← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్భకౌకః arbhakaukaḥ

Original — తెలుగు
  1. అర్భకం అల్పం ఓకో నీడం ; అర్భకం అల్పం ఓకం స్థానం యస్య సః.

(అల్పమైన, చిన్నదైన ఆశ్రయముగలవాడు - భగవంతుడు.)

  1. పరిచ్చ్ఛిన్న హృదయాయ తనత్వాత్ అర్భకౌకః.

(పరిచ్ఛిన్నుడైనప్పటికి పరిమితిగల చిన్నదైన హృదయమందు నివసించువాడు) -

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశౌ (అ) ర్జున ! తిష్టతి |”. (శ్రీమద్భగవద్గీత - 18 - 61)

(అర్జునా ! సమస్తమైన భూతములయొక్క హృదయమను స్థానమందు భగవంతుడున్నాడు.)

  1. సర్వ గతస్య ఆత్మనః ఉపాసనాపేక్షయా అర్భకస్యాపి గుణాః, నైతావతా సర్వ గతస్య హానిః తత్రి దృష్టాంతః హ్యోమవత్.

“అర్భకౌక స్త్వాత్తద్వ్య పదేశశ్చ నేతిచేన్ననిచాయ్యత్వా దేవం వ్యోమ వచ్చ” (బ్రహ్మసూత్రములు - 1 -2 -7)

“యథా సర్వ్బగతమపిద్యోమః సూచ్చా”. (బ్రహ్మసూత్రములు - 1 - 2 - 7)

“యథా సర్వగతమపిద్యోమః సూచ్ఛాద్యవచ్ఛేదేన అర్భకౌకో అణీయశ్చ వ్యపదిశ్యతే, తద్వ ద్బ్రహా పీత్యర్థః”.

(అన్నింటియందును ఉన్నటువంటి ఆత్మకి ఉపాసన చేయుటకు చిన్ననివాసస్థానము - హృదయము -చెప్పబడినది. ఒక చిన్నస్థానమును ఆత్మ ఆశ్రయించియున్నదని చెప్పుటచేత ఆత్మ అన్నింటిలోను ఉన్నదని చెప్పుటలో హానిలేదు - తప్పులేదు - దీనికి ఉదాహరణ ఆకాశము - అన్నింటిలోను ప్రవేశించియుండునదైనను ఆకాశము సూది బెజ్జము అంతదానిలో కూడనుండుటవలన అర్భకౌకము అని చెప్పబడుచున్నది - అంత చిన్నదియని చెప్పబడుచున్నది. ఈ ప్రకారముగానే బ్రహ్మకూడా అన్నింటిలోనుండునదైనను ఒక చిన్నవస్తువులో ఉండుటవలన అర్భకౌకమని చెప్పబడుచున్నది. “ఏషమే ఆత్మా అంతర్హృదయే” (ఈ ఆత్మనా హృదయములోపల నున్నాడు.)

  1. సర్వగతస్యతు సర్వదేశేషు విద్యమానత్వాత్ పరిఛ్ఛిన్న దేశవ్యపిదేశోపి కయాచిదపేక్షయా సంభవతి - యథా సమస్త సమదాధిపతిరపి సన్నయోధ్యాదతిరితి వ్యపదిశ్యతే. కయా పునరపేక్షయా సర్వ గతస్సన్నీశ్వరో అర్భకౌకా అణీయాంశ్చ వ్యపదిశ్యతే ఇతి నిచాయ్య త్వా దేవమితి బ్రూమః - ఏవమణీ యస్త్వాది గుణోపేతః ఈశ్వరః తత్ర హృదయ పుండరీకే నిచాయ్యో ద్రష్టవ్యః ఇత్యుపదిశ్యతే - యథాసాలగ్రామే హరిః - తత్రాస్య బుద్ధిం విజ్ఞానం గ్రాహకం. సర్వగతోపి ఈశ్వరో తత్ర ఉపాస్యమానః ప్రసీదతి వ్యోమ వచ్చై తద్రష్ట వ్యం - యథాసర్వగతమపి సద్వ్యోమసూచీ పాశాద్యపేక్షయా అర్భకారోణీ అణీయశ్చ వ్యపదిశ్యతే, ఏవం బ్రహ్మపి “.

(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

“నను కిమతి హృదయమేవ ప్రాయేణ ఉచ్యతే తత్రాహ - హృదయే పరమాత్మనో బుద్ధి వృత్తి గ్రాహకా భవతి. అతః ఈశ్వరా భివ్యక్తస్థానత్వాత్ ఉక్తిరిత్యర్థః”.

