← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుగ్రహః anugrahaḥ

Original — తెలుగు

ప్రసాదము (దయ కలిగియుండుట.)

అహంకారః; అధిష్టాన శక్తిః. (అహంకారము - అధిష్టించియుండు శక్తి.)

కృపా – శిష్టరక్షణ (శిష్టులను రక్షించుట) ; దయ; కనికరించుట.

అనుగ్రహ శీలః; ఇష్టప్రదానాదినా పాలకః ; అనుగ్రహ్ణాతి, పాలయతి ఇతి.

(అనుగ్రహించు స్వభావము కలవాడు; ఇష్టమైనవాటిని ఇచ్చి పాలించువాడు - అనుగ్రహించువాడు. పాలించువాడు.)

“యే యథామాం ప్రపద్యంతే తాంస్త ధైవ భజామ్యహం” (శ్రీమద్భగవద్గీత- 4 - 11)

వ్యాఖ్యానము : -

“శృణ్వార్తా విత్త కామాశ్చ జ్ఞాని నశ్చ ముముక్షవః |

సకామత్వేన నిష్కామతయా యేమాం యధేశ్వరం |

సమస్త ఫల దాతారం భజంతే తాం స్త ధైవచ |

తదభీష్ట ప్రదానేన త్వనుగృహ్ణామ్యహం హరిః |

ఆర్తా నార్తి వినాశేన విత్త దానేన చార్ధినః |

జిజ్ఞాసూన్ జ్ఞానదానేన జ్ఞానినో మోక్షదానతః |

అనుగృహ్ణామ్యహం స్వామీ నాన్యకామా య చాన్యధా |

ఫలార్ధిత్వే ముముక్షుత్వే హరిరేవ నృణాం గతిః ||“. (గీతాభావప్రకాశము- 4 - 71 to 75, 77)

(బాధలో ఉన్నవారుగాని, ధనముకోరువారుగాని, జ్ఞానులుకాని, మోక్షముకోరువారుకాని, కోరికతోగాని, కోరికలేకగాని, నన్ను భజించువారిని వారి అభీష్టము తీర్చి వారిని అనుగ్రహించెదను - అనగా, బాధలో ఉన్నవారి బాధ పోగొట్టెదను. ధనము కావలసినవారికి ధనము నిచ్చెదను - జ్ఞానము కోరినవారికి జ్ఞానము నిచ్చెదను, జ్ఞానులకు మోక్షమునిచ్చెదను. ఈ రీతిగా ఎవరు ఏది కావలెననిన వారికి అది ఇచ్చి అనుగ్రహించెదను; కోరనది ఇవ్వను; కోరిన కోరినఫలమిచ్చినను మోక్షమిచ్చినను చేయగలవాడను నేనే. నన్నుగాక ఇతరదేవతులను భజించువారు కూడా నన్నే భజించుచున్నారు. ఎందుచేతననగా, నేను అఖిలాత్మను - అనగా, సమస్తమైనవాటిలోనుండు ఆత్మను. అందుచేత ఇతరదేవతులలోకూడా ఆత్మనై యున్నాను. అందుచేత వారిని భజించినా వారిలోనున్న నన్ను భజించినట్లే యగును.)

Transliteration

prasādamu (daya kaligiyuṃḍuṭa.)

ahaṃkāraḥ; adhiṣṭāna śaktiḥ. (ahaṃkāramu - adhiṣṭiṃciyuṃḍu śakti.)

kṛpā – śiṣṭarakṣaṇa (śiṣṭulanu rakṣiṃcuṭa) ; daya; kanikariṃcuṭa.

anugraha śīlaḥ; iṣṭapradānādinā pālakaḥ ; anugrahṇāti, pālayati iti.

(anugrahiṃcu svabhāvamu kalavāḍu; iṣṭamainavāṭini icci pāliṃcuvāḍu - anugrahiṃcuvāḍu. pāliṃcuvāḍu.)

“yē yathāmāṃ prapadyaṃtē tāṃsta dhaiva bhajāmyahaṃ” (śrīmadbhagavadgīta- 4 - 11)

vyākhyānamu : -

“śṛṇvārtā vitta kāmāśca jñāni naśca mumukṣavaḥ |

sakāmatvēna niṣkāmatayā yēmāṃ yadhēśvaraṃ |

samasta phala dātāraṃ bhajaṃtē tāṃ sta dhaivaca |

tadabhīṣṭa pradānēna tvanugṛhṇāmyahaṃ hariḥ |

ārtā nārti vināśēna vitta dānēna cārdhinaḥ |

jijñāsūn jñānadānēna jñāninō mōkṣadānataḥ |

anugṛhṇāmyahaṃ svāmī nānyakāmā ya cānyadhā |

phalārdhitvē mumukṣutvē harirēva nṛṇāṃ gatiḥ ||“. (gītābhāvaprakāśamu- 4 - 71 to 75, 77)

(bādhalō unnavārugāni, dhanamukōruvārugāni, jñānulukāni, mōkṣamukōruvārukāni, kōrikatōgāni, kōrikalēkagāni, nannu bhajiṃcuvārini vāri abhīṣṭamu tīrci vārini anugrahiṃcedanu - anagā, bādhalō unnavāri bādha pōgoṭṭedanu. dhanamu kāvalasinavāriki dhanamu niccedanu - jñānamu kōrinavāriki jñānamu niccedanu, jñānulaku mōkṣamuniccedanu. ī rītigā evaru ēdi kāvalenanina vāriki adi icci anugrahiṃcedanu; kōranadi ivvanu; kōrina kōrinaphalamiccinanu mōkṣamiccinanu cēyagalavāḍanu nēnē. nannugāka itaradēvatulanu bhajiṃcuvāru kūḍā nannē bhajiṃcucunnāru. eṃducētananagā, nēnu akhilātmanu - anagā, samastamainavāṭilōnuṃḍu ātmanu. aṃducēta itaradēvatulalōkūḍā ātmanai yunnānu. aṃducēta vārini bhajiṃcinā vārilōnunna nannu bhajiṃcinaṭlē yagunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.