← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్ధం ardhaṃ

Original — తెలుగు
  1. పదార్థం - మృత్పాషాణాది. (పదార్థము - మట్టి, ఱాయి మొదలగునవి) (వస్తువులు)

  2. ప్రయోజనము, కార్యము, ధనము.

  3. శబ్దాదివిషయములు - ఇంద్రియార్థములు.

  4. అర్థశబ్దో అర్థనీయ భోగవిశేషపరః, విషయః; ఇంద్రియ విషయః.

(కోరతగిన భోగము - సంతోషముతో అనుభవించవలెననికోరబడునది - విషయము; ఇంద్రియ విషయము.)

  1. ధనధాన్యగ్రామ పశ్వాది వస్తు విభవాః -

(ధనము, ధాన్యము, గ్రామము, పాడి, పశువులు, భూమి, ఇల్లుమొదలగు ఐశ్వర్యములు.)

  1. పురుషుడు సాధించవలసిన ధర్మార్ధకామమోక్షములను చతుర్విధపురుషార్థములలో రెండవపురుషార్థము.)

  2. “సుఖరూపత్వాత్ సర్వైరద్థ్యతే ఇతి అర్థః” (శ్రీశంకరః)

(సుఖ స్వరూపుడు, పరమానందఘనము అగుటచేట పరమాత్మ అందఱి చేతను కోరబడువాడు. మోక్షము, పరమ సుఖము – అనంత సుఖము నిచ్చువాడు కనుక ఆ మోక్షముకొఱకు భక్తులచేత అర్ధించబడువాడు, కోరబడువాడు కనుక అర్థము అనగా పరమాత్మ - పరమార్థము - మోక్షస్వరూపుడు.)

  1. పరమపురుషార్థం ఆత్మస్వరూపం.

(ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములలో ఆఖరిదియగు మోక్షము, పరమాత్మ స్వరూపము -దానితో ఐక్యమగుట.)

  1. ఆకాశాది కార్యాః, ఘటపటాది.

(అకాశము మొదలగు కార్యవస్తువులు - కుండ, బట్ట మొదలగునవి.)

  1. “పరమపురుషార్థ, తదుపాయ, తద్విరోధి ప్రభృత్ సర్వాన్ పదార్థాన్” (శ్రీవేదాంత దేశికః)

(పరమపురుషార్థమైన మోక్షము, దానికి సాధనమైనవి,విరోది అడ్డు అయినవి అయిన అన్నిపదార్థములు.)

  1. “వ. --- సర్వ దేశంబుల యందు సర్వకాలంబుల యందు నేది బోదితంబై యుండు,నట్టిదే పరబ్రహ్మ స్వరూపంబు, తత్వం బెఱుంగ నిచ్ఛయించిన మిము బోటి వారలీ చెప్పినది మదీయ తత్త్వాత్మకంబైన యర్థంబని యెఱుంగుదురు. ఈ యర్థంబు తృష్టంబైనయది ---”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 9 -

(సత్యరూపుడైన పరబ్రహ్మయే - అనగా త్రికాలములందుండు పరబ్రహ్మయే - పరమపురుషార్థము, లేక మోక్షము.)

  1. “విషయ విముఖంబులగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును, హేయగుణరహితంబును నగు బ్రహ్మంబు మనో విభ్రాంతి జేసి శబ్దాది ధర్మంబగు నర్థరూపంబునం దోచు అది యెట్టులర్థాకారంబునం దోచుననియడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును, భూతరూపంబున బంచవిధంబును, ఇంద్రియరూపంబున నేకాదశవిధంబును, నై యుండు -”.

(పరబ్రహ్మమే అర్థములుగా మారెను - ఇవి అతని విభూతులలోనివే.)

  1. యథా మథుహో తరుకోటరాదిగతం మధుదేత్తి హరతి చ, తథా త్యాగ భోగ విహీనో ధన సంచయఃన కార్యః; యది క్రియతే నతు పరగామీ భవతి. అర్థవిత్ (- లింగైరర్థం, తత్~ంహరణోపాయంచ దత్తీతి అర్థవిత్ -)అన్యోబలవాన్ భుంక్తే.

(తేనె చెట్టుతొర్రలో ఉన్నదనితెలిసినవాడు దానిని అపహరించును. అందుచేత ఒకరికి ఇవ్వక తానుభోగిం చకనుండువాడు అర్థమును అర్థించకూడదు. అట్టివాడు డబ్బునార్జించిన యడల అది పరులపాలగును.)

  1. జలం తదుద్భవైః తృణశైవాలాది భిః ఛన్నం హిత్వా, అజ్ఞాత్వా యథా అజ్ఞః జలకామ్యయా మృగతృష్ణాం జలనత్ప్రతీయమానాం ఉపాధా వేత్, తథా స్వతస్సుఖరూపం ఆత్మనః స్వరూపం విస్మృత్య వైష యిక సుఖేషు అర్థ దృక్ పురుషార్థదృష్టిః ధావతి.

