అసత్యం (సత్యము కానిది;
అబద్దము.)
అయదార్థ వచనం.
(యధార్థముగా
పలికిన మాటకాదు; ఉన్నది ఉన్నట్లుగా, జరిగినది జరిగినట్టుగా చెప్పిన మాట కాదు.)
ఋతేతర విషయో హ్యనృత శబ్దః.
(ఋతము - సత్యము - కాని విషయము అనృతము.)
“ఋత వ్యతిరిక్తం
సాంసారికఫలం కర్మ అనృతం - బ్రహ్మప్రాప్తి విరోధి -”. (శ్రీరామానుజః)
(ఋతమునకు
- సత్యమునకు - వ్యతిరేకమై సంసారమునకు సంబంధించిన ఫలమునకు కారణమైన కర్మ - బ్రహ్మప్రాప్తికి -
బ్రహ్మను పొందుటకు అడ్డు తగులునది.
‘న’
ఇతి యదాహ తదేవానృతం - అనృతం ఆత్మనః. దేహస్యమూలం, - యథా వృక్షః ఉత్పాటితమూలః శుష్యతే అచిరాదేవ
ఉద్వర్తతే, పతతిచ; ఏవం నష్టం అనృతం ఆత్మా దేహః శుష్యేత్.
(‘లేదు’
అని అనుటయే అనృతము. అనృతము దేహమునకు మూలము - వేరులాంటిది. వేరుతో పెకలించిన చెట్టు ఏ
ప్రకారం శుష్కించి కొద్ది కాలము లోనే పడిపోవునో, ఆ ప్రకారము గానే ఎవని యందు అనృతము నశించునో వాడి
దేహము శుష్కించి నశించి పోవును.)
న ఋతం అనృతం -
(ఋతముకానిది - సత్యము కానిది అనృతము.)
మృగతృష్ణకాది తుల్యం
(ఎండమావులతో సమానమైనది.)
“ఆ. వారిజాక్షులందు
వైవాహికములందు
బ్రాణ విత్త మాన
భంగమందు
జకిత గోకులాగ్రజన్మ
రక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప
!” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 8 - 19 - 584)
“సీ. అంగీకరించిన
నఖిలంబు పోవుచో ననృతంబు గాదు లేదనిన నథిప !
యాత్మవృక్షము
మూలమనృతంబు నిశ్చయము ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 8 - 19 - 581)
Transliteration
asatyaṃ
(satyamu kānidi; abaddamu.)
ayadārtha vacanaṃ.
(yadhārthamugā
palikina māṭakādu; unnadi unnaṭlugā, jariginadi jariginaṭṭugā ceppina
māṭa kādu.)
ṛtētara
viṣayō hyanṛta śabdaḥ. (ṛtamu - satyamu - kāni viṣayamu anṛtamu.)
“ṛta
vyatiriktaṃ sāṃsārikaphalaṃ karma anṛtaṃ - brahmaprāpti virōdhi -”.
(śrīrāmānujaḥ)
(ṛtamunaku
- satyamunaku - vyatirēkamai saṃsāramunaku saṃbaṃdhiṃcina phalamunaku
kāraṇamaina karma - brahmaprāptiki - brahmanu poṃduṭaku aḍḍu
tagulunadi.
‘na’
iti yadāha tadēvānṛtaṃ - anṛtaṃ ātmanaḥ. dēhasyamūlaṃ, - yathā vṛkṣaḥ
utpāṭitamūlaḥ śuṣyatē acirādēva udvartatē, patatica; ēvaṃ naṣṭaṃ anṛtaṃ
ātmā dēhaḥ śuṣyēt.
(‘lēdu’
ani anuṭayē anṛtamu. anṛtamu dēhamunaku mūlamu - vērulāṃṭidi. vērutō
pekaliṃcina ceṭṭu ē prakāraṃ śuṣkiṃci koddi kālamu lōnē paḍipōvunō, ā
prakāramu gānē evani yaṃdu anṛtamu naśiṃcunō vāḍi dēhamu śuṣkiṃci
naśiṃci pōvunu.)
na ṛtaṃ
anṛtaṃ - (ṛtamukānidi - satyamu kānidi anṛtamu.)
mṛgatṛṣṇakādi
tulyaṃ (eṃḍamāvulatō samānamainadi.)
“ā.
vārijākṣulaṃdu vaivāhikamulaṃdu
brāṇa
vitta māna bhaṃgamaṃdu
jakita gōkulāgrajanma
rakṣaṇamaṃdu
boṃkavaccu
naghamu poṃda dadhipa !” (śrīmadāṃdhra mahābhāgavatamu- 8 - 19 -
584)
“sī.
aṃgīkariṃcina nakhilaṃbu pōvucō nanṛtaṃbu gādu lēdanina nathipa !
yātmavṛkṣamu
mūlamanṛtaṃbu niścayamu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu- 8 - 19 -
581)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.