← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యోన్యాశ్రయము anyōnyāśrayamu

Original — తెలుగు

ఒకదానితోనొకటి ఆశ్రయించియుండుట. అది ఉండిననేకాని ఇది ఉండదు. సృష్టిలోని సమస్తవస్తువులను, పెద్దవి, చిన్నవి అను విచక్షణ లేకుండా, భగవంతుడు ఆశ్రయించుకొని ఉన్నాడు - భగవంతుడు ఆశ్రయించి యుండని వస్తువు లేదు –

క. “ఇందుగలడందు లేడని

సందేహమువలదు; చక్రి సర్వోపగతుం

డెందెందు వెతకి చూచిన

నందందేగలడు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము – 7 – 8 - 275)

ప్రకృతి భగవంతుని ఆశ్రయించియున్నది. భగవంతుడు ప్రకృతినాశ్రయించియున్నాడు. ప్రకృతి పరిణామమైన ప్రపంచములో ప్రతి వస్తువులోను భగవంతుడున్నాడు - Every particle of matter contains Energy – భగవంతుడు లేనిది ప్రకృతిలో అణుమాత్రమైనది కూడ లేదు.

క. “---

--- దా

హరిమయము గాని ద్రవ్యము

పరమాణువు లేదు, వంశపావన, వింటే“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 2 - 17)

There is not even the smallest particle of matter which does not contain ENERGY ). (ప్రకృతి పురుషులు ఒకరినొకరు ఆశ్రయించుకొని ఉన్నారు - సాంబశివుడు, అర్థనారీశ్వరుడు.)

Transliteration

okadānitōnokaṭi āśrayiṃciyuṃḍuṭa. adi uṃḍinanēkāni idi uṃḍadu. sṛṣṭilōni samastavastuvulanu, peddavi, cinnavi anu vicakṣaṇa lēkuṃḍā, bhagavaṃtuḍu āśrayiṃcukoni unnāḍu - bhagavaṃtuḍu āśrayiṃci yuṃḍani vastuvu lēdu –

ka. “iṃdugalaḍaṃdu lēḍani

saṃdēhamuvaladu; cakri sarvōpagatuṃ

ḍeṃdeṃdu vetaki cūcina

naṃdaṃdēgalaḍu ---” (śrīmadāṃdhra mahābhāgavatamu – 7 – 8 - 275)

prakṛti bhagavaṃtuni āśrayiṃciyunnadi. bhagavaṃtuḍu prakṛtināśrayiṃciyunnāḍu. prakṛti pariṇāmamaina prapaṃcamulō prati vastuvulōnu bhagavaṃtuḍunnāḍu - Every particle of matter contains Energy – bhagavaṃtuḍu lēnidi prakṛtilō aṇumātramainadi kūḍa lēdu.

ka. “---

--- dā

harimayamu gāni dravyamu

paramāṇuvu lēdu, vaṃśapāvana, viṃṭē”. (śrīmadāṃdhra mahābhāgavatamu- 2 - 17)

There is not even the smallest particle of matter which does not contain ENERGY ). (prakṛti puruṣulu okarinokaru āśrayiṃcukoni unnāru - sāṃbaśivuḍu, arthanārīśvaruḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.