← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపవాదము apavādamu

Original — తెలుగు

వాదమును అపాకరించుట అపవాదము -

వాదమును నిరసించుట, త్రోసివేయుట; మిధ్యావాదము; అసత్యవాదము; తప్పువాదము.

అపవాదో నామ రజ్జు వివర్తస్య సర్పస్య రజ్జు మాత్రవత్; వస్తు వివర్తస్య అవస్తునః అజ్ఞానాదేః ప్రపంచస్య వస్తు మాత్రత్వం.

(భ్రాంతివలన త్రాడు సర్పముగా కనబడినప్పటికీ అది నిజానికి త్రాడే అయినట్లు వస్తువు అయిన బ్రహ్మ అవస్తువు అయిన ప్రపంచముగా అజ్ఞానమువల్ల కనబడినను అది ప్రపంచము కాదు బ్రహ్మమే అని తెలుసుకొనుట.)

రజ్జు వివర్తస్య సర్పస్య రజ్జు మాత్రత్వాత్ వస్తు భూత బ్రహ్మణి వివర్తస్య ప్రపంచాదేః వస్తుభూత రూపత్స్వ నదేశః అపవాదః.

(భ్రమచేత పాముగా కనిపించిన త్రాడును అది పాముకాదు, త్రాడే, అని తెలుసుకొనినట్లు బ్రహ్మ అని అనుకొను ప్రపంచమును తొలగించిన బ్రహ్మము తెలియనగును.)

అధా త్వాదేశో ‘నేతి నేతి’ అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన ప్రకారము “ఇది కాదు, ఇది కాదు” - (ఇది బ్రహ్మము కాదు) అని వస్తువులన్నింటినీ త్రోసివేయగా మిగిలినది బ్రహ్మము అయినట్లు ‘నాయం సర్పో రజ్జు రితి’, ‘నేదం రజితం శుక్తిరితి’ ‘నాయం చోరః స్థాణురితి’ - (రాత్రిపూట చీకటిలో త్రాడును చూచి ఇది పాము అనుకొని భ్రాంతి వదలి, ఇది పాము కాదు, త్రాడే అనిన్నీ, చీకటిలో ముచ్చెపు చిప్పను చూచి ఇది వెండియని కలిగిన భ్రాంతి వదలి, ఇది వెండికాదు ముచ్చెపు చిప్ప అనిన్నీ, చీకటిలో చెట్టు మొరడుచూచి ఇది దొంగ అని కలిగిన భ్రాంతి వదలి ఇది దొంగ కాదు మొరడు అనిన్నీ, నిజము తెలుసుకొనుట అపవాదము. ఈ ప్రకారముగానే ఈ కనబడునదంతయు బ్రహ్మమే, ప్రపంచముగా వివర్తమైనది, మారినది - అంతేగాని వేరే ఇంకేదియు లేదు - అని తెలుసుకొనుట భ్రాంతివలన కలిగినది ఆరోపము. అరోపమును యదార్థ జ్ఞానము వలన - నిజస్థితిని తెలుసుకొనుట వలన - తొలగించుట అపవాదము. )

Transliteration

vādamunu apākariṃcuṭa apavādamu -

vādamunu nirasiṃcuṭa, trōsivēyuṭa; midhyāvādamu; asatyavādamu; tappuvādamu.

apavādō nāma rajju vivartasya sarpasya rajju mātravat; vastu vivartasya avastunaḥ ajñānādēḥ prapaṃcasya vastu mātratvaṃ.

(bhrāṃtivalana trāḍu sarpamugā kanabaḍinappaṭikī adi nijāniki trāḍē ayinaṭlu vastuvu ayina brahma avastuvu ayina prapaṃcamugā ajñānamuvalla kanabaḍinanu adi prapaṃcamu kādu brahmamē ani telusukonuṭa.)

rajju vivartasya sarpasya rajju mātratvāt vastu bhūta brahmaṇi vivartasya prapaṃcādēḥ vastubhūta rūpatsva nadēśaḥ apavādaḥ.

(bhramacēta pāmugā kanipiṃcina trāḍunu adi pāmukādu, trāḍē, ani telusukoninaṭlu brahma ani anukonu prapaṃcamunu tolagiṃcina brahmamu teliyanagunu.)

adhā tvādēśō ‘nēti nēti’ ani bṛhadāraṇyakōpaniṣattulō ceppina prakāramu “idi kādu, idi kādu” - (idi brahmamu kādu) ani vastuvulanniṃṭinī trōsivēyagā migilinadi brahmamu ayinaṭlu ‘nāyaṃ sarpō rajju riti’, ‘nēdaṃ rajitaṃ śuktiriti’ ‘nāyaṃ cōraḥ sthāṇuriti’ - (rātripūṭa cīkaṭilō trāḍunu cūci idi pāmu anukoni bhrāṃti vadali, idi pāmu kādu, trāḍē aninnī, cīkaṭilō muccepu cippanu cūci idi veṃḍiyani kaligina bhrāṃti vadali, idi veṃḍikādu muccepu cippa aninnī, cīkaṭilō ceṭṭu moraḍucūci idi doṃga ani kaligina bhrāṃti vadali idi doṃga kādu moraḍu aninnī, nijamu telusukonuṭa apavādamu. ī prakāramugānē ī kanabaḍunadaṃtayu brahmamē, prapaṃcamugā vivartamainadi, mārinadi - aṃtēgāni vērē iṃkēdiyu lēdu - ani telusukonuṭa bhrāṃtivalana kaliginadi ārōpamu. arōpamunu yadārtha jñānamu valana - nijasthitini telusukonuṭa valana - tolagiṃcuṭa apavādamu. )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.