← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రమే యః apramē yaḥ

Original — తెలుగు

ప్రమాతుం అశక్యః, సర్వైరపి తత్వైః ప్రమాతుం అశక్యః.

(దేనితోను కొలవ శక్యముకానిది, ఏ తత్వములచేతను పోల్చతగినదికాదు.)

న ప్రమేయమప్రమేయం, అశక్య పరిచ్ఛేద్య మిత్యర్థః. అపరిచ్ఛేదం, ఇత్థం అయమితి పరిచ్ఛేత్తుం అశక్యం, ఏవం భూతం ఇతి నిశ్చేతుం అశక్యం.

(ప్రమేయము కానిది అప్రమేయము, పరిమితి చెప్పుటకు శక్యముకానిది - అపరిచ్ఛేదము. ఇతను ఇటువంటివాడు అని పరిమితితో చెప్పుటకు వీలులేనివాడు, అపరిచ్ఛిన్నుడు.)

న ప్రమేయః, ప్రత్యక్షాది ప్రమాణైః అపరిచ్ఛేద్యః.

(ప్రత్యక్షము మొదలగు ప్రమాణములచేత తెలుసుకొనుటకు వీలగు పరిమితి లేనివాడు.)

అశక్య పరిచ్ఛేదః -

(మితి ఇడుటకు - ఇంతటివాడు, ఇటువంటివాడు అని పరిమితి చెప్పుటకు శక్యముకానివాడు, అపరిచ్ఛిన్నుడు.)

అపరిమేయః. (ఇంతటివాడని ప్రమాణింప శక్యముకానివాడు - పరిపూర్ణుడు.)

ప్రత్యక్షాది ప్రమాణైః అపరిచ్ఛేద్యః (శ్రీశంకరః.)

(ప్రత్యక్ష ప్రమాణము మొదలగు ప్రమాణములచేత పరిమితి చెప్పి తెలుసుకొనుటకు శక్యముకానివాడు.)

ప్రత్యక్షాది ప్రమాణాగమ్యః.

(ప్రత్యక్షప్రమాణము మొదలగు ప్రమాణములచేత తెలుసుకొనుటకు అలవికానివాడు.)

యత్ప్రత్యక్షాది ప్రమాణా మేయ తద ప్రమే యం.

(ప్రత్యక్షప్రమాణము మొదలగు ప్రమాణములచేత తెలియబడనిది అప్రమేయము - అనగా, ప్రమాణాతీతము, ప్రమాణములకు మించినది.)

“అత్య శక్యం పరిచ్ఛేత్తుమిత్థం చా యమి యానితి”. (గీతాభావప్రకాశము- 11 - 64)

(ఇది ఇట్టిదని, భగవంతుడింతటివాడని పరిచ్ఛేదమొనరింప శక్యము కానివాడు.)

వేదాంతేతర ప్రమాణా సహత్వాత్ - (ఉపనిషత్తులుకాక ఇతర ప్రమాణములచేత తెలియబడనివాడు.)

శబ్దాది రహితత్వాత్ న ప్రత్యక్ష గమ్యః.

(శబ్దాదులు, అనగా, శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు లేనివాడు అగుటచేత ప్రత్యక్ష ప్రమాణముచేత తెలియబడనివాడు, చూచుటకు వీలులేనివాడు.)

న అపి అనుమానగమ్యః, తద్వ్యాప్తి లింగా భావాత్.

(అనుమానవ్యాప్తిగల లింగము లేనందున అనుమానప్రమాణముచేత తెలియబడనివాడు, ఊహించుటకు వీలుకానివాడు.)

నాప్యుపమాన సిద్ధః, నిర్భాగత్వేన.

(భాగములు లేకపోవుటచేత - పూర్ణుడగుటచేత ఉపమానప్రమాణము ద్వారా దేనితోనూ పోల్చి చెప్పుటకు వీలుకానివాడు.)

సా దృశా భావాత్.

