← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అణోరణీయాన్ aṇōraṇīyān

Original — తెలుగు
  1. (చూడుము :- ‘అణీయాన్’ ; ‘అణుతరం’)

  2. అణుభ్యోపి శ్యామాకాదిభ్యోపి అణిష్టం,సూక్ష్మతయా సర్వాంతః ప్రవేశయోగ్యం ఇత్యర్ధః. (శ్రీరంగరామానుజః)

(చాలచిన్నది అయిన శ్యామాకాదులకన్న - ధాన్యపుగింజ కన్న - చిన్నది. అంత అత్యంత సూక్ష్మముగా నుండుటవలన అన్నిటిలోన ప్రవేశించి యుండుటకు తగియున్నది. “తత్ సృష్ట్యా తదేవాను ప్రావిశత్” అని శ్రుతి - దానిని- లోకములను - సృష్టించి దానిలోనే ప్రవేశించెను, అనగా సృష్టించిన ప్రతి వస్తువులోను ప్రవేశించియున్నాడు. “ఏష ఆత్మా అంతర్హృదయే అణీయాన్ వ్రీహేర్వా” ఇత్యాది శ్రితేః - ఈ ఆత్మ హృదయములోపల వ్రీహి ధాన్యపుగింజ కన్న చిన్నదిగా నున్నది.

  1. అణోః సర్వచేతనాపేక్షయా సూక్ష్మాత్ చేతనాత్ అణుతరః, తతోపిసూక్ష్మః - తదంత ప్రవేశయోగ్యః ఇత్యర్ధః

(సమస్తమైన చేతనవస్తులకన్న సూక్ష్మమైనది, చిన్నది, అణువు.అణువు కన్న సూక్ష్మమైనది - అణుతరమైనది - ఆత్మ - అణువులోపల కూడా ప్రవేశించి యుండుటకు సమర్ధమైనది కనుక.)

  1. ’అణోరణీయాన్’ఇత్యనేన ఆత్మనః దుర్లక్షత్వం, నతు దేహ పరిమితః.

(అణువు కన్న చిన్నది యను చెప్పుట. ఆత్మ కంటికి కనబడనది యని చెప్పుటకే. అంతే కాని ఆత్మ దేహముకలదనికాని, అణువంత దేహము కలదనికాని, అంతకంటె చిన్న దేహము కలదనికాని, దానికి దేహపరిమితి కలదనికాని చెప్పు టకుకాదు.)

  1. అత్యంత దుర్లక్షం.

(అణువు కన్న చిన్నది యనిచెప్పుటవలన చూచుటకు చాల కష్టమైనది అని చెప్పుటయే.)

  1. అతిసూక్ష్మం దుర్జ్ఞానత్వాత్. (దానిని గుఱించి ఏమియు తెలుసుకొనిఉటకు వీలులేనిది, అతి కష్టముమీద తెలుసుకొననగునది - మిక్కిలి సూక్ష్మమైనది.)

  2. అణోః బుద్ధ్యా దేః తులా, తత్కార్యమపి ‘అణీయాన్’. “అణుత్వం బుద్ధి నిష్టం స్యాన్మహత్వం ఖాది నిష్టితం ||” ఇతి స్మృతేః.

(అణువు అనగా బుద్ధిమొదలగువాటివలె చిన్నది - మహత్వము అనగా ఆకాశము మొదలగువాటివలె పెద్దది.)

  1. “అణోరణీయాం సమనుస్మ రేద్యః” (శ్రీమద్భగవద్గీత- 8 - 9)

(సూక్ష్మమైన అణువు కంటె సూక్ష్ముడు అగు భగవంతుని ధృడమైన మనస్సుతో మరణకాలమందు ఎవడు పదే పదే స్మరించునో అట్టివాడు పరపురుషుని పొందును.)

Transliteration
  1. (cūḍumu :- ‘aṇīyān’ ; ‘aṇutaraṃ’)

  2. aṇubhyōpi śyāmākādibhyōpi aṇiṣṭaṃ,sūkṣmatayā sarvāṃtaḥ pravēśayōgyaṃ ityardhaḥ. (śrīraṃgarāmānujaḥ)

(cālacinnadi ayina śyāmākādulakanna - dhānyapugiṃja kanna - cinnadi. aṃta atyaṃta sūkṣmamugā nuṃḍuṭavalana anniṭilōna pravēśiṃci yuṃḍuṭaku tagiyunnadi. “tat sṛṣṭyā tadēvānu prāviśat” ani śruti - dānini- lōkamulanu - sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu, anagā sṛṣṭiṃcina prati vastuvulōnu pravēśiṃciyunnāḍu. “ēṣa ātmā aṃtarhṛdayē aṇīyān vrīhērvā” ityādi śritēḥ - ī ātma hṛdayamulōpala vrīhi dhānyapugiṃja kanna cinnadigā nunnadi.

  1. aṇōḥ sarvacētanāpēkṣayā sūkṣmāt cētanāt aṇutaraḥ, tatōpisūkṣmaḥ - tadaṃta pravēśayōgyaḥ ityardhaḥ

(samastamaina cētanavastulakanna sūkṣmamainadi, cinnadi, aṇuvu.aṇuvu kanna sūkṣmamainadi - aṇutaramainadi - ātma - aṇuvulōpala kūḍā pravēśiṃci yuṃḍuṭaku samardhamainadi kanuka.)

  1. ’aṇōraṇīyān’ityanēna ātmanaḥ durlakṣatvaṃ, natu dēha parimitaḥ.

(aṇuvu kanna cinnadi yanu ceppuṭa. ātma kaṃṭiki kanabaḍanadi yani ceppuṭakē. aṃtē kāni ātma dēhamukaladanikāni, aṇuvaṃta dēhamu kaladanikāni, aṃtakaṃṭe cinna dēhamu kaladanikāni, dāniki dēhaparimiti kaladanikāni ceppu ṭakukādu.)

  1. atyaṃta durlakṣaṃ.

(aṇuvu kanna cinnadi yaniceppuṭavalana cūcuṭaku cāla kaṣṭamainadi ani ceppuṭayē.)

  1. atisūkṣmaṃ durjñānatvāt. (dānini guṟiṃci ēmiyu telusukoniuṭaku vīlulēnidi, ati kaṣṭamumīda telusukonanagunadi - mikkili sūkṣmamainadi.)

  2. aṇōḥ buddhyā dēḥ tulā, tatkāryamapi ‘aṇīyān’. “aṇutvaṃ buddhi niṣṭaṃ syānmahatvaṃ khādi niṣṭitaṃ ||” iti smṛtēḥ.

(aṇuvu anagā buddhimodalaguvāṭivale cinnadi - mahatvamu anagā ākāśamu modalaguvāṭivale peddadi.)

  1. “aṇōraṇīyāṃ samanusma rēdyaḥ” (śrīmadbhagavadgīta- 8 - 9)

(sūkṣmamaina aṇuvu kaṃṭe sūkṣmuḍu agu bhagavaṃtuni dhṛḍamaina manassutō maraṇakālamaṃdu evaḍu padē padē smariṃcunō aṭṭivāḍu parapuruṣuni poṃdunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.