← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపునరావృత్తి apunarāvṛtti

Original — తెలుగు

“అపునర్దేహ సంబంధం” (శ్రీ శంకరః) (తిరిగి దేహముతో సంబంధము లేకుండుట.)

పునర్దేహ సంబంధ భావ రూపం, ముక్తిం.

(తిరిగి దేహముతో సంబంధము లేకుండుటయే రూపముగా గల మోక్షము - దేహముతో సంబంధము అనగా దేహముతో పుట్టుట.)

య దవస్థాత్ ఆత్మనః పునరావృత్తిః న విద్యతే స ఆత్మా అపునరావృత్తిః, స్వేన రూపేణ అపస్థితం ఆత్మానం ఇత్యర్థః –

(ఏ అవస్థలో ఉండగా ఆత్మకు తిరిగి జన్మ కలుగదో ఆ అవస్థకల ఆత్మ పునరావృత్తి లేనిది - స్వస్వ రూపముతో ఆత్మ యుండు స్థితి.)

పునరావృత్తి యనగా మరల జన్మించుట, జనమరణ పరంపరగల సంసారమును పొందుట. అది లేకయుండుట అపునరావృత్తి - అనగా జననము, మరణము మొదలగునవి లేని శాశ్వతమైన కైవల్యము -

“స ఏనాన్ బ్రహ్మ గమ యతి, ఏష దేవపథో బ్రహ్మ పథః. ఏ తేన ప్రతిపద్యమానాః ఇమం మానవమావర్తం నా వర్తంతే.” “ఏతేన అర్చిరాదిమార్గేణ ప్రతిపద్యమానాః ఇమం ఘోరం ఘటీ యంత్రవత్ జననమరణాద్యా వర్తకం సంసారం నావర్తంతే, పునః ప్రతి పద్యంతే”.

(“ఇది బ్రహ్మను పొందించును - ఈ దేవయానమే బ్రహ్మమును పొందుటకు మార్గము - బ్రహ్మపథము. దీనిద్వారా వెళ్ళినవారు ఈ సంసారమను దానిలో తిరిగి పడరు”. ఈ అర్చిరాది మార్గము ద్వారా వెళ్ళినవారు ఘటీయంత్రము వలె, ఏతాము వలె జననమరణములు మొదలగునవి ఒకటి తర్వాత ఒకటిగా అనంతముగా కలుగు మనుష్యులు మొదలగు శరీరములతో కూడియున్న సంసారమందు పడరు - తిరిగి జన్మించరు.)

అపునరావృత్తి ఎట్లు కలుగుననగా : -

“యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కఃసదా శుచిః |

స తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే ||“. (కఠోపనిషత్- 1 - 3 - 8)

(ఆత్మజ్ఞాన సంపన్నుడైన పరాభక్తుడు మనో నిగ్రహవంతుడై, ఎల్లపుడు శుచిగానుండిన పునరావృత్తి లేని పదమును పొందును.)

వ. “- - - నిన్ను సేవించినవారు, వేచిన విత్తనంబునుం బోలె, దేహాంతరోత్పత్తి నొందకుండుదురు - - -”.

(శ్రీమదాంధ్ర మహాభాగవతము- 6 - 475)

“తద్బుద్ధ యస్త దాత్మాన స్తన్నిష్టాస్త త్పరాయణాః |

అచ్ఛాంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూతకల్మషాః ||“. (శ్రీమద్భగవద్గీత- 5 - 17)

“జ్ఞాన ప్రకాశితే తస్మింస్తత్వే సచ్చిత్సుఖాత్మని |

బాహ్య వస్తు పరిత్యాగా ద్బుద్ధిర్యేషాం సునిష్ఠితా |

తదేవాత్మా పరం తత్వం యేషా మద్వైత చేతసాం |

తస్మిన్నేవ చిదానందే బుద్ధిర్యేషాం స్థితోసదా |

ప్రాప్తవ్యం తత్పదం యేషాం విరక్తానాం పరంసుఖం |

సాక్షాత్కారో నిజధ్యానం శ్రవణాది నిరంతరం |

వైరాగ్యాది ప్రకర్షశ్చ పూర్వ పూర్వస్య కార్యతా |

ఉత్తరోత్తర హేతూనాం విశేషణ చతుష్ట యేం |

ఏ తైద్విశేషణైర్యుక్తా మోక్షం గచ్ఛంత్యనా మయం |

జ్ఞానేనూన్మీలితం యేషాం కల్మషం బంధకారణం |

సకార్యా జ్ఞాన బాధేన బ్రహ్మా త్మైక్య ధియాం సతాం |

కథం తన్మూలకో బంధో భవేద్దేహ పరిగ్రహః ||“. (గీతాభావప్రకాశము- 5 - 145 to150)

