అపూర్వమనగా
ధర్మాధర్మములు, పుణ్యపాపములు - దీనినే అదృష్టమందురు.
కర్మ
నశించునదైనను అపూర్వమను నొకదానిని కల్పించి నశించును - కర్మము చేసిన వెంటనే నశించినను దాని
ఫలమునిచ్చుటకు అపూర్వమను సూక్ష్మశక్తిని సృష్టించును. అది కర్మలు చేసినవాడిని వెంటాడి
యుక్తకాలమగునపుడు స్థూలమైవాసనలవలె ఫలరూపముగా మారి కర్మచేత అనుభవింపచేయును.
కొన్ని
కారణకార్యములవలె స్పష్టముగా కానరానిది, అసాధారణము; కారణము లేనట్లుండును, కారణమదృష్టము, తెలియరానిది
అగుటచేతనే దీనిని అదృష్టమని, దైవాత్ అని చెప్పుదురు.
“యజ్ఞాద్ధర్మాద పూర్వాఖ్యా
జ్జాయతే వృష్టి రర్కతః |
అగ్నౌ
ప్రాప్తాహుతిః సమ్యగాదిత్యముప తిష్టతే |
ఆదిత్యా
జ్జాయతే వృష్టి ర్వృష్టే రన్నం తతః ప్రజాః |
సూక్ష్మోధర్మః స యజ్ఞాఖ్యః ఋత్విగాదేశ్చ కర్మణః
|
అపూర్వాఖ్యస్య విహితం కర్మ
కారణం ||“. (గీతాభావప్రకాశము- 3 - 92 to 94)
(యజ్ఞమువలన
అపూర్వమను పేరుగల ధర్మమువలన సూర్యునివలన వర్షము కలుగును - ఎందుచేతననగా - యజ్ఞమందు
శాస్త్రప్రకారము అగ్నియందు ఆహుతి చేయబడినది ఆదిత్యుని పొందును. సూర్యునివలన వర్షము కురియును.
వర్షము కురియుటవలన అన్నము - సస్యము - పుట్టును. సస్యములవలన ప్రజలు - ప్రాణులు
-పుట్టుదురు. యజ్ఞమనునది ఋత్విక్కులు మొదలగువారు చేయుకర్మ, సూక్ష్మధర్మము. దానివలనకలుగు
ఫలము సూక్ష్మమైనది. అది ఏట్లు కలుగునో, దాని మార్గముకాని, రీతిగాని పైకి తెలియదు. స్మృతిలో ఈ ప్రకారము
చెప్పబడినది : - ఈ అపూర్వమను పేరుగల యజ్ఞమునకు యజ్ఞము చేయుట కారణము - ఇటువంటి కర్మ
అటువంటి ఫలమునకు కారణము. మనము చేసిన ఏ కర్మ ఎప్పుడు, ఎక్కడ ఏ విధముగా ఫలమునిచ్చునో మనకు
అనవగాహ్యము - దాని ధర్మము సూక్ష్మాతి సూక్ష్మము. కాని అది ఒక ధర్మమును - (natural law)
అనుసరించియే జరుగును. అందుచేత శ్రీమత్ భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు “గహనా కర్మణో గతిః” అని
చెప్పెను - (4 - 17.) - రుక్మిణీదేవి తన అన్న రుక్మిపొందిన అవమానమును గుఱించి దుఃఖించుచుండ
బలరాముడు ఈ క్రింద విధముగా కర్మఫలముయొక్క అనుభవము గుఱించి చెప్పెను : -
“శా.
తోడం బుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం
జూడకుమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్
కీడున్
మేలును జెందు, లేడొకడు సిక్షింపంగ, రక్షింప, నీ
తోడం
బుట్టువు కర్మశేష పరిభూతుండయ్యె నే డియ్యెడన్“. (పోతన తెలుగు భాగవతము - 10.1- 1775)
పై
పద్యములో కర్మ ఫలమునిచ్చుటకు, కాలము, స్థలము, రీతి కూడ నున్నదని తెలియవచ్చును - ఏ కర్మ కే
ఫలము ఎక్కడ, ఎప్పుడు ఏ రీతిగా వచ్చునో - ఆ ధర్మము - (natural law) - అపూర్వము -
కనబడని కారణము కలది.)
