← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపునర్భవం apunarbhavaṃ

Original — తెలుగు

పునర్భవము లేకపోవుట; మరల జన్మ లేకుండుట.

ఆత్యంతిక మపి కైవల్యం; సాయుజ్య మోక్షం.

(అత్యంతము ఒకటే అయిన పరబ్రహ్మ యొక్క స్థితి, బ్రహ్మతో కలిసిపోవుట; మోక్షము.)

“అహం హరిస్సర్వ మిదం జనార్దనో నాన్యత్తతః కారణకార్య జాతం |

ఈ దృ ఙ్మనో యస్య సతస్య భూయః భవోద్భ వాద్ద్వంద గరదా భవంతి ||” (విష్ణుపురాణము)

(నేను శ్రీహరిని - ఈ సమస్తమూ హరియే, నేనే. వానికంటె అన్యము అయినది కారణకార్యరూపమైనది ఏదియును లేదు అను నీ భావము గలవానికి మరల జన్మించుటద్వారా కలిగెడి ద్వంద్వ రోగములు కలుగనేరవు.)

“బహూనిమే వ్యతీతాని జన్మాని చ త వా ర్జున |

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప |

అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో (అ) పి సన్ |

ప్రకృతిం స్వామథిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా |

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం |

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం |

ధర్మ సంస్థాపానార్థా య సంభవామి యుగే యుగే |

జన్మ కర్మచ మే దివ్య మేవం యో మేత్తి తత్వతః |

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి, మామేతి సో (అ) ర్జున ||“. (శ్రీమద్భగవద్గీత- 4 - 5 to 9)

(“అతిక్రాంతాని జన్మాని స్వేచ్ఛోపాత్త వ పూం షిమే |

బహూని పరమేశ్వరస్య వాసుదేవస్య సద్విభోః |

తప చా జ్ఞానినః కర్మ నిర్మితాని తథార్జున |

- - - తాని జన్మాని సర్వాణి. సర్వజ్ఞోహం మహేశ్వరః |

విజానామి త్వదీయాని మదీయా నీత్య లుప్త దృక్ |

సత్వం వేత్థ తిరోభూత జ్ఞానశక్తిక తయా జ్ఞకః ||“. (గీతాభావప్రకాశము - 4 - 28 to 31)

(సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అయిన శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో ఇట్లుచెప్పెను: - పరమేశుడు వాసుదేవుడు అయిన నాకు నా ఇచ్ఛాప్రకారము తాల్చిన జన్మలు అనేకములు గడిచిపోయినవి. నేను సర్వజ్ఞుడను - అన్నింటిని తెలిసినవాడను - అగుటచేత ఆ జన్మలు అన్నియు నాకు తెలుసును - నీ జన్మలు కూడా నాకు తెలుసును. నీవి అజ్ఞానివి. నీ శరీరము కర్మచేత కలిగినది. నీ జ్ఞానశక్తి తిరోభూతమైనది, మాయమైనది. అందుచేత నీ పూర్వ జన్మలు నీకు తెలియవు. నేను జన్మ మరణములు లేనివాడను. సర్వభూతములకు నీశ్వరుడను - అయినప్పటికీ నా ప్రకృతిని అధిష్ఠించి నా మాయచేత పుట్టుచుందును, పుట్టినట్టు నామాయవలన కనబడుదును. ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధములైన ధర్మము ఎప్పుడు క్షీణించునో, ధర్మమునకు శత్రువైనదిన్నీ, స్వర్గమోక్షములకు విరోధి అయినదిన్నీ యగు అధర్మము ఎప్పుడు ప్రబలునో అప్పుడు నేను నామాయచేత, సూక్షాతిసూక్ష్మమైన రూపము గలవాడనైనందువలన అవ్యక్తుడనైననూ వ్యాక్తుని వలె కంటికి కనబడుదును, పుట్టుచుందును - పుట్టినట్లు కనబడుచుందును. ఎక్కడపడితే అక్కడ, దేనిలో పడితే దానిలోనే, ఎల్లపుడూ సిద్ధముగా నుండునాకు వేరే జన్మము ఎత్తుట ఎట్లు? ఎవరికీ కనబడనివాడను - అవ్యక్తుడను - అందఱికి కనబడునట్లు వర్తించుదును. సాధువులను రక్షించుటకున్నూ, పాపాత్ములను శిక్షించుటకునూ ధర్మమును నిలకడగా నిలబెట్టుటకున్నూ ప్రతియుగమందు ఈ ప్రకారము జన్మించినట్లు స్థూలరూపము గైకొందును. ఈ ప్రకారము నేను పుట్టుటను, ఆ జన్మలలో - అవతారములలో - నేనుచేయు కార్యములను ధర్మ సంస్థాపనము, అధర్మశాసనమును తత్వరీత్యా తెలుసుకొనినవాడు, అనగా, నా పరమాత్మ తత్వమును, అవతారముల తత్వమును, ధర్మాధర్మముల తత్వమును, వీటినన్నింటినీ యథాస్థితిగా - ఉన్నది ఉన్నట్టుగా - ఎవరు తెలుసుకొనునో వారు ఈ శరీరమును విడిచిన తర్వాత మరల జన్మించరు, నన్నే పొందుదురు - నా సాయుజ్యమును పొందుదురు.)

“సాకారమనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం |

ఏ తత్త త్త్వోపదేశేన న పునర్భవ సంభవః ||“. (అష్టావక్రగీత- 1 - 18)

(రూపము కలదంతయు అనృతము - అబద్ధము. ఆకారములేనిదే శాశ్వతముగా నుండునది, నిశ్చలమైనది - ఆకారముతో ఉన్న ప్రపంచమంతయు మిథ్య, నిరాకారుడైన పరబ్రహ్మ ఒక్కడే సత్యమైనవాడు, త్రికాలములందు - శాశ్వతముగా - నుండువాడు. ఇదియే పరబ్రహ్మతత్వము. దీని నెఱింగినవాడు మరల జన్మించడు.)

“ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామో దశాశ్వమేథా వ బృదేన తుల్యః |

దశాశ్వమేథీ పునరేతిజన్మ, కృష్ణ ప్రణామీ న పునర్భవాయ ||“. (శ్రీమద్మహాభారతము - శాంతిపర్వము- 47 - 92)

(శ్రీ కృష్ణభగవానునికి చేసిన ఒక్క నమస్కారము పది యశ్వమేథయాగములు చేసినదానితో సమానము. దశాశ్వ మేథములు చేసినవానికి పునర్భవము కలదు - అతను మరల జన్మించును - గాని, శ్రీ కృష్ణభగవానునికి ప్రణామము చేసినవాడు తిరిగి జన్మించడు.)

“సోమపాన శతకోటి భిరీయాజ్జన్మ, నైతి రఘునాయక నామ్నా |” - (శ్రీరామ కర్ణామృతం - 3 - 109)

(సోమపానము ఎంతచేసినవాడైనను మరల జన్మించును - ఎన్ని యజ్ఞములు చేసినవాడైనను జన్మించును - శ్రీరామచంద్రుని నామము స్మరించినంత మాత్రమున తిరిగి జన్మించడు.) (చూడుము - ‘అపునారావృత్తి’; ‘అపునర్జన్మ’)

Transliteration

punarbhavamu lēkapōvuṭa; marala janma lēkuṃḍuṭa.

ātyaṃtika mapi kaivalyaṃ; sāyujya mōkṣaṃ.

(atyaṃtamu okaṭē ayina parabrahma yokka sthiti, brahmatō kalisipōvuṭa; mōkṣamu.)

“ahaṃ harissarva midaṃ janārdanō nānyattataḥ kāraṇakārya jātaṃ |

ī dṛ ṅmanō yasya satasya bhūyaḥ bhavōdbha vāddvaṃda garadā bhavaṃti ||” (viṣṇupurāṇamu)

(nēnu śrīharini - ī samastamū hariyē, nēnē. vānikaṃṭe anyamu ayinadi kāraṇakāryarūpamainadi ēdiyunu lēdu anu nī bhāvamu galavāniki marala janmiṃcuṭadvārā kaligeḍi dvaṃdva rōgamulu kaluganēravu.)

“bahūnimē vyatītāni janmāni ca ta vā rjuna |

tānyahaṃ vēda sarvāṇi na tvaṃ vēttha paraṃtapa |

ajōpi sannavyayātmā bhūtānāmīśvarō (a) pi san |

prakṛtiṃ svāmathiṣṭhāya saṃbhavāmyātma māyayā |

yadā yadā hi dharmasya glānirbhavati bhārata |

abhyutthānamadharmasya tadātmānaṃ sṛjāmyahaṃ |

paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkṛtāṃ |

dharma saṃsthāpānārthā ya saṃbhavāmi yugē yugē |

janma karmaca mē divya mēvaṃ yō mētti tatvataḥ |

tyaktvā dēhaṃ punarjanma naiti, māmēti sō (a) rjuna ||“. (śrīmadbhagavadgīta- 4 - 5 to 9)

(“atikrāṃtāni janmāni svēcchōpātta va pūṃ ṣimē |

bahūni paramēśvarasya vāsudēvasya sadvibhōḥ |

tapa cā jñāninaḥ karma nirmitāni tathārjuna |

- - - tāni janmāni sarvāṇi. sarvajñōhaṃ mahēśvaraḥ |

vijānāmi tvadīyāni madīyā nītya lupta dṛk |

satvaṃ vēttha tirōbhūta jñānaśaktika tayā jñakaḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 28 to 31)