(జ్ఞానముద్వారా ప్రకాశితమైనటువంటిన్నీ, సచ్చిదానందమైనటువంటిన్నీ బ్రహ్మతత్వమందు బాహ్య వస్తువులను విడిచి పెట్టుటవలన కలిగిన సుస్థిరమైన బుద్ధికలవారు, అద్వైతమును నమ్మినవారును, విరక్తులై ఆ పరమాత్మ పదమే అత్యంత సుఖమును - ఆనందమును - కలిగించు పరమ పదమని తలచువారునూ, బంధకారణమైన కల్మషమును జ్ఞానముచేత పోగొట్టిన వారును - ఈ పైన చెప్పిన నాలుగు విధములవారును తిరిగి జన్మ పొందనిమోక్షమును పొందుదురు. అట్టివారు మరల జన్మించరు. పైన చెప్పబడినవాటిలో తద్బుద్ధి (భగవంతునియందే బుద్ధి) కలిగియుండుటకు తదాత్మత్వము, తదాత్మత్వము కలుగుటకు తన్నిష్ఠ (భగవంతునియందు నిష్ఠ), తన్నిష్ఠ కలుగుటకై తత్పరాయణత్వము - ఉండవలెను - అనగా, తత్పరాయణత్వంబువలన తన్నిష్ఠ, తన్నిష్ఠవలన తదాత్మత్వము, తదాత్మత్వమువలన తద్బుద్ధి కలుగును. ఇవి యిట్లు కలిగినవారు తిరిగి జన్మించరు - మోక్షమును పొందుదురు.)

“మ. పరికింపన్ నిజ భక్తియుక్తి గరిమన్ బాటిల్లు పంకేరుహో

దర విన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగముం

బరివర్జించి విశుద్ధచిత్తు లగుచున్ బంకేజ పత్రేక్ష ణే

తర ధర్మైక నివృత్తు లై సతతముం దైత్యారి చింతింపుచున్“.

“సీ. మఱియు నహంకార మమకార శూన్యులై యర్ధి వర్తింపుచు నర్చిరాది

మార్గ గతుండును మహనీయ చరితుండు - - -

- - -

పురుషోత్తముడు నవపుండరీకాక్షుండు నైన సర్వేశ్వరు నందు బొంది

తే. మాని తా పునరావృత్తి మార్గమైన

ప్రవిమ లానందతేజో విరాజమాన

దివ్యపదమున సుఖియించు ధీరమతులు

మరలిరా రెన్నటికిని జన్మముల నొంద”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 3 - 32 - 1007, 1008)

“క. విను సర్వభావముల బర

ముని ననఘు ననంతు నీశు బురుషోత్తము ని

న్ననయము భజియింపుము ముద

మున బునరావృత్తిలేని ముక్తి లభించున్“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 3 - 32 - 1015)

“ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |

వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ |

కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే |

పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే |

పురుషః ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ |

కారణం గుణసంగో (అ) న్యసదసద్యోని జన్మసు |

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |

పరమాత్మాతి చావ్యుక్తో దేహే (అ) స్మిన్ పురుషః పరః |

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ |

సర్వథా వర్తమానోపి న స భూయో (అ) భిజాయతే ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 19 to 23)

