తప్పు
పనిచేయుట; విహితమగుపని చేయకుండుట; దైవాపరాధములు.
“యానైర్వా పాదుకైర్వాపి
గమనం భగవద్గృహే |
దేవోత్సవాద్య సేవా
చ ప్రమాదశ్చ తదగ్రతః |
ఉచ్చిష్టే చైవ వాశౌచే
భగవద్వందనాదికం |
ఏకహస్త
ప్రణామశ్చ తత్పరస్తాత్ప్రదక్షిణం |
పాద ప్రసారణం
చాగ్రే, తథా పర్యంక బంధనం |
శయనం భక్షణం చాసి
మిథ్యా భాషణ మేవచ |
ఉచ్ఛైర్బాషా మిథో
జల్పారోచనాని చ నిగ్రహః |
నిగ్రహానుగహ చైవ
స్త్రీ నృషు క్రూర భాషణం |
కంబళానరణం చైవ
పరనిందా పరస్తుతిః |
అశ్లీల భాషణం చైవ
హ్య ధోవాయు విమోక్షణం |
శక్తౌ గౌణోప
చారస్తు హ్య నివేదిత భక్షణం |
తత్తత్కాలోద్భవానాం చ
ఫలాదీనా మనర్పణం |
వినియుక్తా
నశిష్టస్య ప్రదానం వ్యంజన స్యహి |
వృష్టీకృతాసనం
చైవపరేషామభి వందనం |
గురౌమేనం నిజస్తోత్రం
దేవతానిందనం తథా |
అపరాథాః తథా
విష్ణోః ద్వాత్రిం శత్పరికీర్తితాః||“.
(వాహనములో
వెళ్ళుచూగాని, పాదుకలు తొడుగుకొనిగాని దేవాలయములోనికి వెళ్ళుట; దేవునకు చేయు ఉత్సవములందు సేవ
చేయకుండుట; ఉత్సవముల ముందు ప్రమాదమైన పనులు చేయుట; శుచిగా నుండకయే దేవునకు నమస్కారము
చేయుట; ఒక్కచేతితో దేవునికి నమస్కరించుట; దేవునిముందట కాళ్ళు జాచుకొని కూర్చుండుట; పక్క వేయుట;
దేవుని యెదుట పడుకొనుట; తినుట; అబద్ధములాడుట; గట్టిగా మాటలాడుట, క్రూరమగు మాటలాడుట; పరులను
నిందించుట; పరులను స్తోత్రము చేయుట; ఆడరాని మాటలాడుట; అపానవాయువు విడుచుట; భగవంతునికి
నివేదించక భుజించుట; ఆయాకాలములలో పండు పండ్లను సమర్పించకుండుట; ఇతరులకు వందనము చేయుచు
గురువు ఎడల మౌనముగా నుండుట; తనకుతాను స్తొత్రము చేసుకొనుట; దేవుని నిందించుట; ఇవి
మొదలగునవి శ్రీమహావిష్ణువు యడల చేయు అపరాధములు - తప్పులు.)
“వైష్ణవ గ్రందేషు నిమ్నాంకితాః
చతుష్షష్టిరపరాధాః ప్రతిపాదితాస్సంతి : -
1.
శ్రీభగవాన్ కించిద్దేవతా తత్వ విశేషోవేతి మాన్యతా. 2. వేదేషు గ్రంధబుద్ధిః, పౌరుషేయత్వ బుద్ధిర్వా. 3.
భక్తేషు జాతిభేధ బుద్ధిః. 4. గురౌ సాధారణమనుష్యః ఇతి బుద్ధిః. 5. భగవతః ప్రతిమా కాష్టం ప్రస్తరో,
ధాత్రీ పత్రం మృత్తికావా ఇతి ధారణా, 6. భగవతః ప్రసాదః ప్రసాదః సాధారణ ఖాద్యవస్తు ఇతి బుద్ధిః7.
భగవతః చరణోదకం సాధారణం జలం ఇతి ధారణా8. తులసీ సాధారణ వృక్షవిశేషః ఇతి మాన్యతా9. గౌః సాధారణః
పశురితి బుద్ధిః 10. శ్రీమద్భాగవతం, శ్రీమద్భగవద్గీతావా సాధారణం పుస్తకం ఇతి బోధః. 11. భగవతః
లీలామానవ కృతయః ఇతిమాన్యతా. 12. సాంసారిక ప్రేమా స్త్రీ సుఖేనవా సహ భగవతః లీలాయాః తుల్యతా పాదనం.
13. గోప్యః భగవతః దృష్టౌ పరస్త్రియః ఇతి ధారణా. 14. రాసలీలాయం కామచేష్టా బుద్ధిః. 15. భగవతః
మహోత్సవసమ యే స్పర్శా స్పర్శ బుద్ధిః. 16. ఈశ్వరం శాస్త్రాణి చ నస్వీకృత్య నాస్తిక తావలంబనం. 17.
