త్రివిధ పరిచ్చేధ శూన్యః; పరిపూర్ణః
-
(దేశకాల
వస్తువులచేత పరిమితిలేనివాడు - అనగా, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అను పరిమితి లేకుండా అంతటా అన్ని
స్థలముల ఉన్నవాడు, ఇది దేశ పరిచ్చేదము. ఇదివరకు ఉండేవాడు, ఇప్పుడులేడు, ఇకముందు ఉండడు
అనునది కాలపరిచ్ఛేదము - ఇది లేకుండా నిత్యము, ఎల్లపుడు అన్ని కాలములందు ఉండు వాడు. ఇందులో
ఉన్నాడు, ఆ వస్తువులో లేడు అనుట వస్తు పరిచ్చేదము. ఇది లేక అన్నివస్తువులలోను ఉన్నాడు. ఈ
మూడు విధముల పరిచ్చేదము లేనివాడు. దీనివలన పరబ్రహ్మ పరిపూర్ణుడు - అంతటను అన్నింటిలోను,
ఎల్లపుడు పూర్తిగా నిండియున్నవాడు - అని తెలియుచున్నది.
“పరిచ్ఛిన్నస్య కార్యస్య
జాత్యాదేర్యోగ దర్శనాత్ |
అపరిచ్ఛిన్నస్య
చిద్ధాతోర్నాస్తి తద్యోగ ఇత్యతః” గీతాభావప్రకాశము- 12 - 25, 26)
(పరిచ్ఛిన్నమగు
కార్యవస్తువునకే, అనగా, పరిమితి చెప్పుటకు తగినటువంటి వస్తువునకే, జన్మ, మరణములు మొదలగునవి
కలుగును. అపరిచ్ఛిన్నమగు చిద్రూపమైన భగవంతునకు అట్టి జననమరణములు కలుగవు)
ఏకం
దేవం పరిచ్ఛిన్నతయా జ్ఞాత్వా తమేవ సంపూజ్య అన్యదేవతా పూజ నత్యాగే మహానర్థో భవతి, కింతు, స్వేష్ట దేవం
సర్వాత్మకత్వం నజ్ఞా త్వా సర్వదేవతా స్వరూప స్వేష్ట దేవం అభేద బుద్ధ్యా వేదోక్తా నుష్ఠాన ప్రకారేణ తతత్కాలే
తత్త ద్దేవతా రూపేణ పూజయేత్.
(సృష్టి
యంతటికీ ఒకే దేవుడనికాక పరిమిత శక్తిగల దేవుడని, ఒకే దేవుని ఆరాధించి మిగిలిన దేవతులను వదలివేయుట
వలన గొప్ప అనర్థము కలుగును - కాని, తన ఇష్ట దైవముకు సమస్త దేవతలకు భేదములేదను
దృష్టితోవేదములో చెప్పిన ప్రకారము ఆయా కాలములందు ఆయా దేవతారూపములనే భావముతోనే పూజింపవలెను.)
ఇంతటివాడు ఇంతయని పరిమాణము
కల్పించుటకు వీలుకానివాడు. (చూడుము - ‘అపరిచ్ఛిన్నుడు’)
Transliteration
trividha pariccēdha
śūnyaḥ; paripūrṇaḥ -
(dēśakāla
vastuvulacēta parimitilēnivāḍu - anagā, ikkaḍa unnāḍu akkaḍa lēḍu anu
parimiti lēkuṃḍā aṃtaṭā anni sthalamula unnavāḍu, idi dēśa pariccēdamu.
idivaraku uṃḍēvāḍu, ippuḍulēḍu, ikamuṃdu uṃḍaḍu anunadi kālaparicchēdamu
- idi lēkuṃḍā nityamu, ellapuḍu anni kālamulaṃdu uṃḍu vāḍu. iṃdulō
unnāḍu, ā vastuvulō lēḍu anuṭa vastu pariccēdamu. idi lēka
annivastuvulalōnu unnāḍu. ī mūḍu vidhamula pariccēdamu lēnivāḍu.
dīnivalana parabrahma paripūrṇuḍu - aṃtaṭanu anniṃṭilōnu, ellapuḍu
pūrtigā niṃḍiyunnavāḍu - ani teliyucunnadi.
“paricchinnasya
kāryasya jātyādēryōga darśanāt |
aparicchinnasya
ciddhātōrnāsti tadyōga ityataḥ” gītābhāvaprakāśamu- 12 - 25, 26)
(paricchinnamagu
kāryavastuvunakē, anagā, parimiti ceppuṭaku taginaṭuvaṃṭi vastuvunakē,
janma, maraṇamulu modalagunavi kalugunu. aparicchinnamagu cidrūpamaina
bhagavaṃtunaku aṭṭi jananamaraṇamulu kalugavu)
ēkaṃ
dēvaṃ paricchinnatayā jñātvā tamēva saṃpūjya anyadēvatā pūja natyāgē
mahānarthō bhavati, kiṃtu, svēṣṭa dēvaṃ sarvātmakatvaṃ najñā tvā
sarvadēvatā svarūpa svēṣṭa dēvaṃ abhēda buddhyā vēdōktā nuṣṭhāna
prakārēṇa tatatkālē tatta ddēvatā rūpēṇa pūjayēt.
(sṛṣṭi
yaṃtaṭikī okē dēvuḍanikāka parimita śaktigala dēvuḍani, okē dēvuni
ārādhiṃci migilina dēvatulanu vadalivēyuṭa valana goppa anarthamu
kalugunu - kāni, tana iṣṭa daivamuku samasta dēvatalaku bhēdamulēdanu
dṛṣṭitōvēdamulō ceppina prakāramu āyā kālamulaṃdu āyā dēvatārūpamulanē
bhāvamutōnē pūjiṃpavalenu.)
iṃtaṭivāḍu
iṃtayani parimāṇamu kalpiṃcuṭaku vīlukānivāḍu. (cūḍumu -
‘aparicchinnuḍu’)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.