ప్రపంచమంతకును పరమాణువులే కారణము అనియు, అవి నిత్యములనియు తెలుపు వాదము - కాణాదమతవాదము“అణోరణీయాన్”. (అణువుకంటె - అతి చిన్నవస్తువుకంటె - చిన్నవాడు) అని భగవంతుని గుఱించి చెప్పబడినది. ఈ అణువులలోకూడ భగవంతుడు ప్రవేశించియుండి వాటిని ఒకదానిచేత ఒకటిని ఆకర్షింపచేసి, వాటిని కలిపి వస్తువులుగా పరిణమింప చేయుచుండుటవలన ప్రపంచోత్పత్తికి కారణమగుచున్నాడు. అణువులలో - పరమాణువులలో - భగవంతుడు- తనశక్తి - చిచ్ఛక్తిరూపముతో - చైతన్య శక్తి రూపముతో - లేనిదే అణువులు ఏమియు చేయలేవు; సృష్టి జరగనేరదు - అంతరించిపోయి యుండును. అణువులు ప్రకృతియొక్క వికారము - రూపము - ప్రకృతి జడము - పరమాత్మ చైతన్యశక్తి దానిలోప్రవేశించియుండుటవలననే అది అనేక వస్తువులుగా, అనేక రూపములుగా మారుచున్నది. ప్రకృతి యనగా Matter - Matter is inert; it cannot move or do anything by itself unless activated by an external force. This external force (శక్తి) is called ENERGY by Scientists. మనము దేనిని భగవంతుని చిచ్ఛక్తి లేక చైతన్య శక్తి అనుచున్నామో దానినే Scientists (ఆధునిక శాస్త్రజ్ఞులు) ENERGY అనుచున్నారు. “తత్ సృష్ట్యా తదేవాను ప్రావిశత్” (దానిని - లోకములను - సృష్టించి, దానిలోనే ప్రవేశించెను) అని శ్రుతి చెప్పుచున్నది. ప్రతి అణువులోను, ప్రతివస్తువులోను భగవంతుడు తన చైతన్య శక్తి రూపముతో లేనిదే ఆ వస్తువులోనుండి ఇంకొకవస్తువు పుట్టదు –
వ. “గగనంబు కాలమాయాంశ యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శ తన్మాత్రంబు వలన వాయువుం గలిగించె - - - తేజంబు కాల మాయాంశ యోగంబున నుత్తమ శ్లోకుని విలోకనంబున బవమాన యుక్తం బగుచు రసతన్మాత్రంబు వలన నంబువుల గలిగించె. సలిలంబు కాలమాయాంశ యోగంబునం బరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తంబై గంధ గుణంబు వలన బృథివి గలిగించె” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 3 - 5 - 202)
అందుచేత భగవంతుని ప్రసక్తి లేనిదే సృష్టి జరుగజాలదు - అణువులు కాని, పరమాణువులు కానివాటంతట అవి ఏమియు చేయజాలవు. ప్రతిదాని లోను - ప్రతి వస్తువులోను భగవంతుడు ఉండుట వలననే దానిలోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది. అందుచేత ఇదంతయు భగవంతుని సృష్టియే - సృష్టి అంతటికి భగవంతుడే కారణము కాని, కేవలము పరమాణువులు కావు. అందుచేత ఇది సృష్టియే కాని (Creation కాని) కేవలము evolution కాదు. దీనిని బట్టి కణాదమతవాదము - అణువాదము - సరియైనదికాదు.
prapaṃcamaṃtakunu paramāṇuvulē kāraṇamu aniyu, avi nityamulaniyu telupu vādamu - kāṇādamatavādamu”aṇōraṇīyān “. (aṇuvukaṃṭe - ati cinnavastuvukaṃṭe - cinnavāḍu) ani bhagavaṃtuni guṟiṃci ceppabaḍinadi. ī aṇuvulalōkūḍa bhagavaṃtuḍu pravēśiṃciyuṃḍi vāṭini okadānicēta okaṭini ākarṣiṃpacēsi, vāṭini kalipi vastuvulugā pariṇamiṃpa cēyucuṃḍuṭavalana prapaṃcōtpattiki kāraṇamagucunnāḍu. aṇuvulalō - paramāṇuvulalō - bhagavaṃtuḍu- tanaśakti - cicchaktirūpamutō - caitanya śakti rūpamutō - lēnidē aṇuvulu ēmiyu cēyalēvu; sṛṣṭi jaraganēradu - aṃtariṃcipōyi yuṃḍunu. aṇuvulu prakṛtiyokka vikāramu - rūpamu - prakṛti jaḍamu - paramātma caitanyaśakti dānilōpravēśiṃciyuṃḍuṭavalananē adi anēka vastuvulugā, anēka rūpamulugā mārucunnadi. prakṛti yanagā Matter - Matter is inert; it cannot move or do anything by itself unless activated by an external force. This external force (śakti) is called ENERGY by Scientists. manamu dēnini bhagavaṃtuni cicchakti lēka caitanya śakti anucunnāmō dāninē Scientists (ādhunika śāstrajñulu) ENERGY anucunnāru.”tat sṛṣṭyā tadēvānu prāviśat” (dānini - lōkamulanu - sṛṣṭiṃci, dānilōnē pravēśiṃcenu) ani śruti ceppucunnadi. prati aṇuvulōnu, prativastuvulōnu bhagavaṃtuḍu tana caitanya śakti rūpamutō lēnidē ā vastuvulōnuṃḍi iṃkokavastuvu puṭṭadu –
va. “gaganaṃbu kālamāyāṃśa yōgaṃbunaṃ buṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna sparśa tanmātraṃbu valana vāyuvuṃ galigiṃce - - - tējaṃbu kāla māyāṃśa yōgaṃbuna nuttama ślōkuni vilōkanaṃbuna bavamāna yuktaṃ bagucu rasatanmātraṃbu valana naṃbuvula galigiṃce. salilaṃbu kālamāyāṃśa yōgaṃbunaṃ baramēśvarānugrahaṃbu galigi tējōyuktaṃbai gaṃdha guṇaṃbu valana bṛthivi galigiṃce” (śrīmadāṃdhra mahābhāgavatamu- 3 - 5 - 202)
aṃducēta bhagavaṃtuni prasakti lēnidē sṛṣṭi jarugajāladu - aṇuvulu kāni, paramāṇuvulu kānivāṭaṃtaṭa avi ēmiyu cēyajālavu. pratidāni lōnu - prati vastuvulōnu bhagavaṃtuḍu uṃḍuṭa valananē dānilōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi. aṃducēta idaṃtayu bhagavaṃtuni sṛṣṭiyē - sṛṣṭi aṃtaṭiki bhagavaṃtuḍē kāraṇamu kāni, kēvalamu paramāṇuvulu kāvu. aṃducēta idi sṛṣṭiyē kāni (Creation kāni) kēvalamu evolution kādu. dīnini baṭṭi kaṇādamatavādamu - aṇuvādamu - sariyainadikādu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.