← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపారం apāraṃ

Original — తెలుగు

గంభీరం -

(లోతు గలది - గుట్టుగా ఉండునది. అందుచేత దురవగాహము; సుళువుగా తెలియబడనిది.)

తర్తుమశక్యం; పారమనగా ఒడ్డు, అది లేనిది; ఒడ్డు - పరిమితి - లేనిది కనుక తరించుటకు - దాటుటకు శక్యము కానిది.

నిరవధికం (పరిమితి లేనిది)

సర్వగతం. (అంతటను వ్యాపించునది. ఇంతటితో సరి అని అడ్డులేకుండా వ్యాపించునది.)

పారః అంతః; స చ దేశకాల వస్తు కృతాత్ త్రివిధః -. తద భావాత్ అపారం బ్రహ్మ.

తత్ర దేశః - ప్రదేశః యత్ సర్వత్ర వ్యాపిత్వేన ఏకదేశ వర్తితస్యదేశతః అంతోనాస్తి, యధా ఘటాదేః; న తు బ్రహ్మణః, తచ్చ సర్వత్ర వ్యాప్య అవతిష్టతే సర్వస్యాపి విదేశస్య మాయయా తస్మిన్నధ్యస్తత్వేన తద నవచ్చేదకత్వాత్.

కాలః = అవిద్యా చిత్ సం యోగః - - - యస్య తు జన్మతః ప్రాగూర్ధ్వంచ అభావో దృశ్యతే, తస్య కాలతః అంతో అస్తి, యధా బుద్ధ్యా దేః న బ్రహ్మణః జన్మాది వికారా భావాత్తస్య కాలస్యాపి తదధ్యస్త దధ్యస్తత్వాచ్చ.

వస్తు = పదార్థః. యత్ యస్మాత్ భిద్యతే తేన తస్య అంతో భవేత్ - యధా : - ఘటః పటాద్భిద్యతే ఇతి ఘటే పటస్యాం తో భవతి; బ్రహ్మణి తు సర్వస్యాపి జగతః మృది ఘట శరావాదేరివ కల్పితత్వేన అవస్తుత్వాత్ నవస్తు పరిచ్ఛేదో అపి తస్య సంభవతి. తస్మాత్ బ్రహ్మ అపారం, అనంతం, దేశకాలవస్తు పరిచ్ఛేదశూన్యం, తతో అన్యస్య ద్వితీయస్యా భావాత్.

(పారము అనగా అంతము - అది దేశకాల, వస్తువుల చేత మూడు విధములు : -

(1.) దేశము - దేశము అనగా ప్రదేశము - ఏది అంతట వ్యాపింపక ఒకే దేశమందు, ఒకే స్థలమందు ఉండునో దానికి దేశమువలన అంతము కలదు – ఒకచోట నుండునది అదే సమయములో మరియొక చోట ఉండదు. బ్రహ్మ ఇటువంటిది కాదు - అన్నిచోట్ల ఒకే కాలమందు ఉండునది - అందుచేత బ్రహ్మమునకు దేశమువలన అంతము, పారము, పరి మితి, లేదు –

(2.) కాలము - కాలమనగా అవిద్యతో కూడియున్న చిద్రూపము. ఏ వస్తువు పుట్టుటకు ముందు, నశించిన తర్వాత లేదో ఆ వస్తువునకు కాలముచేత పారము (అంతము) కలదు. బ్రహ్మకు జన్మము మొదలగు షడ్భావ వికారములు లేనందున, కాలము నందు కూడా బ్రహ్మ అధ్యస్తమై యుండుట చేతను బ్రహ్మకు కాలము వలన పారము (అంతము) లేదు –

(3.) వస్తువు : - వస్తువు అనగా పదార్థము - ఏ వస్తువు మరియొక వస్తువుతో భేదము కలిగి యున్నదో ఆ వస్తువుచేత దానికి అంతము కలదు - కుండ, బట్టకన్న వేరైనది - అందుచేత కుండకు బట్టవలన అంతమున్నది. కుండ, మూకుడు మొదలగువాటి అన్నింటి లోను మట్టి వ్యాపించి యున్నట్లు, వాటిలో మట్టియే వ్యాపించి యున్నట్లు, పరబ్రహ్మమందే ఈ జగత్తు అంతా కల్పించబడి యుండుట వలన, అన్నివస్తువులు పరబ్రహ్మకంటె వేరు కాకపోవుట వలన పరబ్రహ్మమునకు వస్తు పరిచ్ఛేదము లేదు - అందుచేత బ్రహ్మ అపారము, అనంతము, దేశ కాలవస్తువులచేత పరిచ్ఛేదము లేనివాడు, అతనికంటె, అటువంటివాడు, పరిచ్ఛేదరహితుడు మరి ఒకడు లేడు, అందుచేత అపారము) - (చూడుము - ‘అపరిచ్ఛిన్నః’; ‘త్రివిధ పరిచ్ఛేదము’)