సందేహ పూర్వకం ధర్మస్యాచరణం. 18. ధర్మపాలనాలస్యం 19. బాహ్య వృత్తేన భక్తానాం పరీక్షణం. 20.
సాదు మహాత్మనాం గుణదోషాణామాలోచనం. 21. అహముత్తమో అస్తీతి మాన్యతా. 22. కస్యాపి దేవస్య శాస్త్రస్యవా
నిందా. 23. భగవతః విగ్రహం పృష్ట తః కృత్వా ఉపవేశనం. 24. భగవతః విగ్రహస్య సమక్షే ఉపావహే
పాదయోః కృత్వా గమనం. 25. భగవతః విగ్రహస్య సమక్షే మూలాధారణం. 26. భగవతః విగ్రహస్య సమక్షే
యష్టిం గృహత్వా గమనం. 27. భగవతః విగ్రహస్య సమక్షే నీలం వస్త్రం పరిధాయ గమనం. 28. దంతధావనం
గండూషాం శ్చా కృత్వైవ భగవద్విగ్రహస్య సమక్షే గమనం. 29. మల త్యాగా న్మైధునాదేర్వా పశ్చాత్ వస్త్ర
పరివర్తనం వినైవ మందిరే ప్రవేశః 30. భగవతో విగ్రహస్య సమక్షే తాంబూల చర్వణం. 31. భగవతః
విగ్రహస్య హస్తపాద ప్రసారణం 32. భగవతః విగ్రహస్య సమక్షే ఉచ్ఛైస్స్వరేణ హసనం. 33. కుచేష్టా కరణం
చ. 34. స్త్రీణాం చతురిక్షు భ్రమణం. 35. క్రోధః వ్యాపారః. 36. భగవతః విగ్రహస్య సమక్షే
కస్యాప్యన్య సాభివందనం. 37. దుర్గంధం వస్తు భుక్త్వా దుర్గంధ మారీ భవనాత్ ప్రాగేవ మందిరే గమనం.
38. మాదక ద్రవ్యాణాం సేవనం. 39. కస్యాప్యవమాననా హననం వా. 40. కామక్రోధా దీనాం చేష్టా. 41.అతిధేః సా
ధోర్వా సమాదరో ప్రమాదః. 42. అహం భక్తో ధర్మాత్మా పండితః పుణ్యాత్మా వా ఇతి మన్యతా. 43. నాస్తికానాం
వ్యభిచారిణాం హింసకానాం లోభినాం మిథ్యా భాషిణాంచ మనుష్యాణాం సంగతిః. 44. విపత్తా నీశ్వరే దోషారోపణం. 45.
పాపాయ ధర్మస్యానుష్టానం. 46. కస్మైచిత్ కించిదపికష్టం దత్వా’ అహం ధార్మికః” ఇతి మాన్యతా. 47. స్త్రియాః
పుతస్య పరివారస్య ఆశ్రితానాం దీనానాం సాధూ నాంచ పాలన పోషణ యోరు పేక్షణం. 48. కిమపి స్వీయం భోగ్యం
మత్వాతస్య భగవతే నివేదనం అనివేదితస్య వా వస్తునో భోగః 49. నిజేష్ట దేవస్య నామ్నః శపధీకరణం. 50.
ధర్మం భగవతః నామ చ విక్రీయధి నో పార్జనం. 51. స్వీయమిష్టదేవం విహాయ అన్యస్మాత్ ఆశాకరణం. 52. శాస్త్ర
మర్యా దాయాః భంజనం. 53. బ్రహ్మజ్ఞానా భావేపి బ్రహ్మజ్ఞానివదా చరణం. 54. సంప్రదాయ భేదేన వైష్ణవానాం
కతమస్మిన్ ఉచ్ఛ నీచబుద్ధిః. 55. దేవవదా చరణం. 56. అవతారాణాం లీలాసు తారతమ్యం స్థాపయిత్వా తాసు
నిందనం. 57. పరిహాసేపి కించిత్ ప్రతి భవానేవ భగవా నస్తీతి కథనం. 58. భగవాన్ కస్యాపి ముఖాపేక్ష్య స్తీతి
భ్రాంత్యాపి మనసి ధారణం. 59. లోభవశాత్ కస్మైచిత్ భగవద్ప్రసాదస్య చరణోదకస్య వాదానం. 60. భగవతః
చిత్రపటస్య ప్రతిమాయాః నామ్నోవా అవమాననా. 61. కస్యాపి జీవస్య కేనాపి ప్రకారేణ సంతాపనం, భయదర్శనం, అధవా,
కస్యాపి అహితా చరణం. 62. తర్కవితర్కయోః పరాజయే సతి సిద్ధాంత స్థాపన క్షమతా యాః అభావేసతి వా ఆస్తికతాయాః
త్యాగః. 63. భగవదవ తారాణాం జన్మ కర్మసు సాధారణత్వ బుద్ధిః - 64. భగవతః యుగళ రూపే ద్వైతబుద్ధి
కరణం“.
