“భూమిరాసో అనలో వాయుః ఖం మనో
బుద్ధిరేవ చ |
అహంకార
ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్ట ధా (రేవచ) |
అపరే య మితస్త్వన్యాం
ప్రకృతిం విద్ధిమే పరాం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 4, 5)
(భూమ్యాది
పంచభూతాని సూక్ష్మావస్థా త్మకాని హి |
తస్మా
త్త్రీణ్యేవ లక్ష్యంతే మనో (అ) హంకార ఇష్యతే |
బుద్ధి శబ్దా
న్మహత్తత్వమహంకారస్య కారణం |
అవిద్యాత్మక
మవ్యక్తం వాసనా నంత్య వాసితం |
అహంకార వదేనోక్తం
సర్వకారణ కారణం |
ఇత్యే ముక్త
రీత్యేయం సాక్షి భాసత యాక్షగా |
శక్తిః
పరమ ధర్మాఖ్యా (అ) నిర్వాచ్యా త్రిగుణాత్మికా |
ప్రకారై రష్ట
భిర్భేదమాగతా పారమేశ్వరీ |
అంతర్భూతో
(అ) త్ర సర్వోపి జడవర్గః ప్రపంచ గః |
అష్టధోక్తా
నికృష్టేయం ప్రకృతిర్మలి నానృతా |
సంసార బంధ
రూపత్వాత్ పరార్థత్వా జ్జడత్వతః ||“. (గీతా భావప్రకాశము- 7 - 28 to 34)
(పంచభూతములు
- అనగా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి -, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఈ ఎనిమిది
విధములుగా నా అపరాప్రకృతి యున్నది. దీనికంటె వేరైనది పరా ప్రకృతి - ఇక్కడ పంచభూతములు తన్మాత్రలు,
సూక్ష్మరూపములో నున్నవి, పంచీకరణము కానివి. బుద్ధి అనగా అహంకారమునకు కారణమైన మహత్తత్త్వము -
మనస్సు అనగా అహంకారము. ఈ ప్రకృతి సత్వరజస్తమములను మూడుగుణములు గలది. ఇది అనిర్వాచ్యము -
ఇట్టిదని నిర్వచనము చేయుటకు వీలుకానిది. జడరూపమైన ఈ ప్రపంచము అంతయు ఈ ప్రకృతి లోనే
ఇమిడియున్నది. ఇది నికృష్టమైనది, మలినమైనది, సంసారములో జీవులను బంధించునది. ఈ అపరాప్రకృతి
భగవంతుని యుక్క పరాప్రకృతి, చిచ్ఛక్తి రూపమైన దానితో కలిసి సర్వ ప్రపంచకము - ప్రపంచములోని సమస్త
వస్తువులుగా మారుచున్నది. ఈ రెండు శక్తులు భగవంతునివే - సమస్త జీవులకు భగవంతుడు తన
చిచ్ఛక్తి రూపముతో ప్రాణముపోయగా - చైతన్యము కలిగించగా - అపరశక్తి రూపములో వాటికి రూపము శరీరమును
- కలిగించును - ఈ రెండు శక్తులు కలియుటవలననే ప్రకృతి పురుషుల సం యోగము వలననే -
(combination of matter and Energy వలననే) ప్రపంచము సృష్టి యగుచున్నది.)
“మాయాధ్యక్షేణప్రకృతిః సూయతే సచారచరం” (శ్రీమద్భగవద్గీత- 9 -10.) (నేను ఈ ప్రకృతిని అధిష్టించి
యుండుటవలన ప్రకృతి చరాచరములతో ఈ జగత్తును సృష్టించుచున్నది - కనుచున్నది.) బీజం మాం
సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం” (శ్రీమద్భగవద్గీత- 7 - 10)
(సమస్త
భూతములకు బీజము నేనే అని తెలుసుకొనుము.)
