← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనుమానము anumānamu

Original — తెలుగు

అనుమానప్రమాణము - ప్రమాణములలో నొకటి.

ఊహించుట

ఒక గుఱుతును బట్టి ఇచట ఈ వస్తువు ఉన్నదని నిర్ణయించి చెప్పుట - పొగనుచూచి అగ్ని ఉన్నదని చెప్పుట. అగ్నిలేనిదే పొగ ఉండదు కనుక పొగ ఉండిన అగ్ని ఉన్నదని ఊహించుట.

మనము చూచిన విషయముల జ్ఞానమునుండి చూడని విషయముల జ్ఞానమును కలుగచేయుసాధనము. కొండపై పొగచూచుట విషయము - దీనిని బట్టి కొండపైన కనబడకపోయినను అగ్ని ఉన్నదను విషయమును గ్రహించుట అనుమానము -.

“అనుమితి కరణమనుమానం, పరామర్శజన్యం జ్ఞానమనుమితిః వాప్తి విశిష్ట ధర్మతా జ్ఞానం పరామర్శః - యథా, వహ్నివ్యాప్యధూమవాన్ అయం పర్వతః ఇతిజ్ఞానం పరామర్శః, తజ్జన్యం పర్వతో వహ్నిమానితి జ్ఞానమనుమితిః. యత్ర ధూమస్తత్రాగ్ని రితి సాహచర్య నియమో వ్యాప్తిః. వ్యాప్యస్య పర్వతాది వృత్తిత్వం పక్ష ధర్మతా”. (తర్క సంగ్రహే)

(ఎక్కడపొగయుండిన అక్కడ అగ్ని యుండును, అగ్నితో సహచరిగా పొగయుండును, అగ్నిలేనిదే పొగయుండదు - అను నియమము వ్యాప్తి. అగ్ని వ్యాపించి ఈ పర్వతము మీద ఉన్నది కనుక ఈ పర్వతము మీద పొగ ఉన్నది అనుట పరామర్శ. దానిని బట్టి పొగను బట్టి పర్వతము మీద అగ్నియున్నది అను జ్ఞానము అనుమితి. అనుమితికరణమే అనుమానము.)

అతః ప్రత్యక్షస్య సవిశేష విషయత్వేన ప్రత్యక్షాది సంబంధ విశిష్ట విషయత్వాత్ అనుమానమపి సవిశేష విషయ మేవ ప్రమాణసంఖ్యా వివాదోపి సర్వాభ్యాసగత ప్రమాణానాం అయమేవ విషయఃఇతి న కేనాపి ప్రమాణేన నిర్విశేషవస్తు సిద్ధిః (శ్రీరామానుజః.)

(రెండు పదార్థములకుగల అవినాభావసంబంధము - అనగా, ఒకటిలేనిదే రెండవది యుండదు అను సంబంధము - ప్రత్యక్షముగా చూచిన తర్వాత తెలియును - అనగా, ప్రత్యక్ష ప్రమాణమువలన తెలియును. అందుచేత ప్రత్యక్షప్రమాణము సవిశేష విషయమునే తెలియపఱచును - ఈ విధముగా ప్రత్యక్షప్రమాణముచేత తెలిసిన వస్తువునే అనుమానప్రమాణము తెలియచేయును. అగ్ని ఉండిననే పొగ ఉండును అను ప్రత్యక్షప్రమాణమువలన అగ్ని కనబడకపోయినను పొగ కనబడినందున అగ్ని ఉన్నదని అనుమానించవచ్చును, ఇదియే అనుమాన ప్రమాణము, అనగా ప్రత్యక్షప్రమాణముచేత తెలియబడిన వస్తువునే అనుమానప్రమాణము విషయమునే తెలియచేయగలదు. అందుచేత అనుమానప్రమాణము సవిశేష విషయమునే తెలియచేయగలదు. భగవంతుడు నిర్విశేషము, నిరాకారము, నిర్గుణము. భగవంతుడు తెలిసిన ఏ వస్తువు వలెగాని ఉండడు. అందుచేత ఏ వస్తువువలన కలుగు జ్ఞానముచేనైనను అనుమానించి తెలుసుకొనుటకు వీలులేనివాడు. అనుమానప్రమాణము వలన అతనిని తెలుసుకొనలేము - వేదైకవేద్యుడు. వేదము చేతనే - వేదముద్వారానే తెలుసుకొనుటకు వీలు అయినవాడు.)

అనుమానప్రమాణముచేత గలుగు జ్ఞానము పరోక్షజ్ఞానమేకాని అపరోక్షజ్ఞానముకాదు. ఈ ప్రమాణమువలనకంటికి కనబడువస్తువు ఉన్నదని తెలియునుకాని అది యెట్టిదో దానియొక్క అసాధారణాకారము తెలియదు - కొండమీద పొగనుబట్టి కొండమీద అగ్నియున్నదని తెలియునుకాని అసాధారణకారణమును అనగా, అగ్నియొక్క వేడిమినికాని, ఎంత కాంతివంతమైనదో అను విషయముకాని తెలియదు. అందుచేత అనుమానప్రమాణము భగవంతుడు ఉన్నాడని తెలియచేయునేకాని అతనెటువంటివాడో, అతని పరిపూర్ణత - ప్రపంచమంతటను నిండియున్నాడు, ప్రతివస్తువులోనూ పూర్తిగా వ్యాపించియున్నాడు, అద్వయుడు - అతడు ఒక్కడే తప్ప మరేదియునులేదు - అనుసంగతులు తెలియచేయలేదు.