(నీటిలో పుట్టినటువంటి గడ్డి (రెల్లు), నాచు, నీటిని కప్పివేయగా అక్కడ నీరు లేదని అజ్ఞాని - తెలివిలేనివాడు - నీటికోసమని నీరువలె ప్రకాశించుచున్న ఏండమావులకు ఆశించును. ఆ ప్రకారముగానే స్వతః పరమానందరూపమైన, సుఖస్వరూపమైన ఆత్మని వదలిపెట్టి, అనగా, పరమార్థమైన మోక్షమును వదలి, విషయములకు సంబంధించిన తుచ్ఛసుఖమును అర్థములవలన కలిగెడి క్షణిక సుఖమును అజ్ఞుడు - బ్రహ్మజ్ఞానము లేనివాడు - కోరును.)

  1. పురుషార్థసాధనం కళేబరం; స్థూల దేహాది.

(చతుర్విధ పురుషార్థములను పొందుటకు సాధనమైనది శరీరము - స్థూలదేహము. స్థూలదేహముండిననే, దానితోనే చతుర్విధపురుషార్థములు సాధించబడును - “శరీరమాద్యం ఖలుధర్మసాధనం”

(చతుర్విధపురుషార్థములలో మొదటిది అయిన ధర్మమును, ధర్మమార్గమున పొందగలుగు మిగిలిన అర్థకామమోక్షములు అను మూడుపురుషార్థములను పొందగలుగుటకు మొదటిసాధనము శరీరము.)

  1. “యస్యాత్మ రతి రేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః |

ఆత్మస్యేవ చ సంతుష్టః తస్యకార్యం నవిద్యతే |

నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చన |

న చాస్య సర్వభూతేషు కశ్చి దర్ధ వ్యపాశ్రయః ||“. (శ్రీమద్భగవద్గీత- 3 - 17, 18)

(ఇంద్రియారామునకు మంచిగంధము, స్త్రీలు, మొదలగువానియందు రతి కలిగియుండును; అన్నపానాదులందు తృప్తి కలిగియుండును; సంతోషమువలన సంతోషముకలుగును, కాని ఆత్మయందే రతికలవాడుఆత్మయందే తృప్తిగలవాడు, ఆత్మయందే సంతోషము గలవాడు కృతకృత్యుడగును. అట్టివానికి చేయవలసిన కర్మలేదు, కర్మ చేయుటవలన ప్రయోజనము లేదు - అర్థము లేదు - ఎందుచేతననగా అతనికి స్వర్గాదిఫలము అవసరము లేదు. కర్మ చేయనందున ప్రత్యవాయము కలుగదు, కర్మవలన కలుగు అర్థముతో - ప్రయోజనముతో - సంబంధము లేదు.)

  1. “యస్యార్థ స్తస్య మిత్రాణి”

అర్థము - ధనము - ఉన్నవాడిని, దాని కారణంగా, మిత్రులు చేరుదురు –

“క. ఎప్పుడు సంపద గలిగిన

నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్ - - - “. (సుమతీ శతకము)

  1. అర్థానామార్జనే దుఃఖం -

(ధనము నార్జించుటలో దుఃఖము పాలగును, అయినను ఆర్జించుట మానడు.)

  1. యథామధువ్రతైః ఇతస్తతః పుష్పేభ్యః ఆనీయక్వచిన్నివేశితం మధుతత్స్వామినః మధువ్రతాన్ పాత్వాఅన్యోహరత, తథామధుప ద్దుఃఖేన న ఆర్జితం ధనం అన్యః పతింహత్వా - ధనస్యపతిం హత్వా - హరేత్.

(ఇక్కడ, అక్కడా తిరిగి పువ్వులనుండు సేకరించిన తేనెను దానిని, ఇంకొకడు హరించును - ఆ ప్రకారముగానే తేనెటీగవలె బహు ప్రయాసపడి, అక్కడనుండి ఇక్కడనుండి తెచ్చి కూడబెట్టిన అర్థమును - ధనమును ఆ ధనపతిని చంపి ఇంకొకడు హరించును. అందుచేత ధనమార్జించినను దుఃఖమేకలుగును.)

  1. అర్ధస్య పురుషో దాసో దాసస్త్వర్థో నకస్య చిత్ |

ఇతి సత్యం ఇతి సత్యం మహారాజః బద్ధోస్మ్యర్థేనకౌరవైః || “.

(పురుషుడు ధనమునకు దాసుడు. ధనము పురుషునకు దాసుడు కానేరదు. ఇది నిజము. ధనము నిమిత్తమై, ధనము చేతనే నేను కౌరవులకు బద్ధుడనై యున్నాను.)