(పురుషుడు - పరమాత్మ - ప్రకృతి అనాదులు - ఆది అనగా జన్మలేనివారు - ఎప్పటినుండియో యున్నవి. ప్రకృతియొక్క వికారములు - శరీరము, ఇంద్రియములు మొదలగునవిన్నీ, సత్వరజస్తమోగుణములున్నూ ప్రకృతినుండి పుట్టినవి. కార్యములైన శరీరము మొదలగువాటికిన్నీ, కరణములైన ఇంద్రియములు మొదలగువాటికిన్నీ కారణము - మూలకారణము ప్రకృతి - అనగా, ప్రకృతిలోనుండి ఇవి అన్నియు పుట్టుచున్నవి. పురుషుడు - జీవాత్మ – సుఖదుఃఖముల ననుభవించువాడు, పురుషుడు ప్రకృతిలోనుండి - అనగా, ప్రకృతిలోనుండి పుట్టినదాని వికారములన్నింటిలోను ఉండి - ప్రకృతివలన కలిగిన గుణములను అనుభవించుచున్నాడు - పురుషుడు - జీవాత్మ - ఉచ్ఛ, నీచ జన్మలను పొందుటకు ఈ ప్రకృతియొక్క గుణములైన సత్వ రజస్తమములతో కలిసియుండుటయే కారణము. ప్రకృతి అచేతనము. పురుషుని చిచ్ఛక్తి తనలో లేనిదే ఏ పనియు తనంతటతాను చేయలేనిది. దానికి స్వతః కర్తృత్వము లేదు - అవికారియగు పురుషునకు భోక్తృత్వములేదు - అయినను పురుషునితో ఎల్లపుడు కలిసియుండుటవలన ప్రకృతిపనులు చేయుచున్నది, వాటికి కర్త యగుచున్నది. పురుషుడు ప్రకృతితో కలిసియుండుటవలననే భోక్త యగుచున్నాడు. అంతేగాని పురుషుడు (పరమాత్మ) వేరు, జీవాత్మ వేరు అనికాదు. ద్రష్ట, భర్త, ఈశ్వరుడు అయినవాడే ఈ దేహములో ఉన్నవాడు. ఈ ప్రకారముగా పురుషుని, ప్రకృతిని, దాని గుణములను తెలిసినవాడు, మానవుడుగా ప్రవర్తించినను, అతను తిరిగి జన్మించడు.)

యథా నిఖిల హేయ ప్రత్యనీక కల్యాణైక తానో జగజ్జన్మాది కారణం సమస్త వస్తు విలక్షణ స్సర్వజ్ఞః సత్య సంకల్పః, ఆశ్రిత వాత్సల్యైక జలధిః పరమ కారుణికో, నిరస్త సమభ్యధిక సంభావనః పరబ్రహ్మా భిధానః, పరమ పురుషో అస్తీతి శబ్దా దవ గమ్యతే. ఏవమహరహ మనుష్టీయమాన వర్ణాశ్రమః ధర్మాను గృహీత తదుపాసనరూప తత్సమారాధన ప్రీతః ఉపాసీనాన్ అనాదికాల ప్రవృత్యానంత దుస్తరకర్మ సం చయ రూపా విద్యాం వినివర్త్యస్వ యాధా త్మ్యానుభవ రూపానవధి కాతిశయానందం ప్రాప్య పునర్నావర్త యతీత్యపి శబ్దా దేవా వ గమ్యతే - శబ్దశ్చ - “సఖల్వేవం వర్త యన్యావదా యుషం బ్రహ్మలోకమభిసంపద్యతే, న చ పునరావర్తతే, న చ పునరావర్తతే” –

ఇత్యాదికః - తథాచ భగవతా స్వయమేవోక్తం –

“మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతం |

నామ్న వంతి మ హాత్మాన స్సం సిద్ధిం పరమాం గతాః |

ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినో (అ) ర్జున |

మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ||”

ఇతి | నచోచ్ఛిన్నకర్మ బంధస్యా సంకుచిత జ్ఞానస్య పరబ్రహ్మానుభవైక స్వభావస్య తదేకస్వభావస్య తదేక ప్రియస్యానవధికాతిశయానందం బ్రహ్మానుభవతో (అ) న్యాపేక్షా తదర్థారం భాద్య సంభవాత్ పునరావృత్తి శంకా. నచ పరమపురుష స్సత్య సంకల్పో (అ) త్యర్థప్రియం జ్ఞానినం లబ్ధ్వాకదా చిదావర్త యిష్యతి. య ఏవమాహ –

“ప్రియో హి జ్ఞానినో అత్యర్థ మహం స చ మమ ప్రియః |

ఉదారాస్సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవమే మతం |

ఆస్థితస్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం |

బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |

వాసుదేవస్సర్వమితి సమహాత్మా సుదుర్లభః ||”

“ఇతి సూత్యాభ్యాస శాస్త్ర సమాప్తిం ద్యోత యతి ఇతి సర్వం సమంజసం”. (శ్రీరామానుజః)

