మహతః
ఋగ్వేదాదేః శాస్త్రస్యానేక విద్యాస్థానోప బృంహితస్య ప్రదీపవత్సర్వార్థా వ ద్యోతినః సర్వజ్ఞ కల్పస్య యోనిః కారణం
బ్రహ్మ. నహీ దృశస్య ఋగ్వేదాది లక్షణస్య సర్వజ్ఞ గుణాన్వితస్య సర్వజ్ఞాత్ అన్యతః సంభవోస్తి.
యద్యద్విస్తరార్థం శాస్త్రం యస్మాత్ పురుషవిశేషాత్ సంభవతి, యథా వ్యాకరణాది పాణిన్యాదేః జ్ఞేయైక దేశార్థమపి
సతతోప్యధికతర విజ్ఞానః ఇతి ప్రసిద్ధం లోకే. కిమువక్తవ్యం అనేక శాఖాబేధ భిన్నస్య దేవతిర్యఙ్మనుష్య
వర్ణాశ్రమాది ప్రవిభాగ హేతోః ఋగ్వేదాద్యాఖ్యస్య సర్వజ్ఞానా కరస్య అప్రయత్నేనైవ లీలాన్యా యేన
పురుషనిశ్వాసవద్యస్మాన్ మహతః భూతాద్యోనేః సంభవః - “అస్య మహతో భూతస్య నిరతిశయః సర్వజ్ఞత్వం సర్వ
శక్తిమత్వం చేతి” (శ్రీశంకరః- బ్రహ్మసూత్రభాష్యే)
(గొప్పదైనటువంటిన్నీ,
అనేకవిద్యలకు స్థానమై, సమస్త పురుషార్థములను దీపమువలె ప్రజ్వలింపచేసినటువంటిన్నీ, ఋగ్వేదాదులుగల
వేదమునకు కారణము పరబ్రహ్మ. సమస్తమైన జ్ఞానమును భోధించు గుణములుగల ఋగ్వేదాది లక్షణములుగల
వేదము సర్వజ్ఞుడైన పరమాత్మ తప్ప ఇతరునివలన సంభవించియుండదు - పాణిని మొదలగువారిచే రచించబడిన
వ్యాకరణము మొదలగు గ్రంధములవలె ఒకానొక పురుషుడురచించిన గ్రంధములే గొప్ప విజ్ఞానమును భోధించునవిగా
లోకములో ప్రసిద్ధముగానున్నవి. అట్టి సందర్భములో దేవతిర్యఙ్మనుష్య వర్ణాశ్రమములు మొదలగు అనేక
భాగములు కలిగియుండి, అనేక శేఖాభేదములు కలిగియుండి, సమస్త జ్ఞానమునకు ఆకరమైన, ఋగ్వేదము,
యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అను పేరుగల వేదము అప్రయత్నముగా, లీలామాత్రముగా,
పురుషునియొక్క నిశ్వాసమువలె మహాభూతమైన పరబ్రహ్మ నుండి పుట్టినదనిన ఇంక చెప్పవలసినదేమి? “ఈ మహా
భూతమైన పరమాత్మయొక్క నిశ్వాసమే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము” అని శ్రుతి చెప్పుటవలన ఆ
మహాభూతముయొక్క నిరతిశయమైన (ఇంకొకదాని చేత మించబడని) సర్వజ్ఞత్వమును, సమస్తమైన శక్తులను కలిగి
యుండడమును తెలియ చేయుచున్నది.)
“యథా
అధ్యే తారః పూర్వం క్రమం జ్ఞాత్వా వేదం కుర్వంతి, తథా విచిత్రగుణమాయాసహా యో అనావృతానంత స్వప్రకాశ
చిద్రూపః పరమేశ్వరః స్వకృత పూర్వకల్పీ యక్రమ సజాతీయక్రమవంతం వేదరాశిం తదర్థాంశ్చ యుగపత్ జ్ఞానన్నేవ
కరోతీతి న వేదస్య పౌరుషే యతా”.