(తనతో సదృశుడు - సరిగా పోల్చతగినవాడు లేనందున ఉపమానప్రమాణముచేత పోల్చి చెప్పుటకు అలవికానివాడు.)

నా ప్యర్థా పత్తి గ్రాహ్యః, తద్వినానుపద్యమానస్యా సంభవాత్.

(భగవంతుడు తప్ప ప్రమాణములేక సంభవించున దేదియులేదు కావున అర్థాపత్తి ప్రమాణముచే గ్రహించుటకు అలవికానివాడు.)

నాప్య భావ గోచరం భావ రూపత్వాత్, అభావ సాక్షిత్వాత్ చ.

(భావరూపము కలిగియుండుటవలన - అభావమునకు సాక్షియగుటవలన అభావప్రమాణముచే తెలియుటకు శక్యముకానివాడు.)

నాపి శాస్త్రప్రమాణ వేద్యః - ప్రమాణ జన్యాతిశయ భావాత్.

(ప్రమాణములవలన కలుగు నతిశయము లేకుండుటవలన శాస్త్రప్రమాణములవల్ల తెలియబడనివాడు.)

“అపరిచ్ఛిన్నః”. (దేశకాలవస్తువులచేత పరిమితి లేనివాడు) - (త్రివిధ పరిచ్ఛేద రహితుడు)

“అప్రమేయః ప్రమాణైస్త్వం” (మహా భారతము - అరణ్యపర్వము -.)

(ప్రమాణములచేత నీవు తెలియబడనివాడవు, ప్రమాణములకు ప్రమేయముకావు.)

ప్రమాణాతీతం - ప్రమాణమాత్రా గమ్యం.

(ప్రమాణములకు అతీతమైనవాడు, మించినవాడు.)

స్వప్రకాశస్య చిద్ధాతోర్మా నాపేక్షా స్వభాసనే |

నాస్తి సర్వావ భాసస్య మానం తే నావ భాస్యతే||“.

(చిత్ వస్తువు, స్వయంప్రకాశము అయినది మిగిలినవాటిని ప్రకాశింప చేయునది. ఇటువంటిదానికి ప్రమాణము అనునదిలేదు - ఆత్మ చిద్వస్తువు అందుచేత అది అప్రమేయము.)

“నిర్విశేష వస్త్వాది భిః నిర్విశేష వస్తుని ఇదం ప్రమాణమితి న శక్యతే వక్తుం - స విశేషవస్తు విషయత్వాత్; సర్వ ప్రమాణానాం నక్వ చిన్నిర్విశేష వస్తు సిద్ధిః” (శ్రీరామానుజః)

(నిర్విశేష వస్తువులచేత నిర్విశేష వస్తువునకు ఇది ప్రమాణము - ఇది ఇంతది, ఇది ఇటువంటిది అను ప్రమాణము - చెప్పుటకు శక్యముకాదు. ప్రమాణములన్నియు సవిశేష వస్తువులగుటవలన వాటి వల్ల నిర్విసేష వస్తువు ఏదియు సిద్ధించదు, అని అట్టిదానినిదేనిని చెప్పలేదు. పరమాత్మ నిర్విశేషుడు, నిరాకారుడు, నిర్గుణుడు.)

“యస్మాత్ ప్రమాణ ప్రమేయ వ్యవహార ఆత్మా అనవభోధాశ్రయ ఏవ, తస్మాత్సిద్ధమాత్మనో అప్రమేయత్వం; నైవహికార్యం స్వకారణమతి లంఘ్య అన్యత్ర ఆకారకాస్పదముపనిబద్నాతి” (నైష్కర్మ్యసిద్ధి - 2 - 284)

“(మట్టి కారణము, దానితో చేయబడిన కుండ కార్యము. కార్యమైనకుండ కారణమైన మట్టినే ఆశ్రయించియుండును, ఇంకొకదానిని ఆశ్రయించి యుండదు - ఆ ప్రకారముగానే దారము కారణము, బట్ట దానికార్యము. బట్ట దారములనే ఆశ్రయించి యుండును - కుండదారములను ఆశ్రయించి యుండదు, బట్ట మట్టిని ఆశ్రయించి యుండదు. ప్రమాణ ప్రమేయములు అజ్ఞాన కల్పితములు - అందుచేత అజ్ఞానమునే ఆశ్రయించి యుండును - పరమాత్మ అజ్ఞాన కల్పితముకాదు నిత్యసిద్ధమైనది - ఎల్లపుడు ఉండునది. అందుచేత అది ప్రమేయముకాదు, కనుక ప్రమాణముచేత తెలియబడదు - అందుచేత అప్రమేయము.)