(ఇది మంచిది, ఇది చెడ్దది అను తారతమ్యములేక సమస్త వస్తువులకు శుభమును కలుగచేయునటువంటిన్నీ, జగత్తుయొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటిన్నీ, సమస్త వస్తువులకంటె వేరైనటువంటిన్నీ, సర్వజ్ఞుడైనటువంటిన్నీ, అడ్డులేని సంకల్పము గలిగినటువంటిన్నీ, తనను ఆశ్రయించుకొని ఉన్నవారి (భక్తుల) యడల పుత్ర వాత్సల్యము కలిగినటువంటిన్నీ, అపరిమిత దయకలిగినటువంటిన్నీ, తనతో సమానుడుగాని, అధికుడుగాని లేనటువంటిన్నీ, పరబ్రహ్మ అనిపేరుతో చెప్పబడుచున్న పరమపురుషుడు కలడు అని వేదమువలన తెలియుచున్నది. ఈ ప్రకారముగానే, ప్రతిదినమును వర్ణాశ్రమములను అనిష్ఠించినవాడై, తననే ఉపాసనచేయుచు, తననే ఆరాధించుట చేత దయకలిగిన వాడై అట్టి ఉపాసకులను - భక్తులను – అనాదికాలము నుండి, అనంతముగా వచ్చుచున్నదిన్నీ, దాటవీలుకానిదిన్నీ – తప్పించుకొన వీలులేనిదిన్నీ - కర్మ సంచయము - కర్మ సముదాయము - రూపముగా గల అవిద్యనుండి తరించి, తన స్వస్వరూపమైన పరమానందమును పొంది, తిరిగి జన్మకొఱకు సంసారములో పడడు అని కూడా వేదములవలననే తెలియుచున్నది. శ్రుతి ఏమని చెప్పుచున్నదనగా - అట్టివాడు ఈ ప్రకారము ఆయుర్దాయమున్నంత వఱకు సంచరించువాడు, బ్రహ్మలోకమును పొందును, అతడు తిరిగి జన్మించడు, తిరిగి జన్మించడు అను మొదలగునవి. ఈ రీతిగానే శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు : - “మహాత్ములైన వారు నన్ను పొందిన తర్వాత దుఃఖమునకు ఆలయమైనటువంటిన్నీ, శాశ్వతము కానటువంటిన్నీ పునర్జన్మ పొందరు. బ్రహ్మలోకము మొదలు లోకములన్నియు నశించిపోయి మరల మరల పుట్టవలసినవే. నన్ను పొందినవాడు తిరిగి జన్మను పొందడు -” అని కర్మ సంబంధము తెగినటువంటిన్నీ, సర్వజ్ఞుడైనటువంటిన్నీ పరబ్రహ్మను భవమే స్వభావముగా గలిగినటువంటిన్నీ, ఏకైక భక్తి కలిగినటువంటిన్నీ, బ్రహ్మానందము ననుభవించునటువంటి వానికి, ఇతరాపేక్ష కలుగకపోవుటవలన తిరిగి జన్మ కలుగునను శంకలేదు - పరమపురుషుడు, సత్యసంకల్పుడు, అయిన భగవంతుడు తనకు అత్యంతము ప్రియుడైన జ్ఞానిని తిరిగి జన్మపొందునట్లు సంసారములో పడవేయడు. శ్రీకృష్ణభగవానుడు ఈ విషయమై శ్రీమద్భగవద్గీతలో చెప్పినదేమనగా” -

“జ్ఞాని యగువానికి నేను అత్యంతము ప్రియుడను, నాకు అతను అత్యంతము ప్రియుడు. నాలుగు విధములైన నా భక్తులందరూ - అనగా, ఆర్తుడు - బాధలోనున్నవాడు, జిజ్ఞాసువు - భగవద్విషయమగు జ్ఞానము తెలుసుకొను కోరువాడు -, అర్థార్థీ - ప్రయోజనమును అర్ధించువాడు, కోరువాడు -, జ్ఞానీ - భగవత్ జ్ఞానము కలవాడు - ఈ అందరూ ఉదారులే, గొప్పవారే. వారిలో జ్ఞానియగువాడు ఆత్మయే -”బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మజ్ఞానము కలవాడు - జ్ఞాని - బ్రహ్మమే) అని చెప్పినందువలన యోగయుక్తు డైన జ్ఞాని - నిష్కామకర్మయోగముచే మనశ్శుద్ధి కలిగిన జ్ఞాని, నాకంటె ఉత్తమమైనగతి - పొందతగిన స్థానము - లేనట్టి నన్నే అనేక జన్మల తర్వాత పొందును. వాసుదేవుడే - సమస్తమైన వాటియందు నివసించియుండు దేవుడు - సర్వమున్నూ, అన్నియు, అంతా అతనే, ప్రపంచమంతా అతనే అని భావించి ఆ ప్రకారము నడుచుకొను మహాత్ముడు చాలా అరుదు. జ్ఞాని పరమాత్మను పొందును - అనగా, అతనికి పునర్జన్మలేదు. ఈ విషయము బ్రహ్మ సూత్రములలోను, శాస్త్రములలోను ఆఖరిమాటగా, పర్యవసానముగా చెప్పబడినది.) (చూడుము - ‘అనావృత్తి’, ‘అపునర్భవము’, ‘పునరావృత్తి’)

మోక్షము.