(వేదాధ్యయనము
చేయువాడు పూర్వక్రమమును తెలుసుకొని వేదాధ్యయనము ఏ ప్రకారము చేయునో ఆ ప్రకారము విచిత్ర గుణములతో
కూడుకున్న మాయా సహాయము కలవాడై ఏ విధమైన ఆవరణములు లేకయుండి, అంతములేని స్వయం ప్రకాశ చైతన్యమే
రూపముగా గల పరమేశ్వరుడు పూర్వకల్పములో తనచేత చేయబడిన ప్రకారము ననుసరించి వేద రాశిని దాని
యర్థమును, రెండింటినీ తెలిసినవాడైనందున చేయును. అందువలన వేదము అపౌరుషేయము - అనగా, ఒక
పురుషమాత్రుని చేత చేయబడలేదు -)
“స
భగవాన్ పురుషోత్తమః ప్రలయావసాన సమ యే పూర్వ సంస్థానం జగత్ స్మరన్”బహుస్యాం” ఇతి సంకల్ప్య, భోగ్య
భోక్తృ జాతం స్వస్మిన్ స్వస్మిన్ శక్తి మాత్రావశేషం ప్రలీనం విభజ్య మహదాది బ్రహ్మాండం హిరణ్యగర్భ పర్యంతం
యథాపూర్వం సృష్ట్వా వేదాంశ్చ పూర్వాను పుర్వీ విశేష సంస్థితాన్ ఆవిష్కృత్య, హిరణ్యగర్భ యోపదిశ్య, పూర్వ
వ దేవదేవాద్యాకార జగత్సర్గే తం నియుజ్య స్వయమపి తదంతరాత్మ తయా (అ) వతస్థే.
“ఏ
తదేవ వేదస్యా పౌరుషే యత్వం, నిత్యత్వం చ| యత్ పూర్వ పూర్వోచ్చారణ క్రమ జనిత సంస్కారేణ తమేవ క్రమ
విశేషం స్మృత్వా తే నైవ క్రమేణోచ్చారణత్వం” (శ్రీ రామనుజః)
(భగవంతుడైన
పురుషోత్తముడు ప్రళయము ముగియు సమయమందు ఇదివఱకు కల్పములో ఉండుకున్న జగత్తును స్మరించుచు
“నేను బహు విధములుగా మారెదను” (అనేక రూపములుగా మారెదను) అని సంకల్పించి భోక్త భోగ్య రూపములైన
సమస్త వస్తువులను శక్తి రూపముగా మాత్రము తనలో లీనమైనవాటిని విభజించి (వేఱు, వేఱుగా విభక్తము చేసి),
మహత్తత్వము మొదలుకొని హిరణ్యగర్భునివఱకుగల బ్రహ్మాండమును పూర్వము వలెనే - పూర్వకల్పములోవలెనే,
సృష్టించి, పూర్వాను పూర్వికముగా, ముందు ముందు కల్పములలోవలెనే ఆవిష్కరించి హిరణ్యగర్భునకు -
చతుర్ముఖ బ్రహ్మకు - ఉపదేశించి, పూర్వమువలెనే దేవతలు మొదలగు ఆకారములతోకూడిన జగత్తును
సృష్టించుట యందు అతనిని నియోగించి తానే వాటి అన్నింటిలోను అంతరాత్మగా ఉండెను - పూర్వ పూర్వోచ్చారణ
క్రమమువలన కలిగిన సంస్కారమువలన దానినే ఆ క్రమమునే స్మరించి ఆ క్రమముగానే ఉచ్చరించుటవలననే
వేదములు అపౌరుషేయములని, నిత్యములని చెప్పబడుచున్నవి.)
“అస్య
మహతో భూతస్య నిశ్వసి తమే వైతత్, యదృగ్వేదో, యజుర్వేదస్సామవేదో (అ)ధర్వాంగిరస ఇతి మహాపురాణం, విద్యా
ఉపనిషదస్సూత్రాణి” (బృహదారణ్యకోపనిషత్ - 2 - 4 -10)
(ఋగ్వేదము,
యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, ఇతిహాసములు,పురాణములు, విద్యలు, ఉపనిషత్తులు,
బ్రహ్మసూత్రములు - ఇవి అన్నియు మహాభూతమైన పరమాత్మయొక్క నిశ్వాసమే.ఉచ్చ్వాస నిశ్వాసములు ఏ పురుషుడూ
ప్రయత్నముచేయ నవసరము లేకనే ఎట్లు కలుగుచున్నవో, ఆ ప్రకారముగానే పరమాత్మయొక్క నిశ్వాసమే
వేదములు,మొదలగునవన్నియును. అందుచేత బ్రహ్మకూడా ఒక పురుషుడే అని అతని ప్రణీతములగుటచే
పౌరుషేయములు అని వాదించుటకు వీలులేదు - అవి భగవంతునియొక్క నిశ్వాసమువలన అనాయాసముగా వాటంతట అవే
ఉదయించినవి కనుక.)
