēha kāraṇaṃ bhūtapaṃcakaṃ, virāṭsaṃjñikaṃ anna śabdēna ucyatē - tasya bhūta bhautika kāraṇatvāt.

(aṃdaricētanu, anniṃṭicētanu tinabaḍucunnadi ani ceppuṭacēta sthūladēhamunaku kāraṇamaina paṃcabhūta saṃghātamaina virāṭ ani ceppabaḍucunnadi. (vividha rūpamulugā pariṇamiṃcucunnadi virāṭ.) sthūlabhūtamulaku vāṭiki kāraṇamulayinavāṭiki anniṃṭiki kāraṇamayinadi virāṭsvarūpamu.)

“annaṃ brahmēti vyajānāt ityannāt hi ēva khalu imāni bhūtāni jāyaṃtē, annēna jātāni jīvaṃti, annaṃ prayaṃti abhisaṃviśaṃti” (taittirīyōpaniṣat)

(annamuvalananē ī bhūtamulu puṭṭucunnavi, aṭlu puṭṭinavi annamuvalananē jīviṃcucunnavi, annamulōnē layamagucunnavi - dānilōnē pravēśiṃci ēkamagucunnavi.)

(“yataḥ sarvāṇi bhūtāni jāyaṃtē, yāni jātāni jīvaṃti, yasminnapyēti, abhisaṃ viśaṃti” ani paramātma prapaṃcamu yokka sṛṣṭi sthitilayamulaku kāraṇamani ceppabaḍinadi. ā prakāramugānē annamuvalananē prapaṃca sṛṣṭisthitilayamulu ceppabaḍinavi. aṃducēta annamanagā parabrahmasvarūpamē ani upāsiṃcavalenu.)

“annādvai prajāḥ prajāyaṃtē, annēnaina jīvaṃti” (taittirīyōpaniṣat)

(annamuvalananē prajalupuṭṭucunnāru; annamuvalananē jīviṃcucunnāru - ani taittarīyōpaniṣat ceppucunnadi.)

“anna prabhavāḥ anna jīvanāḥ, anna pralayāśca sarvāḥ prajāḥ, tasmāt annaṃ sarvauṣadhaṃ, sarvaprāṇināṃ dēha dāha praśamanaṃ annaṃ ucyatē”.

(prajalaṃdaru annamuvalana puṭṭinavāru, annamu tinuṭavalana jīviṃciyunnāru. annamu valananē naśiṃcucunnāru - aṃducēta prāṇulaṃdaraku annamu sarvauṣadhamu dēhadāhamunu śamiṃpacēyunu -

“annādbhavaṃti bhūtāni parjanyādanna saṃbhavaḥ” (śrīmadbhagavadgīta- 3 - 14)

varṣamupaḍuṭavalana sasyamulu (annamu) kalugucunnavi, ā sasyamulu tini bhūtamulu - mānavulu, paśuvulu, pakṣulu modalagunavi, jīvamukalavi - vṛddhipoṃducunnavi.ā annamu śarīramunaku paḍaniyaḍala - tinakūḍani annamu tinarāni vidhamugā tininayaḍala rōgamu kaligi ā jīvulu canipōvucuṃduru. anni jīvulalōnu annamē uṃḍuṭavalana - rūpamu māriyuṃḍuṭavalana, raktamāṃsamulugā māriyuṃḍuṭavalana - okajīvi iṃkoka jīviki annamagucunnadi. jāgrattagā vāḍi tininayaḍala annamē amṛtamu, ajāgrattavalana annamē viṣamu.)

yē “annaṃ brahma” yadhōktaṃ upāsatē - kadhaṃ? annajō, annātmā anna praḷayōhaṃ tasmāt “annaṃ brahmēti” kutaḥ punassarvānna prāpti phalaṃ annātmōpāsanamiti ucyatē.