Transliteration
  1. padārthaṃ - mṛtpāṣāṇādi. (padārthamu - maṭṭi, ṟāyi modalagunavi) (vastuvulu)

  2. prayōjanamu, kāryamu, dhanamu.

  3. śabdādiviṣayamulu - iṃdriyārthamulu.

  4. arthaśabdō arthanīya bhōgaviśēṣaparaḥ, viṣayaḥ; iṃdriya viṣayaḥ.

(kōratagina bhōgamu - saṃtōṣamutō anubhaviṃcavalenanikōrabaḍunadi - viṣayamu; iṃdriya viṣayamu.)

  1. dhanadhānyagrāma paśvādi vastu vibhavāḥ -

(dhanamu, dhānyamu, grāmamu, pāḍi, paśuvulu, bhūmi, illumodalagu aiśvaryamulu.)

  1. puruṣuḍu sādhiṃcavalasina dharmārdhakāmamōkṣamulanu caturvidhapuruṣārthamulalō reṃḍavapuruṣārthamu.)

  2. “sukharūpatvāt sarvairadthyatē iti arthaḥ” (śrīśaṃkaraḥ)

(sukha svarūpuḍu, paramānaṃdaghanamu aguṭacēṭa paramātma aṃdaṟi cētanu kōrabaḍuvāḍu. mōkṣamu, parama sukhamu – anaṃta sukhamu niccuvāḍu kanuka ā mōkṣamukoṟaku bhaktulacēta ardhiṃcabaḍuvāḍu, kōrabaḍuvāḍu kanuka arthamu anagā paramātma - paramārthamu - mōkṣasvarūpuḍu.)

  1. paramapuruṣārthaṃ ātmasvarūpaṃ.

(dharmārthakāmamōkṣamulanu caturvidha puruṣārthamulalō ākharidiyagu mōkṣamu, paramātma svarūpamu -dānitō aikyamaguṭa.)

  1. ākāśādi kāryāḥ, ghaṭapaṭādi.

(akāśamu modalagu kāryavastuvulu - kuṃḍa, baṭṭa modalagunavi.)

  1. “paramapuruṣārtha, tadupāya, tadvirōdhi prabhṛt sarvān padārthān” (śrīvēdāṃta dēśikaḥ)

(paramapuruṣārthamaina mōkṣamu, dāniki sādhanamainavi,virōdi aḍḍu ayinavi ayina annipadārthamulu.)

  1. “va. --- sarva dēśaṃbula yaṃdu sarvakālaṃbula yaṃdu nēdi bōditaṃbai yuṃḍu,naṭṭidē parabrahma svarūpaṃbu, tatvaṃ beṟuṃga nicchayiṃcina mimu bōṭi vāralī ceppinadi madīya tattvātmakaṃbaina yarthaṃbani yeṟuṃguduru. ī yarthaṃbu tṛṣṭaṃbainayadi ---”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 9 -

(satyarūpuḍaina parabrahmayē - anagā trikālamulaṃduṃḍu parabrahmayē - paramapuruṣārthamu, lēka mōkṣamu.)

  1. “viṣaya vimukhaṃbulagu niṃdriyaṃbulacēta jñānarūpaṃbunu, hēyaguṇarahitaṃbunu nagu brahmaṃbu manō vibhrāṃti jēsi śabdādi dharmaṃbagu nartharūpaṃbunaṃ dōcu adi yeṭṭularthākāraṃbunaṃ dōcunaniyaḍigitivēni nahaṃkāraṃbu guṇarūpaṃbunaṃ jēsi trividhaṃbunu, bhūtarūpaṃbuna baṃcavidhaṃbunu, iṃdriyarūpaṃbuna nēkādaśavidhaṃbunu, nai yuṃḍu -”.

(parabrahmamē arthamulugā mārenu - ivi atani vibhūtulalōnivē.)

  1. yathā mathuhō tarukōṭarādigataṃ madhudētti harati ca, tathā tyāga bhōga vihīnō dhana saṃcayaḥna kāryaḥ; yadi kriyatē natu paragāmī bhavati. arthavit (- liṃgairarthaṃ, tat~ṃharaṇōpāyaṃca dattīti arthavit -)anyōbalavān bhuṃktē.

(tēne ceṭṭutorralō unnadanitelisinavāḍu dānini apahariṃcunu. aṃducēta okariki ivvaka tānubhōgiṃ cakanuṃḍuvāḍu arthamunu arthiṃcakūḍadu. aṭṭivāḍu ḍabbunārjiṃcina yaḍala adi parulapālagunu.)

  1. jalaṃ tadudbhavaiḥ tṛṇaśaivālādi bhiḥ channaṃ hitvā, ajñātvā yathā ajñaḥ jalakāmyayā mṛgatṛṣṇāṃ jalanatpratīyamānāṃ upādhā vēt, tathā svatassukharūpaṃ ātmanaḥ svarūpaṃ vismṛtya vaiṣa yika sukhēṣu artha dṛk puruṣārthadṛṣṭiḥ dhāvati.