“అనాదినిధనా నిత్యా వాగుత్సృష్టా
స్వయం భువా |
ఆదౌ వేదమ
యీ దివ్యా యతః సర్వాః ప్రవృత్త యః ||“.
(సృష్టి
ప్రారంభములో ఆద్యంతములు లేనిది, నిత్యమైనదిన్నీ వేదమయమైన వాక్కు స్వయంభువుడైన పరమాత్మనుండి
విసృష్టమైనది. దానినుండి అన్నియు పుట్టినవి.)
“యో బ్రహ్మణం
విదధాతి పూర్వం, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై”.
(ఎవరు
పూర్వము చతుర్ముఖ బ్రహ్మను సృష్టించెనో, ఎవరు వేదములను నిచ్చెనో అతని కొఱకు నమస్కారము.)
వేదము
బ్రహ్మనుండి పుట్టినది, కాని, ఇందువలన అవి ఒక పురుషుని - మానవమాత్రుని - ప్రణీతములనుటకు
వీలులేదు - ఎందుచేతననగా - “ధతా యథా పూర్వమకల్పయత్” అను శ్రుతివలన పూర్వకల్పములో ఉండిన
వేదరాశినే భగవంతుడు ఆ ప్రకారముగానే కల్పించెను - మొదటిసారిగాకాదు - ఎప్పుడు మొదట కల్పించెనో తెలియదు.
ఏ పురుషుడు - ఏమానవమాత్రుడు - కల్పించినట్లు తెలియదు. బ్రహ్మయే కల్పించియున్నందున అవి అపౌరుషే
యములు -
వేదములు
అపౌరుషేయములుగాన, ఒక పురుషునిచే ప్రణీతములు కానందున, పురుష ప్రణీత గ్రంధములకు కలుగు
భ్రమ, ప్రమాదము, మొదలగు దోషములుండవు. అందువలన వేదము, అప్పటికీ, ఇప్ప టికీ, ఎప్పటికీ ప్రమాణమే.
వేదములో చెప్పిన విషయములకు - అపౌరుషేయమైనందున - వేదమే ప్రమాణము.)
(అందులో
చెప్పిన విషయములు - ప్రకృతి ధర్మములు - (natural laws) - అన్నికాలములకు
సత్యములు.)
Transliteration
mahataḥ
ṛgvēdādēḥ śāstrasyānēka vidyāsthānōpa bṛṃhitasya pradīpavatsarvārthā va
dyōtinaḥ sarvajña kalpasya yōniḥ kāraṇaṃ brahma. nahī dṛśasya ṛgvēdādi
lakṣaṇasya sarvajña guṇānvitasya sarvajñāt anyataḥ saṃbhavōsti.