Transliteration

“apunardēha saṃbaṃdhaṃ” (śrī śaṃkaraḥ) (tirigi dēhamutō saṃbaṃdhamu lēkuṃḍuṭa.)

punardēha saṃbaṃdha bhāva rūpaṃ, muktiṃ.

(tirigi dēhamutō saṃbaṃdhamu lēkuṃḍuṭayē rūpamugā gala mōkṣamu - dēhamutō saṃbaṃdhamu anagā dēhamutō puṭṭuṭa.)

ya davasthāt ātmanaḥ punarāvṛttiḥ na vidyatē sa ātmā apunarāvṛttiḥ, svēna rūpēṇa apasthitaṃ ātmānaṃ ityarthaḥ –

(ē avasthalō uṃḍagā ātmaku tirigi janma kalugadō ā avasthakala ātma punarāvṛtti lēnidi - svasva rūpamutō ātma yuṃḍu sthiti.)

punarāvṛtti yanagā marala janmiṃcuṭa, janamaraṇa paraṃparagala saṃsāramunu poṃduṭa. adi lēkayuṃḍuṭa apunarāvṛtti - anagā jananamu, maraṇamu modalagunavi lēni śāśvatamaina kaivalyamu -

“sa ēnān brahma gama yati, ēṣa dēvapathō brahma pathaḥ. ē tēna pratipadyamānāḥ imaṃ mānavamāvartaṃ nā vartaṃtē.” “ētēna arcirādimārgēṇa pratipadyamānāḥ imaṃ ghōraṃ ghaṭī yaṃtravat jananamaraṇādyā vartakaṃ saṃsāraṃ nāvartaṃtē, punaḥ prati padyaṃtē”.

(“idi brahmanu poṃdiṃcunu - ī dēvayānamē brahmamunu poṃduṭaku mārgamu - brahmapathamu. dīnidvārā veḷḷinavāru ī saṃsāramanu dānilō tirigi paḍaru”. ī arcirādi mārgamu dvārā veḷḷinavāru ghaṭīyaṃtramu vale, ētāmu vale jananamaraṇamulu modalagunavi okaṭi tarvāta okaṭigā anaṃtamugā kalugu manuṣyulu modalagu śarīramulatō kūḍiyunna saṃsāramaṃdu paḍaru - tirigi janmiṃcaru.)

apunarāvṛtti eṭlu kalugunanagā : -

“yastu vijñānavān bhavati samanaskaḥsadā śuciḥ |

sa tatpadamāpnōti yasmāt bhūyō na jāyatē ||“. (kaṭhōpaniṣat- 1 - 3 - 8)

(ātmajñāna saṃpannuḍaina parābhaktuḍu manō nigrahavaṃtuḍai, ellapuḍu śucigānuṃḍina punarāvṛtti lēni padamunu poṃdunu.)

va. “- - - ninnu sēviṃcinavāru, vēcina vittanaṃbunuṃ bōle, dēhāṃtarōtpatti noṃdakuṃḍuduru - - -”.

(śrīmadāṃdhra mahābhāgavatamu- 6 - 475)

“tadbuddha yasta dātmāna stanniṣṭāsta tparāyaṇāḥ |

acchāṃtya punarāvṛttiṃ jñāna nirdhūtakalmaṣāḥ ||“. (śrīmadbhagavadgīta- 5 - 17)

“jñāna prakāśitē tasmiṃstatvē saccitsukhātmani |

bāhya vastu parityāgā dbuddhiryēṣāṃ suniṣṭhitā |

tadēvātmā paraṃ tatvaṃ yēṣā madvaita cētasāṃ |

tasminnēva cidānaṃdē buddhiryēṣāṃ sthitōsadā |

prāptavyaṃ tatpadaṃ yēṣāṃ viraktānāṃ paraṃsukhaṃ |

sākṣātkārō nijadhyānaṃ śravaṇādi niraṃtaraṃ |

vairāgyādi prakarṣaśca pūrva pūrvasya kāryatā |

uttarōttara hētūnāṃ viśēṣaṇa catuṣṭa yēṃ |

ē taidviśēṣaṇairyuktā mōkṣaṃ gacchaṃtyanā mayaṃ |

jñānēnūnmīlitaṃ yēṣāṃ kalmaṣaṃ baṃdhakāraṇaṃ |

sakāryā jñāna bādhēna brahmā tmaikya dhiyāṃ satāṃ |

kathaṃ tanmūlakō baṃdhō bhavēddēha parigrahaḥ ||“. (gītābhāvaprakāśamu- 5 - 145 to150)