యస్మాదద్వైతం తస్మా దేకదైవ ఏకేనైవ ప్రకారేణ - విజ్ఞాన ఘనైకరస ప్రకారేణ ఆకాశవన్నిరంతరేణ అనుద్రష్టవ్యం, యస్మా దేతత్ బ్రహ్మ అప్రమేయం, అప్రమేయం సర్వైకత్వాత్. అన్యేనహ్యస్యత్ ప్రమీయతే ఇదం చైకమేవ, అతో అప్రమేయం.

(పరమాత్మ అద్వయుడగుటచేతను, ఒకే ప్రకారముగా, అనగా విజ్ఞానఘనము - చిద్ఘనము, ఘనీభవించిన చైతన్యము - అను ఒకే ఒక రసము - తత్వము - గా ఉండుట చేత ఆకాశమువలె ఎల్లపుడు ఉండునది. ఇందుచేత అన్నింటిలోను ఒకే ఒకటి అయిన చైతన్యముగా ఉండుటవలన పరమాత్మ అప్రమేయము. ఒకదానితో ఇంకొకదానిని గుఱించి చెప్పగలిగినపుడు అది ప్రమేయము. కాని, పరమాత్మ ఒకటే యగుటవలన, ఉన్నదంతయు పరమాత్మయే అగుటవలన, ప్రమాణమగు ఇంకొకవస్తువు లేనందువలన పరమాత్మ అప్రమేయము.)

శబ్దాదిరహితత్వాన్న ప్రత్యక్షగమ్యం, నాప్యనుమాన విషయః, తద్వాప్త లింగా భావాత్, నాప్యుపమాన సిద్ధిః నిర్భగత్వేన సాదృశా భావాత్ నాప్యర్థాపత్తి గ్రాహ్యః, తద్వినానుప పద్యమానస్యా సంభవాత్; నాప్యభాదగోచరో భావత్వేన సమ్మతత్వాత్, అభావ సాక్షిత్వాచ్చ న షష్ట ప్రమాణస్య; నాపి శాస్త్రప్రమాణవేద్యః, ప్రమాణజన్యాతిశయా భావాత్. యద్యేవం శాస్త్ర యోనిత్వం కథిరె ? ఉచ్యతే ప్రమాణాది సాక్షిత్వేన ప్రకాశ స్వరూపస్య ప్రమాణ విషయత్వే (అ)పి అధ్యస్తా తద్రూప నివర్తకత్వేన శాస్త్ర ప్రమాణకత్వం ఇతి, అప్రమేయః సాక్షి రూపత్వా ద్వా” (శ్రీశంకరః.) (అర్థమునకు చూడుము - 11 to 17)

(“ఆరవ ప్రమాణమైన అభావమునకు (అనుపలబ్దికి) గోచరింపడు - పరమాత్మ సత్తారూపుడు, అభావమునకు సాక్షిగా ఉన్నాడు - శాస్త్రప్రమాణముచే తెలియబడువాడుకాడు - ఎందుచేతననగా శాస్త్రముచేత సిద్ధించెడి అతిశయమేమీ లేదు - అట్లనయడల శాస్త్ర యోని యగుట ఎట్లు ? ప్రమాణాదులకు సాక్షిగా నుండుటవలన ప్రకాశ స్వరూపుడైన పరమాత్మ ప్రమాణగోచరుడు కాకున్నను వీనియందు అధ్యసింపబడిన అనాత్మ రూపమును - తనదికాని రూపమును - దృశ్యప్రపంచమును - నివర్తింప చేయునదగుటచేత శాస్త్రమునకు ప్రమాణము సంభవించుచున్నది. అదియునుగాక సాక్షిరూపుడగుటవలన అప్రమేయుడు - ప్రమే యదృశ్య భిన్నుడగుచున్నాడు”.)

