పరమపురుషార్థ లక్షణాపవర్గః -
(ధర్మార్ధకామ
మోక్షములను చతుర్విధ పురుషార్థములలో ఆఖరిది, అన్నింటికంటె ఉత్కృష్టమైన పురుషార్థము,
మోక్షము.)
సంసార నివృత్తిః, అవిద్యా
నివృత్తిః.
(జననమరణ రూపమైన సంసారము
లేకుండ చేయునది, అవిద్యా, దాని ప్రభావము లేకుండునది.)
మరల మరల
కలుగు జననమరణరూపమైన భవబంధమునుండి విముక్తి.
అంతము, ముక్తి, మోక్షము; నాశము.
“బ్రహ్మ
విషయ వేదన మేవ అపవర్గోపాయం సర్వాః శ్రుతయః విద ధాతి. జ్ఞానం చోపాసనాత్మకం, ఉపాస్యం చ సగుణం బ్రహ్మ
ఇత్యుక్తం”. (శ్రీరామానుజః)
(బ్రహ్మజ్ఞానమే
అపవర్గమునకు ఉపాయము అని శ్రుతులు అన్నియు చెప్పుచున్నవి. బ్రహ్మజ్ఞానమే ఉపాసన, ఉపాసించ వలసినది,
ఉపాసించ తగినది సగుణ బ్రహ్మ.)
గౌరోహమితి
మిధ్యా జ్ఞాన స్యాపాయే రాగద్వేష మోహాది దోషాణాం నాశః దోషాపా యాత్ ధర్మాధర్మ స్వరూప ప్రవృత్తిరపా యః,
ప్రవృత్త్యపాయాత్ పునర్దేహప్రాప్తి రూప జన్మాపాయః,
ఏవం
పారక్రమేణ ఉత్తరోత్తరస్య హేతునాశాత్, నాశేసతి తస్య ప్రవృత్తి రూపహేతోః అనంతరస్య కార్యస్య జన్మనః అపాయాత్
దుఃఖ ధ్వంసరూపో అపవర్గో భవతీ త్యర్థః -.
(మిథ్యాజ్ఞానము
పోయినతోడనే రాగము, ద్వేషము, మోహము మొదలగు వాటివలనకలుగు దోషములు నశించును - ఈ దోషములు
పోయినతోడనే ధర్మాధర్మ రూపమైన ప్రవృత్తి నాశనమగును - ప్రవృత్తి పోయినతోడనే తిరిగి దేహమును పొందుటే
రూపముగా గల జన్మమునెత్తుట లేకపోవును - ఈ ప్రకారముగా ఒకదానికి ఒకటి కారణమై యుండుటచేత, కారణము
నాశించగా జన్మ కలుగక పోవుటవలన సమస్తమైన దుఃఖములను ధ్వంసము చేయునట్టి అపవర్గము - మోక్షము –
కలుగును.)
“దుఃఖ జన్మ
ప్రవృత్త దోషమిథ్యా నానాముత్తరోత్తరాపాయే తదనం తరాపా యా దపవర్గః -”. (గౌతమసూత్రము)
(దుఃఖము,
జన్మము, ప్రవృత్తి, దోషము, మిథ్యాజ్ఞానము అను ఈ అయిదింటిలోను ఆఖరిదియగు మిధ్యా జ్ఞానము యొక్క
వినాశముచే దోషనాశము, దోషనాశముచే ప్రఋత్తినాశము, ప్రవృత్తినాశముచే జన్మ నాశము, దానివలన దుఃఖనాశము -
అదియే అపవర్గము - లేక మోక్షము.)
“రూపమారోగ్యమర్థాంశ్చ భోగాం
శ్చైవాను షంగికాన్ |
దదతి
ధ్యాయతోనిత్యం అపవర్గో ప్రదోహరిః ||“.
(అపవర్గమునిచ్చు
శ్రీహరిని నిత్యము ధ్యానించినయడల రూపము, ఆరోగ్యము, అర్థములు, భోగములు, మొదలగు వాటిని కూడ అతను
ఇచ్చును.)
వ. “---
మోక్షమిచ్చుటంజేసి నారయణుండు సేవ్యుండు ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 1 - 2 - 59)
“మోక్షమిచ్ఛేత్
జనార్దనాత్”. (మోక్షము కొఱకు జనార్దనుని - శ్రీమహావిష్ణువును - ఉపాసించవలెను.)