Transliteration
apūrvamanagā
dharmādharmamulu, puṇyapāpamulu - dīninē adṛṣṭamaṃduru.
karma
naśiṃcunadainanu apūrvamanu nokadānini kalpiṃci naśiṃcunu - karmamu
cēsina veṃṭanē naśiṃcinanu dāni phalamuniccuṭaku apūrvamanu
sūkṣmaśaktini sṛṣṭiṃcunu. adi karmalu cēsinavāḍini veṃṭāḍi
yuktakālamagunapuḍu sthūlamaivāsanalavale phalarūpamugā māri karmacēta
anubhaviṃpacēyunu.
konni
kāraṇakāryamulavale spaṣṭamugā kānarānidi, asādhāraṇamu; kāraṇamu
lēnaṭluṃḍunu, kāraṇamadṛṣṭamu, teliyarānidi aguṭacētanē dīnini
adṛṣṭamani, daivāt ani ceppuduru.
“yajñāddharmāda
pūrvākhyā jjāyatē vṛṣṭi rarkataḥ |
agnau prāptāhutiḥ
samyagādityamupa tiṣṭatē |
ādityā jjāyatē
vṛṣṭi rvṛṣṭē rannaṃ tataḥ prajāḥ |
sūkṣmōdharmaḥ
sa yajñākhyaḥ ṛtvigādēśca karmaṇaḥ |
apūrvākhyasya
vihitaṃ karma kāraṇaṃ ||“. (gītābhāvaprakāśamu- 3 - 92 to 94)
(yajñamuvalana
apūrvamanu pērugala dharmamuvalana sūryunivalana varṣamu kalugunu -
eṃducētananagā - yajñamaṃdu śāstraprakāramu agniyaṃdu āhuti cēyabaḍinadi
ādityuni poṃdunu. sūryunivalana varṣamu kuriyunu. varṣamu kuriyuṭavalana
annamu - sasyamu - puṭṭunu. sasyamulavalana prajalu - prāṇulu
-puṭṭuduru. yajñamanunadi ṛtvikkulu modalaguvāru cēyukarma,
sūkṣmadharmamu. dānivalanakalugu phalamu sūkṣmamainadi. adi ēṭlu
kalugunō, dāni mārgamukāni, rītigāni paiki teliyadu. smṛtilō ī prakāramu
ceppabaḍinadi : - ī apūrvamanu pērugala yajñamunaku yajñamu cēyuṭa
kāraṇamu - iṭuvaṃṭi karma aṭuvaṃṭi phalamunaku kāraṇamu. manamu cēsina ē
karma eppuḍu, ekkaḍa ē vidhamugā phalamuniccunō manaku anavagāhyamu -
dāni dharmamu sūkṣmāti sūkṣmamu. kāni adi oka dharmamunu - (natural law)
anusariṃciyē jarugunu. aṃducēta śrīmat bhagavadgītalō
śrīkṛṣṇabhagavānuḍu “gahanā karmaṇō gatiḥ” ani ceppenu - (4 - 17.) -
rukmiṇīdēvi tana anna rukmipoṃdina avamānamunu guṟiṃci duḥkhiṃcucuṃḍa
balarāmuḍu ī kriṃda vidhamugā karmaphalamuyokka anubhavamu guṟiṃci
ceppenu : -
“śā. tōḍaṃ
buṭṭinavāni bhaṃgamunakun duḥkhiṃci mā kṛṣṇu ne
ggāḍaṃ
jūḍakumamma pūrvabhava karmādhīnamai prāṇulan
kīḍun mēlunu
jeṃdu, lēḍokaḍu sikṣiṃpaṃga, rakṣiṃpa, nī
tōḍaṃ
buṭṭuvu karmaśēṣa paribhūtuṃḍayye nē ḍiyyeḍan”. (pōtana telugu
bhāgavatamu - 10.1- 1775)
pai
padyamulō karma phalamuniccuṭaku, kālamu, sthalamu, rīti kūḍa nunnadani
teliyavaccunu - ē karma kē phalamu ekkaḍa, eppuḍu ē rītigā vaccunō - ā
dharmamu - (natural law) - apūrvamu - kanabaḍani kāraṇamu kaladi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.