(వైష్ణవ
గ్రంధములందు అరువదినాలుగు అపరాధములు చెప్ప బడియున్నవి : - 1. భగవంతుడు ఒక చిన్న దేవత,
లేక, తత్వములలో ఒక విశేషమైన తత్వము అని తలచుట. 2. వేదములు ఒక గ్రంధమని, అవి అపౌరుషే
యములుకావు, ఎవరో ఒక పురుషుడు వ్రాసినవి అను బుద్ధి కలిగియుండుట, 3.భక్తులందు జాతిభేదము
చూచు బుద్ధి కలిగియుండుట. 4. గురువు యడల ఇతను అందఱి వలె సాధారణ మనిషి యే యని బుద్ధి
కలిగియుండుట. 5. భగవంతుని యొక్క విగ్రహము ఒక కర్ర, ఒక లోహముతో చేసిన బొమ్మ, లేక మట్టితో చేసిన
బొమ్మ అని అభిప్రాయము కలిగియుండుట. 6. భగవంతుని ప్రసాదము సాధారణమైన వస్తువే యనుకొనుట. 7.
భగవంతునిపాదములు కడిగిన జలము - పాదోదకము - సాధారణమైన నీరే యని తలచుట. 8. తులసి సాధారణమైన -
అన్నింటివంటి ఒక చెట్టే యని తలచుట. 9. గోవు సాధారణమైన - మిగిలిన పశువులవంటి పశువే యను బుద్ధి
కలిగియుండుట. 10. శ్రీమద్భాగవతము, శ్రీమద్భగవద్గీత - ఇవి సాధారణమైన ఇతర పుస్తకముల వంటివే
అనుకొనుట. 11. భగవంతుని లీలలు మానవులు చేయుపనులే యని అనుకొనుట. 12. సంసారమందు గల ప్రేమ
చేతనో, స్త్రీ సంభోగసుఖము చేతనో భగవంతుని లీల సమానమైనదని పోల్చుట. 13. భగవంతుని దృష్టిలో గోపికలు
పరస్త్రీలని అనుకొనుట. 14. శ్రీకృష్ణుడు గోపికలతో చేసిన రాసక్రీడ మన్మధ చేష్ట యను బుద్ధి
కలిగియుండుట. 15. భగవంతుని ఉత్సవములందు స్పర్శా స్పర్శ బుద్ధి కలిగియుండుట. 16. భగవంతుని
శాస్త్రములను వదలివేసి నాస్తికమతము నవలంభించుట - భగవంతుడు లేడు అను బుద్ధి కలిగియుండుట 17.
సందేహముతో ధర్మము నాచరించుట. 18. ధర్మమును పాలించుట యందు - ధర్మముగా ప్రవర్తించుటలో
ఆలస్యము చేయుట. 19. భక్తులను బాహ్య వృత్తులవలన – వ్యాపారముల వలన వారి భక్తి పరీక్షించుట,
20. సాధువుల గుణములందు - మహాత్ముల గుణములందు దోషముల గుఱించియే ఆలోచించుట. 21. నేనే
ఉత్తముడను, గొప్పవాడను అని అభిమానము కలిగియుండుట, 22. ఏదేని ఒక దేవునిగాని, శాస్త్రమునుగాని
నిందించుట. 23. భగవంతుని విగ్రహము ప్రక్క - పృష్టము పెట్టి కూర్చునుట. 24. భగవద్విగ్రహ
సమక్షములో పాదములు ఉపావహముచేసి వెళ్ళుట. 25. భగవంతుని విగ్రహము ముందట పూలమాల ధరించుట.
26. భగవంతుని విగ్రహము ముందు కర్ర పట్టుకొని నడుచుట 27. భగవంతుని విగ్రహసమక్షములో నీలి
వస్త్రము కప్పుకొని నడచుట. 28. పళ్ళుతోముకొనక భగవంతుని విగ్రహము ముందుకు వెళ్ళుట. 29.
మలము విడిచిన తర్వాత, మైధునము తర్వాత వస్త్రము మార్చుకొనక దేవాలయములో ప్రవేశించుట. 30. భగవంతుని
విగ్రహము వైపు కాళ్ళు చేతులు జాచుట. 31. భగవంతుని విగ్రహముముందు తాంబూలము సేవించుట. 32.
