న విద్యతే ఉత్తమం యస్మాత్
తదనుత్తమం.
(ఎవనికంటె
ఉత్తమమైన వాడులేడో అట్టివాడు.)
యస్మాత్ ఉత్తమం నాస్తి
తదనుత్తమం సర్వోత్తమ మిత్యర్థః, అనవిధి కాతిశయ మిత్యర్థః.
(ఎవనికంటె
ఉత్తమమైన వాడులేడో వాడు అనుత్తముడు, సర్వోత్తముడు - అన్నింటికన్న ఉత్తముడు - అడ్డులేనటువంటి,
మించనటువంటి, అతిశయము, ఆధిక్యతగలవాడు.)
అవిద్యమానం
ఉత్తమం యస్మాత్ తదనుత్తమం, సర్వాధికం, సర్వోత్తమం.
(ఇతనికన్న
ఉత్తముడు లేడు కనుక ఇతను అనుత్తముడు - అందఱికన్న అధికుడు, అందరికన్న ఉత్తముడు.)
నిరతిశయం, అతిశ్రేష్టః.
(తనకంటె అధికము అనునది లేనివాడు; మిక్కిలి
శ్రేష్టమైనది.)
“యస్మాత్ పరం నాపరం అస్తి
కించిత్” ఇతి శ్రుతేః -
(దీనికంటె
అతీతమైనది, ఉత్కృష్టమైనది, గొప్పది అయిన పరతత్వముగాని, అపరతత్వముగాని ఇంకొకటి లేదు. అందుచేత ఇతను
అనుత్తముడు.)
“సత్వత్సమోస్త్యభ్యధికః కుతో
(అ) న్యో” - (శ్రీమద్భగవద్గీత - 11 - 43)
(నీతో సమానమైనవాడు లేడు.
అటువంటి విషయములో నీకన్న అధికుడెవడు ? - లేడని అర్థము.)
“క. - - -
నీకంటె నొడయ డెవ్వడు
లోకంబులకెల్ల నిఖిల
లోకస్తుత్యా!” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 8 - 7 - 231)
“అవ్యక్తం వ్యక్తి మాపన్నం
మన్యంతే మామ బుద్ధయః |
పరంభావమ జానంతో మామ వ్యయమనుత్తమం
||“. (గీతాభావప్రకాశము- 7 - 24)
(నేను
నాశరహితమైనటువంటివాడను, నాకన్న ఉత్తముడు ఎవడూ లేడు. నేనే అందరికన్న ఉత్తముడను,
ఉత్కృష్టుడను. అట్టినా పరమోత్కృష్టతను తెలుసుకొనలేక అజ్ఞానులు, జనులందఱివలె ఇదివఱకు ఎవరికి
కనబడకుండ ఉండునన్ను పుట్టిన వానినిగా భావించెదరు.)
“సర్వద్రవ్యేషు విద్యైవ
ద్రవ్యమాహురనుత్తమం |”
(ద్రవ్యము
లన్నింటిలోను విద్యయే సర్వోత్కృష్ట మైనదని, - దానికన్న ఉత్తమ మైనది లేదని - చెప్పబడుచున్నది.)
Transliteration
na
vidyatē uttamaṃ yasmāt tadanuttamaṃ.
(evanikaṃṭe uttamamaina
vāḍulēḍō aṭṭivāḍu.)
yasmāt
uttamaṃ nāsti tadanuttamaṃ sarvōttama mityarthaḥ, anavidhi kātiśaya
mityarthaḥ.
(evanikaṃṭe
uttamamaina vāḍulēḍō vāḍu anuttamuḍu, sarvōttamuḍu - anniṃṭikanna
uttamuḍu - aḍḍulēnaṭuvaṃṭi, miṃcanaṭuvaṃṭi, atiśayamu,
ādhikyatagalavāḍu.)
avidyamānaṃ
uttamaṃ yasmāt tadanuttamaṃ, sarvādhikaṃ, sarvōttamaṃ.
(itanikanna
uttamuḍu lēḍu kanuka itanu anuttamuḍu - aṃdaṟikanna adhikuḍu,
aṃdarikanna uttamuḍu.)
niratiśayaṃ,
atiśrēṣṭaḥ.
(tanakaṃṭe
adhikamu anunadi lēnivāḍu; mikkili śrēṣṭamainadi.)
“yasmāt paraṃ
nāparaṃ asti kiṃcit” iti śrutēḥ -
(dīnikaṃṭe
atītamainadi, utkṛṣṭamainadi, goppadi ayina paratatvamugāni,
aparatatvamugāni iṃkokaṭi lēdu. aṃducēta itanu anuttamuḍu.)
“satvatsamōstyabhyadhikaḥ
kutō (a) nyō” - (śrīmadbhagavadgīta - 11 - 43)
(nītō
samānamainavāḍu lēḍu. aṭuvaṃṭi viṣayamulō nīkanna adhikuḍevaḍu ? -
lēḍani arthamu.)
“ka. - - -
nīkaṃṭe noḍaya
ḍevvaḍu
lōkaṃbulakella
nikhila lōkastutyā!” (śrīmadāṃdhra mahābhāgavatamu - 8 - 7 - 231)
“avyaktaṃ
vyakti māpannaṃ manyaṃtē māma buddhayaḥ |
paraṃbhāvama
jānaṃtō māma vyayamanuttamaṃ ||“. (gītābhāvaprakāśamu- 7 - 24)
(nēnu
nāśarahitamainaṭuvaṃṭivāḍanu, nākanna uttamuḍu evaḍū lēḍu. nēnē
aṃdarikanna uttamuḍanu, utkṛṣṭuḍanu. aṭṭinā paramōtkṛṣṭatanu
telusukonalēka ajñānulu, janulaṃdaṟivale idivaṟaku evariki kanabaḍakuṃḍa
uṃḍunannu puṭṭina vāninigā bhāviṃcedaru.)
“sarvadravyēṣu
vidyaiva dravyamāhuranuttamaṃ |”
(dravyamu
lanniṃṭilōnu vidyayē sarvōtkṛṣṭa mainadani, - dānikanna uttama mainadi
lēdani - ceppabaḍucunnadi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.