Transliteration
paramapuruṣārtha
lakṣaṇāpavargaḥ -
(dharmārdhakāma
mōkṣamulanu caturvidha puruṣārthamulalō ākharidi, anniṃṭikaṃṭe
utkṛṣṭamaina puruṣārthamu, mōkṣamu.)
saṃsāra
nivṛttiḥ, avidyā nivṛttiḥ.
(jananamaraṇa
rūpamaina saṃsāramu lēkuṃḍa cēyunadi, avidyā, dāni prabhāvamu
lēkuṃḍunadi.)
marala
marala kalugu jananamaraṇarūpamaina bhavabaṃdhamunuṃḍi vimukti.
aṃtamu, mukti,
mōkṣamu; nāśamu.
“brahma
viṣaya vēdana mēva apavargōpāyaṃ sarvāḥ śrutayaḥ vida dhāti. jñānaṃ
cōpāsanātmakaṃ, upāsyaṃ ca saguṇaṃ brahma ityuktaṃ”. (śrīrāmānujaḥ)
(brahmajñānamē
apavargamunaku upāyamu ani śrutulu anniyu ceppucunnavi. brahmajñānamē
upāsana, upāsiṃca valasinadi, upāsiṃca taginadi saguṇa brahma.)
gaurōhamiti
midhyā jñāna syāpāyē rāgadvēṣa mōhādi dōṣāṇāṃ nāśaḥ dōṣāpā yāt
dharmādharma svarūpa pravṛttirapā yaḥ, pravṛttyapāyāt punardēhaprāpti
rūpa janmāpāyaḥ,
ēvaṃ
pārakramēṇa uttarōttarasya hētunāśāt, nāśēsati tasya pravṛtti rūpahētōḥ
anaṃtarasya kāryasya janmanaḥ apāyāt duḥkha dhvaṃsarūpō apavargō bhavatī
tyarthaḥ -.
(mithyājñānamu
pōyinatōḍanē rāgamu, dvēṣamu, mōhamu modalagu vāṭivalanakalugu dōṣamulu
naśiṃcunu - ī dōṣamulu pōyinatōḍanē dharmādharma rūpamaina pravṛtti
nāśanamagunu - pravṛtti pōyinatōḍanē tirigi dēhamunu poṃduṭē rūpamugā
gala janmamunettuṭa lēkapōvunu - ī prakāramugā okadāniki okaṭi kāraṇamai
yuṃḍuṭacēta, kāraṇamu nāśiṃcagā janma kalugaka pōvuṭavalana samastamaina
duḥkhamulanu dhvaṃsamu cēyunaṭṭi apavargamu - mōkṣamu – kalugunu.)
“duḥkha
janma pravṛtta dōṣamithyā nānāmuttarōttarāpāyē tadanaṃ tarāpā yā
dapavargaḥ -”. (gautamasūtramu)
(duḥkhamu,
janmamu, pravṛtti, dōṣamu, mithyājñānamu anu ī ayidiṃṭilōnu ākharidiyagu
midhyā jñānamu yokka vināśamucē dōṣanāśamu, dōṣanāśamucē praṛttināśamu,
pravṛttināśamucē janma nāśamu, dānivalana duḥkhanāśamu - adiyē
apavargamu - lēka mōkṣamu.)
“rūpamārōgyamarthāṃśca
bhōgāṃ ścaivānu ṣaṃgikān |
dadati dhyāyatōnityaṃ
apavargō pradōhariḥ ||“.
(apavargamuniccu
śrīharini nityamu dhyāniṃcinayaḍala rūpamu, ārōgyamu, arthamulu,
bhōgamulu, modalagu vāṭini kūḍa atanu iccunu.)
va.
“--- mōkṣamiccuṭaṃjēsi nārayaṇuṃḍu sēvyuṃḍu ---” (śrīmadāṃdhra
mahābhāgavatamu- 1 - 2 - 59)
“mōkṣamicchēt
janārdanāt”. (mōkṣamu koṟaku janārdanuni - śrīmahāviṣṇuvunu -
upāsiṃcavalenu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.