“మమ
యోనిర్మహద్భ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం |
సంభవః సర్వభూతానాం తతో భవతి
భారత ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 3)
(ఇక్కడ
బ్రహ్మ అనగా ప్రకృతి - ఈ ప్రకృతి నేను గర్భము ధరింపచేయుస్థానము - వస్తువు - దానినుండి సమస్త
భూతములు పుట్టుచున్నవి - “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” (ప్రపంచమునకు తలిదండ్రులైన
పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించు చున్నాను - అట్లే లక్ష్మీనారాయణులకు, సీతారాములకు, (matter
and Energy కి), ప్రకృతి పురుషులకు నమస్కరించుచున్నాను.) - (చూడుము -
‘ప్రకృతి’,‘సృష్టి’‘పురుషుడు’)
(కుమ్మరివాడు
కుండలు చేయుటకు మట్టి కావలయును, బంగారపు పనివానికి బంగారపు ఆభరణములు చేయుటకు బంగారము
కావలెను. అట్లే భగవంతుని ప్రపంచములోని వస్తువులు చేయుటకు ప్రకృతి (material - raw
material.) కావలెను - అందుచేత మొదట ఈ అపరాప్రకృతిని భగవంతుడు సృష్టించెను - ‘ప్రథమం
కృతం’ - (మొదట చేయబడినది - సృష్టించబడినది) - కనుక ప్రకృతి అని చెప్ప బడినది.)
“ఏ
తద్యోనీని భూతాని సర్వాణీత్యుపథారయ |” (శ్రీమద్భగవద్గీత - 7 - 6)
(ప్రపంచములోనున్న
సమస్తభూతములకు ఈ అపరా ప్రకృతియే యోని - జన్మించుచోటు - దీని నుండియే సమస్త భూతములు -
ఒకదానిలోనుండి ఒకటిగా - పుట్టుచున్నవి. మొదటి జన్మస్థానము కనుక మహద్యోని అని చెప్పబడుచున్నది. లేక,
ఈ అపరాప్రకృతియే భగవంతుని చిచ్ఛక్తి అయిన పరాప్రకృతితో కలిసి ప్రపంచములోని సమస్త భూతములుగా
మారుచున్నది. అందుచేత అది మహద్యోని. ప్రతివస్తువులోను ఈ ప్రకృతి అంశ, భగవంతుని అంశ - పరాశక్తి
అంశ - ఉన్నది. అందుచేత ఒకవస్తువులోనుండి ఇంకొకటి పుట్టినపుడు మొదటి వస్తువులోనున్న ప్రకృతి
అంశ రెండవ వస్తువునకు – మొదటవస్తువులో నుండి పుట్టిన దానికి - యోని. ఈ ప్రకారముగా వెనుకకు
వెళ్ళగా, వెళ్ళగా, మొట్ట మొదటి యోని అపరాప్రకృతి. అందుచేత అది మూల ప్రకృతి, మహద్యోని.)
“సర్వయోనిషు కౌంతేయ,
మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోని రహం,
బీజప్రదః పితా ||. (శ్రీమద్భగవద్గీత- 14 - 4)
(ఏ
యే యోనులనుండి ఏ యే వస్తువులు - భూతములు - పుట్టినను వాటి అన్నింటికి మహద్యోని, మూలప్రకృతి -
మొదటి యోని ప్రకృతియే - వాటి అన్నింటికి బీజము మొదటినుండి నా పరాశక్తి లేక చిచ్ఛక్తితో ఉన్న నేనే. అందుచేత
మొదటినుండి ఇప్పటివరకు ఈ సృష్టిలోని అన్ని భూతములకు తండ్రిని నేనే. ఈ అపరాప్రకృతియే
కన్నతల్లి.)
“మూల ప్రకృతి రపి
కృతిర్మహదాద్యాః ప్రకృతి వికృతయః | సప్త” (సాంఖ్యా - కా - 3)
(ఎనిమిది
విధములుగా నుండిన మూల ప్రకృతిలో మూల ప్రకృతి అవికృతి - అనగా ఇంకొక దానిలోనుండి పుట్టినది కాదు -
వికారము చెందనిది, మార్పు చెందనిది. అది భగవంతుని శక్తియే యగుటచేత భగవంతుని నుండి విడిపోయి వేరుగా
ఇంకొక దానిలోనుండి పుట్టినదికాదు –
“ప్రకృతిం పురుషం
చైవవిద్ధ్యనాదీ ఉభావపి |”
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి
ప్రకృతి సంభవాన్ ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 19)
(ప్రకృతి,
పురుషుడు అనాదులు, మహదాదులు - అనగా, మహత్తత్త్వము మొదలగునవి - ప్రకృతియొక్క వికృతులు,
వికారములు, ప్రకృతిలోనుండి పుట్టినవి - ప్రకృతి యొక్క మార్పులు.)