భగవంతుని విగ్రహముముందు గట్టిగా నవ్వుట. 33. చెడ్డ పనులు చేయుట. 34. స్త్రీలు నాలుగు
దిక్కుల తిరుగుట. 35. క్రోధముతో పనులు చేయుట. 36. భగవంతుని విగ్రహము ముందు ఇతరునికి
ఎవరికైనా నమస్కరించుట. 37. కంపుకొట్టు ఆహారముతిని ఆ దుర్వాసన హరించక ముందే దేవాలయములో
ప్రవేశించుట. 38. మాదక ద్రవ్యములను సేవించుట. 39. ఎవరినైనను అనుమానించుట. 40. కామము,
క్రోధము మొదలగు వాటితో పనిచేయుట. 41. అతిధినిగాని, సాధుజనులనుగాని ఆదరించుటలో ప్రమాదము
కలుగచేయుట. 42. నేను భక్తుడను, ధర్మాత్ముడను, పండితుడను, పుణ్యాత్ముడను, అను అభిమానము
కలిగియుండుట. 43. నాస్తికులయొక్క, వ్యభిచారులయొక్క, హింసచేయువారియొక్క, లోభులయొక్క, అబద్ధమాడువారియొక్క
సాంగత్యము చేయుట. 44. ఆపదకలిగినప్పుడు భగవంతుని మీదనే నేరమారోపించుట. 45. పాపము కొఱకు
ధర్మముననుసరించుట. 46. ఎవరికైనా ఏకొంచెమైనా ఇచ్చి, నేను ధర్మాత్ముడను, ధార్మికుడను,
ధర్మముచేయువాడను అని అభిమానము కలిగియుండుట. 47. స్త్రీలను, పుత్రుని, పరివారమును,
ఆశ్రయించుకొనియున్న వారిని, దీనులను, సాధువులను పాలించుటయందు - కాపాడుటయందు, పోషించుటయందు -
ఉపేక్షించుట. 48. దేనినైనా తాను భుజించవలసినదే యని తలచి భగవంతునికి నైవేద్యము పెట్టుట, లేక,
భగవంతునికి నైవేద్యముగా పెట్టని వస్తువును భుజించుట. 49. తన ఇష్ట దేవతయొక్క పేరుమీద శపధము
చేయుట. 50. ధర్మమును భగవన్నామమును అమ్మి ధన మార్జించుట. 51. తన ఇష్ట దేవతనువదలి
ఇతరదైవమునందు ఆశకలిగియుండుట.52. శాస్త్రములో చేప్పబడిన మర్యాదలను చెరచుట. 53. బ్రహ్మజ్ఞానము
లేకపోయినను బ్రహ్మజ్ఞానివలె నాచరించుట, ప్రవర్తించుట. 54. మతసాంప్రదాయములోని భేదములవలన వైష్ణవుల
యడల - విష్ణుభక్తుల యడల - వీరు గొప్పవారు, వీరు నీచులు - అధములు - అను బుద్ధి కలిగి
యుండుట. 55. దేవునివలె ప్రవర్తించుట. 56. భగవంతుని అవతారములలోని లీలలో తారతమ్యము, హెచ్చు
తగ్గులు ఎంచి వాటిని నిందించుట. 57. పరిహాసమందు నువ్వే భగవంతుని ప్రతివి - ప్రతిమవు - అని
చెప్పుట. 58. భగవంతుడు ఒక్కొక్కని ముఖములో నుండును అనుభ్రాంతి కలిగియుండుట. 59. లోభమువల్ల
ఎవనికో భగవంతుని ప్రసాదముకాని, పాదోదకముగాని ఇచ్చుట. 60.భగవంతునియొక్క చిత్రపటమునుకాని,
విగ్రహమునుకాని - ప్రతిమనుకాని - నామమునుకాని అవమానించుట. 61. ఏ జీవునినైనను, ఏ రీతగానైనను,
సంతాపము కలుగచేయుట - బాధకలుగచేయుట, భయము కలుగచేయుట, లేక, ఏదేని ఇష్టములేనిపని చేయుట. 62.
తర్క వితర్కములలో పరాజయమైనపుడు - ఓడిపోయినపుడు, సిద్ధాంతము చేయుటకు చేతకానపుడు
ఆస్తిక్యమునువదలి వేయుట, భగవంతుడున్నాడు అను అభిప్రాయము వదలుట. 63. భగవంతుని
అవతారములందు. అతని కర్మలందు సాధారణమైనవే యను బుద్ధి కలిగియుండుట. 64. భగవంతుని యుగల
రూపమందు ద్వైతబుద్ధి కలిగియుండుట.)
Transliteration
tappu
panicēyuṭa; vihitamagupani cēyakuṃḍuṭa; daivāparādhamulu.
