“జ్ఞానం పరోక్ష మిత్యుక్తం
శాస్తా చార్యోప దేశజం |
అపరోక్షం హి విజ్ఞానం - - - ||“.
(గీతాభావప్రకాశము- 3 - 276)
(గురువు,
శాస్త్రము ఉపదేశించు జ్ఞానము పరోక్షజ్ఞానము. తనంతట తాను తెలుసుకోకుండా ఒకరు చెప్పినది, లేక
గ్రంధములలో చెప్పబడినది తెలుసుకొనుట పరోక్షజ్ఞానము - విజ్ఞానము, తన అనుభవము వలన తెలుసుకొనునది
అపరోక్షజ్ఞానము.)
“అస్తి బ్రహ్మేతి చే ద్వేద
పరోక్ష జ్ఞానమేవ తత్ |
“అహం బ్రహ్మే” తిచే ద్వేద సాక్షాత్కారస్స
ఉచ్యతే ||“. (వరాహోపనిషత్.)
(శ్రుతి
ద్వారాకాని, గురువు ద్వారాకాని ‘బ్రహ్మ కలడు’ అని తెలుసుకొనుట పరోక్ష జ్ఞానము - (indirect
knowledge.) “నేనే బ్రహ్మను” - “అహం బ్రహ్మాస్మి” - అను మహావాక్యము ద్వారా తెలుసుకొనుట
-బ్రహ్మసాక్షాత్కారము చేసుకొనుట - అపరోక్షజ్ఞానము - (direct knowledge.)
“ఇదం మద్విషయం జ్ఞాన
మపరోక్షం స్వతో యతః” - (గీతాభావప్రకాశము- 7 - 15)
(పరమాత్మ
విషయమైనదియు, పరమాత్మ సాక్షాత్కారమును కలిగించునదియు అగు జ్ఞానము అపరోక్షజ్ఞానము.)
“అహం మేవ బ్రహ్మ” ఇతి జ్ఞానం
అపరోక్షం.
(“నేనే బ్రహ్మము” అను మొదలగు
మహావాక్యముల జ్ఞానము అపరోక్షజ్ఞానము -.)
ప్రత్యక్షమైన
జ్ఞానము - వస్తువు ఎదుటగా, దగ్గరగా ఉండగా కలిగిన జ్ఞానము, అపరోక్షజ్ఞానము.
ఏ
విషయమునైనను తెలుసుకొనుటకు ప్రయత్నము చేయగా, ఆ వస్తువు ప్రత్యక్షముగా కనిపించిన యడల దానివలన
కలిగిన జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము -
బ్రహ్మజ్ఞానమునకు
లక్ష్యమైన పరమాత్మను విచారించగా తన అనుభవము వలన కలిగిన జ్ఞానము అపరోక్షజ్ఞానము. శ్రుతులు
ఇతరుల అనుభవముగాన వాటివలన కలుగు జ్ఞానము పరోక్షజ్ఞానము.
పదిమంది
యేరుదాటి ఆవలి వడ్డుకు చేరినతర్వాత అందరు సరిగా దాటిరి అని తెలుసుకొను జ్ఞానము అపరోక్షజ్ఞానము. ఆ
పదిమందిలో ఒకడు తనను లెక్కపెట్టకుండా ఇతరులను లెక్కపెట్టి తొమ్మిది మంది వచ్చేరు అని భ్రమపడగా
పదకొండవవాడు వచ్చి వారి పదిమందిని లెక్కపెట్టి మీరు పదిమంది ఉన్నారని చెప్పినందువలన కలిగిన జ్ఞానము
పరోక్షజ్ఞానము.
Transliteration
“jñānaṃ parōkṣa
mityuktaṃ śāstā cāryōpa dēśajaṃ |
aparōkṣaṃ
hi vijñānaṃ - - - ||“. (gītābhāvaprakāśamu- 3 - 276)
(guruvu,
śāstramu upadēśiṃcu jñānamu parōkṣajñānamu. tanaṃtaṭa tānu telusukōkuṃḍā
okaru ceppinadi, lēka graṃdhamulalō ceppabaḍinadi telusukonuṭa
parōkṣajñānamu - vijñānamu, tana anubhavamu valana telusukonunadi
aparōkṣajñānamu.)
“asti brahmēti
cē dvēda parōkṣa jñānamēva tat |
“ahaṃ
brahmē” ticē dvēda sākṣātkārassa ucyatē ||“. (varāhōpaniṣat.)
(śruti
dvārākāni, guruvu dvārākāni ‘brahma kalaḍu’ ani telusukonuṭa parōkṣa
jñānamu - (indirect knowledge.) “nēnē brahmanu” - “ahaṃ brahmāsmi” - anu
mahāvākyamu dvārā telusukonuṭa -brahmasākṣātkāramu cēsukonuṭa -
aparōkṣajñānamu - (direct knowledge.)
“idaṃ
madviṣayaṃ jñāna maparōkṣaṃ svatō yataḥ” - (gītābhāvaprakāśamu- 7 -
15)
(paramātma
viṣayamainadiyu, paramātma sākṣātkāramunu kaligiṃcunadiyu agu jñānamu
aparōkṣajñānamu.)
“ahaṃ
mēva brahma” iti jñānaṃ aparōkṣaṃ.
(“nēnē
brahmamu” anu modalagu mahāvākyamula jñānamu aparōkṣajñānamu -.)
pratyakṣamaina
jñānamu - vastuvu eduṭagā, daggaragā uṃḍagā kaligina jñānamu,
aparōkṣajñānamu.
ē
viṣayamunainanu telusukonuṭaku prayatnamu cēyagā, ā vastuvu
pratyakṣamugā kanipiṃcina yaḍala dānivalana kaligina jñānamu
pratyakṣajñānamu -
brahmajñānamunaku
lakṣyamaina paramātmanu vicāriṃcagā tana anubhavamu valana kaligina
jñānamu aparōkṣajñānamu. śrutulu itarula anubhavamugāna vāṭivalana
kalugu jñānamu parōkṣajñānamu.
padimaṃdi
yērudāṭi āvali vaḍḍuku cērinatarvāta aṃdaru sarigā dāṭiri ani telusukonu
jñānamu aparōkṣajñānamu. ā padimaṃdilō okaḍu tananu lekkapeṭṭakuṃḍā
itarulanu lekkapeṭṭi tommidi maṃdi vaccēru ani bhramapaḍagā
padakoṃḍavavāḍu vacci vāri padimaṃdini lekkapeṭṭi mīru padimaṃdi
unnārani ceppinaṃduvalana kaligina jñānamu parōkṣajñānamu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.