(jñānamudvārā prakāśitamainaṭuvaṃṭinnī, saccidānaṃdamainaṭuvaṃṭinnī brahmatatvamaṃdu bāhya vastuvulanu viḍici peṭṭuṭavalana kaligina susthiramaina buddhikalavāru, advaitamunu namminavārunu, viraktulai ā paramātma padamē atyaṃta sukhamunu - ānaṃdamunu - kaligiṃcu parama padamani talacuvārunū, baṃdhakāraṇamaina kalmaṣamunu jñānamucēta pōgoṭṭina vārunu - ī paina ceppina nālugu vidhamulavārunu tirigi janma poṃdanimōkṣamunu poṃduduru. aṭṭivāru marala janmiṃcaru. paina ceppabaḍinavāṭilō tadbuddhi (bhagavaṃtuniyaṃdē buddhi) kaligiyuṃḍuṭaku tadātmatvamu, tadātmatvamu kaluguṭaku tanniṣṭha (bhagavaṃtuniyaṃdu niṣṭha), tanniṣṭha kaluguṭakai tatparāyaṇatvamu - uṃḍavalenu - anagā, tatparāyaṇatvaṃbuvalana tanniṣṭha, tanniṣṭhavalana tadātmatvamu, tadātmatvamuvalana tadbuddhi kalugunu. ivi yiṭlu kaliginavāru tirigi janmiṃcaru - mōkṣamunu poṃduduru.)

“ma. parikiṃpan nija bhaktiyukti gariman bāṭillu paṃkēruhō

dara vinyasta samasta dharmamula śāṃtasvāṃtulai saṃgamuṃ

barivarjiṃci viśuddhacittu lagucun baṃkēja patrēkṣa ṇē

tara dharmaika nivṛttu lai satatamuṃ daityāri ciṃtiṃpucun”.

“sī. maṟiyu nahaṃkāra mamakāra śūnyulai yardhi vartiṃpucu narcirādi

mārga gatuṃḍunu mahanīya carituṃḍu - - -

- - -

puruṣōttamuḍu navapuṃḍarīkākṣuṃḍu naina sarvēśvaru naṃdu boṃdi

tē. māni tā punarāvṛtti mārgamaina

pravima lānaṃdatējō virājamāna

divyapadamuna sukhiyiṃcu dhīramatulu

maralirā rennaṭikini janmamula noṃda”. (śrīmadāṃdhra mahābhāgavatamu- 3 - 32 - 1007, 1008)

“ka. vinu sarvabhāvamula bara

muni nanaghu nanaṃtu nīśu buruṣōttamu ni

nnanayamu bhajiyiṃpumu muda

muna bunarāvṛttilēni mukti labhiṃcun”. (śrīmadāṃdhra mahābhāgavatamu- 3 - 32 - 1015)

“prakṛtiṃ puruṣaṃ caiva viddhyanādī ubhāvapi |

vikārāṃśca guṇāṃścaiva viddhi prakṛti saṃbhavān |

kāryakāraṇa kartṛtvē hētuḥ prakṛti rucyatē |

puruṣaḥ sukha duḥkhānāṃ bhōktṛtvē hēturucyatē |

puruṣaḥ prakṛtisthōhi bhuṃktē prakṛti jān guṇān |

kāraṇaṃ guṇasaṃgō (a) nyasadasadyōni janmasu |

upadraṣṭānumaṃtā ca bhartā bhōktā mahēśvaraḥ |

paramātmāti cāvyuktō dēhē (a) smin puruṣaḥ paraḥ |

ya ēvaṃ vētti puruṣaṃ prakṛtiṃ ca guṇaiḥ saha |

sarvathā vartamānōpi na sa bhūyō (a) bhijāyatē ||“. (śrīmadbhagavadgīta - 13 - 19 to 23)