(nīṭilō puṭṭinaṭuvaṃṭi gaḍḍi (rellu), nācu, nīṭini kappivēyagā akkaḍa nīru lēdani ajñāni - telivilēnivāḍu - nīṭikōsamani nīruvale prakāśiṃcucunna ēṃḍamāvulaku āśiṃcunu. ā prakāramugānē svataḥ paramānaṃdarūpamaina, sukhasvarūpamaina ātmani vadalipeṭṭi, anagā, paramārthamaina mōkṣamunu vadali, viṣayamulaku saṃbaṃdhiṃcina tucchasukhamunu arthamulavalana kaligeḍi kṣaṇika sukhamunu ajñuḍu - brahmajñānamu lēnivāḍu - kōrunu.)

  1. puruṣārthasādhanaṃ kaḷēbaraṃ; sthūla dēhādi.

(caturvidha puruṣārthamulanu poṃduṭaku sādhanamainadi śarīramu - sthūladēhamu. sthūladēhamuṃḍinanē, dānitōnē caturvidhapuruṣārthamulu sādhiṃcabaḍunu - “śarīramādyaṃ khaludharmasādhanaṃ”

(caturvidhapuruṣārthamulalō modaṭidi ayina dharmamunu, dharmamārgamuna poṃdagalugu migilina arthakāmamōkṣamulu anu mūḍupuruṣārthamulanu poṃdagaluguṭaku modaṭisādhanamu śarīramu.)

  1. “yasyātma rati rēva syāt ātmatṛptaśca mānavaḥ |

ātmasyēva ca saṃtuṣṭaḥ tasyakāryaṃ navidyatē |

naiva tasya kṛtē nārthō nā kṛtē nēha kaścana |

na cāsya sarvabhūtēṣu kaści dardha vyapāśrayaḥ ||“. (śrīmadbhagavadgīta- 3 - 17, 18)

(iṃdriyārāmunaku maṃcigaṃdhamu, strīlu, modalaguvāniyaṃdu rati kaligiyuṃḍunu; annapānādulaṃdu tṛpti kaligiyuṃḍunu; saṃtōṣamuvalana saṃtōṣamukalugunu, kāni ātmayaṃdē ratikalavāḍuātmayaṃdē tṛptigalavāḍu, ātmayaṃdē saṃtōṣamu galavāḍu kṛtakṛtyuḍagunu. aṭṭivāniki cēyavalasina karmalēdu, karma cēyuṭavalana prayōjanamu lēdu - arthamu lēdu - eṃducētananagā ataniki svargādiphalamu avasaramu lēdu. karma cēyanaṃduna pratyavāyamu kalugadu, karmavalana kalugu arthamutō - prayōjanamutō - saṃbaṃdhamu lēdu.)

  1. “yasyārtha stasya mitrāṇi”

arthamu - dhanamu - unnavāḍini, dāni kāraṇaṃgā, mitrulu cēruduru –

“ka. eppuḍu saṃpada galigina

nappuḍu baṃdhuvulu vatturadi yeṭlannan - - - “. (sumatī śatakamu)

  1. arthānāmārjanē duḥkhaṃ -

(dhanamu nārjiṃcuṭalō duḥkhamu pālagunu, ayinanu ārjiṃcuṭa mānaḍu.)

  1. yathāmadhuvrataiḥ itastataḥ puṣpēbhyaḥ ānīyakvacinnivēśitaṃ madhutatsvāminaḥ madhuvratān pātvāanyōharata, tathāmadhupa dduḥkhēna na ārjitaṃ dhanaṃ anyaḥ patiṃhatvā - dhanasyapatiṃ hatvā - harēt.

(ikkaḍa, akkaḍā tirigi puvvulanuṃḍu sēkariṃcina tēnenu dānini, iṃkokaḍu hariṃcunu - ā prakāramugānē tēneṭīgavale bahu prayāsapaḍi, akkaḍanuṃḍi ikkaḍanuṃḍi tecci kūḍabeṭṭina arthamunu - dhanamunu ā dhanapatini caṃpi iṃkokaḍu hariṃcunu. aṃducēta dhanamārjiṃcinanu duḥkhamēkalugunu.)

  1. ardhasya puruṣō dāsō dāsastvarthō nakasya cit |

iti satyaṃ iti satyaṃ mahārājaḥ baddhōsmyarthēnakauravaiḥ || “.

(puruṣuḍu dhanamunaku dāsuḍu. dhanamu puruṣunaku dāsuḍu kānēradu. idi nijamu. dhanamu nimittamai, dhanamu cētanē nēnu kauravulaku baddhuḍanai yunnānu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.