“yānairvā pādukairvāpi
gamanaṃ bhagavadgṛhē |
dēvōtsavādya sēvā ca
pramādaśca tadagrataḥ |
ucciṣṭē caiva vāśaucē
bhagavadvaṃdanādikaṃ |
ēkahasta
praṇāmaśca tatparastātpradakṣiṇaṃ |
pāda prasāraṇaṃ
cāgrē, tathā paryaṃka baṃdhanaṃ |
śayanaṃ bhakṣaṇaṃ cāsi
mithyā bhāṣaṇa mēvaca |
ucchairbāṣā mithō
jalpārōcanāni ca nigrahaḥ |
nigrahānugaha caiva
strī nṛṣu krūra bhāṣaṇaṃ |
kaṃbaḷānaraṇaṃ caiva
paraniṃdā parastutiḥ |
aślīla bhāṣaṇaṃ caiva
hya dhōvāyu vimōkṣaṇaṃ |
śaktau gauṇōpa
cārastu hya nivēdita bhakṣaṇaṃ |
tattatkālōdbhavānāṃ
ca phalādīnā manarpaṇaṃ |
viniyuktā
naśiṣṭasya pradānaṃ vyaṃjana syahi |
vṛṣṭīkṛtāsanaṃ
caivaparēṣāmabhi vaṃdanaṃ |
guraumēnaṃ nijastōtraṃ
dēvatāniṃdanaṃ tathā |
aparāthāḥ tathā
viṣṇōḥ dvātriṃ śatparikīrtitāḥ||“.
(vāhanamulō
veḷḷucūgāni, pādukalu toḍugukonigāni dēvālayamulōniki veḷḷuṭa; dēvunaku
cēyu utsavamulaṃdu sēva cēyakuṃḍuṭa; utsavamula muṃdu pramādamaina
panulu cēyuṭa; śucigā nuṃḍakayē dēvunaku namaskāramu cēyuṭa; okkacētitō
dēvuniki namaskariṃcuṭa; dēvunimuṃdaṭa kāḷḷu jācukoni kūrcuṃḍuṭa; pakka
vēyuṭa; dēvuni yeduṭa paḍukonuṭa; tinuṭa; abaddhamulāḍuṭa; gaṭṭigā
māṭalāḍuṭa, krūramagu māṭalāḍuṭa; parulanu niṃdiṃcuṭa; parulanu stōtramu
cēyuṭa; āḍarāni māṭalāḍuṭa; apānavāyuvu viḍucuṭa; bhagavaṃtuniki
nivēdiṃcaka bhujiṃcuṭa; āyākālamulalō paṃḍu paṃḍlanu samarpiṃcakuṃḍuṭa;
itarulaku vaṃdanamu cēyucu guruvu eḍala maunamugā nuṃḍuṭa; tanakutānu
stotramu cēsukonuṭa; dēvuni niṃdiṃcuṭa; ivi modalagunavi śrīmahāviṣṇuvu
yaḍala cēyu aparādhamulu - tappulu.)
“vaiṣṇava
graṃdēṣu nimnāṃkitāḥ catuṣṣaṣṭiraparādhāḥ pratipāditāssaṃti : -
1.
śrībhagavān kiṃciddēvatā tatva viśēṣōvēti mānyatā. 2. vēdēṣu
graṃdhabuddhiḥ, pauruṣēyatva buddhirvā. 3. bhaktēṣu jātibhēdha buddhiḥ.
4. gurau sādhāraṇamanuṣyaḥ iti buddhiḥ. 5. bhagavataḥ pratimā kāṣṭaṃ
prastarō, dhātrī patraṃ mṛttikāvā iti dhāraṇā, 6. bhagavataḥ prasādaḥ
prasādaḥ sādhāraṇa khādyavastu iti buddhiḥ7. bhagavataḥ caraṇōdakaṃ
sādhāraṇaṃ jalaṃ iti dhāraṇā8. tulasī sādhāraṇa vṛkṣaviśēṣaḥ iti
mānyatā9. gauḥ sādhāraṇaḥ paśuriti buddhiḥ 10. śrīmadbhāgavataṃ,
śrīmadbhagavadgītāvā sādhāraṇaṃ pustakaṃ iti bōdhaḥ. 11. bhagavataḥ
līlāmānava kṛtayaḥ itimānyatā. 12. sāṃsārika prēmā strī sukhēnavā saha
bhagavataḥ līlāyāḥ tulyatā pādanaṃ. 13. gōpyaḥ bhagavataḥ dṛṣṭau
parastriyaḥ iti dhāraṇā. 14. rāsalīlāyaṃ kāmacēṣṭā buddhiḥ. 15.
