మిక్కిలి చిన్నది; అల్పమైనది; సూక్ష్మమైనది.
అణోః సర్వ చేతనా పేక్షయా సూక్ష్మాత్.
(ప్రకృతికి సంబంధించిన వస్తువులన్నింటిలోను చిన్నది. ఇంతకంటె చిన్నవస్తువు మఱిలేదు - సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువు.)
సూక్ష్మ తయా చక్షురాద్య గోచరం. (మిక్కిలి సూక్ష్మమైన దగుటచేత కన్ను మొదలగువాటికి గోచరము కానిది.)
జగత్కారణమగు సూక్ష్మవస్తువు, సూక్ష్మాంశము -
(కొన్ని అణువులు కలిసిన ఒక పదార్ధమగును. సృష్టిలో ఉన్న వస్తువులన్నియు అణుసముదాయము వలన ఏర్పడినవే.)
(భగవంతుడు అణువువలె పరమ సూక్ష్ముడు - అందుచేత తెలుసుకొనుటకు కష్టమైనవాడు. ఇట్లు చెప్పుటవలన భగవంతుడు అణువంతే ఉండువాడు అని చెప్పుట కాదు - దానికి కూడా అతను విభుడు అగుటవలన.)
(మిక్కిలి చిన్న స్వరూపుడగు ఈ ఆత్మ శుద్ధమైన మనస్సు ద్వారా తెలియ తగినవాడు.)
“ద్వ్యణుకా దీనాం అస్మదాది ప్రత్యక్ష గమ్య త్వా భావే అపి యోగి జనచక్షుర్గమ్యత్వమస్తి. తదపి ఆత్మనః నాస్తి”.
(పరమాణువు ద్వ్యణుకము మొదలగునవి సూక్ష్మ వస్తువులు. మనవంటి వారికి దృష్టిగోచరము కావు. కాని యోగిజనులకు కనపడును. ఆత్మ అటువంటిది కాదు - అటువంటివారికి కూడ కనబడదు.)
అణువు అనగా ప్రకృతిలో ఉన్న అతి సూక్ష్మ వస్తువు. అది ATOM కాదు - ATOM అనగా A + TOMOS = A = Not, TOMOS = Cut, - that which cannot be cut - అచ్ఛేద్యము - (చూడుము - ‘ఆత్మ’.)
“అణ్వ్యో మాత్రా (అ)వినాశిన్యో దశార్ధానాం తు యాః స్మృతాః |
తాభిఃసార్ధమిదం సర్వం సంభవత్యను పూర్వశః |”
ఇతి స్మృతేః. అతి సూక్ష్మములై మరణకాలమునందును నశింపనివై యుండు పంచ భూతమాత్రలేవి కలవో వానితో కూడ క్రమముగా ఈ ప్రపంచమంతయు పుట్టుచున్నది.)
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయము కాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 2 - 1 -17)
(సృష్టిలో ఏ ఒక్క పరమాణువైనను భగవంతుడులోపల ప్రవేశించియుండనిది లేదు)-
(There is not the smallest particle of matter which does not contain ENERGY.)
“సీ. --- జాల సూర్య మరీచి సంగత గగనస్థ మగు త్రసరేణు షడంశ మరయ
బరమాణువయ్యె దత్పరమాణువం దర్క గతి యెంత తడవు దత్కాలమగును
తే. సూక్ష్మ కాలంబు - - -
వ. అందు బరమాణుద్వయం బొక్క యణువగు, నణు త్రితయం బొక్క త్రసరేణువగు,అవి మూడు గూడ నొక్క తుటి యగు - - ”
( శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 11 - 345, 346)
(ఇంటి కిటికీలోనుండి లొపలికివచ్చు సూర్యకిరణము నలుసు పదునాఱవ వంతులో ఎంతకాలము ప్రసరించియుండునో అది పరమాణువు (కాలము); అది సూక్ష్మకాలము - కాలగణనమునకు మొదటిది. అట్టి పరమాణువులు రెండు కలిసి ఒక అణువు, మూడు అణువులు ఒక త్రసరేణువు; త్రసరేణువులు మూడు ఒక్క త్రుటి - ఈ ప్రకారము కాలమానము ప్రారంభము.)
mikkili cinnadi; alpamainadi; sūkṣmamainadi.
aṇōḥ sarva cētanā pēkṣayā sūkṣmāt.
