← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అరిషడ్వర్గము ariṣaḍvargamu

Original — తెలుగు
  1. అరీణామంతశ్శత్రూ ణాం, కామక్రోధ దీనాం షడ్వర్గో అరిషడ్వర్గః - షణ్ణాం వర్గః షడ్వర్గః.

(కామము, క్రోధము మొదలగునవి ఆరు అంతశ్శత్రువులు. ఈ ఆరింటికూటమి అరిషడ్వర్గము.)

“ఉ. లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా

నీకము జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ

భీకర శత్రు లార్వుర బ్రభిన్నుల జేసిన బ్రాణికోటిలో

నీకు విరోధి లే డొకడు నేర్పున జూడుము దానవేశ్వరా” (శ్రీమదాంధ్రమహా భాగవతము - 7 - 8 - 267)

Transliteration
  1. arīṇāmaṃtaśśatrū ṇāṃ, kāmakrōdha dīnāṃ ṣaḍvargō ariṣaḍvargaḥ - ṣaṇṇāṃ vargaḥ ṣaḍvargaḥ.

(kāmamu, krōdhamu modalagunavi āru aṃtaśśatruvulu. ī āriṃṭikūṭami ariṣaḍvargamu.)

“u. lōkamulanniyun gaḍiyalōna jayiṃcinavāḍa viṃdriyā

nīkamu jittamuṃ geluva nēravu ninnu nibaddhu jēyu nī

bhīkara śatru lārvura brabhinnula jēsina brāṇikōṭilō

nīku virōdhi lē ḍokaḍu nērpuna jūḍumu dānavēśvarā” (śrīmadāṃdhramahā bhāgavatamu - 7 - 8 - 267)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.