(ఎండమావులందలి
జలమువలె) ఉన్నదానిని కప్పిపుచ్చుట.
అపహ్నవోనామ మహోపనిషత్సు
పంచమాధ్యాయే - “మరుభూమే జలం సర్వం మరుమాత్రమేవ”(శ్రుతిః.)
అపహ్నవమనగా
మహోపనిషత్తునందు 5వ అధ్యాయములో చెప్పబడినది. ‘ఎడారిలో - మరుభూమి యందు లేకనే కనుపించెడి ఎండమావుల
జలమంతయును ఆ మరుభూమియే’ అటులనే పరిశుద్ధమగు పరమాత్మయందు కల్పితమగు నామరూపాదికమగు
ప్రపంచమంతయు ఆ పరమాత్మ స్వరూపమేకాని ఇతరముకాదు.)
“ప్రకృతం యన్నిషిద్ధాన్యత్
సాధ్యతే సాపహ్నతిః” -
“నేదం
నభోమండలమంబురాశిర్నైతాశ్చ తారాః నవఫేన భంగాః |
నాయం
శశీకుండలితః ఫణీంద్రో నాసౌ కలంకః శయితో మురారిః ||“.
(ఉన్నదానిని
నిషేధించి - కాదని చెప్పి - ఇంకొకదానిని సాధించి చెప్పుట - ఈ పైన కనబడునది ఆకాశము కాదు, అది
సముద్రము; ఆకాశములో కనబడునవి నక్షత్రములు కావు, సముద్రముపు నీటిలోని నురగబిందువులు,
ఆకాశములో కనబడుచున్నవాడు చంద్రుడుకాడు, కుండలమువలె - చుట్టుకొనియున్న పామువలె - ఉన్న
శేషుడు. ఆ చంద్రునిలో కనబడునది మచ్చకాదు - అదియే శేషునిమీద పవళించియున్న శ్రీమహా విష్ణువే -
అయినప్పటికీ దానిని కప్పిపుచ్చి ఆ దృశ్యమును ఆకాశమువలె, అందులోని నక్షత్రములవలె, చంద్రునివలె,
అందులోని మచ్చవలె నగపడుట అపహ్నవము.)
“సీ. భువి
విషయాకృష్టభూతంబు లైన యింద్రియములచేతను దివిరి మనము
దగ విషయాసక్తి దగిలి యాంతర మైన మహిత
విచారసామర్థ్య మెల్ల
శరకుశాది స్తంబ జాలంబు హదత్రోయములు
గ్రోలుగతి గ్రమంబున హరించు
నీ
రీతి నంతర్విచార సామర్థ్యంబు నపహృతం బైన పూర్వపరాను
తే. మేయ సంధానరూప
సంస్మృతి నశించు
నది నశించిన విజ్ఞాన మంత
దొలగు
నట్టి విజ్ఞాననాశంబు
నార్యజనులు
స్వాత్మ కది
సకలాపహ్నవం బటండ్రు.”
“వ.
అదియునుం గాక”ఆత్మన స్తు కామాయ సర్వం ప్రియం భవతి” యను వేద వచనంబుజేసి విషయంబులకుం
బ్రియతమంబై యాత్మోపాధికంబు నొంది, యాత్మాపహ్నవంబునం బాటిల్లు స్వార్థనాశం బెద్ది గలుగు దానికంటె లోకంబున
నధికం బైన స్వార్థనాశంబు లేదు. అది యెట్లనిన సర్వార్థనాశంబునకు స్థైర్యంబు నొందించునట్టి
యర్థకామాభిధ్యానంబునం ద ద్దేతుకం బైన స్వార్థనాశంబునం బరోక్షాపరోక్షరూప జ్ఞానంబు నశించుం గావున
నాత్మాపహ్నవంబున కంటె నధికం బైన సర్వార్థనాశంబు లేదు.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 4 - 22 –
625-626)
Transliteration
(eṃḍamāvulaṃdali
jalamuvale) unnadānini kappipuccuṭa.