bhagavataḥ mahōtsavasama yē sparśā sparśa buddhiḥ. 16. īśvaraṃ śāstrāṇi
ca nasvīkṛtya nāstika tāvalaṃbanaṃ. 17. saṃdēha pūrvakaṃ
dharmasyācaraṇaṃ. 18. dharmapālanālasyaṃ 19. bāhya vṛttēna bhaktānāṃ
parīkṣaṇaṃ. 20. sādu mahātmanāṃ guṇadōṣāṇāmālōcanaṃ. 21. ahamuttamō
astīti mānyatā. 22. kasyāpi dēvasya śāstrasyavā niṃdā. 23. bhagavataḥ
vigrahaṃ pṛṣṭa taḥ kṛtvā upavēśanaṃ. 24. bhagavataḥ vigrahasya samakṣē
upāvahē pādayōḥ kṛtvā gamanaṃ. 25. bhagavataḥ vigrahasya samakṣē
mūlādhāraṇaṃ. 26. bhagavataḥ vigrahasya samakṣē yaṣṭiṃ gṛhatvā gamanaṃ.
27. bhagavataḥ vigrahasya samakṣē nīlaṃ vastraṃ paridhāya gamanaṃ. 28.
daṃtadhāvanaṃ gaṃḍūṣāṃ ścā kṛtvaiva bhagavadvigrahasya samakṣē gamanaṃ.
29. mala tyāgā nmaidhunādērvā paścāt vastra parivartanaṃ vinaiva maṃdirē
pravēśaḥ 30. bhagavatō vigrahasya samakṣē tāṃbūla carvaṇaṃ. 31.
bhagavataḥ vigrahasya hastapāda prasāraṇaṃ 32. bhagavataḥ vigrahasya
samakṣē ucchaissvarēṇa hasanaṃ. 33. kucēṣṭā karaṇaṃ ca. 34. strīṇāṃ
caturikṣu bhramaṇaṃ. 35. krōdhaḥ vyāpāraḥ. 36. bhagavataḥ vigrahasya
samakṣē kasyāpyanya sābhivaṃdanaṃ. 37. durgaṃdhaṃ vastu bhuktvā
durgaṃdha mārī bhavanāt prāgēva maṃdirē gamanaṃ. 38. mādaka dravyāṇāṃ
sēvanaṃ. 39. kasyāpyavamānanā hananaṃ vā. 40. kāmakrōdhā dīnāṃ cēṣṭā.
41.atidhēḥ sā dhōrvā samādarō pramādaḥ. 42. ahaṃ bhaktō dharmātmā
paṃḍitaḥ puṇyātmā vā iti manyatā. 43. nāstikānāṃ vyabhicāriṇāṃ
hiṃsakānāṃ lōbhināṃ mithyā bhāṣiṇāṃca manuṣyāṇāṃ saṃgatiḥ. 44. vipattā
nīśvarē dōṣārōpaṇaṃ. 45. pāpāya dharmasyānuṣṭānaṃ. 46. kasmaicit
kiṃcidapikaṣṭaṃ datvā’ ahaṃ dhārmikaḥ” iti mānyatā. 47. striyāḥ putasya
parivārasya āśritānāṃ dīnānāṃ sādhū nāṃca pālana pōṣaṇa yōru pēkṣaṇaṃ.
48. kimapi svīyaṃ bhōgyaṃ matvātasya bhagavatē nivēdanaṃ anivēditasya vā
vastunō bhōgaḥ 49. nijēṣṭa dēvasya nāmnaḥ śapadhīkaraṇaṃ. 50. dharmaṃ
bhagavataḥ nāma ca vikrīyadhi nō pārjanaṃ. 51. svīyamiṣṭadēvaṃ vihāya
anyasmāt āśākaraṇaṃ. 52. śāstra maryā dāyāḥ bhaṃjanaṃ. 53. brahmajñānā
bhāvēpi brahmajñānivadā caraṇaṃ. 54. saṃpradāya bhēdēna vaiṣṇavānāṃ
katamasmin uccha nīcabuddhiḥ. 55. dēvavadā caraṇaṃ. 56. avatārāṇāṃ
līlāsu tāratamyaṃ sthāpayitvā tāsu niṃdanaṃ. 57. parihāsēpi kiṃcit prati
bhavānēva bhagavā nastīti kathanaṃ. 58. bhagavān kasyāpi mukhāpēkṣya
stīti bhrāṃtyāpi manasi dhāraṇaṃ. 59. lōbhavaśāt kasmaicit
bhagavadprasādasya caraṇōdakasya vādānaṃ. 60. bhagavataḥ citrapaṭasya
pratimāyāḥ nāmnōvā avamānanā. 61. kasyāpi jīvasya kēnāpi prakārēṇa
saṃtāpanaṃ, bhayadarśanaṃ, adhavā, kasyāpi ahitā caraṇaṃ. 62.
tarkavitarkayōḥ parājayē sati siddhāṃta sthāpana kṣamatā yāḥ abhāvēsati
vā āstikatāyāḥ tyāgaḥ. 63. bhagavadava tārāṇāṃ janma karmasu
sādhāraṇatva buddhiḥ - 64. bhagavataḥ yugaḷa rūpē dvaitabuddhi
karaṇaṃ”.