Transliteration
“bhūmirāsō analō vāyuḥ
khaṃ manō buddhirēva ca |
ahaṃkāra itīyaṃ
mē bhinnā prakṛti raṣṭa dhā (rēvaca) |
aparē
ya mitastvanyāṃ prakṛtiṃ viddhimē parāṃ ||“. (śrīmadbhagavadgīta - 7 -
4, 5)
(bhūmyādi
paṃcabhūtāni sūkṣmāvasthā tmakāni hi |
tasmā
ttrīṇyēva lakṣyaṃtē manō (a) haṃkāra iṣyatē |
buddhi śabdā
nmahattatvamahaṃkārasya kāraṇaṃ |
avidyātmaka mavyaktaṃ
vāsanā naṃtya vāsitaṃ |
ahaṃkāra vadēnōktaṃ
sarvakāraṇa kāraṇaṃ |
ityē mukta rītyēyaṃ
sākṣi bhāsata yākṣagā |
śaktiḥ
parama dharmākhyā (a) nirvācyā triguṇātmikā |
prakārai raṣṭa
bhirbhēdamāgatā pāramēśvarī |
aṃtarbhūtō (a)
tra sarvōpi jaḍavargaḥ prapaṃca gaḥ |
aṣṭadhōktā nikṛṣṭēyaṃ
prakṛtirmali nānṛtā |
saṃsāra
baṃdha rūpatvāt parārthatvā jjaḍatvataḥ ||“. (gītā bhāvaprakāśamu- 7 -
28 to 34)
(paṃcabhūtamulu
- anagā ākāśamu, vāyuvu, agni, nīru, bhūmi -, manassu, buddhi,
ahaṃkāramu anu ī enimidi vidhamulugā nā aparāprakṛti yunnadi. dīnikaṃṭe
vērainadi parā prakṛti - ikkaḍa paṃcabhūtamulu tanmātralu,
sūkṣmarūpamulō nunnavi, paṃcīkaraṇamu kānivi. buddhi anagā
ahaṃkāramunaku kāraṇamaina mahattattvamu - manassu anagā ahaṃkāramu. ī
prakṛti satvarajastamamulanu mūḍuguṇamulu galadi. idi anirvācyamu -
iṭṭidani nirvacanamu cēyuṭaku vīlukānidi. jaḍarūpamaina ī prapaṃcamu
aṃtayu ī prakṛti lōnē imiḍiyunnadi. idi nikṛṣṭamainadi, malinamainadi,
saṃsāramulō jīvulanu baṃdhiṃcunadi. ī aparāprakṛti bhagavaṃtuni yukka
parāprakṛti, cicchakti rūpamaina dānitō kalisi sarva prapaṃcakamu -
prapaṃcamulōni samasta vastuvulugā mārucunnadi. ī reṃḍu śaktulu
bhagavaṃtunivē - samasta jīvulaku bhagavaṃtuḍu tana cicchakti rūpamutō
prāṇamupōyagā - caitanyamu kaligiṃcagā - aparaśakti rūpamulō vāṭiki
rūpamu śarīramunu - kaligiṃcunu - ī reṃḍu śaktulu kaliyuṭavalananē
prakṛti puruṣula saṃ yōgamu valananē - (combination of matter and Energy
valananē) prapaṃcamu sṛṣṭi yagucunnadi.) “māyādhyakṣēṇaprakṛtiḥ sūyatē
sacāracaraṃ” (śrīmadbhagavadgīta- 9 -10.) (nēnu ī prakṛtini adhiṣṭiṃci
yuṃḍuṭavalana prakṛti carācaramulatō ī jagattunu sṛṣṭiṃcucunnadi -
kanucunnadi.) bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanaṃ”
(śrīmadbhagavadgīta- 7 - 10)
(samasta
bhūtamulaku bījamu nēnē ani telusukonumu.)