(prakṛtiki saṃbaṃdhiṃcina vastuvulanniṃṭilōnu cinnadi. iṃtakaṃṭe cinnavastuvu maṟilēdu - sūkṣmāti sūkṣmamaina vastuvu.)
sūkṣma tayā cakṣurādya gōcaraṃ. (mikkili sūkṣmamaina daguṭacēta kannu modalaguvāṭiki gōcaramu kānidi.)
jagatkāraṇamagu sūkṣmavastuvu, sūkṣmāṃśamu -
(konni aṇuvulu kalisina oka padārdhamagunu. sṛṣṭilō unna vastuvulanniyu aṇusamudāyamu valana ērpaḍinavē.)
(bhagavaṃtuḍu aṇuvuvale parama sūkṣmuḍu - aṃducēta telusukonuṭaku kaṣṭamainavāḍu. iṭlu ceppuṭavalana bhagavaṃtuḍu aṇuvaṃtē uṃḍuvāḍu ani ceppuṭa kādu - dāniki kūḍā atanu vibhuḍu aguṭavalana.)
(mikkili cinna svarūpuḍagu ī ātma śuddhamaina manassu dvārā teliya taginavāḍu.)
“dvyaṇukā dīnāṃ asmadādi pratyakṣa gamya tvā bhāvē api yōgi janacakṣurgamyatvamasti. tadapi ātmanaḥ nāsti”.
(paramāṇuvu dvyaṇukamu modalagunavi sūkṣma vastuvulu. manavaṃṭi vāriki dṛṣṭigōcaramu kāvu. kāni yōgijanulaku kanapaḍunu. ātma aṭuvaṃṭidi kādu - aṭuvaṃṭivāriki kūḍa kanabaḍadu.)
aṇuvu anagā prakṛtilō unna ati sūkṣma vastuvu. adi ATOM kādu - ATOM anagā A + TOMOS = A = Not, TOMOS = Cut, - that which cannot be cut - acchēdyamu - (cūḍumu - ‘ātma’.)
“aṇvyō mātrā (a)vināśinyō daśārdhānāṃ tu yāḥ smṛtāḥ |
tābhiḥsārdhamidaṃ sarvaṃ saṃbhavatyanu pūrvaśaḥ |”
iti smṛtēḥ. ati sūkṣmamulai maraṇakālamunaṃdunu naśiṃpanivai yuṃḍu paṃca bhūtamātralēvi kalavō vānitō kūḍa kramamugā ī prapaṃcamaṃtayu puṭṭucunnadi.)
hari viśvamayuṃḍu saṃśayamu panilēdā
harimayamu kāni dravyamu
paramāṇuvu lēdu vaṃśapāvana viṃṭē” (śrī madāṃdhra mahābhāgavatamu- 2 - 1 -17)
(sṛṣṭilō ē okka paramāṇuvainanu bhagavaṃtuḍulōpala pravēśiṃciyuṃḍanidi lēdu)-
(There is not the smallest particle of matter which does not contain ENERGY.)
“sī. --- jāla sūrya marīci saṃgata gaganastha magu trasarēṇu ṣaḍaṃśa maraya
baramāṇuvayye datparamāṇuvaṃ darka gati yeṃta taḍavu datkālamagunu
tē. sūkṣma kālaṃbu - - -
va. aṃdu baramāṇudvayaṃ bokka yaṇuvagu, naṇu tritayaṃ bokka trasarēṇuvagu,avi mūḍu gūḍa nokka tuṭi yagu - - ”
( śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 11 - 345, 346)
(iṃṭi kiṭikīlōnuṃḍi lopalikivaccu sūryakiraṇamu nalusu padunāṟava vaṃtulō eṃtakālamu prasariṃciyuṃḍunō adi paramāṇuvu (kālamu); adi sūkṣmakālamu - kālagaṇanamunaku modaṭidi. aṭṭi paramāṇuvulu reṃḍu kalisi oka aṇuvu, mūḍu aṇuvulu oka trasarēṇuvu; trasarēṇuvulu mūḍu okka truṭi - ī prakāramu kālamānamu prāraṃbhamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.