ఘటాది వస్తువులు జడములైనందున స్వయముగా ప్రకాశించునవికావు, ప్రమాణములచేత తెలియబడునవి. అంతకుముందు తెలియనిదానిని ప్రమాణములు తెలియచేయును - పరమాత్మ స్వయంప్రకాశము - ఘటము మొదలగు జడవస్తువులవంటిది కాదు - అందుచేత ప్రమాణములచేత తెలియబడదు.

విషయములైన శబ్ద స్పర్శ రూప రస గంధములు ప్రత్యక్షప్రమాణములచే తెలుసుకొనుటకు వీలగుచున్నది. కాని “అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం” అని ఆత్మ గుఱించి శ్రుతి చెప్పుచున్నది. - తథా అరసం నిత్యమగంధవత్ ” అని కూడ చెప్పుచున్నది. ఆత్మ ఏ విధమైన విషయములు లేనిదికనుక, ప్రత్యక్షప్రమాణముచే తెలియబడదు -“నైవ చైతస్య. లింగం” (శరీరములేనిది, ఆకారములేనిది అని శ్రుతి చెప్పుటవలన ఆత్మ ఎట్టిదో ఊహించుటకు కూడ వీలుకానిది. అందుచేత ఆత్మ అనుమానప్రమాణముచేత తెలియబడనిది. “హేతు దృష్టాన్ త వర్జితః” అని శ్రుతి చెప్పుటవలన ఏ దృష్టాంతము ద్వారా దేనితోనైనను పోల్చి చెప్పుటకు వీలులేదు - కనుకౌపమానప్రమాణము చేతనైనను తెలుసుకొనుటకు వీలులేనిది. “యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్రమ వర్ణం” అని శ్రుతి చెప్పుటవలన ఆత్మ నామ రూప సజాతులులేనిది. అందుచేత శబ్ద ప్రమాణముచేత తెలుసుకొనుటకు వీలుకానిది. “యతో వాచో నివర్తంతే” అనుటవలన వాక్కునకు అందనిది - నోటితో చెప్పుటకు వీలుకానిది. ఇట్లైనను ఆత్మయందు అధ్యస్తమగు విశేషములను తొలగించి నిర్విశేషమగు ఆత్మను శ్రుతులు తెలియచేయుచున్నవి. అందుచేత శ్రుతులు ఆత్మవిషయములో ప్రమాణములు.)

Transliteration

pramātuṃ aśakyaḥ, sarvairapi tatvaiḥ pramātuṃ aśakyaḥ.

(dēnitōnu kolava śakyamukānidi, ē tatvamulacētanu pōlcataginadikādu.)

na pramēyamapramēyaṃ, aśakya paricchēdya mityarthaḥ. aparicchēdaṃ, itthaṃ ayamiti paricchēttuṃ aśakyaṃ, ēvaṃ bhūtaṃ iti niścētuṃ aśakyaṃ.

(pramēyamu kānidi apramēyamu, parimiti ceppuṭaku śakyamukānidi - aparicchēdamu. itanu iṭuvaṃṭivāḍu ani parimititō ceppuṭaku vīlulēnivāḍu, aparicchinnuḍu.)

na pramēyaḥ, pratyakṣādi pramāṇaiḥ aparicchēdyaḥ.

(pratyakṣamu modalagu pramāṇamulacēta telusukonuṭaku vīlagu parimiti lēnivāḍu.)

aśakya paricchēdaḥ -

(miti iḍuṭaku - iṃtaṭivāḍu, iṭuvaṃṭivāḍu ani parimiti ceppuṭaku śakyamukānivāḍu, aparicchinnuḍu.)

aparimēyaḥ. (iṃtaṭivāḍani pramāṇiṃpa śakyamukānivāḍu - paripūrṇuḍu.)

pratyakṣādi pramāṇaiḥ aparicchēdyaḥ (śrīśaṃkaraḥ.)