అన్నింటిలోను ఉన్నటువంటిన్నీ, ప్రతిచోట ఉన్నట్లుకనబడుచున్నటువంటిన్నీ, భగవంతుడు ఒక చిన్నచోట ఉన్నాడని చెప్పుట ఒకానొక అపేక్షవలననే అగుచున్నది. సమస్త భూమండలమునకు అధిపతిఅయినవానిని అయోధ్యాపతియని ఒకనగరమునకు అధిపతియని చెప్పుట కలదు. అన్నివస్తువులలోను ఉన్న ఈశ్వరుడు అర్భకౌకః - (చిన్న వస్తువు నాశ్రయించియున్నాడు) - ‘అణీయాన్’ (అణువుకన్న చిన్నవాడుగ నున్నాడు) అని చెప్పుట, అతను వెదకతగినవాడు, చూడతగినవాడు, తెలుసుకొనతగినవాడు అగుటవలననే. అందుచేత అణువుకంటె అణువు అయినవాడగు ఈశ్వరుడు హృదయపద్మమందు వెదకి చూడతగినవాడు - సాలగ్రామములో విష్ణువు ఉన్నట్లే భావించి, ధ్యానించి దర్శించకలిగినట్లు భగవంతుని గ్రహించుటకు - తెలుసుకొనుటకు బుద్ధి జ్ఞానము అవసరము - అది హృదయపద్మమునందు ఉండుటచేత భగవంతుని తెలుసుకొనుటకు హృదయమువంటి చిన్నస్థానము చెప్పబడినది. తదేకధ్యానము కుదురుటకవకాశము కలుగును. అట్లు సాలగ్రామమందు, హృదయపద్మమందుగాని ధ్యానించి ఉపాసించినయడల భగవంతుడు అనుగ్రహించును. ఇందుకు ఉదాహరణము: - ఆకాశము - అన్నింటిలోను ప్రవేశించియుండు ఆకాశము సూది కన్నమంత చిన్నదానిలోకూడ నున్నట్లే, భగవంతుడు కూడ అన్నింటిలోను ఉన్నాడు. అయినను ఒకచిన్నవస్తువైన హృదయములో ఉన్నాడని చెప్పబడుచున్నాడు. అన్నింటిలోను ఉన్న భగవంతుడు హృదయములోనే ఉన్నాడని ఎందుకు చెప్పబడినది అనగా, పరమాత్మను తెలుసుకొనగలిగిన బుద్ధివృత్తి హృదయమందు హృదయమందు గలదు. అందుచేత హృదయము భగవంతుని ధ్యానించి తెలుసుకొనగలుగు స్థానమగుటవలన అట్లుచెప్పబడినది.- “ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశౌ (అ) ర్జున తిష్ఠతి”

(శ్రీమద్భగవద్గీత - 18 - 61) - (చూడుము - 2)

  1. పరమాత్మ అన్నింటిలోను అంతట వ్యాపించి ఉన్నవాడైనను అతను ఏ వస్తువులో - ఉపాధిలో - ఉండునో ఆ వస్తువంత పరిమితి గలవాడు అని చెప్పబడుచున్నాడు.)
Transliteration
  1. arbhakaṃ alpaṃ ōkō nīḍaṃ ; arbhakaṃ alpaṃ ōkaṃ sthānaṃ yasya saḥ.

(alpamaina, cinnadaina āśrayamugalavāḍu - bhagavaṃtuḍu.)

  1. pariccchinna hṛdayāya tanatvāt arbhakaukaḥ.

(paricchinnuḍainappaṭiki parimitigala cinnadaina hṛdayamaṃdu nivasiṃcuvāḍu) -

“īśvaraḥ sarvabhūtānāṃ hṛddēśau (a) rjuna ! tiṣṭati |”. (śrīmadbhagavadgīta - 18 - 61)

(arjunā ! samastamaina bhūtamulayokka hṛdayamanu sthānamaṃdu bhagavaṃtuḍunnāḍu.)

  1. sarva gatasya ātmanaḥ upāsanāpēkṣayā arbhakasyāpi guṇāḥ, naitāvatā sarva gatasya hāniḥ tatri dṛṣṭāṃtaḥ hyōmavat.

“arbhakauka stvāttadvya padēśaśca nēticēnnanicāyyatvā dēvaṃ vyōma vacca” (brahmasūtramulu - 1 -2 -7)

“yathā sarvbagatamapidyōmaḥ sūccā”. (brahmasūtramulu - 1 - 2 - 7)

“yathā sarvagatamapidyōmaḥ sūcchādyavacchēdēna arbhakaukō aṇīyaśca vyapadiśyatē, tadva dbrahā pītyarthaḥ”.

(anniṃṭiyaṃdunu unnaṭuvaṃṭi ātmaki upāsana cēyuṭaku cinnanivāsasthānamu - hṛdayamu -ceppabaḍinadi. oka cinnasthānamunu ātma āśrayiṃciyunnadani ceppuṭacēta ātma anniṃṭilōnu unnadani ceppuṭalō hānilēdu - tappulēdu - dīniki udāharaṇa ākāśamu - anniṃṭilōnu pravēśiṃciyuṃḍunadainanu ākāśamu sūdi bejjamu aṃtadānilō kūḍanuṃḍuṭavalana arbhakaukamu ani ceppabaḍucunnadi - aṃta cinnadiyani ceppabaḍucunnadi. ī prakāramugānē brahmakūḍā anniṃṭilōnuṃḍunadainanu oka cinnavastuvulō uṃḍuṭavalana arbhakaukamani ceppabaḍucunnadi. “ēṣamē ātmā aṃtarhṛdayē” (ī ātmanā hṛdayamulōpala nunnāḍu.)