(śāstramulō ceppina prakāramu annamu brahma ani evaru upāsiṃcucunnārō - anunadi ē prakāramanagā - nēnu annamu nuṃḍi puṭṭinavāḍanu, annamayamaina śarīramu galavāḍanu, annamulōnē layamunu poṃduvāḍanu, aṃducēta annamu brahmamē ani evaru upāsiṃcedarō - ani.dīniki kāraṇamēmanagā annamē ātmayani upāsiṃcuṭavalana anni vidhamulaina annamu prāptiṃcuṭayē phalamu. )

vrīhi yavādi lakṣaṇaṃ. (tinabaḍu dhānyamulu modalaguvāṭi lakṣaṇamukaladi annamu.)

annamōdanāpūpavyaṃ janādi rūpaṃ. (piṃḍivaṃṭalu modalagunavi annamu.)

sthāvarāṇi (kadalanivi, acaramulu ayina vṛkṣa latādulu - ivi kadilē jīvulaku āhāramu.)

rasādi bhāva māpannaṃ annaṃ. (rasamu modalaguvāṭivale pariṇamiṃcinavi, mārinavi.)

“carācara manna macarāḥ” (manuḥ)

(kāḷḷu, cētulu kaligina bhūtamulaku kāḷḷu, cētulu lēni vṛkṣādulu, latādulu annamu - ahāramu.)

“sī. ādikālaṃbuna nā prajāpati pati yayina lōkēśvaruṃ ḍacyutuṃḍu

padmanētruḍu vanaspatula nōṣadhimukhyajātaṃbu niṣamu (iṣṭamu) nūrjaṃbu (balamu) gōri

kalpiṃce naṃdu mukhyaṃ baina yannaṃbu nacaraṃbu lainaṭṭi yapada mella

bādacārulakunu bālveṭṭi, yirugāḷḷu cētulu kaligina jīvatatiki

tē. hastamulu lēni yā catuṣpādu lella

nannamuga būni kāviṃce ---“. (śrīmadāṃdhra mahābhāgavatamu- 6 - 4 - 198)

(sṛṣṭi prāraṃbhamuna bhagavaṃtuḍu auṣadhulanu, vanaspatulanu sṛṣṭiṃcenu - pādamulu lēnivāṭini pādamulu galavāṭiki annamuga - ahāramugā - cēsenu. kāḷḷu cētulu galavāṭiki cētululēni catuṣpada jaṃtuvulanu āhāramuga cēsenu.)

“va. --- karaṃbulugala jaṃtuvulaku garaṃbulu lēni catuṣpadādu lāhāraṃbulagu, caraṇaṃbulu gala prāṇulaku jaraṇaṃbululēni tṛṇādulu bhakṣaṇīyaṃbulagu. adhikajanmaṃbulugala vyāghrādulaku nalpa janmaṃbugala mṛgādulu bhōjyaṃbulagu. sakala dēhidēhaṃbulaṃdunu jīvuṃḍu galuguṭaṃjēsi jīvuniki jīvuṃḍa jīvikayagu. sahastā sahastādi rūpaṃbaina viśvamaṃtayu nīśvaruṃḍugā deliyumu. ataniki vēṟu lēdu ---”.

(śrīmadāṃdhra mahābhāgavatamu- 1 - 13 - 323)

“annādrasaḥ, rasācchōṇitaṃ, śōṇitāt māṃsaḥ, māṃsā dmēdhaḥ, mēdhasassnāyaḥ, snāyubhyō asthīni, asthibhyō majjā, majjayāḥ śuklaḥ”.

(annamunuṃḍi rasamu, rasamunuṃḍi śōṇitamu, śōṇitamunuṃḍi māṃsamu, māṃsamunuṃḍi mēdhassu, mēdhassunuṃḍi snāyuvu, snāyuvuvalana asthi, astikalanuṃḍi majjā, dāninuṃḍi śuklamu kalugucunnavi - anagā, annamē śarīramulō inni padārthamulugā mārucunnadi.)

paṃcātmakaṃ, paṃcasuvartamānaṃ, ṣaḍāśrayaṃ, ṣaḍguṇa yōgayuktaṃ |

taṃ saptadhātuṃ, trimalaṃ, dviyōniṃ caturvidhāharamidaṃ śarīraṃ ||“.