Transliteration

gaṃbhīraṃ -

(lōtu galadi - guṭṭugā uṃḍunadi. aṃducēta duravagāhamu; suḷuvugā teliyabaḍanidi.)

tartumaśakyaṃ; pāramanagā oḍḍu, adi lēnidi; oḍḍu - parimiti - lēnidi kanuka tariṃcuṭaku - dāṭuṭaku śakyamu kānidi.

niravadhikaṃ (parimiti lēnidi)

sarvagataṃ. (aṃtaṭanu vyāpiṃcunadi. iṃtaṭitō sari ani aḍḍulēkuṃḍā vyāpiṃcunadi.)

pāraḥ aṃtaḥ; sa ca dēśakāla vastu kṛtāt trividhaḥ -. tada bhāvāt apāraṃ brahma.

tatra dēśaḥ - pradēśaḥ yat sarvatra vyāpitvēna ēkadēśa vartitasyadēśataḥ aṃtōnāsti, yadhā ghaṭādēḥ; na tu brahmaṇaḥ, tacca sarvatra vyāpya avatiṣṭatē sarvasyāpi vidēśasya māyayā tasminnadhyastatvēna tada navaccēdakatvāt.

kālaḥ = avidyā cit saṃ yōgaḥ - - - yasya tu janmataḥ prāgūrdhvaṃca abhāvō dṛśyatē, tasya kālataḥ aṃtō asti, yadhā buddhyā dēḥ na brahmaṇaḥ janmādi vikārā bhāvāttasya kālasyāpi tadadhyasta dadhyastatvācca.

vastu = padārthaḥ. yat yasmāt bhidyatē tēna tasya aṃtō bhavēt - yadhā : - ghaṭaḥ paṭādbhidyatē iti ghaṭē paṭasyāṃ tō bhavati; brahmaṇi tu sarvasyāpi jagataḥ mṛdi ghaṭa śarāvādēriva kalpitatvēna avastutvāt navastu paricchēdō api tasya saṃbhavati. tasmāt brahma apāraṃ, anaṃtaṃ, dēśakālavastu paricchēdaśūnyaṃ, tatō anyasya dvitīyasyā bhāvāt.

(pāramu anagā aṃtamu - adi dēśakāla, vastuvula cēta mūḍu vidhamulu : -

(1.) dēśamu - dēśamu anagā pradēśamu - ēdi aṃtaṭa vyāpiṃpaka okē dēśamaṃdu, okē sthalamaṃdu uṃḍunō dāniki dēśamuvalana aṃtamu kaladu – okacōṭa nuṃḍunadi adē samayamulō mariyoka cōṭa uṃḍadu. brahma iṭuvaṃṭidi kādu - annicōṭla okē kālamaṃdu uṃḍunadi - aṃducēta brahmamunaku dēśamuvalana aṃtamu, pāramu, pari miti, lēdu –

(2.) kālamu - kālamanagā avidyatō kūḍiyunna cidrūpamu. ē vastuvu puṭṭuṭaku muṃdu, naśiṃcina tarvāta lēdō ā vastuvunaku kālamucēta pāramu (aṃtamu) kaladu. brahmaku janmamu modalagu ṣaḍbhāva vikāramulu lēnaṃduna, kālamu naṃdu kūḍā brahma adhyastamai yuṃḍuṭa cētanu brahmaku kālamu valana pāramu (aṃtamu) lēdu –

(3.) vastuvu : - vastuvu anagā padārthamu - ē vastuvu mariyoka vastuvutō bhēdamu kaligi yunnadō ā vastuvucēta dāniki aṃtamu kaladu - kuṃḍa, baṭṭakanna vērainadi - aṃducēta kuṃḍaku baṭṭavalana aṃtamunnadi. kuṃḍa, mūkuḍu modalaguvāṭi anniṃṭi lōnu maṭṭi vyāpiṃci yunnaṭlu, vāṭilō maṭṭiyē vyāpiṃci yunnaṭlu, parabrahmamaṃdē ī jagattu aṃtā kalpiṃcabaḍi yuṃḍuṭa valana, annivastuvulu parabrahmakaṃṭe vēru kākapōvuṭa valana parabrahmamunaku vastu paricchēdamu lēdu - aṃducēta brahma apāramu, anaṃtamu, dēśa kālavastuvulacēta paricchēdamu lēnivāḍu, atanikaṃṭe, aṭuvaṃṭivāḍu, paricchēdarahituḍu mari okaḍu lēḍu, aṃducēta apāramu) - (cūḍumu - ‘aparicchinnaḥ’; ‘trividha paricchēdamu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.