(vaiṣṇava
graṃdhamulaṃdu aruvadinālugu aparādhamulu ceppa baḍiyunnavi : - 1.
bhagavaṃtuḍu oka cinna dēvata, lēka, tatvamulalō oka viśēṣamaina tatvamu
ani talacuṭa. 2. vēdamulu oka graṃdhamani, avi apauruṣē yamulukāvu,
evarō oka puruṣuḍu vrāsinavi anu buddhi kaligiyuṃḍuṭa, 3.bhaktulaṃdu
jātibhēdamu cūcu buddhi kaligiyuṃḍuṭa. 4. guruvu yaḍala itanu aṃdaṟi
vale sādhāraṇa maniṣi yē yani buddhi kaligiyuṃḍuṭa. 5. bhagavaṃtuni
yokka vigrahamu oka karra, oka lōhamutō cēsina bomma, lēka maṭṭitō
cēsina bomma ani abhiprāyamu kaligiyuṃḍuṭa. 6. bhagavaṃtuni prasādamu
sādhāraṇamaina vastuvē yanukonuṭa. 7. bhagavaṃtunipādamulu kaḍigina
jalamu - pādōdakamu - sādhāraṇamaina nīrē yani talacuṭa. 8. tulasi
sādhāraṇamaina - anniṃṭivaṃṭi oka ceṭṭē yani talacuṭa. 9. gōvu
sādhāraṇamaina - migilina paśuvulavaṃṭi paśuvē yanu buddhi
kaligiyuṃḍuṭa. 10. śrīmadbhāgavatamu, śrīmadbhagavadgīta - ivi
sādhāraṇamaina itara pustakamula vaṃṭivē anukonuṭa. 11. bhagavaṃtuni
līlalu mānavulu cēyupanulē yani anukonuṭa. 12. saṃsāramaṃdu gala prēma
cētanō, strī saṃbhōgasukhamu cētanō bhagavaṃtuni līla samānamainadani
pōlcuṭa. 13. bhagavaṃtuni dṛṣṭilō gōpikalu parastrīlani anukonuṭa. 14.
śrīkṛṣṇuḍu gōpikalatō cēsina rāsakrīḍa manmadha cēṣṭa yanu buddhi
kaligiyuṃḍuṭa. 15. bhagavaṃtuni utsavamulaṃdu sparśā sparśa buddhi
kaligiyuṃḍuṭa. 16. bhagavaṃtuni śāstramulanu vadalivēsi nāstikamatamu
navalaṃbhiṃcuṭa - bhagavaṃtuḍu lēḍu anu buddhi kaligiyuṃḍuṭa 17.
saṃdēhamutō dharmamu nācariṃcuṭa. 18. dharmamunu pāliṃcuṭa yaṃdu -
dharmamugā pravartiṃcuṭalō ālasyamu cēyuṭa. 19. bhaktulanu bāhya
vṛttulavalana – vyāpāramula valana vāri bhakti parīkṣiṃcuṭa, 20.
sādhuvula guṇamulaṃdu - mahātmula guṇamulaṃdu dōṣamula guṟiṃciyē
ālōciṃcuṭa. 21. nēnē uttamuḍanu, goppavāḍanu ani abhimānamu
kaligiyuṃḍuṭa, 22. ēdēni oka dēvunigāni, śāstramunugāni niṃdiṃcuṭa. 23.
bhagavaṃtuni vigrahamu prakka - pṛṣṭamu peṭṭi kūrcunuṭa. 24.
bhagavadvigraha samakṣamulō pādamulu upāvahamucēsi veḷḷuṭa. 25.
bhagavaṃtuni vigrahamu muṃdaṭa pūlamāla dhariṃcuṭa. 26. bhagavaṃtuni
vigrahamu muṃdu karra paṭṭukoni naḍucuṭa 27. bhagavaṃtuni
vigrahasamakṣamulō nīli vastramu kappukoni naḍacuṭa. 28. paḷḷutōmukonaka
bhagavaṃtuni vigrahamu muṃduku veḷḷuṭa. 29. malamu viḍicina tarvāta,
maidhunamu tarvāta vastramu mārcukonaka dēvālayamulō pravēśiṃcuṭa. 30.