(paṃcabhūtamula kalayikavalana kaligina śarīramulu kaligina strī puruṣulu madhura, āmla, lavaṇa, tikta, kaṣāyamulanu ṣaḍrasamulu kaliginaṭuvaṃṭi bhakṣya bhōjya lēhya cōṣyamulanu nālugu vidhamulaina annamunu - āhāramunu - bhujiṃcuṭavalana, ā bhujiṃcina ahāramu - annamu - kālakramamuna pacanamai, rasarūpamugā māri, sapta dhātuvulugala rētassugāmārunu. ī rētassusaṃdu jīvuḍuṃḍunu - anagā, inni pariṇāmamulu ceṃdina tarvāta jīvuḍu nivasiṃcuṭaku tagina vātavaraṇamu - paristhiti - ērpaḍunu.)

“pūrva rūpa parityāgēna rūpāṃtaraprāpti pariṇāmaḥ, kṣīraṃ dadhyākārēṇa pariṇamatē” -

(idivaraku unna rūpamunu vadali maṟiyoka rūpamunu poṃduṭayē pariṇāmamu - mārpu. pālu peruguvalemāruṭa pariṇāmamu. ī prakāramugānē annarasamu anēkavidhamulugā pariṇamiṃci - mārpulanu ceṃdi, dēhamugā mārucunnadi.)

“śukra śōṇitarūpēṇa hyanmāt pariṇatātkila |

śarīrāṇi prajāyaṃtē, vṛṣṭērannasya janmaca ||“. (gītābhāvaprakāśamu- 3 -91)

(tinina annamu śuklaśōṇitamulugā mārinaṃduna śarīramulu puṭṭucunnavi, varṣamu kuriyuṭavalana sasyamulu molaci annamu kalugucunnadi.)

“yadadyatē tadannaṃ, yēnapacyatē sō (a) yaṃ puruṣa śarīrē aṃtarasti”.

(tinabaḍunadi annamu. dānini pacanamucēyu puruṣuḍu śarīramulōnē unnāḍu - vaiśvānaruḍu - tinabaḍu annamu bhagavaṃtuḍē, dānini pacanamucēyuvāḍu bhagavaṃtuḍē. ‘atti iti ātmā’ - tinuvāḍukūḍa bhagavaṃtuḍē.

“ahaṃ vaiśvānarō bhūtvā prāṇināṃ dēhamāśritaḥ |

prāṇāpāna samāyuktaḥ pacāmyannaṃ caturvidhaṃ ||“. (śrīmadbhagavadgīta - 15 -14)

(nēnu prāṇula dēhamulō vaiśvānaruḍanu pērutō jaṭharāgninai prāṇāpāna vāyuvulatō kūḍina vāḍanai - prāṇāpānavāyuvula vṛtti dvārā bhakṣyamu, bhōjyamu, lēhyamu, cōṣyamu anu nālugu vidhamula annamunu pākamucēsi, avi aruguṭakunu, śarīramaṃtaṭā vyāpiṃci pōṣiṃcuṭakunu, tagina sthitilō nuṃḍunaṭula pariṇamiṃpacēyudunu - mārpu kalugacēyudunu.)

“sō (ā)pō (a) bhya tapattābhyō mūrti rajāyata |

yō vaimūrti rajāyatānnaṃ vaitat” (aitarēyōpaniṣat)

(bhagavaṃtuḍu nīṭilōnuṃḍi nīṭini tana sattasphūrticē tapiṃpa cēyagā oka ākāramutōnunna vastuvu puṭṭenu - adiyē annamu.)

bhakṣya,bhōjya, lēhya, cōṣya bhēdaiḥ annaṃ caturvidhaṃ.

(bhakṣyamulani, bhōjyamulani, lēhyamulani, cōṣyamulani annamu nālugu vidhamulu -paḷḷatō koriki tinabaḍu apūsamu modalagunavi bhakṣyamulu. nālukacētanē pīlcivēyabaḍunavi - pāyasamu modalagunavi bhōjyamulu - nālukamīda vēsukoni rasamu ruci cūcucū, dravamuvale tayārainavi - bellamu modalagunavi lēhyamulu. paḷḷatō namili, rasamunē grahiṃci, pippini vadalivēyavalasina padārthamulu - ceruku modalagunavi cōṣyamulu - (cōṣyamanagā pīlcabaḍinadi) -.)