(puruṣuḍu - paramātma - prakṛti anādulu - ādi anagā janmalēnivāru - eppaṭinuṃḍiyō yunnavi. prakṛtiyokka vikāramulu - śarīramu, iṃdriyamulu modalagunavinnī, satvarajastamōguṇamulunnū prakṛtinuṃḍi puṭṭinavi. kāryamulaina śarīramu modalaguvāṭikinnī, karaṇamulaina iṃdriyamulu modalaguvāṭikinnī kāraṇamu - mūlakāraṇamu prakṛti - anagā, prakṛtilōnuṃḍi ivi anniyu puṭṭucunnavi. puruṣuḍu - jīvātma – sukhaduḥkhamula nanubhaviṃcuvāḍu, puruṣuḍu prakṛtilōnuṃḍi - anagā, prakṛtilōnuṃḍi puṭṭinadāni vikāramulanniṃṭilōnu uṃḍi - prakṛtivalana kaligina guṇamulanu anubhaviṃcucunnāḍu - puruṣuḍu - jīvātma - uccha, nīca janmalanu poṃduṭaku ī prakṛtiyokka guṇamulaina satva rajastamamulatō kalisiyuṃḍuṭayē kāraṇamu. prakṛti acētanamu. puruṣuni cicchakti tanalō lēnidē ē paniyu tanaṃtaṭatānu cēyalēnidi. dāniki svataḥ kartṛtvamu lēdu - avikāriyagu puruṣunaku bhōktṛtvamulēdu - ayinanu puruṣunitō ellapuḍu kalisiyuṃḍuṭavalana prakṛtipanulu cēyucunnadi, vāṭiki karta yagucunnadi. puruṣuḍu prakṛtitō kalisiyuṃḍuṭavalananē bhōkta yagucunnāḍu. aṃtēgāni puruṣuḍu (paramātma) vēru, jīvātma vēru anikādu. draṣṭa, bharta, īśvaruḍu ayinavāḍē ī dēhamulō unnavāḍu. ī prakāramugā puruṣuni, prakṛtini, dāni guṇamulanu telisinavāḍu, mānavuḍugā pravartiṃcinanu, atanu tirigi janmiṃcaḍu.)

yathā nikhila hēya pratyanīka kalyāṇaika tānō jagajjanmādi kāraṇaṃ samasta vastu vilakṣaṇa ssarvajñaḥ satya saṃkalpaḥ, āśrita vātsalyaika jaladhiḥ parama kāruṇikō, nirasta samabhyadhika saṃbhāvanaḥ parabrahmā bhidhānaḥ, parama puruṣō astīti śabdā dava gamyatē. ēvamaharaha manuṣṭīyamāna varṇāśramaḥ dharmānu gṛhīta tadupāsanarūpa tatsamārādhana prītaḥ upāsīnān anādikāla pravṛtyānaṃta dustarakarma saṃ caya rūpā vidyāṃ vinivartyasva yādhā tmyānubhava rūpānavadhi kātiśayānaṃdaṃ prāpya punarnāvarta yatītyapi śabdā dēvā va gamyatē - śabdaśca - “sakhalvēvaṃ varta yanyāvadā yuṣaṃ brahmalōkamabhisaṃpadyatē, na ca punarāvartatē, na ca punarāvartatē” –

ityādikaḥ - tathāca bhagavatā svayamēvōktaṃ –

“māmupētya punarjanma duḥkhālaya maśāśvataṃ |

nāmna vaṃti ma hātmāna ssaṃ siddhiṃ paramāṃ gatāḥ |

ā brahma bhuvanāllōkāḥ punarāvartinō (a) rjuna |

māmupētyatu kauṃtēya punarjanma na vidyatē ||”

iti | nacōcchinnakarma baṃdhasyā saṃkucita jñānasya parabrahmānubhavaika svabhāvasya tadēkasvabhāvasya tadēka priyasyānavadhikātiśayānaṃdaṃ brahmānubhavatō (a) nyāpēkṣā tadarthāraṃ bhādya saṃbhavāt punarāvṛtti śaṃkā. naca paramapuruṣa ssatya saṃkalpō (a) tyarthapriyaṃ jñāninaṃ labdhvākadā cidāvarta yiṣyati. ya ēvamāha –

“priyō hi jñāninō atyartha mahaṃ sa ca mama priyaḥ |

udārāssarva ēvaitē jñānītvātmaivamē mataṃ |

āsthitassa hi yuktātmā māmēvānuttamāṃ gatiṃ |

bahūnāṃ janma nāmaṃtē jñānavān māṃ prapadyatē |

vāsudēvassarvamiti samahātmā sudurlabhaḥ ||”

“iti sūtyābhyāsa śāstra samāptiṃ dyōta yati iti sarvaṃ samaṃjasaṃ”. (śrīrāmānujaḥ)