(sarvajñuḍu, sarvaśaktimaṃtuḍu, ayina śrīkṛṣṇabhagavānuḍu arjununitō iṭluceppenu: - paramēśuḍu vāsudēvuḍu ayina nāku nā icchāprakāramu tālcina janmalu anēkamulu gaḍicipōyinavi. nēnu sarvajñuḍanu - anniṃṭini telisinavāḍanu - aguṭacēta ā janmalu anniyu nāku telusunu - nī janmalu kūḍā nāku telusunu. nīvi ajñānivi. nī śarīramu karmacēta kaliginadi. nī jñānaśakti tirōbhūtamainadi, māyamainadi. aṃducēta nī pūrva janmalu nīku teliyavu. nēnu janma maraṇamulu lēnivāḍanu. sarvabhūtamulaku nīśvaruḍanu - ayinappaṭikī nā prakṛtini adhiṣṭhiṃci nā māyacēta puṭṭucuṃdunu, puṭṭinaṭṭu nāmāyavalana kanabaḍudunu. pravṛtti, nivṛtti anu reṃḍu vidhamulaina dharmamu eppuḍu kṣīṇiṃcunō, dharmamunaku śatruvainadinnī, svargamōkṣamulaku virōdhi ayinadinnī yagu adharmamu eppuḍu prabalunō appuḍu nēnu nāmāyacēta, sūkṣātisūkṣmamaina rūpamu galavāḍanainaṃduvalana avyaktuḍanainanū vyāktuni vale kaṃṭiki kanabaḍudunu, puṭṭucuṃdunu - puṭṭinaṭlu kanabaḍucuṃdunu. ekkaḍapaḍitē akkaḍa, dēnilō paḍitē dānilōnē, ellapuḍū siddhamugā nuṃḍunāku vērē janmamu ettuṭa eṭlu? evarikī kanabaḍanivāḍanu - avyaktuḍanu - aṃdaṟiki kanabaḍunaṭlu vartiṃcudunu. sādhuvulanu rakṣiṃcuṭakunnū, pāpātmulanu śikṣiṃcuṭakunū dharmamunu nilakaḍagā nilabeṭṭuṭakunnū pratiyugamaṃdu ī prakāramu janmiṃcinaṭlu sthūlarūpamu gaikoṃdunu. ī prakāramu nēnu puṭṭuṭanu, ā janmalalō - avatāramulalō - nēnucēyu kāryamulanu dharma saṃsthāpanamu, adharmaśāsanamunu tatvarītyā telusukoninavāḍu, anagā, nā paramātma tatvamunu, avatāramula tatvamunu, dharmādharmamula tatvamunu, vīṭinanniṃṭinī yathāsthitigā - unnadi unnaṭṭugā - evaru telusukonunō vāru ī śarīramunu viḍicina tarvāta marala janmiṃcaru, nannē poṃduduru - nā sāyujyamunu poṃduduru.)

“sākāramanṛtaṃ viddhi nirākāraṃ tu niścalaṃ |

ē tatta ttvōpadēśēna na punarbhava saṃbhavaḥ ||“. (aṣṭāvakragīta- 1 - 18)

(rūpamu kaladaṃtayu anṛtamu - abaddhamu. ākāramulēnidē śāśvatamugā nuṃḍunadi, niścalamainadi - ākāramutō unna prapaṃcamaṃtayu mithya, nirākāruḍaina parabrahma okkaḍē satyamainavāḍu, trikālamulaṃdu - śāśvatamugā - nuṃḍuvāḍu. idiyē parabrahmatatvamu. dīni neṟiṃginavāḍu marala janmiṃcaḍu.)

“ēkōpi kṛṣṇasya kṛtaḥ praṇāmō daśāśvamēthā va bṛdēna tulyaḥ |

daśāśvamēthī punarētijanma, kṛṣṇa praṇāmī na punarbhavāya ||“. (śrīmadmahābhāratamu - śāṃtiparvamu- 47 - 92)

(śrī kṛṣṇabhagavānuniki cēsina okka namaskāramu padi yaśvamēthayāgamulu cēsinadānitō samānamu. daśāśva mēthamulu cēsinavāniki punarbhavamu kaladu - atanu marala janmiṃcunu - gāni, śrī kṛṣṇabhagavānuniki praṇāmamu cēsinavāḍu tirigi janmiṃcaḍu.)

“sōmapāna śatakōṭi bhirīyājjanma, naiti raghunāyaka nāmnā |” - (śrīrāma karṇāmṛtaṃ - 3 - 109)

(sōmapānamu eṃtacēsinavāḍainanu marala janmiṃcunu - enni yajñamulu cēsinavāḍainanu janmiṃcunu - śrīrāmacaṃdruni nāmamu smariṃcinaṃta mātramuna tirigi janmiṃcaḍu.) (cūḍumu - ‘apunārāvṛtti’; ‘apunarjanma’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.