bhagavaṃtuni vigrahamu vaipu kāḷḷu cētulu jācuṭa. 31. bhagavaṃtuni
vigrahamumuṃdu tāṃbūlamu sēviṃcuṭa. 32. bhagavaṃtuni vigrahamumuṃdu
gaṭṭigā navvuṭa. 33. ceḍḍa panulu cēyuṭa. 34. strīlu nālugu dikkula
tiruguṭa. 35. krōdhamutō panulu cēyuṭa. 36. bhagavaṃtuni vigrahamu muṃdu
itaruniki evarikainā namaskariṃcuṭa. 37. kaṃpukoṭṭu āhāramutini ā
durvāsana hariṃcaka muṃdē dēvālayamulō pravēśiṃcuṭa. 38. mādaka
dravyamulanu sēviṃcuṭa. 39. evarinainanu anumāniṃcuṭa. 40. kāmamu,
krōdhamu modalagu vāṭitō panicēyuṭa. 41. atidhinigāni, sādhujanulanugāni
ādariṃcuṭalō pramādamu kalugacēyuṭa. 42. nēnu bhaktuḍanu, dharmātmuḍanu,
paṃḍituḍanu, puṇyātmuḍanu, anu abhimānamu kaligiyuṃḍuṭa. 43.
nāstikulayokka, vyabhicārulayokka, hiṃsacēyuvāriyokka, lōbhulayokka,
abaddhamāḍuvāriyokka sāṃgatyamu cēyuṭa. 44. āpadakaliginappuḍu
bhagavaṃtuni mīdanē nēramārōpiṃcuṭa. 45. pāpamu koṟaku
dharmamunanusariṃcuṭa. 46. evarikainā ēkoṃcemainā icci, nēnu
dharmātmuḍanu, dhārmikuḍanu, dharmamucēyuvāḍanu ani abhimānamu
kaligiyuṃḍuṭa. 47. strīlanu, putruni, parivāramunu, āśrayiṃcukoniyunna
vārini, dīnulanu, sādhuvulanu pāliṃcuṭayaṃdu - kāpāḍuṭayaṃdu,
pōṣiṃcuṭayaṃdu - upēkṣiṃcuṭa. 48. dēninainā tānu bhujiṃcavalasinadē yani
talaci bhagavaṃtuniki naivēdyamu peṭṭuṭa, lēka, bhagavaṃtuniki
naivēdyamugā peṭṭani vastuvunu bhujiṃcuṭa. 49. tana iṣṭa dēvatayokka
pērumīda śapadhamu cēyuṭa. 50. dharmamunu bhagavannāmamunu ammi dhana
mārjiṃcuṭa. 51. tana iṣṭa dēvatanuvadali itaradaivamunaṃdu
āśakaligiyuṃḍuṭa.52. śāstramulō cēppabaḍina maryādalanu ceracuṭa. 53.
brahmajñānamu lēkapōyinanu brahmajñānivale nācariṃcuṭa, pravartiṃcuṭa.
54. matasāṃpradāyamulōni bhēdamulavalana vaiṣṇavula yaḍala -
viṣṇubhaktula yaḍala - vīru goppavāru, vīru nīculu - adhamulu - anu
buddhi kaligi yuṃḍuṭa. 55. dēvunivale pravartiṃcuṭa. 56. bhagavaṃtuni
avatāramulalōni līlalō tāratamyamu, heccu taggulu eṃci vāṭini
niṃdiṃcuṭa. 57. parihāsamaṃdu nuvvē bhagavaṃtuni prativi - pratimavu -
ani ceppuṭa. 58. bhagavaṃtuḍu okkokkani mukhamulō nuṃḍunu anubhrāṃti
kaligiyuṃḍuṭa. 59. lōbhamuvalla evanikō bhagavaṃtuni prasādamukāni,
pādōdakamugāni iccuṭa. 60.bhagavaṃtuniyokka citrapaṭamunukāni,
vigrahamunukāni - pratimanukāni - nāmamunukāni avamāniṃcuṭa. 61. ē
jīvuninainanu, ē rītagānainanu, saṃtāpamu kalugacēyuṭa -
bādhakalugacēyuṭa, bhayamu kalugacēyuṭa, lēka, ēdēni iṣṭamulēnipani
cēyuṭa. 62. tarka vitarkamulalō parājayamainapuḍu - ōḍipōyinapuḍu,
siddhāṃtamu cēyuṭaku cētakānapuḍu āstikyamunuvadali vēyuṭa,
bhagavaṃtuḍunnāḍu anu abhiprāyamu vadaluṭa. 63. bhagavaṃtuni
avatāramulaṃdu. atani karmalaṃdu sādhāraṇamainavē yanu buddhi
kaligiyuṃḍuṭa. 64. bhagavaṃtuni yugala rūpamaṃdu dvaitabuddhi
kaligiyuṃḍuṭa.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.