(pratyakṣa pramāṇamu modalagu pramāṇamulacēta parimiti ceppi telusukonuṭaku śakyamukānivāḍu.)

pratyakṣādi pramāṇāgamyaḥ.

(pratyakṣapramāṇamu modalagu pramāṇamulacēta telusukonuṭaku alavikānivāḍu.)

yatpratyakṣādi pramāṇā mēya tada pramē yaṃ.

(pratyakṣapramāṇamu modalagu pramāṇamulacēta teliyabaḍanidi apramēyamu - anagā, pramāṇātītamu, pramāṇamulaku miṃcinadi.)

“atya śakyaṃ paricchēttumitthaṃ cā yami yāniti”. (gītābhāvaprakāśamu- 11 - 64)

(idi iṭṭidani, bhagavaṃtuḍiṃtaṭivāḍani paricchēdamonariṃpa śakyamu kānivāḍu.)

vēdāṃtētara pramāṇā sahatvāt - (upaniṣattulukāka itara pramāṇamulacēta teliyabaḍanivāḍu.)

śabdādi rahitatvāt na pratyakṣa gamyaḥ.

(śabdādulu, anagā, śabda,sparśa,rūpa,rasa,gaṃdhamulu lēnivāḍu aguṭacēta pratyakṣa pramāṇamucēta teliyabaḍanivāḍu, cūcuṭaku vīlulēnivāḍu.)

na api anumānagamyaḥ, tadvyāpti liṃgā bhāvāt.

(anumānavyāptigala liṃgamu lēnaṃduna anumānapramāṇamucēta teliyabaḍanivāḍu, ūhiṃcuṭaku vīlukānivāḍu.)

nāpyupamāna siddhaḥ, nirbhāgatvēna.

(bhāgamulu lēkapōvuṭacēta - pūrṇuḍaguṭacēta upamānapramāṇamu dvārā dēnitōnū pōlci ceppuṭaku vīlukānivāḍu.)

sā dṛśā bhāvāt.

(tanatō sadṛśuḍu - sarigā pōlcataginavāḍu lēnaṃduna upamānapramāṇamucēta pōlci ceppuṭaku alavikānivāḍu.)

nā pyarthā patti grāhyaḥ, tadvinānupadyamānasyā saṃbhavāt.

(bhagavaṃtuḍu tappa pramāṇamulēka saṃbhaviṃcuna dēdiyulēdu kāvuna arthāpatti pramāṇamucē grahiṃcuṭaku alavikānivāḍu.)

nāpya bhāva gōcaraṃ bhāva rūpatvāt, abhāva sākṣitvāt ca.

(bhāvarūpamu kaligiyuṃḍuṭavalana - abhāvamunaku sākṣiyaguṭavalana abhāvapramāṇamucē teliyuṭaku śakyamukānivāḍu.)

nāpi śāstrapramāṇa vēdyaḥ - pramāṇa janyātiśaya bhāvāt.

(pramāṇamulavalana kalugu natiśayamu lēkuṃḍuṭavalana śāstrapramāṇamulavalla teliyabaḍanivāḍu.)

“aparicchinnaḥ”. (dēśakālavastuvulacēta parimiti lēnivāḍu) - (trividha paricchēda rahituḍu)

“apramēyaḥ pramāṇaistvaṃ” (mahā bhāratamu - araṇyaparvamu -.)

(pramāṇamulacēta nīvu teliyabaḍanivāḍavu, pramāṇamulaku pramēyamukāvu.)

pramāṇātītaṃ - pramāṇamātrā gamyaṃ.

(pramāṇamulaku atītamainavāḍu, miṃcinavāḍu.)

svaprakāśasya ciddhātōrmā nāpēkṣā svabhāsanē |

nāsti sarvāva bhāsasya mānaṃ tē nāva bhāsyatē||“.

