← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరిగ్రహః aparigrahaḥ

Original — తెలుగు

పరిగ్రహ రహి తః. (పరిగ్రహము చేయనివాడు; ఇతరులు ఇచ్చినవాటిని పరిగ్రహింపనివాడు.)

విషయాణాం ఆర్జన రక్షణక్షయ సంగహింసా దోషాది దర్శనాత్ అస్వీకరణం అపరిగ్రహః.

(విషయముల నార్జించుటయందు, వాటిని రక్షించుకొనుటయందు, ఉన్నవాటిని కాపాడుకొనుటయందు, అది నశించుట యందు హింస మొదలగు దోషములుండుట వలన వాటిని పరిగ్రహింపనివాడు - ఎవరిచ్చినను పరిగ్రహింపనివాడు.)

“ప్రాణమాత్ర ధారణానుకూల పరిగ్రహేతర పరిగ్రహో యే నా గృహీతః స అపరి గ్రహః”

(ప్రాణమును ధరించి యుండుటకు మాత్రము - అనగా, బ్రతికియుండుటకు కావలసినంత మాత్రమే గ్రహించి ఇతరములను గ్రహించక యుండువాడు.)

“దాన పూర్వకంబుగా నెవ్వరేమైన

నొసగ సంగ్రహింపకునికి సత్కృతముగ

శిష్యులొసగు ద్రవ్యంబు గొనుటయే

ననఘ ! తద పరిగ్రహంబు, వత్స !“.

(ధనము మొదలగువాటిని దానముగా ఎవరిచ్చినను పుచ్చుకొనక, శిష్యులిచ్చినవాటిని పుచ్చుకొనుట అపరిగ్రహము - అట్టివాడు -.)

విషయముల వంక పోనివాడు.

Transliteration

parigraha rahi taḥ. (parigrahamu cēyanivāḍu; itarulu iccinavāṭini parigrahiṃpanivāḍu.)

viṣayāṇāṃ ārjana rakṣaṇakṣaya saṃgahiṃsā dōṣādi darśanāt asvīkaraṇaṃ aparigrahaḥ.

(viṣayamula nārjiṃcuṭayaṃdu, vāṭini rakṣiṃcukonuṭayaṃdu, unnavāṭini kāpāḍukonuṭayaṃdu, adi naśiṃcuṭa yaṃdu hiṃsa modalagu dōṣamuluṃḍuṭa valana vāṭini parigrahiṃpanivāḍu - evariccinanu parigrahiṃpanivāḍu.)

“prāṇamātra dhāraṇānukūla parigrahētara parigrahō yē nā gṛhītaḥ sa apari grahaḥ”

(prāṇamunu dhariṃci yuṃḍuṭaku mātramu - anagā, bratikiyuṃḍuṭaku kāvalasinaṃta mātramē grahiṃci itaramulanu grahiṃcaka yuṃḍuvāḍu.)

“dāna pūrvakaṃbugā nevvarēmaina

nosaga saṃgrahiṃpakuniki satkṛtamuga

śiṣyulosagu dravyaṃbu gonuṭayē

nanagha ! tada parigrahaṃbu, vatsa !“.

(dhanamu modalaguvāṭini dānamugā evariccinanu puccukonaka, śiṣyuliccinavāṭini puccukonuṭa aparigrahamu - aṭṭivāḍu -.)

viṣayamula vaṃka pōnivāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.