పూజ, పూజావిధానము.
అర్చన రెండువిధములు –
బాహ్యము - పైకి, అందఱికి కనబడునటుల, వినబడునటుల చేయునది.
ఆభ్యంతరము - మనస్సులో చేయునది.)
అర్చన ఎనిమిది విధములు - ముగ్గు, సుగంధము, అక్షతలు, పుష్పము, ధూపము, దీపము,నైవేద్యము, తాంబూలము..
స్తుతి లక్షణస్య అర్చనస్య ఆధిక్యే కం కారణం ? ఉచ్యతే - హింసాది పురుషాం తర, ద్రవ్యాంతర దేశకాలాది నియమానపేక్షత్వం ఆధిఖ్యే కారణం.
(స్తుతిరూపమైన అర్చనలోని ఆధిక్యమునకు కారణమేమనగా - దీనిలో జీవహింసలేదు, మఱియొక పురుషుని ఆశ్రయించవలసిన అవసరములేదు, పదార్థములతో పనిలేదు, దేశము, కాలము మొదలయినవాటియొక్క నియమములేదు - అనగా శాస్త్రములో చెప్పబడిన చోటనే చేయవలయును అనికాని, నియమింపబడిన దినముననే చేయవలయును అనికాని నియమములేదు.)
తిలాక్ష తైర్య జే ద్దేవం జీవన్ముక్తో నసంశయః”
(ప్రశస్తమైన బిల్వపత్రములచేతను, పుష్పములచేతను, అక్షతలచేతను, దేవుని పూజింపవలయును.)
దూర్వా భిర్నార్చ యే ద్దుర్గాం, కేతకైర్న మహేశ్వరం ||“. (దేవీ భాగవతం)
(విఘ్నేశ్వరుని తులసీదళములతో పూజచేయరాదు, విష్ణువును అక్షతలతో పూజచేయకూడదు, దుర్గను దూర్యములతో పూజచేయరాదు, ఈశ్వరుని పువ్వుతో పూజ చేయకూడదు.)
“అహింసా ప్రధమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం |
సర్వభూతదయా పుష్పం, క్షమపుష్పం విశేషతః |
జ్ఞానం పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధై న చ |
సత్యమష్ట విధం, పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ ||“.
(అహింస, ఇంద్రియ నిగ్రహము, సమస్త ప్రాణికోటులందును దయగలిగియుండుట, క్షమ, జ్ఞానము, తపస్సు, సత్యము ధ్యానము - ఈ ఎనిమిది విధములైన పుష్పములు విష్ణువునకు ప్రీతిని కలుగ చేయునవి.)
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతిమానవః ||“.
(భగవంతునివలన ఈ సమస్త భూతముల వ్యాపారము నడచుచున్నది - ఈ జగత్తు అంతటిలోనూ అతనే వ్యాపించియున్నాడు - అట్టి భగవంతుని మానవుడు అర్చించి సిద్ధినిపొందును)
“పత్రం, పుష్పం, ఫలం తోయం మోమే భక్తా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ||“. (శ్రీమద్భగవద్గీత- 9 - 26)
(ఎటువంటివాడైనను, ఎంతబీదవాడైనను, అతనికి అనాయాసముగా దొరుకు ఆకు, పువ్వు, పండు,లేక నీరు అయినను, వాసుదేవునికంటె ఉత్కృష్ట దైవము లేదని నమ్మి అతనికి, అనంతైశ్వర్యములు గల శ్రీవిష్ణువు కొఱకు భక్తితో సేవకునివలె అర్పించినయడల దానిని ఎంత చిన్నదానినైనను, గడ్డిపరకవలె ఎంత విలువలేనిదైనను నేను ప్రీతితో దానిని అశనమువలె స్వీకరించెదను, ఇట్లు ఆ విలువలేని వస్తువులను స్వీకరించుటలో కారణము భక్తితో నాకు అర్పించుటయే.
“క. దళమైన పుష్పమైనను
ఫలమైనను సలిల మైన బాయనిభక్తిన్
గొలిచిన జను లర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భజింతున్.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 10 - ఉ.భా - 1006)
pūja, pūjāvidhānamu.
arcana reṃḍuvidhamulu –
bāhyamu - paiki, aṃdaṟiki kanabaḍunaṭula, vinabaḍunaṭula cēyunadi.