(idi maṃcidi, idi ceḍdadi anu tāratamyamulēka samasta vastuvulaku śubhamunu kalugacēyunaṭuvaṃṭinnī, jagattuyokka sṛṣṭi sthiti layamulaku kāraṇamainaṭuvaṃṭinnī, samasta vastuvulakaṃṭe vērainaṭuvaṃṭinnī, sarvajñuḍainaṭuvaṃṭinnī, aḍḍulēni saṃkalpamu galiginaṭuvaṃṭinnī, tananu āśrayiṃcukoni unnavāri (bhaktula) yaḍala putra vātsalyamu kaliginaṭuvaṃṭinnī, aparimita dayakaliginaṭuvaṃṭinnī, tanatō samānuḍugāni, adhikuḍugāni lēnaṭuvaṃṭinnī, parabrahma anipērutō ceppabaḍucunna paramapuruṣuḍu kalaḍu ani vēdamuvalana teliyucunnadi. ī prakāramugānē, pratidinamunu varṇāśramamulanu aniṣṭhiṃcinavāḍai, tananē upāsanacēyucu, tananē ārādhiṃcuṭa cēta dayakaligina vāḍai aṭṭi upāsakulanu - bhaktulanu – anādikālamu nuṃḍi, anaṃtamugā vaccucunnadinnī, dāṭavīlukānidinnī – tappiṃcukona vīlulēnidinnī - karma saṃcayamu - karma samudāyamu - rūpamugā gala avidyanuṃḍi tariṃci, tana svasvarūpamaina paramānaṃdamunu poṃdi, tirigi janmakoṟaku saṃsāramulō paḍaḍu ani kūḍā vēdamulavalananē teliyucunnadi. śruti ēmani ceppucunnadanagā - aṭṭivāḍu ī prakāramu āyurdāyamunnaṃta vaṟaku saṃcariṃcuvāḍu, brahmalōkamunu poṃdunu, ataḍu tirigi janmiṃcaḍu, tirigi janmiṃcaḍu anu modalagunavi. ī rītigānē śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō ceppiyunnāḍu : - “mahātmulaina vāru nannu poṃdina tarvāta duḥkhamunaku ālayamainaṭuvaṃṭinnī, śāśvatamu kānaṭuvaṃṭinnī punarjanma poṃdaru. brahmalōkamu modalu lōkamulanniyu naśiṃcipōyi marala marala puṭṭavalasinavē. nannu poṃdinavāḍu tirigi janmanu poṃdaḍu -” ani karma saṃbaṃdhamu teginaṭuvaṃṭinnī, sarvajñuḍainaṭuvaṃṭinnī parabrahmanu bhavamē svabhāvamugā galiginaṭuvaṃṭinnī, ēkaika bhakti kaliginaṭuvaṃṭinnī, brahmānaṃdamu nanubhaviṃcunaṭuvaṃṭi vāniki, itarāpēkṣa kalugakapōvuṭavalana tirigi janma kalugunanu śaṃkalēdu - paramapuruṣuḍu, satyasaṃkalpuḍu, ayina bhagavaṃtuḍu tanaku atyaṃtamu priyuḍaina jñānini tirigi janmapoṃdunaṭlu saṃsāramulō paḍavēyaḍu. śrīkṛṣṇabhagavānuḍu ī viṣayamai śrīmadbhagavadgītalō ceppinadēmanagā” -

“jñāni yaguvāniki nēnu atyaṃtamu priyuḍanu, nāku atanu atyaṃtamu priyuḍu. nālugu vidhamulaina nā bhaktulaṃdarū - anagā, ārtuḍu - bādhalōnunnavāḍu, jijñāsuvu - bhagavadviṣayamagu jñānamu telusukonu kōruvāḍu -, arthārthī - prayōjanamunu ardhiṃcuvāḍu, kōruvāḍu -, jñānī - bhagavat jñānamu kalavāḍu - ī aṃdarū udārulē, goppavārē. vārilō jñāniyaguvāḍu ātmayē -”brahmavid brahmaiva bhavati” (brahmajñānamu kalavāḍu - jñāni - brahmamē) ani ceppinaṃduvalana yōgayuktu ḍaina jñāni - niṣkāmakarmayōgamucē manaśśuddhi kaligina jñāni, nākaṃṭe uttamamainagati - poṃdatagina sthānamu - lēnaṭṭi nannē anēka janmala tarvāta poṃdunu. vāsudēvuḍē - samastamaina vāṭiyaṃdu nivasiṃciyuṃḍu dēvuḍu - sarvamunnū, anniyu, aṃtā atanē, prapaṃcamaṃtā atanē ani bhāviṃci ā prakāramu naḍucukonu mahātmuḍu cālā arudu. jñāni paramātmanu poṃdunu - anagā, ataniki punarjanmalēdu. ī viṣayamu brahma sūtramulalōnu, śāstramulalōnu ākharimāṭagā, paryavasānamugā ceppabaḍinadi.) (cūḍumu - ‘anāvṛtti’, ‘apunarbhavamu’, ‘punarāvṛtti’)

mōkṣamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.