(cit vastuvu, svayaṃprakāśamu ayinadi migilinavāṭini prakāśiṃpa cēyunadi. iṭuvaṃṭidāniki pramāṇamu anunadilēdu - ātma cidvastuvu aṃducēta adi apramēyamu.)

“nirviśēṣa vastvādi bhiḥ nirviśēṣa vastuni idaṃ pramāṇamiti na śakyatē vaktuṃ - sa viśēṣavastu viṣayatvāt; sarva pramāṇānāṃ nakva cinnirviśēṣa vastu siddhiḥ” (śrīrāmānujaḥ)

(nirviśēṣa vastuvulacēta nirviśēṣa vastuvunaku idi pramāṇamu - idi iṃtadi, idi iṭuvaṃṭidi anu pramāṇamu - ceppuṭaku śakyamukādu. pramāṇamulanniyu saviśēṣa vastuvulaguṭavalana vāṭi valla nirvisēṣa vastuvu ēdiyu siddhiṃcadu, ani aṭṭidāninidēnini ceppalēdu. paramātma nirviśēṣuḍu, nirākāruḍu, nirguṇuḍu.)

“yasmāt pramāṇa pramēya vyavahāra ātmā anavabhōdhāśraya ēva, tasmātsiddhamātmanō apramēyatvaṃ; naivahikāryaṃ svakāraṇamati laṃghya anyatra ākārakāspadamupanibadnāti” (naiṣkarmyasiddhi - 2 - 284)

“(maṭṭi kāraṇamu, dānitō cēyabaḍina kuṃḍa kāryamu. kāryamainakuṃḍa kāraṇamaina maṭṭinē āśrayiṃciyuṃḍunu, iṃkokadānini āśrayiṃci yuṃḍadu - ā prakāramugānē dāramu kāraṇamu, baṭṭa dānikāryamu. baṭṭa dāramulanē āśrayiṃci yuṃḍunu - kuṃḍadāramulanu āśrayiṃci yuṃḍadu, baṭṭa maṭṭini āśrayiṃci yuṃḍadu. pramāṇa pramēyamulu ajñāna kalpitamulu - aṃducēta ajñānamunē āśrayiṃci yuṃḍunu - paramātma ajñāna kalpitamukādu nityasiddhamainadi - ellapuḍu uṃḍunadi. aṃducēta adi pramēyamukādu, kanuka pramāṇamucēta teliyabaḍadu - aṃducēta apramēyamu.)

yasmādadvaitaṃ tasmā dēkadaiva ēkēnaiva prakārēṇa - vijñāna ghanaikarasa prakārēṇa ākāśavanniraṃtarēṇa anudraṣṭavyaṃ, yasmā dētat brahma apramēyaṃ, apramēyaṃ sarvaikatvāt. anyēnahyasyat pramīyatē idaṃ caikamēva, atō apramēyaṃ.

(paramātma advayuḍaguṭacētanu, okē prakāramugā, anagā vijñānaghanamu - cidghanamu, ghanībhaviṃcina caitanyamu - anu okē oka rasamu - tatvamu - gā uṃḍuṭa cēta ākāśamuvale ellapuḍu uṃḍunadi. iṃducēta anniṃṭilōnu okē okaṭi ayina caitanyamugā uṃḍuṭavalana paramātma apramēyamu. okadānitō iṃkokadānini guṟiṃci ceppagaliginapuḍu adi pramēyamu. kāni, paramātma okaṭē yaguṭavalana, unnadaṃtayu paramātmayē aguṭavalana, pramāṇamagu iṃkokavastuvu lēnaṃduvalana paramātma apramēyamu.)