yadyadvistarārthaṃ śāstraṃ yasmāt puruṣaviśēṣāt saṃbhavati, yathā
vyākaraṇādi pāṇinyādēḥ jñēyaika dēśārthamapi satatōpyadhikatara vijñānaḥ
iti prasiddhaṃ lōkē. kimuvaktavyaṃ anēka śākhābēdha bhinnasya
dēvatiryaṅmanuṣya varṇāśramādi pravibhāga hētōḥ ṛgvēdādyākhyasya
sarvajñānā karasya aprayatnēnaiva līlānyā yēna puruṣaniśvāsavadyasmān
mahataḥ bhūtādyōnēḥ saṃbhavaḥ - “asya mahatō bhūtasya niratiśayaḥ
sarvajñatvaṃ sarva śaktimatvaṃ cēti” (śrīśaṃkaraḥ-
brahmasūtrabhāṣyē)
(goppadainaṭuvaṃṭinnī,
anēkavidyalaku sthānamai, samasta puruṣārthamulanu dīpamuvale
prajvaliṃpacēsinaṭuvaṃṭinnī, ṛgvēdādulugala vēdamunaku kāraṇamu
parabrahma. samastamaina jñānamunu bhōdhiṃcu guṇamulugala ṛgvēdādi
lakṣaṇamulugala vēdamu sarvajñuḍaina paramātma tappa itarunivalana
saṃbhaviṃciyuṃḍadu - pāṇini modalaguvāricē raciṃcabaḍina vyākaraṇamu
modalagu graṃdhamulavale okānoka puruṣuḍuraciṃcina graṃdhamulē goppa
vijñānamunu bhōdhiṃcunavigā lōkamulō prasiddhamugānunnavi. aṭṭi
saṃdarbhamulō dēvatiryaṅmanuṣya varṇāśramamulu modalagu anēka bhāgamulu
kaligiyuṃḍi, anēka śēkhābhēdamulu kaligiyuṃḍi, samasta jñānamunaku
ākaramaina, ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvavēdamu anu
pērugala vēdamu aprayatnamugā, līlāmātramugā, puruṣuniyokka
niśvāsamuvale mahābhūtamaina parabrahma nuṃḍi puṭṭinadanina iṃka
ceppavalasinadēmi? “ī mahā bhūtamaina paramātmayokka niśvāsamē ī
ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu” ani śruti ceppuṭavalana ā
mahābhūtamuyokka niratiśayamaina (iṃkokadāni cēta miṃcabaḍani)
sarvajñatvamunu, samastamaina śaktulanu kaligi yuṃḍaḍamunu teliya
cēyucunnadi.)
“yathā
adhyē tāraḥ pūrvaṃ kramaṃ jñātvā vēdaṃ kurvaṃti, tathā
vicitraguṇamāyāsahā yō anāvṛtānaṃta svaprakāśa cidrūpaḥ paramēśvaraḥ
svakṛta pūrvakalpī yakrama sajātīyakramavaṃtaṃ vēdarāśiṃ tadarthāṃśca
yugapat jñānannēva karōtīti na vēdasya pauruṣē yatā”.
(vēdādhyayanamu
cēyuvāḍu pūrvakramamunu telusukoni vēdādhyayanamu ē prakāramu cēyunō ā
prakāramu vicitra guṇamulatō kūḍukunna māyā sahāyamu kalavāḍai ē
vidhamaina āvaraṇamulu lēkayuṃḍi, aṃtamulēni svayaṃ prakāśa caitanyamē
rūpamugā gala paramēśvaruḍu pūrvakalpamulō tanacēta cēyabaḍina prakāramu
nanusariṃci vēda rāśini dāni yarthamunu, reṃḍiṃṭinī telisinavāḍainaṃduna
cēyunu. aṃduvalana vēdamu apauruṣēyamu - anagā, oka puruṣamātruni cēta
cēyabaḍalēdu -)
“sa
bhagavān puruṣōttamaḥ pralayāvasāna sama yē pūrva saṃsthānaṃ jagat
smaran”bahusyāṃ” iti saṃkalpya, bhōgya bhōktṛ jātaṃ svasmin svasmin
śakti mātrāvaśēṣaṃ pralīnaṃ vibhajya mahadādi brahmāṃḍaṃ hiraṇyagarbha
paryaṃtaṃ yathāpūrvaṃ sṛṣṭvā vēdāṃśca pūrvānu purvī viśēṣa saṃsthitān
āviṣkṛtya, hiraṇyagarbha yōpadiśya, pūrva va dēvadēvādyākāra jagatsargē
taṃ niyujya svayamapi tadaṃtarātma tayā (a) vatasthē.