apahnavōnāma
mahōpaniṣatsu paṃcamādhyāyē - “marubhūmē jalaṃ sarvaṃ
marumātramēva”(śrutiḥ.)
apahnavamanagā
mahōpaniṣattunaṃdu 5va adhyāyamulō ceppabaḍinadi. ‘eḍārilō - marubhūmi
yaṃdu lēkanē kanupiṃceḍi eṃḍamāvula jalamaṃtayunu ā marubhūmiyē’ aṭulanē
pariśuddhamagu paramātmayaṃdu kalpitamagu nāmarūpādikamagu
prapaṃcamaṃtayu ā paramātma svarūpamēkāni itaramukādu.)
“prakṛtaṃ
yanniṣiddhānyat sādhyatē sāpahnatiḥ” -
“nēdaṃ
nabhōmaṃḍalamaṃburāśirnaitāśca tārāḥ navaphēna bhaṃgāḥ |
nāyaṃ
śaśīkuṃḍalitaḥ phaṇīṃdrō nāsau kalaṃkaḥ śayitō murāriḥ ||“.
(unnadānini
niṣēdhiṃci - kādani ceppi - iṃkokadānini sādhiṃci ceppuṭa - ī paina
kanabaḍunadi ākāśamu kādu, adi samudramu; ākāśamulō kanabaḍunavi
nakṣatramulu kāvu, samudramupu nīṭilōni nuragabiṃduvulu, ākāśamulō
kanabaḍucunnavāḍu caṃdruḍukāḍu, kuṃḍalamuvale - cuṭṭukoniyunna pāmuvale
- unna śēṣuḍu. ā caṃdrunilō kanabaḍunadi maccakādu - adiyē śēṣunimīda
pavaḷiṃciyunna śrīmahā viṣṇuvē - ayinappaṭikī dānini kappipucci ā
dṛśyamunu ākāśamuvale, aṃdulōni nakṣatramulavale, caṃdrunivale, aṃdulōni
maccavale nagapaḍuṭa apahnavamu.)
“sī.
bhuvi viṣayākṛṣṭabhūtaṃbu laina yiṃdriyamulacētanu diviri manamu
daga
viṣayāsakti dagili yāṃtara maina mahita vicārasāmarthya mella
śarakuśādi
staṃba jālaṃbu hadatrōyamulu grōlugati gramaṃbuna hariṃcu
nī
rīti naṃtarvicāra sāmarthyaṃbu napahṛtaṃ baina pūrvaparānu
tē. mēya saṃdhānarūpa saṃsmṛti
naśiṃcu
nadi naśiṃcina vijñāna maṃta
dolagu
naṭṭi vijñānanāśaṃbu
nāryajanulu
svātma kadi sakalāpahnavaṃ
baṭaṃḍru.”
“va.
adiyunuṃ gāka”ātmana stu kāmāya sarvaṃ priyaṃ bhavati” yanu vēda
vacanaṃbujēsi viṣayaṃbulakuṃ briyatamaṃbai yātmōpādhikaṃbu noṃdi,
yātmāpahnavaṃbunaṃ bāṭillu svārthanāśaṃ beddi galugu dānikaṃṭe lōkaṃbuna
nadhikaṃ baina svārthanāśaṃbu lēdu. adi yeṭlanina sarvārthanāśaṃbunaku
sthairyaṃbu noṃdiṃcunaṭṭi yarthakāmābhidhyānaṃbunaṃ da ddētukaṃ baina
svārthanāśaṃbunaṃ barōkṣāparōkṣarūpa jñānaṃbu naśiṃcuṃ gāvuna
nātmāpahnavaṃbuna kaṃṭe nadhikaṃ baina sarvārthanāśaṃbu lēdu.”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 4 - 22 – 625-626)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.