śabdādirahitatvānna pratyakṣagamyaṃ, nāpyanumāna viṣayaḥ, tadvāpta liṃgā bhāvāt, nāpyupamāna siddhiḥ nirbhagatvēna sādṛśā bhāvāt nāpyarthāpatti grāhyaḥ, tadvinānupa padyamānasyā saṃbhavāt; nāpyabhādagōcarō bhāvatvēna sammatatvāt, abhāva sākṣitvācca na ṣaṣṭa pramāṇasya; nāpi śāstrapramāṇavēdyaḥ, pramāṇajanyātiśayā bhāvāt. yadyēvaṃ śāstra yōnitvaṃ kathire ? ucyatē pramāṇādi sākṣitvēna prakāśa svarūpasya pramāṇa viṣayatvē (a)pi adhyastā tadrūpa nivartakatvēna śāstra pramāṇakatvaṃ iti, apramēyaḥ sākṣi rūpatvā dvā” (śrīśaṃkaraḥ.) (arthamunaku cūḍumu - 11 to 17)

(“ārava pramāṇamaina abhāvamunaku (anupalabdiki) gōcariṃpaḍu - paramātma sattārūpuḍu, abhāvamunaku sākṣigā unnāḍu - śāstrapramāṇamucē teliyabaḍuvāḍukāḍu - eṃducētananagā śāstramucēta siddhiṃceḍi atiśayamēmī lēdu - aṭlanayaḍala śāstra yōni yaguṭa eṭlu ? pramāṇādulaku sākṣigā nuṃḍuṭavalana prakāśa svarūpuḍaina paramātma pramāṇagōcaruḍu kākunnanu vīniyaṃdu adhyasiṃpabaḍina anātma rūpamunu - tanadikāni rūpamunu - dṛśyaprapaṃcamunu - nivartiṃpa cēyunadaguṭacēta śāstramunaku pramāṇamu saṃbhaviṃcucunnadi. adiyunugāka sākṣirūpuḍaguṭavalana apramēyuḍu - pramē yadṛśya bhinnuḍagucunnāḍu”.)

ghaṭādi vastuvulu jaḍamulainaṃduna svayamugā prakāśiṃcunavikāvu, pramāṇamulacēta teliyabaḍunavi. aṃtakumuṃdu teliyanidānini pramāṇamulu teliyacēyunu - paramātma svayaṃprakāśamu - ghaṭamu modalagu jaḍavastuvulavaṃṭidi kādu - aṃducēta pramāṇamulacēta teliyabaḍadu.

viṣayamulaina śabda sparśa rūpa rasa gaṃdhamulu pratyakṣapramāṇamulacē telusukonuṭaku vīlagucunnadi. kāni “aśabda masparśa marūpa mavyayaṃ” ani ātma guṟiṃci śruti ceppucunnadi. - tathā arasaṃ nityamagaṃdhavat ” ani kūḍa ceppucunnadi. ātma ē vidhamaina viṣayamulu lēnidikanuka, pratyakṣapramāṇamucē teliyabaḍadu -“naiva caitasya. liṃgaṃ” (śarīramulēnidi, ākāramulēnidi ani śruti ceppuṭavalana ātma eṭṭidō ūhiṃcuṭaku kūḍa vīlukānidi. aṃducēta ātma anumānapramāṇamucēta teliyabaḍanidi. “hētu dṛṣṭān ta varjitaḥ” ani śruti ceppuṭavalana ē dṛṣṭāṃtamu dvārā dēnitōnainanu pōlci ceppuṭaku vīlulēdu - kanukaupamānapramāṇamu cētanainanu telusukonuṭaku vīlulēnidi. “yat tadadrēśya magrāhya magōtrama varṇaṃ” ani śruti ceppuṭavalana ātma nāma rūpa sajātululēnidi. aṃducēta śabda pramāṇamucēta telusukonuṭaku vīlukānidi. “yatō vācō nivartaṃtē” anuṭavalana vākkunaku aṃdanidi - nōṭitō ceppuṭaku vīlukānidi. iṭlainanu ātmayaṃdu adhyastamagu viśēṣamulanu tolagiṃci nirviśēṣamagu ātmanu śrutulu teliyacēyucunnavi. aṃducēta śrutulu ātmaviṣayamulō pramāṇamulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.