అనుమానగా స్మృతి, ప్రత్యక్షమనగా శ్రుతి.

Transliteration

anumānapramāṇamu - pramāṇamulalō nokaṭi.

ūhiṃcuṭa

oka guṟutunu baṭṭi icaṭa ī vastuvu unnadani nirṇayiṃci ceppuṭa - poganucūci agni unnadani ceppuṭa. agnilēnidē poga uṃḍadu kanuka poga uṃḍina agni unnadani ūhiṃcuṭa.

manamu cūcina viṣayamula jñānamunuṃḍi cūḍani viṣayamula jñānamunu kalugacēyusādhanamu. koṃḍapai pogacūcuṭa viṣayamu - dīnini baṭṭi koṃḍapaina kanabaḍakapōyinanu agni unnadanu viṣayamunu grahiṃcuṭa anumānamu -.

“anumiti karaṇamanumānaṃ, parāmarśajanyaṃ jñānamanumitiḥ vāpti viśiṣṭa dharmatā jñānaṃ parāmarśaḥ - yathā, vahnivyāpyadhūmavān ayaṃ parvataḥ itijñānaṃ parāmarśaḥ, tajjanyaṃ parvatō vahnimāniti jñānamanumitiḥ. yatra dhūmastatrāgni riti sāhacarya niyamō vyāptiḥ. vyāpyasya parvatādi vṛttitvaṃ pakṣa dharmatā”. (tarka saṃgrahē)

(ekkaḍapogayuṃḍina akkaḍa agni yuṃḍunu, agnitō sahacarigā pogayuṃḍunu, agnilēnidē pogayuṃḍadu - anu niyamamu vyāpti. agni vyāpiṃci ī parvatamu mīda unnadi kanuka ī parvatamu mīda poga unnadi anuṭa parāmarśa. dānini baṭṭi poganu baṭṭi parvatamu mīda agniyunnadi anu jñānamu anumiti. anumitikaraṇamē anumānamu.)

ataḥ pratyakṣasya saviśēṣa viṣayatvēna pratyakṣādi saṃbaṃdha viśiṣṭa viṣayatvāt anumānamapi saviśēṣa viṣaya mēva pramāṇasaṃkhyā vivādōpi sarvābhyāsagata pramāṇānāṃ ayamēva viṣayaḥiti na kēnāpi pramāṇēna nirviśēṣavastu siddhiḥ (śrīrāmānujaḥ.)

(reṃḍu padārthamulakugala avinābhāvasaṃbaṃdhamu - anagā, okaṭilēnidē reṃḍavadi yuṃḍadu anu saṃbaṃdhamu - pratyakṣamugā cūcina tarvāta teliyunu - anagā, pratyakṣa pramāṇamuvalana teliyunu. aṃducēta pratyakṣapramāṇamu saviśēṣa viṣayamunē teliyapaṟacunu - ī vidhamugā pratyakṣapramāṇamucēta telisina vastuvunē anumānapramāṇamu teliyacēyunu. agni uṃḍinanē poga uṃḍunu anu pratyakṣapramāṇamuvalana agni kanabaḍakapōyinanu poga kanabaḍinaṃduna agni unnadani anumāniṃcavaccunu, idiyē anumāna pramāṇamu, anagā pratyakṣapramāṇamucēta teliyabaḍina vastuvunē anumānapramāṇamu viṣayamunē teliyacēyagaladu. aṃducēta anumānapramāṇamu saviśēṣa viṣayamunē teliyacēyagaladu. bhagavaṃtuḍu nirviśēṣamu, nirākāramu, nirguṇamu. bhagavaṃtuḍu telisina ē vastuvu valegāni uṃḍaḍu. aṃducēta ē vastuvuvalana kalugu jñānamucēnainanu anumāniṃci telusukonuṭaku vīlulēnivāḍu. anumānapramāṇamu valana atanini telusukonalēmu - vēdaikavēdyuḍu. vēdamu cētanē - vēdamudvārānē telusukonuṭaku vīlu ayinavāḍu.)

anumānapramāṇamucēta galugu jñānamu parōkṣajñānamēkāni aparōkṣajñānamukādu. ī pramāṇamuvalanakaṃṭiki kanabaḍuvastuvu unnadani teliyunukāni adi yeṭṭidō dāniyokka asādhāraṇākāramu teliyadu - koṃḍamīda poganubaṭṭi koṃḍamīda agniyunnadani teliyunukāni asādhāraṇakāraṇamunu anagā, agniyokka vēḍiminikāni, eṃta kāṃtivaṃtamainadō anu viṣayamukāni teliyadu. aṃducēta anumānapramāṇamu bhagavaṃtuḍu unnāḍani teliyacēyunēkāni ataneṭuvaṃṭivāḍō, atani paripūrṇata - prapaṃcamaṃtaṭanu niṃḍiyunnāḍu, prativastuvulōnū pūrtigā vyāpiṃciyunnāḍu, advayuḍu - ataḍu okkaḍē tappa marēdiyunulēdu - anusaṃgatulu teliyacēyalēdu.

anumānagā smṛti, pratyakṣamanagā śruti.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.