ābhyaṃtaramu - manassulō cēyunadi.)
arcana enimidi vidhamulu - muggu, sugaṃdhamu, akṣatalu, puṣpamu, dhūpamu, dīpamu,naivēdyamu, tāṃbūlamu..
stuti lakṣaṇasya arcanasya ādhikyē kaṃ kāraṇaṃ ? ucyatē - hiṃsādi puruṣāṃ tara, dravyāṃtara dēśakālādi niyamānapēkṣatvaṃ ādhikhyē kāraṇaṃ.
(stutirūpamaina arcanalōni ādhikyamunaku kāraṇamēmanagā - dīnilō jīvahiṃsalēdu, maṟiyoka puruṣuni āśrayiṃcavalasina avasaramulēdu, padārthamulatō panilēdu, dēśamu, kālamu modalayinavāṭiyokka niyamamulēdu - anagā śāstramulō ceppabaḍina cōṭanē cēyavalayunu anikāni, niyamiṃpabaḍina dinamunanē cēyavalayunu anikāni niyamamulēdu.)
tilākṣa tairya jē ddēvaṃ jīvanmuktō nasaṃśayaḥ”
(praśastamaina bilvapatramulacētanu, puṣpamulacētanu, akṣatalacētanu, dēvuni pūjiṃpavalayunu.)
dūrvā bhirnārca yē ddurgāṃ, kētakairna mahēśvaraṃ ||“. (dēvī bhāgavataṃ)
(vighnēśvaruni tulasīdaḷamulatō pūjacēyarādu, viṣṇuvunu akṣatalatō pūjacēyakūḍadu, durganu dūryamulatō pūjacēyarādu, īśvaruni puvvutō pūja cēyakūḍadu.)
“ahiṃsā pradhamaṃ puṣpaṃ puṣpamiṃdriya nigrahaṃ |
sarvabhūtadayā puṣpaṃ, kṣamapuṣpaṃ viśēṣataḥ |
jñānaṃ puṣpaṃ, tapaḥ puṣpaṃ, dhyānaṃ puṣpaṃ tadhai na ca |
satyamaṣṭa vidhaṃ, puṣpaṃ viṣṇōḥ prītikaraṃ bhavēt ||“.
(ahiṃsa, iṃdriya nigrahamu, samasta prāṇikōṭulaṃdunu dayagaligiyuṃḍuṭa, kṣama, jñānamu, tapassu, satyamu dhyānamu - ī enimidi vidhamulaina puṣpamulu viṣṇuvunaku prītini kaluga cēyunavi.)
svakarmaṇā tamabhyarcya siddhiṃ viṃdatimānavaḥ ||“.
(bhagavaṃtunivalana ī samasta bhūtamula vyāpāramu naḍacucunnadi - ī jagattu aṃtaṭilōnū atanē vyāpiṃciyunnāḍu - aṭṭi bhagavaṃtuni mānavuḍu arciṃci siddhinipoṃdunu)
“patraṃ, puṣpaṃ, phalaṃ tōyaṃ mōmē bhaktā prayacchati |
tadahaṃ bhaktyupahṛtamaśnāmi prayatātmanaḥ ||“. (śrīmadbhagavadgīta- 9 - 26)
(eṭuvaṃṭivāḍainanu, eṃtabīdavāḍainanu, ataniki anāyāsamugā doruku āku, puvvu, paṃḍu,lēka nīru ayinanu, vāsudēvunikaṃṭe utkṛṣṭa daivamu lēdani nammi ataniki, anaṃtaiśvaryamulu gala śrīviṣṇuvu koṟaku bhaktitō sēvakunivale arpiṃcinayaḍala dānini eṃta cinnadāninainanu, gaḍḍiparakavale eṃta viluvalēnidainanu nēnu prītitō dānini aśanamuvale svīkariṃcedanu, iṭlu ā viluvalēni vastuvulanu svīkariṃcuṭalō kāraṇamu bhaktitō nāku arpiṃcuṭayē.
“ka. daḷamaina puṣpamainanu
phalamainanu salila maina bāyanibhaktin
golicina janu larpiṃcina
nelamin rucirānnamugane yēnu bhajiṃtun.” (śrīmadāṃdhra mahābhāgavatamu- 10 - u.bhā - 1006)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.