“ē
tadēva vēdasyā pauruṣē yatvaṃ, nityatvaṃ ca| yat pūrva pūrvōccāraṇa
krama janita saṃskārēṇa tamēva krama viśēṣaṃ smṛtvā tē naiva
kramēṇōccāraṇatvaṃ” (śrī rāmanujaḥ)
(bhagavaṃtuḍaina
puruṣōttamuḍu praḷayamu mugiyu samayamaṃdu idivaṟaku kalpamulō uṃḍukunna
jagattunu smariṃcucu “nēnu bahu vidhamulugā māredanu” (anēka rūpamulugā
māredanu) ani saṃkalpiṃci bhōkta bhōgya rūpamulaina samasta vastuvulanu
śakti rūpamugā mātramu tanalō līnamainavāṭini vibhajiṃci (vēṟu, vēṟugā
vibhaktamu cēsi), mahattatvamu modalukoni hiraṇyagarbhunivaṟakugala
brahmāṃḍamunu pūrvamu valenē - pūrvakalpamulōvalenē, sṛṣṭiṃci, pūrvānu
pūrvikamugā, muṃdu muṃdu kalpamulalōvalenē āviṣkariṃci hiraṇyagarbhunaku
- caturmukha brahmaku - upadēśiṃci, pūrvamuvalenē dēvatalu modalagu
ākāramulatōkūḍina jagattunu sṛṣṭiṃcuṭa yaṃdu atanini niyōgiṃci tānē vāṭi
anniṃṭilōnu aṃtarātmagā uṃḍenu - pūrva pūrvōccāraṇa kramamuvalana
kaligina saṃskāramuvalana dāninē ā kramamunē smariṃci ā kramamugānē
uccariṃcuṭavalananē vēdamulu apauruṣēyamulani, nityamulani
ceppabaḍucunnavi.)
“asya
mahatō bhūtasya niśvasi tamē vaitat, yadṛgvēdō, yajurvēdassāmavēdō
(a)dharvāṃgirasa iti mahāpurāṇaṃ, vidyā upaniṣadassūtrāṇi”
(bṛhadāraṇyakōpaniṣat - 2 - 4 -10)
(ṛgvēdamu,
yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu, itihāsamulu,purāṇamulu,
vidyalu, upaniṣattulu, brahmasūtramulu - ivi anniyu mahābhūtamaina
paramātmayokka niśvāsamē.uccvāsa niśvāsamulu ē puruṣuḍū prayatnamucēya
navasaramu lēkanē eṭlu kalugucunnavō, ā prakāramugānē paramātmayokka
niśvāsamē vēdamulu,modalagunavanniyunu. aṃducēta brahmakūḍā oka puruṣuḍē
ani atani praṇītamulaguṭacē pauruṣēyamulu ani vādiṃcuṭaku vīlulēdu - avi
bhagavaṃtuniyokka niśvāsamuvalana anāyāsamugā vāṭaṃtaṭa avē udayiṃcinavi
kanuka.)
“anādinidhanā nityā
vāgutsṛṣṭā svayaṃ bhuvā |
ādau vēdama yī
divyā yataḥ sarvāḥ pravṛtta yaḥ ||“.
(sṛṣṭi
prāraṃbhamulō ādyaṃtamulu lēnidi, nityamainadinnī vēdamayamaina vākku
svayaṃbhuvuḍaina paramātmanuṃḍi visṛṣṭamainadi. dāninuṃḍi anniyu
puṭṭinavi.)
“yō
brahmaṇaṃ vidadhāti pūrvaṃ, yō vai vēdāṃśca prahiṇōti tasmai”.
(evaru
pūrvamu caturmukha brahmanu sṛṣṭiṃcenō, evaru vēdamulanu niccenō atani
koṟaku namaskāramu.)
vēdamu
brahmanuṃḍi puṭṭinadi, kāni, iṃduvalana avi oka puruṣuni - mānavamātruni
- praṇītamulanuṭaku vīlulēdu - eṃducētananagā - “dhatā yathā
pūrvamakalpayat” anu śrutivalana pūrvakalpamulō uṃḍina vēdarāśinē
bhagavaṃtuḍu ā prakāramugānē kalpiṃcenu - modaṭisārigākādu - eppuḍu
modaṭa kalpiṃcenō teliyadu. ē puruṣuḍu - ēmānavamātruḍu - kalpiṃcinaṭlu
teliyadu. brahmayē kalpiṃciyunnaṃduna avi apauruṣē yamulu -
vēdamulu
apauruṣēyamulugāna, oka puruṣunicē praṇītamulu kānaṃduna, puruṣa praṇīta
graṃdhamulaku kalugu bhrama, pramādamu, modalagu dōṣamuluṃḍavu.
aṃduvalana vēdamu, appaṭikī, ippa ṭikī, eppaṭikī pramāṇamē. vēdamulō
ceppina viṣayamulaku - apauruṣēyamainaṃduna - vēdamē pramāṇamu.)
(aṃdulō
ceppina viṣayamulu - prakṛti dharmamulu - (natural laws) -
annikālamulaku satyamulu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.