“annamayaṃ hi, saumya | manaḥ” iti śrutiḥ -

(manassu annamayaṃ - anagā manamu tinina āhāramu manasugā mārunu -, manamu tinina āhāramunu baṭṭi mana buddhi tayāragunu, manasunu baṭṭi maniṣi pravartana, naḍavaḍi tayāragunu - (Tell me what you eat and I shall tell you what you are.) (annamu mūḍubhāgamulugā nuṃḍunu - aṃdulō asāramaina bhāgamu purīṣamugā mārunu, koṃcemusāravaṃtamainadi māṃsamugā mārunu, pūrtigā sāravaṃtamainabhāgamu buddhigā mārunu.)

annamu ātmakādu, anātmavastuvu. aṃducēta tayārayina dēhamu, iṃdriyamulu, manassu ātmakādu-anātma vastuvulu-

annamaśanaṃ khādaḥ ityannaṃ trividhaṃ.

(annamu. aśanamu, khādamu ani annamu mūḍuvidhamulu.)

“tyatōpi buddhi rannasya kāryamēva na saṃśayaḥ- |

atōpi buddhimanna syakāryaṃ tyaktvā nivikta dhīḥ |

sarvasākṣiṇi cidrūpē kāryānnityamahaṃ matiḥ ||“.

(buddhi annamuyokka kāryamu - annamuvalana tayārainadi - saṃśayamulēdu - aṃducēta buddhini vadali sarvasākṣi, cidrūpuḍu ayina bhagavaṃtuniyaṃdu - adi nēnē - (ahaṃ brahmāsmi) yani buddhi - abhiprāyamu - nityamu kaligiyuṃḍavalenu.)

“āpaścannāma sṛjaṃta” - (cāṃdōgyōpaniṣat- 6 - 2 - 4)

(udakamulu annamunu puṭṭiṃcenu - udakamu annamunaku kāraṇamu.)

“ka. dhṛtivadalaka yugrasthiti

bratidinamunu biḍikeḍavani rajamaśanamugā

nīti niyamamutō nā paśu

pati śaṃkaru phālanayanu bhargunumēśun

cedarani nijabhaktini bhajiyiṃcina - - - “. (śrīmadāṃdhra mahābhāgavatamu - 10 - u.bhā. - 332)

(annamuvaṃtu bhūmi dhūḷinē annamugā tini svālvuḍu śivuni sēviṃcenu -śrī kṛṣṇuḍu yaśōdaku tana viśvarūpamunu nōṭilō cūpeṭṭa talaci maṭṭi tinenu. maṭṭiyē ceṭṭuyokka śarīramugāmārunu. aṃducēta maṭṭilōnuṃḍi puṭṭu annamuvaṃtu maṭṭinē tinuṭa aṭṭi mahātmulakē sādhyamukāni itarulaku kādu.)

“agnau prāptā hutiḥ samyagādityamupatiṣṭatē |

ādityā jjāyatē vṛṣṭirvṛṣṭērannaṃ tataḥ prajāḥ |

sūkṣmī dharmaḥ yajñākhya ṛtvigā dēśca karmaṇaḥ |

apūrvākhyasya yajñasya vihitaṃ karmakāraṇaṃ ||“. (gītābhāvaprakāśamu- 3 - 92 to 94)

(agniyaṃdu āhuti cēyabaḍinadi sūryuni cērucunnadi, sūryunivalana varṣamu kuriyucunnadi. varṣamu paḍuṭavalana sasyamulu molucucunnavi. ā sasyamulē annamugā mārucunnavi. ī prakāramugā yajñamunaku, annamunaku gala paraṃpara saṃbaṃdhamu sūkṣma dharmamu - dīni pēru yajñamu, apūrvamu anu yajñamu - ī yajñamu cēyuvāru, cēyiṃcuvāru ṛtvigādulu cēyukarma phalitamugā galiginadi. idi sūkṣmamaguṭacēta sāmānya dṛṣṭi, sāmānya jñānamunaku gōcaramukādu - sūkṣmāti sūkṣmamulanu cūḍagalugu śaktigala sūkṣmadarśinulaku mātramē kanugona nagunu.)

“dviṣadannaṃ na bhōktavyaṃ dviṣaṃtaṃ naiva bhōja yēt|”.

(śatruvu peṭṭina annamu tinakūḍadu - śatruvunaku annamu peṭṭarādu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.