“mama
yōnirmahadbhrahma tasmin garbhaṃ dadhāmyahaṃ |
saṃbhavaḥ
sarvabhūtānāṃ tatō bhavati bhārata ||“. (śrīmadbhagavadgīta - 14 -
3)
(ikkaḍa
brahma anagā prakṛti - ī prakṛti nēnu garbhamu dhariṃpacēyusthānamu -
vastuvu - dāninuṃḍi samasta bhūtamulu puṭṭucunnavi - “jagataḥ pitarau
vaṃdē pārvatī paramēśvarau” (prapaṃcamunaku talidaṃḍrulaina pārvatī
paramēśvarulaku namaskariṃcu cunnānu - aṭlē lakṣmīnārāyaṇulaku,
sītārāmulaku, (matter and Energy ki), prakṛti puruṣulaku
namaskariṃcucunnānu.) - (cūḍumu - ‘prakṛti’,‘sṛṣṭi’‘puruṣuḍu’)
(kummarivāḍu
kuṃḍalu cēyuṭaku maṭṭi kāvalayunu, baṃgārapu panivāniki baṃgārapu
ābharaṇamulu cēyuṭaku baṃgāramu kāvalenu. aṭlē bhagavaṃtuni
prapaṃcamulōni vastuvulu cēyuṭaku prakṛti (material - raw material.)
kāvalenu - aṃducēta modaṭa ī aparāprakṛtini bhagavaṃtuḍu sṛṣṭiṃcenu -
‘prathamaṃ kṛtaṃ’ - (modaṭa cēyabaḍinadi - sṛṣṭiṃcabaḍinadi) - kanuka
prakṛti ani ceppa baḍinadi.)
“ē
tadyōnīni bhūtāni sarvāṇītyupathāraya |” (śrīmadbhagavadgīta - 7 -
6)
(prapaṃcamulōnunna
samastabhūtamulaku ī aparā prakṛtiyē yōni - janmiṃcucōṭu - dīni nuṃḍiyē
samasta bhūtamulu - okadānilōnuṃḍi okaṭigā - puṭṭucunnavi. modaṭi
janmasthānamu kanuka mahadyōni ani ceppabaḍucunnadi. lēka, ī
aparāprakṛtiyē bhagavaṃtuni cicchakti ayina parāprakṛtitō kalisi
prapaṃcamulōni samasta bhūtamulugā mārucunnadi. aṃducēta adi mahadyōni.
prativastuvulōnu ī prakṛti aṃśa, bhagavaṃtuni aṃśa - parāśakti aṃśa -
unnadi. aṃducēta okavastuvulōnuṃḍi iṃkokaṭi puṭṭinapuḍu modaṭi
vastuvulōnunna prakṛti aṃśa reṃḍava vastuvunaku – modaṭavastuvulō nuṃḍi
puṭṭina dāniki - yōni. ī prakāramugā venukaku veḷḷagā, veḷḷagā, moṭṭa
modaṭi yōni aparāprakṛti. aṃducēta adi mūla prakṛti, mahadyōni.)
“sarvayōniṣu kauṃtēya,
mūrtayaḥ saṃbhavaṃti yāḥ |
tāsāṃ
brahma mahadyōni rahaṃ, bījapradaḥ pitā ||. (śrīmadbhagavadgīta- 14 -
4)
(ē
yē yōnulanuṃḍi ē yē vastuvulu - bhūtamulu - puṭṭinanu vāṭi anniṃṭiki
mahadyōni, mūlaprakṛti - modaṭi yōni prakṛtiyē - vāṭi anniṃṭiki bījamu
modaṭinuṃḍi nā parāśakti lēka cicchaktitō unna nēnē. aṃducēta
modaṭinuṃḍi ippaṭivaraku ī sṛṣṭilōni anni bhūtamulaku taṃḍrini nēnē. ī
aparāprakṛtiyē kannatalli.)
“mūla
prakṛti rapi kṛtirmahadādyāḥ prakṛti vikṛtayaḥ | sapta” (sāṃkhyā - kā -
3)
(enimidi
vidhamulugā nuṃḍina mūla prakṛtilō mūla prakṛti avikṛti - anagā iṃkoka
dānilōnuṃḍi puṭṭinadi kādu - vikāramu ceṃdanidi, mārpu ceṃdanidi. adi
bhagavaṃtuni śaktiyē yaguṭacēta bhagavaṃtuni nuṃḍi viḍipōyi vērugā
iṃkoka dānilōnuṃḍi puṭṭinadikādu –
“prakṛtiṃ puruṣaṃ
caivaviddhyanādī ubhāvapi |”
vikārāṃśca
guṇāṃścaiva viddhi prakṛti saṃbhavān ||“. (śrīmadbhagavadgīta - 13 -
19)
(prakṛti,
puruṣuḍu anādulu, mahadādulu - anagā, mahattattvamu modalagunavi -
prakṛtiyokka vikṛtulu, vikāramulu, prakṛtilōnuṃḍi puṭṭinavi - prakṛti
yokka mārpulu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.