  1. sarvagatasyatu sarvadēśēṣu vidyamānatvāt parichchinna dēśavyapidēśōpi kayācidapēkṣayā saṃbhavati - yathā samasta samadādhipatirapi sannayōdhyādatiriti vyapadiśyatē. kayā punarapēkṣayā sarva gatassannīśvarō arbhakaukā aṇīyāṃśca vyapadiśyatē iti nicāyya tvā dēvamiti brūmaḥ - ēvamaṇī yastvādi guṇōpētaḥ īśvaraḥ tatra hṛdaya puṃḍarīkē nicāyyō draṣṭavyaḥ ityupadiśyatē - yathāsālagrāmē hariḥ - tatrāsya buddhiṃ vijñānaṃ grāhakaṃ. sarvagatōpi īśvarō tatra upāsyamānaḥ prasīdati vyōma vaccai tadraṣṭa vyaṃ - yathāsarvagatamapi sadvyōmasūcī pāśādyapēkṣayā arbhakārōṇī aṇīyaśca vyapadiśyatē, ēvaṃ brahmapi “.

(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

“nanu kimati hṛdayamēva prāyēṇa ucyatē tatrāha - hṛdayē paramātmanō buddhi vṛtti grāhakā bhavati. ataḥ īśvarā bhivyaktasthānatvāt uktirityarthaḥ”.

anniṃṭilōnu unnaṭuvaṃṭinnī, praticōṭa unnaṭlukanabaḍucunnaṭuvaṃṭinnī, bhagavaṃtuḍu oka cinnacōṭa unnāḍani ceppuṭa okānoka apēkṣavalananē agucunnadi. samasta bhūmaṃḍalamunaku adhipatiayinavānini ayōdhyāpatiyani okanagaramunaku adhipatiyani ceppuṭa kaladu. annivastuvulalōnu unna īśvaruḍu arbhakaukaḥ - (cinna vastuvu nāśrayiṃciyunnāḍu) - ‘aṇīyān’ (aṇuvukanna cinnavāḍuga nunnāḍu) ani ceppuṭa, atanu vedakataginavāḍu, cūḍataginavāḍu, telusukonataginavāḍu aguṭavalananē. aṃducēta aṇuvukaṃṭe aṇuvu ayinavāḍagu īśvaruḍu hṛdayapadmamaṃdu vedaki cūḍataginavāḍu - sālagrāmamulō viṣṇuvu unnaṭlē bhāviṃci, dhyāniṃci darśiṃcakaliginaṭlu bhagavaṃtuni grahiṃcuṭaku - telusukonuṭaku buddhi jñānamu avasaramu - adi hṛdayapadmamunaṃdu uṃḍuṭacēta bhagavaṃtuni telusukonuṭaku hṛdayamuvaṃṭi cinnasthānamu ceppabaḍinadi. tadēkadhyānamu kuduruṭakavakāśamu kalugunu. aṭlu sālagrāmamaṃdu, hṛdayapadmamaṃdugāni dhyāniṃci upāsiṃcinayaḍala bhagavaṃtuḍu anugrahiṃcunu. iṃduku udāharaṇamu: - ākāśamu - anniṃṭilōnu pravēśiṃciyuṃḍu ākāśamu sūdi kannamaṃta cinnadānilōkūḍa nunnaṭlē, bhagavaṃtuḍu kūḍa anniṃṭilōnu unnāḍu. ayinanu okacinnavastuvaina hṛdayamulō unnāḍani ceppabaḍucunnāḍu. anniṃṭilōnu unna bhagavaṃtuḍu hṛdayamulōnē unnāḍani eṃduku ceppabaḍinadi anagā, paramātmanu telusukonagaligina buddhivṛtti hṛdayamaṃdu hṛdayamaṃdu galadu. aṃducēta hṛdayamu bhagavaṃtuni dhyāniṃci telusukonagalugu sthānamaguṭavalana aṭluceppabaḍinadi.- “īśvara ssarvabhūtānāṃ hṛddēśau (a) rjuna tiṣṭhati”

(śrīmadbhagavadgīta - 18 - 61) - (cūḍumu - 2)

  1. paramātma anniṃṭilōnu aṃtaṭa vyāpiṃci unnavāḍainanu atanu ē vastuvulō - upādhilō - uṃḍunō ā vastuvaṃta parimiti galavāḍu ani ceppabaḍucunnāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.